కీళ్ల వాతావ 11599...India
52 సవత్సరాల మహిళా ఉపాధ్యాయురాలు చేతులు మరియు కాళ్ళ జాయింట్లలో నొప్పితో బాధపడుతూ ఉన్నారు. బ్లాక్ బోర్డు పై రాయడానికి సుద్ధ మొక్కను పట్టుకునే సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. రుమటాలజిస్ట్ ఆమె పరిస్థితిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు బోలు ఎముకల వ్యాధిగా నిర్ధారించగా ఆమె 2015 డిసెంబర్ నుండి సూచించిన మందులు మరియు సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించారు. ఎటువంటి ఉపశమనం లేనప్పటికీ ఆమె మందులను కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. అదనంగా 2 సంవత్సరాల క్రితం ఆమె మోకాలిలో నొప్పి ఏర్పడింది (బహుశా పాఠశాలలో ఎక్కువ గంటలు నిలబడడం వల్ల కావచ్చు), మరియు ఒక సంవత్సరం క్రితం జీర్ణకోశ వ్యాధులు(కడుపులో మంట) కూడా ఏర్పడింది. 2018 జనవరి నాటికి ఆమెకు చాక్ పీస్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడడంతో మెడికల్ లీవ్ తీసుకోవలసి వచ్చింది. 2018 ఆగస్టు 2న ప్రాక్టీషనరును సందర్శించిన సమయంలో ఆమె చాలా నిస్పృహకు గురై ఉన్నారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు బోలు ఎముకల వ్యాధికి :
#1. CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.6 Osteoporosis…TDS
జీర్ణకోశ వ్యాధులకు :
#2. CC4.5 Ulcers + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…TDS
ఒక నెల తర్వాత సెప్టెంబర్ 5న ఆమెకు కడుపులో మంట 90% తగ్గడంతో #2 OD కి తగ్గించబడింది, ఆపై 100% మెరుగుదల ఏర్పడడంతో అక్టోబర్ 15న నిలిపివేయబడింది. సెప్టెంబర్ 20 నాటికి మోకాళ్ళు మరియు కీళ్ళలో నొప్పి స్వల్పంగా తగ్గిందని ఆమె తెలిపారు. డిసెంబర్ 28 నాటికి జాయింట్లలో నొప్పి 50% మరియు మోకాళ్ళలో నొప్పి 80% తగ్గింది. 2019 జూలై 10 నాటికి జాయింట్లలో నొప్పి 90% మెరుగుకావడంతో #1 యొక్క మోతాదు BD కి తగ్గించబడింది. అక్టోబర్ 21నాటికి గత రెండు నెలలుగా అల్లోపతీ మందులు అన్నింటిని నిలిపివేసినప్పటికీ కొద్దిపాటి నొప్పి మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు. చాక్ పీస్ పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఆమె తన బోధన తిరిగి కొనసాగించారు. డిసెంబర్ 15న #1 మోతాదు OD కి తగ్గించబడింది. 2020 జనవరి నాటికి ఆమె పూర్తిగా కోలుకున్నారు. 2020 మార్చిలో ఒకసారి మరియు 2021 జనవరిలో మరొకసారి రెమిడీ తీసుకోవడం ఆపాలని ప్రయత్నించగా ఆమెకు కొంచం నొప్పి అనిపించి రెండు వారాలపాటు కొనసాగింది. అందుచేత నిర్వహణ మోతాదు OD గా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. 2021 నవంబర్ నాటికి పూర్తిగా రోగ లక్షణ రహితంగా ఉంటూ ప్రాక్టీషనరుతో నిరంతరం అనుసంధానంలో ఉంటున్నారు.