Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 12 సంచిక 5
సెప్టెంబర్ / అక్టోబర్ 2021
అవలోకనం

డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

తెలుసుకోవడానికి చదవండి: నార్త్ అమెరికన్ ప్రాక్టీషనర్స్ వైబ్రియోనిక్స్ సర్కిల్ ప్రారంభం గురించి. వైబ్రియోనిక్స్ సేవలను మరింత ఎక్కువ మందికి ఎలా చేరవేయాలి? బ్రాడ్‌కాస్టింగ్ (దూర ప్రసార చికిత్స) కోసం వస్తున్న అభ్యర్థనలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రూపొందించిన కొత్త మార్గదర్శకాలు. వైబ్రియోనిక్స్ టార్చ్‌బేరర్స్ (వైబ్రియోనిక్స్ సేవా వారసులు/మార్గదర్శకులు) అనే కొత్త విభాగాన్ని రూపొందించేందుకు చేపట్టిన కార్యక్రమాలు. మన "స్ప్రెడ్ ది వర్డ్" (వైబ్రియోనిక్స్ సందేశాన్ని విస్తరించండి) ప్రచారం సాధిస్తున్న పురోగతి.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో 11 ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి: డిస్‌ఫాజియా (మింగడంలో ఇబ్బంది); ఫంగల్ ఇన్ఫెక్షన్; చలికాలపు దగ్గు; అనిమే కార్టూన్ల వ్యసనం; చర్మ దురద; ఎగ్జిమా (చర్మ దద్దుర్లు); తగ్గని తీవ్రమైన కడుపు నొప్పి; హెచ్‌ఐవీ; అరచేతులపై దురద మరియు పొలుసులు ఊడే చర్మం; ఎముక విరుగు నయం అయిన తరువాత భుజం నొప్పి; సంతానలేమి.

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

ఈ సంచికలో ముగ్గురు అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. మొదటి ప్రాక్టీషనర్ 2017లో యెస్విపి గా అర్హత పొంది, వైబ్రియోనిక్స్ సేవను పూర్తికాల సేవగా కొనసాగించేందుకు ఉద్యోగానికి ముందస్తు విరమణ చేశారు. కోవిడ్-19 బాధితులతో సహా అనేక మందికి నిరంతరం బ్రాడ్‌కాస్టింగ్ (దూర ప్రసార చికిత్స) సేవలు అందిస్తూ హృదయాన్ని హత్తుకునే ఫలితాలను సాధించారు. అంతేకాకుండా, వైబ్రియోనిక్స్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా సేవలందించడంతో పాటు అనేక పరిపాలనా మరియు పరిశోధనా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిగిలిన ఇద్దరు యెస్విపిలు న్యూయార్క్లో నివసిస్తున్న దంపతులు. 2008 నుండి సాయి సెంటర్లో వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ, 2015 నుండి వైబ్రియోనిక్స్ సేవ చేస్తున్నారు. పరిపాలన విభాగం లో ప్రవేశాలు మరియు డేటా అప్‌డేట్ (సమాచార నవీకరణ) బాధ్యతలు నిర్వహించడంతో పాటు, ఏవిపిలకు మార్గదర్శకత్వం అందిస్తూ, బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ (దూర ప్రసార చికిత్స నెట్‌వర్క్)లో కూడా చురుకుగా సేవలందిస్తున్నారు.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్న జవాబులు

తెలుసుకోవడానికి చదవండి: ఇబి రెమెడీని దీర్ఘకాలం తీసుకుంటే, మన శరీరానికి దానిపై రెసిస్టెన్స్ (ప్రతిఘటన శక్తి) ఏర్పడుతుందా? ఒక కామన్ కాంబో లోని అనేక రెమెడీలు తమ తమ వైబ్రేషన్స్ ను అలాగే నిలుపుకుంటాయా? అలాగే ఒకే బాటిల్‌లో అనేక CCలు కలిపినప్పుడు అవి స్వస్థతను ఎలా కలిగిస్తాయి? అన్ని కాంబోలలో CC10.1 ఎమర్జెన్సీస్ను కలిపితే వాటి ప్రభావం మరింత పెరుగుతుందా? భూమిపై తన చివరి గంటల్లో ఉన్న రోగి ప్రశాంతంగా జీవనయాత్రను ముగించేందుకు ఉపయోగపడే రెమెడీ ఏమిటి? నాకు వ్యాధి వచ్చినప్పుడు నాకు నేనే చికిత్స చేసుకోవడం మంచిదా? లేక మరొక ప్రాక్టీషనర్ ద్వారా చికిత్స పొందడం మంచిదా? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రోగిని ఆరోగ్యకరమైన జీవనశైలిను అలవర్చుకునేలా ఎలా ప్రోత్సహించాలి?

పూర్తి వ్యాసం చదవండి

దివ్యవైద్యుని దివ్య వాణి

స్వామి ప్రేమపూర్వకంగా, స్వచ్ఛమైన సాత్విక ఆహారం ద్వారా శారీరక మరియు మానసిక బలాన్ని ఎలా పెంపొందించుకోవాలో, అలాగే సేవను సంపూర్ణ హృదయంతో ఎలా అర్పించాలో మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

అమెరికా మరియు భారతదేశంలో జరగబోయే వర్చువల్ వర్క్‌షాప్స్, అలాగే యునైటెడ్ కింగ్‌డమ్ లో నిర్వహించబడే నేషనల్ యాన్యువల్ రిఫ్రెషర్ సెమినార్ (జాతీయ వార్షిక పునశ్చరణ సదస్సు).

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

తృణధాన్యాలతో కూడిన సంపూర్ణ ఆహారం అనే ఆరోగ్య వ్యాసంలో వివిధ రకాల గ్రేన్స్ (ధాన్యాలు) గురించి— సంపూర్ణ ధాన్యాలు మరియు పూర్తిగా సంపూర్ణం కాని ధాన్యాలు, గ్లూటెన్ లేని మరియు గ్లూటెన్ కలిగిన ధాన్యాలు, అలాగే సంపూర్ణ ధాన్యాల నుండి గరిష్ట ఆరోగ్య ప్రయోజనం పొందే విధానాన్ని వివరించారు. క్లెన్సింగ్ కాంబో ను తన ఇంటి చుట్టూ పిచికారీ చేయడం వల్ల భయం, మానసిక ఒత్తిడి తగ్గి, రోగి యొక్క నియంత్రణలోకి రాని రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయికి వచ్చిన సంఘటన, స్వప్న చికిత్స ద్వారా ఇయర్ చెవి నొప్పి తగ్గిన అనుభవం, అలాగే పశువైద్యులు ఆశలు వదిలేసిన పరిస్థితిలో వైబ్రియోనిక్స్ పెంపుడు జంతువులను ఎలా కాపాడిందో తెలిపే ప్రేరణాత్మక అనుభవాలు. జూన్–జూలై 2021లో నిర్వహించిన వర్చువల్ ఏవిపి వర్క్‌షాప్ మరియు పుట్టపర్తిలో జరిగిన కాంటాక్ట్ ప్రోగ్రామ్ గురించి వివరాలు.

పూర్తి వ్యాసం చదవండి