దీర్ఘకాలిక ఆమ్లత్వము 11599...India
51 సంవత్సరాల వ్యక్తి ఐదేళ్లుగా ఆమ్లత్వము కారణంగా మంట, తేనుపు, యాసిడ్ రిఫ్లెక్స్ తో బాధపడుతున్నారు. అతను శరీరానికి వ్యాయామము లేని నిశ్చల జీవన శైలి, మరియు రిటైల్ సేల్స్ కు సంబంధించి ఒక గొలుసు గ్రూపుకు అధిపతిగా చాలా ఒత్తిడితో కూడిన పనిభారము కలిగి ఉన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా తను రోజుకి పది సిగరెట్లు తాగుతూ ఉండేవారు. గత ఐదు సంవత్సరాలుగా అతను అనేక నివారణా ఔషధాలను, మరియు ప్రిస్క్రిప్షన్ మందులు ప్రయత్నించారు కానీ ఏదీ సహాయం చేయలేదు. 2018 సెప్టెంబర్ 9న ప్రాక్టీషనరును కలిసేనాటికి అతను ఎలాంటి ఔషధాలు తీసుకోవడంలేదు, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.5 Ulcers + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic…TDS
ధూమపానం మానేయాలని నిశ్చల జీవనశైలికి దూరంగా ఉండాలని ప్రాక్టీషనరు సూచించారు. 2019 ఫిబ్రవరి 16 వరకు అతను తిరిగి రాలేదు, ఐతే ఈ రెమిడీ తీసుకుంటున్న ఇంతకాలం వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేవని తెలిపారు. ఇచ్చిన రెమిడీ జనవరిలో పూర్తయిపోవడంతో వ్యాధి లక్షణాలు మళ్ళీ తీవ్రమయ్యాయి. అతనికి రీఫిల్ ను ఇస్తూ రోజుకు 40 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదు రోజులు నడవాలని సూచించారు. మార్చి 19న తన వ్యాధి లక్షణాల తీవ్రత తక్కువగా ఉందని సంతోషంతో తెలియ జేశారు. జూన్ 6 వ తేదీనాటికి 20% మెరుగుపడడంతో అతను క్రమం తప్పకుండా రెమిడీ తీసుకోవడం ప్రారంభించారు. అతను ధూమపానం మానివేయడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. నవంబర్ 11న అతను 50% మెరుగుదల ఉందని, డిసెంబర్ 26 నాటికి 80% చేరుకుని, 2020 మార్చి మూడో వారం నాటికి ఆమ్లత్వం జాడ కూడా లేకుండా పోయింది.
కోవిడ్ లాక్ డౌన్ కారణంగా అతను ప్రాక్టీషనరును సందర్శించలేక పోవడంతో 2020 మార్చిలో రెమిడీ తీసుకోవడం మానేశారు. సానుకూల అంశం ఏమిటంటే లాక్డౌన్ కారణంగా అతను తన బ్రాండ్ సిగరెట్ పొందలేకపోయిన కారణంగా ఈ దురలవాటు బలవంతంగా వదల వలసి వచ్చింది. ఒకవారం లోనే తనలో శక్తిస్థాయి పెరిగినట్లు భావన కలిగింది. అతని జీవనశైలిని మార్చడంలో గొప్ప పురోగతికి దారితీసింది. ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవనం యొక్క ప్రాముఖ్యత అతను గ్రహించారు. నెమ్మదిగా ధూమపానం మానివేసి, సైక్లింగ్ ప్రారంభించారు. ప్రతీరోజు పదిహేను కిలోమీటర్లు మరియు వారాంతంలో 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం ప్రయాణించడం ప్రారంభించారు. చివరిగా 2021 ప్రాక్టీషనరును సంప్రదించిన సందర్భంలో 18 నెలలకు పైగా వ్యాధి పునరావృతం కాలేదని తెలిపారు.
సంపాదకుని వ్యాఖ్య: క్రమం తప్పకుండా రెమిడీలు తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను ఈ కేసు నిరూపిస్తుంది.