Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 12 సంచిక 5
సెప్టెంబర్ / అక్టోబర్ 2021
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఇప్పుడు గడుస్తున్న కాలం ఈ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన పండుగ సమయాలలో ఒకటి. మనము ప్రస్తుతం రెండు ముఖ్యమైన పండుగలను గమనించాము - ఓనం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి, సాధారణ పరిస్థితులలో ప్రశాంతి నిలయంలో అత్యంత ఉత్సాహ హర్షాతిరేకంతో జరుపుకుంటారు. కానీ మహమ్మారి మనకు నేర్పించిన పాఠం ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మనమంతా మన అంతరంగ ప్రయాణానికి సన్నద్దం కావడం. ఈ రెండు పండుగల నుండి మనం నేర్చుకోవడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇవి ప్రేమ, త్యాగం మరియు అన్నింటికంటే ముఖ్యంగా నిస్వార్థ సేవ యొక్క రూపాలుగా ఉన్నాయి. స్వామి ఇలా అంటారు, "మీ కార్యకలాపాలన్నిటినీ దేవునికి సమర్పణగానూ మరియు మీరు చేసే పనులన్నీ దేవుని పనిగానే భావించండి. పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగరడానికి రెండు రెక్కలు మరియు సైకిల్ ముందుకు కదలడానికి రెండు చక్రాలు ఎంత అవసరమో, అలాగే మనిషి తన అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ప్రేమ మరియు సేవ అవసరం. ప్రేమ లేని సేవను అందించడం ద్వారా ఎటువంటి ప్రయోజనము కలగదు. మీరు చేసే సేవా కార్యకలాపాల నుండి ఎటువంటి ఫలితాన్ని ఆశించవద్దు. సేవను అందించడం ద్వారా మీరు పొందిన సంతృప్తే ఒక అపూర్వ బహుమతి." – శ్రీ సత్య సాయి బాబా, కృష్ణ జయంతి ఉపన్యాసం, 1999 సెప్టెంబర్ 3. మీ అందరికీ తెలిసినట్లుగా, సాయి వైబ్రియోనిక్స్ యొక్క లక్ష్యం ఈ నిస్వార్థ సేవ మరియు షరతులులేని ప్రేమపై ఆధారపడింది!

మా సోదర సోదరీమణులు యుఎస్, కెనడా, గయానా మరియు ట్రినిడాడ్ నుండి ప్రాక్టీషనర్ల కోసం సురక్షితమైన ప్రైవేట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అయిన “వైబ్రియోనిక్స్ సర్కిల్ ఆఫ్ నార్త్ అమెరికన్ ప్రాక్టీషనర్స్ ("VCNAP") ను, ప్రారంభించారని మీకు తెలుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అద్భుత మైలురాయి సాధనలో ఉత్తర అమెరికా సమన్వయకర్త చేసిన అవిరళ కృషి, ప్రాక్టీషనర్ 02844 నుండి అందిన సాంకేతిక సహకారంతో, సుసంపన్నమైన వేదికను రూపొందించడానికి సాధ్యమైంది. దీనిద్వారా అభిప్రాయాలను పంచుకోవడం, పూర్తి సహకార చేయూత, ప్రశ్నోత్తరాలు, ప్రేరణ, స్వామి లీలలు, ప్రత్యక్ష ప్రకటనలు, ప్రార్థన అభ్యర్థనలు స్వీకరించుట, ఇంకా మరెన్నో కార్యక్రమాల నిర్వహణ సుసాధ్యమైంది. ఈ నెట్వర్క్ గతంలో నిర్వహించిన నెలవారీ జూమ్ కాల్‌లను భర్తీ చేస్తూ ప్రతిరోజూ పర్యవేక్షించబడుతోంది. ప్రాక్టీషనర్ల ప్రశ్నలకు ముగ్గురు అనుభవజ్ఞులైన SVP ల ప్యానెల్ సమాధానమిస్తుంది, మరియు ఈ ప్రాంతంలోని అందరి ప్రయోజనం కోసం ఫోరమ్‌లో పోస్ట్ చేయబడుతుంది.  

భారతదేశంలో మహమ్మారి యొక్క మూడవ తరంగం నియంత్రణలోకి వచ్చినందున, మా ఇమ్యునిటీ బూస్టర్ IB కి డిమాండ్ మందగించడం ప్రారంభమైంది. ఏదేమైనా, పుట్టపర్తిలో IB పంపిణీ స్థానిక ప్రాక్టీషనర్లు మరియు వైబ్రియోనిక్స్ అడ్మిన్ మరియు ఇతర వాలంటీర్ల ద్వారా చాలా చురుకుగా కొనసాగుతున్నది. ఒరిస్సాకి చెందిన ప్రాక్టీషనర్ 02835 స్వల్ప వ్యవధిలో ఇచ్చిన నోటీసుకు వెంటనే ప్రతిస్పందించి 550 IB సీసాలను సిద్ధం చేయడం ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అంశము. భారతదేశంలో IB యొక్క మొత్తం లబ్ధిదారుల సంఖ్య, మేము ఈ వార్తాలేఖ ముద్రణకు వెళుతున్నప్పుడు 487,089 కి చేరుకుంది. అలాగే, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆంక్షలను సడలించడంతో, ప్రాక్టీషనర్లు వ్యక్తిగత శిబిరాలను ప్లాన్ చేయడం మరియు క్లినిక్‌లను తిరిగి ప్రారంభించడం మనం చూస్తున్నాము. సాయి ఆర్గనైజేషన్ వారు నిర్వహించే వైద్య శిబిరాలలో తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రజలకు చేరువ కావలసిందిగా ప్రాక్టీషనర్‌లను నేను హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తున్నాను. ఈ సందర్భంగా మీ నివేదికలను స్వీకరించడానికి మరియు ఆయా శిబిరాలలో మీ అనుభవాలను గురించి వినడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. 

కోవిడ్ మహమ్మారి సమయంలో బ్రాడ్‌కాస్టింగ్ కోసం మన చొరవ అద్భుతంగా రూపుదాల్చి, ప్రస్తుతం, ప్రసార అభ్యర్థనలలో గణనీయమైన పెరుగుదల వ్యక్తమవుతోంది; ప్రధానంగా, మన సరికొత్త మరియు మెరుగైన వెబ్‌సైట్ నుండి ఎక్కువ అభ్యర్ధనలు వస్తున్నాయి. SRHVP మెషిన్ ఉన్న ప్రాక్టీషనర్లు అందరూ ఈ సేవ కోసం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పనిచేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మనము బ్రాడ్కాస్టింగ్ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసిడ్యూర్ SOP) మరియు మార్గదర్శకాలను ఖరారు చేశాము, అది త్వరలో ప్రాక్టీషనర్ వాలంటీర్ లకు పంపబడతాయి. SRHVP లేని అభ్యాసకులందరూ తమ ప్రాంతీయ సమన్వయకర్తలను ప్రసార అభ్యర్థనలతో సంప్రదించాలని కూడా నేను అభ్యర్థిస్తున్నాను.

సాయి వైబ్రియానిక్స్ ని మరింతగా ప్రజలకు చేరువ చేయాలనే మన లక్ష్యానికి అనుగుణంగా, మన స్థానిక సాయి కమ్యూనిటీకి చెందిన సభ్యులలో ఎవరైతే తమ పరిసరాల్లో మరియు సమీప గ్రామాలలో క్యాంపులు మరియు కమ్యూనిటీ సెంటర్లలో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారిని గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలి. దీని కోసం మేము ఒక కొత్త వర్గం వైబ్రియోనిక్స్ టార్చ్ బేరర్స్ గా చెప్పదగిన అసిస్టెంట్ ప్రాక్టీషనర్‌ (AP) అనే విధానం రూపొందించాము. వారి కోసం మేము సరళమైన మరియు వేగవంతమైన అడ్మిషన్ ప్రాసెస్‌ రూపొందించాము, దాని తర్వాత వారి స్థానిక భాషలో ఇ-కోర్సు మరియు వర్క్‌షాప్ శిక్షణ ఉంటుంది. ప్రాక్టీషనర్లు అందరూ అటువంటి చురుకైన అభ్యర్ధులను గుర్తించి మాతో సంబంధం నెరపే విధంగా తగిన కృషి చేయవలసిందిగా అభ్యర్ధన. ప్రస్తుతం 2021 డిసెంబర్ లో షెడ్యూల్ చేయబడిన వర్క్‌షాప్‌లో హిందీలో శిక్షణ పొందుటకు మొదటి బ్యాచ్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నాము.   

“స్ప్రెడ్ ద వర్డ్” ప్రచారం లో భాగంగా మనం నిర్వహించిన అనేక ఇంటరాక్టివ్ అవేర్‌నెస్ వెబినార్‌ల దృష్ట్యా చూస్తే ఇది చాలా ఫలవంతమైన సంవత్సరం. అటువంటి అవగాహన చర్చ కోసం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని సుప్రసిద్ధ చిన్మయ మిషన్‌ వారు సహకరించినందుకు ఎంతో గౌరవ ప్రదంగా భావిస్తున్నాము. ఇక్కడ చేసిన ప్రసంగానికి మంచి ఆదరణ లభించడంతో పాటు ఆ తరువాత నిర్వహించిన ఆసక్తికరమైన మరియు శ్రేయోదాయకమైన ప్రశ్నోత్తరాల సెషన్, భవిష్యత్తు కోసం అవకాశాలను మెరుగుపరుస్తుందని నేను సంతోషంగా నివేదిస్తున్నాను. సాయి వైబ్రియోనిక్స్ మిషన్ ను మరింత వ్యాప్తి చేయడానికి వైబ్రియోనిక్స్ ప్రాంతీయ కోఆర్డినేటర్లు తమ రాష్ట్ర కోఆర్డినేటర్లతో సంబంధాలు పెట్టుకొని సాయి భక్తుల కోసం తగిన వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి చర్చలను ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రతిపాదిస్తున్నాము. అటువంటి కార్యక్రమాలను సులభతరం చేయడానికి మీకు అవసరమైన ఏదైనా సహాయంతో మీకు సహకరించడానికి మేము ఆనందంగా సంసిద్ధులమై ఉన్నాము. మరింత సమాచారం కోసం మీరు మాకు [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు.

రోగుల యొక్క అనుభవాలు టెస్టిమోనియల్స్ (ఆడియో, వీడియో, టెక్స్ట్) మరింత ఎక్కువగా పంపవలసిందిగా ఎప్పటిలాగే, ప్రాక్టీషనర్లందరికీ నేను వినయపూర్వకమైన అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. మన సంస్థ ప్రాక్టీషనర్ల అనుభవాల పైనే ఎక్కువగా ఆధారపడుతుంది కనుక మీ అందరి నుండి ఎంత ఎక్కువ సహకారం లభిస్తుందో అంత ఎక్కువగా మనము సమిష్టిగా నేర్చుకుంటూ ఎదుగగలుగుతాము.

మీ అందరికీ సుసంపన్నమైన కాలాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి, బృహత్తరమైన ఈ గొప్ప సేవను కొనసాగించండి!

సాయికి ప్రేమపూర్వక సేవలో

జిత్ కె అగర్వాల్

డిస్ఫాజియా (మ్రింగుడు పడక పోవడం) 11573...India

44-ఏళ్ల-మహిళ తన గొంతు ద్వారా ఏదైనా మింగడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఐదేళ్ల క్రితం ఇది డిస్ఫాజియాగా నిర్ధారణ చేయబడింది. ఆమె తినడం ప్రారంభించిన ప్రతీసారీ, ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది(ఆహారం సరియైన మార్గంలో వెళ్లకుండా తప్పు దారిన పడుతుంది) ఫలితంగా దగ్గు మరియు ఉక్కిరిబిక్కిరి అవుతున్న భావన కలుగుతుంది. ఈ తీవ్రమైన దగ్గు పగలు మరియు రాత్రి కూడా కొనసాగుతున్నందువలన దీని ప్రభావం కారణంగా చాలాసార్లు ఆమెకు శరీరమంతా నొప్పులు (రాత్రి సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది) మరియు జ్వరం కూడా వస్తూ ఉండేది. బహుశా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. వైద్యుడు శస్త్ర చికిత్సకు సిఫారసు చేస్తారని ఆమె భయపడినందున ఆమె అతనిని సంప్రదించలేదు. ఆమె OTC మందులను మాత్రమే తీసుకుంది కానీ పెద్దగా ప్రయోజనం సాధించలేదు. 2018 జనవరి 17 , ప్రాక్టీషనరు క్రింది రెమిడీ ఇచ్చారు:

NM18 General Fever + NM20 Injury + NM30 Throat + NM31 Tonsils (& Glands) + NM32 Vein-Piles + NM36 War + SM41 Uplift…ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు అనంతరం 6TD 

ఒక వారంలోనే శరీరంలో నొప్పి మరియు జ్వరం తగ్గిపోయాయి, ఇప్పుడు ఇబ్బంది లేకుండా బాగా మింగగలుగుతున్నారు, పగటిపూట దగ్గు అప్పుడప్పుడు వస్తోంది కానీ రాత్రి సమయంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో వారం తరువాత పగటిపూట దగ్గు లేదు ఐతే రాత్రిపూట దగ్గులో 50% మెరుగుదల ఉంది, కాబట్టి మోతాదు TDS కి తగ్గించబడింది. ఆమె పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ మరో రెండు వారాలలో ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఆమె ఇప్పుడు తన భోజనాన్ని ఆస్వాదించగలుగుతున్నారు. 2018 ఫిబ్రవరి 28 నాటికి మోతాదు నెమ్మదిగా సున్నాకి తగ్గించబడింది. 2021 జులై నాటికి, వ్యాధి పరిస్థితి మళ్లీ కనిపించలేదు.  

108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే : CC19.7 Throat chronic + CC3.7 Circulation ఇవ్వండి

ఫంగల్ ఇన్ఫెక్షన్ 11573...India

55-ఏళ్ల-వ్యక్తి గత పదేళ్లుగా వేసవి మరియు వర్షాకాలములలో గజ్జలు మరియు పాదాలలో దురద మరియు చర్మంపై పొలుసులు ఏర్పడడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. 2008 వేసవిలో ఇది ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌గా నిర్ధారించబడింది. కొన్ని సీజన్లలో, అతను అల్లోపతి ఔషధాలను తీసుకున్నారు కానీ తరువాత వచ్చే సీజన్‌లో ఇన్‌ఫెక్షన్ మళ్లీ కనిపిస్తూ ఉండేది. కాబట్టి అతను వాటిని తీసుకోవడం మానేశారు. అతను కొబ్బరినూనెతో బాధ తగ్గించుకోవాలని ప్రయత్నించే వారు కానీ స్వల్ప ఉపశమనం మాత్రమే ఉండేది. అయితే ఈ ఇన్ఫెక్షన్ గత సంవత్సరమంతా విరామం లేకుండా కొనసాగడంతో అతను దురదను తట్టుకోలేకపోయారు. నిరంతరం వంటిమీద గోకుకొనవలసిన అవసరం ఉన్నందున, అతను 2018 జనవరి 11 , ప్రాక్టీషనరును సంప్రదించగా అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:    

NM2 Blood + NM6 Calming + NM27 Skin-D + NM101 Skin-H + NM102 Skin Itch + OM17 Liver Gallbladder + SM27 Infection…TDS మరియు నీటిలో బాహ్య అనువర్తనం కోసం…BD

ఒక వారంలో అతను దురదలో 25% ఉపశమనం పొందారు. ఆ తర్వాత ప్రతీ వారం దాదాపు 20% మెరుగుదల గమనించబడింది, ఫిబ్రవరి 15 న ఐదవ వారం ముగిసే సమయానికి, అతని చర్మం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చింది. మోతాదు క్రమంగా తగ్గిస్తూ 2018 మార్చి 2 నాటికి సున్నాకి తగ్గించబడింది. మూడున్నర సంవత్సరాల తరువాత కూడా అతను ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదీ లేకుండా ఆరోగ్యమైన జీవితం కొనసాగిస్తున్నారు.

108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే : CC21.3 Skin allergies + CC21.7 Fungus ఇవ్వండి

చలికాలము వచ్చే దగ్గు 03521...USA

ఒక 37-ఏళ్ల-మహిళ 2013 లో USA వెళ్ళారు. అప్పటి నుండి ఆమె ప్రతీ శీతాకాలంలో, పగలు మరియు రాత్రి కూడా నిరంతర దగ్గుతో బాధపడటమే కాక, తినేటప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆమె తల్లికి ఉబ్బసం ఉంది, కానీ ఈమెకు చిన్నతనంలో మాత్రమే తేలికపాటి జలుబు మరియు దగ్గు వచ్చింది. మునుపటి రెండు శీతాకాలాలలో, ఆమెకు స్టెరాయిడ్స్ మరియు ఇన్హేలర్ సూచించబడ్డాయి, అది ఆమెకు ఉపశమనం కలిగించింది కానీ అది తాత్కాలికం మాత్రమే. తరువాతి శీతాకాలం ప్రారంభంలో తీవ్రమైన దగ్గు ఏర్పడింది, అయితే ఆమె గత సంవత్సరాల్లో అల్లోపతి మందుల దుష్ప్రభావాల వల్ల ఇబ్బంది పడుతున్నందున ఆమె వాటిని తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. 2016 అక్టోబర్ 20 , ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:

NM8 Chest + NM9 Chest TS + NM30 Throat + NM71 CCA + SM31 Lung & Chest + CC10.1 Emergencies…TDS 

ఒక వారంలో, రాత్రిపూట వచ్చే దగ్గు పూర్తిగా తగ్గిపోగా పగటి పూట వచ్చే దగ్గులో 25% మెరుగుదల ఉంది. మరో మూడు వారాల తరువాత, పగటి దగ్గు కూడా అదృశ్యమైంది మరియు ఉక్కిరిబిక్కిరి చేసే ఇబ్బంది కూడా పోయింది. అయితే, ఆమె మోతాదు తీసుకోవడం మర్చిపోతే, లక్షణాలు తిరిగి ఏర్పడుతున్నట్లు అనిపించడంతో ఆమె TDS వద్ద మోతాదు కొనసాగించాలని సూచించబడ్డారు. మరో నాలుగు వారాల తర్వాత, CC10.1 Emergencies మినహాయిస్తూ రెమిడీ సవరించబడింది. ప్రస్తుతం శీతాకాలపు గరిష్ఠ స్థాయి ఉన్న కారణంగా మోతాదు 2017 ఫిబ్రవరి 15 న BD కి తగ్గించే ముందు వరకు TDS గా ఇవ్వబడింది. ఒక నెల తరువాత OD కి తగ్గించి, 2017 ఏప్రిల్ మూడవ వారంలో నిలిపివేయ బడింది. నాలుగు శీతాకాలాలు గడిచిపోయాయి, ప్రస్తుతం 2021 జులై వరకు, ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.   

108CC బాక్సు ఉపయోగిస్తుంటే : CC19.6 Cough chronic + CC19.6 Throat chronic + CC10.1 Emergencies ఇవ్వండి.

‘‘అనిమే”యానిమేషన్ కార్టూన్ల వ్యసనం 03594...USA

25 ఏళ్ల యువకుడు 7 సంవత్సరాల క్రితం తన అండర్ గ్రాడ్యుయేట్ చదువు కోసం అమెరికాకు వెళ్లాడు. తన కాలేజీ మొదటి సంవత్సరంలో, అతను అనిమే* అని పిలువబడే జపనీస్ కార్టూన్‌లను చూడటం ప్రారంభించాడు. ఇది నెమ్మదిగా వ్యసనంగా మారి కొన్ని నెలల తర్వాత, అతను రాత్రులలో కూడా నిరంతరం ఈ కార్టూన్లు చూడసాగాడు. కాబట్టి పగటిపూట, అతనికి ఏకాగ్రత లోపించింది మరియు తన చదువుపై దృష్టి పెట్టలేకపోయాడు. ఫలితంగా, అతను పరీక్షలలో బాగా రాణించలేక చివరికి రెండేళ్ల అధ్యయనం తర్వాత కళాశాల నుండి తప్పుకున్నాడు. అతను శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు మరియు రిసెప్షనిస్ట్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. యువకుని తండ్రి ఇతనిని ఈ వ్యసనము విడిచిపెట్టవలసిందిగా ఒప్పించారు. అంతేకాక గతంలో తనకు వైబ్రియానిక్స్ యొక్క స్వస్థత కలిగించే శక్తి పై ఉన్న నమ్మకం కారణంగా వైబ్రియోనిక్స్‌ని తీసుకోవలసిందిగా సూచించారు. కుమారుడు దీనికి అంగీకరించినందున ప్రాక్టీషనరు 2015 డిసెంబర్ 14 న క్రింది రెమిడీ ఇచ్చారు:   

#1. CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions…TDS

డిసెంబర్ 29 న, రోగి నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ బట్టి అతనికి రాత్రి నిద్రపట్టక పోవడం కారణంగా అది కార్టూన్‌లను చూడటానికి  దోహదపడిందని ప్రాక్టీషనరు రోగి నుండి గ్రహించారు. రోగి సాధారణ నిద్రా విధానానికి తిరిగి రావడానికి సహాయపడటము కోసం అదనపు రెమిడీ ఇవ్వబడింది:

 #2. CC15.6 Sleep disorders…సాధారణ నిద్రవేళకు 30 నిమిషాల ముందు, నిద్రరాకపోతే 30 నిమిషాల వ్యవధిలో రెండు మోతాదుల వరకు,  

ఇది రోగి కార్టూన్‌లను నిరంతరం చూసే అలవాటును తగ్గించడానికి మరియు పగటిపూట చక్కగా పనిలో నిమగ్నం కావడానికి సహాయపడింది.

ప్రారంభంనుండే, అనిమే చూడడానికి గడిపే సమయం వారం వారం క్రమంగా తగ్గిపోసాగింది. 2016 మార్చి3 నాటికి 50% మెరుగుపడినట్లు అతను భావించారు. అతని కుటుంబ సభ్యుల మద్దతుతో, అతను రెమిడీలు తీసుకోవడం కొనసాగించగా వారు ఇతనిలో మరింత స్థిరమైన మెరుగుదలను గమనించారు. జూన్ మొదటి వారం నాటికి, అతను తన వ్యసనాన్ని పూర్తిగా అధిగమించాడు, ఐతే కార్టూన్‌లను చూడటములో అతని అభిరుచి మాత్రం కొనసాగుతూనే ఉంది. #1 మోతాదు BD కి తగ్గించబడి క్రమంగా జులై చివరి వారం నాటికి క్రమంగా సున్నాకి తగ్గించబడింది. అటుపిమ్మట #2 యొక్క అవసరం రాలేదు. 2017లో తన చదువును కొనసాగించుకోవడానికి ప్రారంభించి 2019 లో విజయవంతంగా పట్టభద్రుడయ్యాడు. జూలై 2021 నాటికి, చక్కగా చదువుకుంటున్నాడు.     

*అనిమే వ్యసనము చాలా వాస్తవమైనదిగా అనుభూతి కలిగిస్తూ ఉంటుంది, ఐతే చాలా ప్రమాదకరమైనది (వీడియోగేమ్ వ్యసనం వంటిది). ఎందుకంటే ఇది సరదాగా, యాక్షన్‌ తో కూడి, హాస్యభరితంగా మరియు వినోదాత్మకంగా ఉంటుంది. ఇది మరొక ఎపిసోడ్‌ను చూడకుండా ఉండలేనంతగా దృశ్యకులను ప్రోత్సహించే ప్రదర్శన వంటిది.  

చర్మము పై దురద 03578...France

45 – ఏళ్ల - మహిళ గత 25 సంవత్సరాలుగా తన శరీరంలోని వివిధ భాగాలలో చర్మం మీద దురదతో బాధపడుతున్నారు, ఇది చేతులు మరియు కాళ్లపై చాలా ఎక్కువగా ఉంది. ఒక సంవత్సరం క్రితం ఇది తీవ్ర సమస్యగా అయ్యేంతవరకూ కూడా ఇది ఆమెను పెద్దగా బాధించలేదు. ఆమె తన చర్మము పైన నిరంతరం గోకుతూ ఉంటుంది, ఇది రాత్రులలో ఎక్కువగా ఉండి, నిద్రలేమి కలుగుతూ ఉండేది. ఆమె విభిన్న అల్లోపతి చికిత్సలు ప్రయత్నించారు కానీ అవి ఏమాత్రం ఉపశమనం ఇవ్వలేదు. ఆరు నెలల క్రితం ఆమె క్లీనింగ్ కు సంబంధించిన ఒక ఉద్యోగములో చేరినప్పుడు, శుభ్రపరిచేందుకు వాడే రసాయనములు ఉత్పత్తుల వాడకం వల్ల, ఆమె పరిస్థితి మరింత దిగజారింది. దురద భరించలేనిదిగా మారడంతో, ఆమె 2019 జులై 12 ప్రాక్టీషనరును కలిసినప్పుడు ఆమె దాదాపు కళ్లనీళ్ళ పర్యంతం అయ్యారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:  

#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies…6TD ఒక వారం అనంతరం TDS 

#2. CC21.3 Skin allergies…TDS బాహ్య అనువర్తనం కోసం కొబ్బరినూనెలో  

జూలై 21 నాటికి ఆమెకు దురదలో 20% మాత్రమే మెరుగుదల ఉంది కానీ ఆమె ఇప్పుడు బాగా నిద్రపోగలుగుతున్నారు. అయితే, మేల్కొన్నప్పుడు, దురద మొదలవుతుంది. మరో ఎనిమిది రోజుల తర్వాత, ఉపశమనం చాలా తక్కువగా ఉన్నందున, #2 క్రింది విధంగా మెరుగుపరచ బడింది.

#3. CC10.1 Emergencies + #2…TDS బాహ్య అనువర్తనం కోసం కొబ్బరినూనెలో

రెండు వారాల తరువాత, దురద విషయంలో 70% మరియు మరో నెల తర్వాత 90% ఉపశమనం కలిగింది. ఆమె రెండు రెమిడీల మోతాదును OD కి తగ్గించాలని భావించారు. అక్టోబర్ 11 న, ఆమె చర్మంపై దురద పూర్తిగా తొలగిపోయిందని సంతోషంగా తెలియజేసారు. మరో రెండు వారాల తర్వాత, 2019 డిసెంబర్ 15 న రెమిడీ ఆపే వరకు మోతాదు OW కి తగ్గించబడింది. 2020 జులైలో వారి చివరి సంప్రదింపుల సమయానికి, రెమిడీ నిలిపివేసిన ఏడు నెలల తర్వాత కూడా వ్యాధి పునరావృతం కాలేదు.

తామర 11629...India

25 ఏళ్ల స్త్రీకి దురద, పొడిగానూ మరియు పొలుసులుగా ఉండే చర్మం, ప్రధానంగా ఆమె వీపు పైభాగంలో ఏర్పడ్డాయి. ప్రభావిత భాగాలు ఆమె సాధారణ చర్మం రంగు కంటే పేలవంగా ఉండేవి. క్రమంగా ఇవి ముందు వైపు కూడా వ్యాపించడం ప్రారంభించాయి (చిత్రాలు చూడండి). ఈ పరిస్థితి ఒక సంవత్సరం క్రితం తామరగా నిర్ధారించబడి ఆమెకు మాత్రలు మరియు లేపనం రెండూ సూచించబడ్డాయి. అయితే, చర్మం ఎర్రబడినప్పుడు మరియు పొక్కులు వంటివి ఏర్పడినప్పుడు మాత్రమే ఆమె వీటిని ఉపయోగిస్తుస్తున్నారు; ఇది ప్రతీ నెలా ఏర్పడుతూ అల్లోపతి చికిత్స తర్వాత 8-10 రోజులకు తీవ్రత తగ్గుతుంది. 2020 ఏప్రిల్ 7 , ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:

CC21.2 Skin infections + CC21.6 Eczema…TDS 

మే 4 నాటికి, ఆమె వ్యాధి లక్షణాలు అన్నింటినుండి 100% మెరుగుదల ఏర్పడి ఆమె చర్మం సాధారణమయ్యింది. (చిత్రాలు చూడండి). మోతాదు OD కి తగ్గించబడింది, ఆమె ఇలానే కొనసాగించడానికి ఇష్టపడ్డారు. ఆరు నెలల తర్వాత కూడా ఎలాంటి లక్షణాలు పునరావృతం కానందున, ఆమె నవంబర్ చివరి వారంలో నివారణను నిలిపివేసారు. 2021 ఆగష్టు నాటికి, ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నారు. 

సంపాదకుని సూచన: చర్మ సంబంధిత రుగ్మతలలో, బాహ్య అనువర్తనం కూడా సిఫారసు చేయడం మంచిది

  

కంట్రోల్ కాని కడుపునొప్పి 01001...Uruguay

ఏడేళ్ల బాలుడు ఆహారం తీసుకోవడం ప్రారంభిచగానే కడుపు నొప్పి ఏర్పడి తినడం మానివేయసాగాడు. అందువలన తను తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండడంతో సన్నగా అయ్యాడు. డాక్టర్ అతడి ఉదరంలో పరాన్నజీవుల కోసం పరీక్షించారు కానీ అటువంటివి ఏవీ లేవని తేలింది. కాబట్టి అతను ఎటువంటి మందులను సూచించక దీనికి ఏదైనా భావోద్వేగము కారణము కావచ్చని తెలిపారు. నాలుగు నెలల క్రితం బాబు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పుడు అతను భోజనం చేసే ప్రతీ సారి ఈ సమస్య ప్రారంభమయ్యింది. దీని గురించి తల్లి ఆందోళన చెందుతూ 2020 జనవరి 20 ప్రాక్టీషనరును సంప్రదించారు. తన కుమారుడు పాఠశాలకు వెళ్ళడం మరియు ఉపాధ్యాయులు మరియు తోటివారిని కలవడం పట్ల భయంతో ఉన్నాడు అన్న విషయం తప్ప వ్యాధికి ఎటువంటి స్పష్టమైన కారణాన్ని గుర్తించలేకపోయారు. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

NM6 Calming + NM12 Combination-12 + NM29 SUFI…TDS

మొదటి రోజు, అతను 3 సార్లు వాంతి చేసుకున్నాడు. ఇది పుల్ అవుట్ అని గ్రహించి, తల్లి అదే మోతాదును కొనసాగించారు. వాంతులు మరో రెండు రోజులు కొనసాగి జనవరి 22న ఆగిపోయాయి. ఆ తర్వాత అతను భోజనం చేసే సమయంలో ఇబ్బంది నుండి బయటపడి నొప్పి లేకుండా స్వల్ప ఆహారాన్ని తినగలిగాడు. అతని పరిస్థితి నిరంతరం మెరుగుపడి కొంతకాలం తర్వాత, అతను పూర్తి భోజనాన్ని హాయిగా తినగలగాడు. ఇది కుటుంబంలోని ప్రతీ ఒక్కరికీ చాలా సంతోషాన్నిచ్చింది. ఫిబ్రవరి 26 న  మోతాదు OD కి తగ్గించబడింది మరియు ఏప్రిల్ 2 నాటికి క్రమంగా సున్నాకి తగ్గించబడింది. బాలుడు ఇంకా సన్నగానే ఉన్నప్పటికీ, అతను బలంగా మరియు శక్తివంతంగా ఉన్నాడు. ఇప్పటికి ఒక సంవత్సరానికి పైగా అయింధి, బాలుడు తన భోజనాన్ని ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా పెరుగుతున్నాడు.   

108CCబాక్సు ఉపయోగిస్తున్నట్లైతే : CC4.1 Digestion tonic + CC15.1 Mental & Emotional tonic ఇవ్వండి.

హెచ్ ఐ వి HIV 11585...India

42 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడు 2019 ఫిబ్రవరి నుండి జ్వరం, ఆకలి లేకపోవడం, అలసట, బరువు తగ్గడం మరియు రాత్రిళ్ళు   చెమట పట్టడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మార్చి 7 న అతనికి హెచ్ఐవి ఉన్నట్లు నిర్ధారణ అయింది మరియు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నుండి యాంటీవైరల్ మందులు తీసుకోవడం ప్రారంభించారు. అతడి భార్యకు టెస్ట్ చేయించగా నెగెటివ్‌గా తేలింది. అతను తరచుగా పని నిమిత్తం ఇంటి నుండి దూరంగా వెళుతున్నందువలన వివాహేతర సంబంధాల కారణంగా తనకు ఈ వ్యాధి  సంక్రమించినట్లు అతనికి తెలుసు. అపరాధ భావనతో ఇప్పుడు, అతను తన ఇంటి నుండి బయటకు కూడా వెళ్లలేనంత స్థితిలో ఉన్నారు. తన భర్త పరిస్థితితో నిరాశకు లోనైన భార్య, 'సాయిబాబా వైద్యం' (గ్రామస్తులు వైబ్రియానిక్స్ ను ఆ విధంగానే పిలుస్తారు) తన భర్తకు ఏమైనా సహాయము చేయగలదేమో అని విచారించడానికి ప్రాక్టీషనరును సంప్రదించారు. 2019 మార్చి 13 , ప్రాక్టీషనర్ రోగిని అతని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. రిపోర్టులు చూసిన తరువాత, ఆ దంపతులకు సరైన వైఖరిని కలిగి ఉండాలని మరియు పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని  దంపతులకు సలహా ఇచ్చి, క్రింది రెమిడీ ఇచ్చారు:   

NM12 Combination 12 + NM63 Back-up + NM90 Nutrition + OM28 Immune System + SM26 Immunity + SM29 Kidney + SM30 Life (AIDS) + SM41 Uplift + SR250 Psorinum + SR272 Arsen Alb CM + SR282 Carcinosin + SR292 Graphites 30C + SR318 Thuja 200C + SR345 Calendula + SR360 VIBGYOR...TDS 

ఒక నెల రోజులలో, రోగి తన వ్యాధి లక్షణాలలో అన్నింటి నుండి 30% మెరుగుదలని పొందారు. అతను రీఫిల్ కోసం ప్రాక్టీషనరును స్వయంగా సందర్శించారు. చికిత్స పట్ల చాలా సానుకూలంగా మరియు విశ్వాసంతో ఉన్నారు. మరో రెండు నెలల తరువాత, అతనికి 80% మెరుగుదల కలిగి తన పనిని తిరిగి ప్రారంభించుకొనడానికి తగినంత శక్తి కలిగి ఉన్నారు. 2019 సెప్టెంబర్ నాటికి, అనగా మూడు నెలల తర్వాత, అతను 100% అన్ని వ్యాధి లక్షణాలు నుండి కోలుకోవడంతో అల్లోపతి మందులు తీసుకోవడం మానేశారు. 2019 డిసెంబర్ 9 న, HIV పరీక్ష ఫలితం నెగిటివ్ గా రావడం చూసి ప్రాక్టీషనరు ఎంతో ఆనందించారు. మోతాదు OD కి తగ్గించబడి చివరకు 2020 మార్చి 14 న నిలిపివేయబడింది. 2021 జులై నాటికి, అతను ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. 

108CCబాక్సు ఉపయోగిస్తున్నట్లైతే : CC12.3 AIDS - HIV + CC12.4 Autoimmune diseases

అరచేతి చర్మముపై దురద మరియు పొరలు 11210...India

ఒక 50-ఏళ్ల-వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా రెండు అరచేతులపై మరియు పాదాలపై కొంతభాగము దురద, బొబ్బలు మరియు చర్మము పొరలుగా విడిపోవడం అనే సమస్యతో బాధపడుతున్నారు. మొదటి రెండు సంవత్సరాలలో, అతను కేవలం కొబ్బరి నూనెను ఉపయోగించడం ద్వారా సమస్య నివారించడానికి ప్రయత్నించారు కానీ ఇది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చింది. 2019 లో పరిస్థితి అధ్వాన్నంగా మారినప్పుడు, అతను చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించగా కొన్ని యాంటీ-అలెర్జీ మాత్రలతో పాటు ప్రోసివేట్ ఎస్ (కార్టికోస్టెరాయిడ్) క్రీమ్‌ సూచించారు. అతను మాత్రలు తీసుకోలేదు కానీ క్రీమ్ మంచి ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే, స్వల్పకాలం తర్వాత, లక్షణాలు మళ్లీ కనిపించేవి. అందువలన అతను

క్రీమ్‌ను దాదాపు ప్రతీరోజూ ఉపయోగించాల్సి వచ్చింది, ఆ విధంగా అతను రెండు సంవత్సరాలు గడపడం జరిగింది. అతను తన మోటార్‌బైక్ రైడింగ్‌ కూడా వదులుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే హ్యాండిల్స్ అతని అరచేతులకు రాపిడి జరగడం ద్వారా పరిస్థితి మరింత తీవ్రమవుతూ ఉండేది. 2021 మార్చి3 (చిత్రాన్ని చూడండి) అతను ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC21.3 Skin allergies + CC21.5 Dry Sores + CC21.6 Eczema...TDS నోటికి తీసుకోవడానికి మరియు కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం …BD 

   

    

అతను వైబ్రో రెమెడీని మాత్రమే తీసుకున్నారు. ఒక వారం తరువాత, తన పాదాలు ఇప్పుడు సాధారణ స్థితిలో ఉన్నాయని మరియు అరచేతులపై బొబ్బలు పోయాయని తెలిపారు. అయితే దురద మరియు పొరలుగా ఉండే చర్మం కేవలం 25% మాత్రమే మెరుగ్గా ఉండగా మార్చి 29 నాటికి, అతనికి 90% మెరుగయ్యింది (చిత్రాన్ని చూడండి). నోటి ద్వారా తీసుకొనే మోతాదు కూడా BD కి తగ్గించబడింది. ఏప్రిల్ 6 నాటికి అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, కనుక అతను ఏప్రిల్ 20 నాటికి రెమిడీలు ఉపయోగించడం మానేసే వరకు తగ్గించిన మోతాదులో రెమిడీ ఉపయోగించారు. 2021 జులై నాటికి, ఎటువంటి లక్షణాలు పునరావృతం కాలేదు.

ఎముక విరుగుదల నయం అయిన అనంతరం ఏర్పడిన భుజం నొప్పి 11626...India

2020 ఫిబ్రవరి 23 న, 61-ఏళ్ల-మహిళ కింద పడిపోయిన సందర్భంలో, ఆమె కుడి భుజంలో వెంట్రుక వాసి పగులు ఏర్పడి తీవ్రమైన నొప్పికలుగ సాగింది. ఆమె భుజం క్రీప్ కట్టుతో చుట్టబడింది, ఆమెకు పెయిన్ కిల్లర్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని సూచింపబడింది. మూడు రోజుల తర్వాత దాని దుష్ప్రభావాలకు భయపడి ఆమె పెయిన్ కిల్లర్‌ను ఆపివేసారు. ఎముక నయం కావడంతో 45 రోజుల తర్వాత కట్టు తొలగించబడింది. కానీ ఆమె కుడి చేయిని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా, తనను తీవ్రంగా వేధించే నొప్పి నుండి ఉపశమనం మాత్రం లభించలేదు. ఆమె ఒక గ్లాసు నీరు కూడా చేతితో పట్టుకోలేకపోయేవారు, ఇంటి పనులు చేసుకోవడం బహు ప్రయాసగా ఉండేది. 2020 మే లో, ఆమె ప్రాక్టీషనరు నుండి IB (కోవిడ్ -19 కోసం) రెమిడీ తీసుకోవడం ప్రారంభించారు. రెండు వారాలలో, 18 నెలలుగా ఆమెను వేధిస్తున్న నిద్ర సమస్య పూర్తిగా తగ్గిపోయింది. వైబ్రియోనిక్స్ శక్తి యొక్క ఈ అనుభవంతో ఆమె ప్రోత్సహింపబడి తన చేతి నొప్పి కోసం ప్రాక్టీషనరును సంప్రదించారు. పై సమస్యతో పాటు ఆమెకు గత రెండు సంవత్సరాలుగా అధిక శారీరక శ్రమను ఎదుర్కొన్నప్పుడు, అలాగే బాసీమఠం (క్రాస్ లెగ్డ్) వేసుకొని 15 నిమిషాల కన్నా ఎక్కువ సేపూ కూర్చున్నప్పుడల్లా మోకాళ్లపై తేలికపాటి నొప్పి కలిగేది. 2020 జూన్ 1 ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.6 Osteoporosis + CC20.7 Fractures…TDS 

ఒక నెల తర్వాత జులై 5 న, ఆమె భుజం మరియు మోకాలి నొప్పిలో 100% ఉపశమనము ఏర్పడినట్లు తెలిపారు. ఆమె తన కుడి చేతిని కదిలించగలగడం, రోజువారీ పనులను సులువుగా చేసుకోగలగడం, మరియు ఎక్కువసేపు బాసీమఠం లో కూర్చోగలగడం సులభతరం అయ్యింది. మోతాదును సెప్టెంబర్ 10న పూర్తిగా ఆపేముందు 8 వారాలవరకు OD గా తగ్గించబడింది. అంతేకాక ఆమెకు ఎముకలకు సంబంధించిన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం కోసం క్రింది రెమిడీ ఇవ్వబడింది: 

#2. CC20.1 SMJ tonic + CC20.6 Osteoporosis…TDS ఐదు నెలల వరకు TDS, ఒక నెలకి BD, 2 నెలలకు OD మరియు 2021 మే 20 న నిలిపివేయడం జరిగింది.

2021 ఆగష్టు లో తదుపరి సమీక్షలో, ఎటువంటి నొప్పి పునరావృతం  కాలేదని తెలిసింది.

వంధత్వము 03572...Gabon

బాధాకరమైన రుతుస్రావంతో బాధపడుతున్న38-ఏళ్ల-మహిళకు 2015 అక్టోబర్ లో ఆమె కుడి అండాశయంలో 5 సెంటీమీటర్ల తిత్తి ఉన్నట్లు నిర్ధారణ అయింది; హార్మోన్ల టెస్ట్ ఫలితాలు సాధారణముగానే ఉన్నాయి. గైనకాలజిస్ట్ తిత్తి కోసం, లుటెనైల్ 10 రోజులు తీసుకోవలసిందిగా ఆమెకు సూచించినప్పటికీ అది సహాయం చేయలేదు. ఆమెకు 8-ఏళ్ల-కుమార్తె ఉంది మరియు 2017 ఫిబ్రవరి నుండి రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారు. 2018 జూన్ నాటికి ఆమె గర్భం దాల్చకపోవడంతో, ఆమె HSG పరీక్ష చేయించుకోగా తన రెండు ఫెలోపియన్ ట్యూబ్‌లు పూర్తిగా బ్లాక్ అయ్యాయని వెల్లడించారు. ఆమె ఋతు చక్రాన్ని నియంత్రించడానికి మరియు అండోత్సర్గము పెంచడానికి ఆమెకు మూడు నెలల పాటు క్లోమిడ్ మరియు డుఫాస్టన్ సూచించబడింది. అయితే, ఆమె గర్భం ధరించలేదు లేదా ఋతు చక్రంలో ఎటువంటి మార్పు లేదు. ఆమె కుటుంబంలో ఈమె పట్ల చాలా అసూయ ఉన్నందున, ఎవరో తనపై మంత్రాలు ప్రయోగించారని కాబట్టి తను గర్భం దాల్చలేకపోయినట్లు అనుమానించారు. 2018 సెప్టెంబర్ 15 ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా ఈ క్రింది రెమిడీ ఇచ్చారు: 

#1. CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders…TDS

ఆమె ఏ ఇతర ఔషములు తీసుకోలేదు. 2019 మే 10 న, ఆమె ఋతుస్రావం ఇక బాధాకరంగా లేదని మరియు ఒక ఫెలోపియన్ ట్యూబ్ తెరుచుకోగా, మరొకటి బ్లాక్ చేయబడే ఉందని గైనకాలజిస్ట్ కనుగొన్నారని ఆమె తెలిపారు. రెమిడీ క్రింది విధంగా మెరుగుపరచబడింది:

#2. CC8.5 Vagina & Cervix + #1…TDS 

జూన్‌లో డాక్టర్ ఆమెకు ఓపెన్ ఫెలోపియన్ ట్యూబ్‌లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందని కనుగొన్నారు మరియు దానిని తొలగించాలని, అలాగే ట్యూబ్‌ను కూడా తీసివేయాలని సూచించారు. శస్త్రచికిత్స తర్వాత ఆమెకు 10 రోజుల పాటు నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ చికిత్స అందించబడింది. ఈ అనుభవం తర్వాత కూడా, ఆమె బిడ్డను పొందాలని కృతనిశ్చయం తో వైబ్రియోనిక్స్‌ కొనసాగించాలని ధృఢంగా నిర్ణయించుకున్నారు. ప్రాక్టీషనరు రెమిడీని ఇలా మార్చారు:

≠3. CC8.4 Ovaries & Uterus + CC8.5 Vagina & Cervix + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders…TDS

సెప్టెంబర్ 30 న, ఆమె గర్భ ధారణ పరీక్ష పాజిటివ్ అని ప్రాక్టీషనర్‌కి తెలియజేస్తూ ఆమె హర్షం వ్యక్తం చేసారు. గైనకాలజిస్ట్ బ్లాక్ చేయబడిన ఫెలోపియన్ ట్యూబ్‌తో గర్భం దాల్చడం ఎలా సంభవించిదో అర్ధాంకాక ఆశ్చర్యానికి లోనయ్యారు. పిండం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంది. ఆమె రోగితో ఇలా అన్నారు, "మేడమ్, మీరు గర్భవతి కావడం నిజంగా ఒక అద్భుతం." డాక్టర్ అధిక రక్తపోటును గుర్తించినందున, ఆమెకు ఆల్డోమెట్ సూచించబడింది. గర్భధారణ పూర్తి కాలము, మరియు ప్రసవం అనంతరం ఒక నెల వరకు తీసుకోవలసినదిగా సూచిస్తూ #3 ను క్రింది రెమిడితో భర్తీ చేసారు.   

గర్భ ధారణ కోసం

#4. CC8.2 Pregnancy tonic + CC8.9 Morning sickness + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders…TDS 

అధిక రక్త పోతుకోసం

#5. CC3.3 High Blood Pressure (BP) + CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC17.2 Cleansing…TDS

1 ఏప్రిల్ 2020 న ఆమె ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె మే 1 న #4 తీసుకోవడం మానేసారు కానీ బిపి కొంచెం ఎక్కువగా ఉన్నందున #5 ని కొనసాగించాలని సూచింప బడ్డారు. జూన్ 1 న BP సాధారణము కావడంతో #5 తీసుకోవడం ఆపివేశారు. 2021జులై నాటికి, ఆమె మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.   

ప్రాక్టీషనర్ల వివరాలు 11573...India

ప్రాక్టీషనర్ 11573...ఇండియా భగవాన్ బాబావారు వీరి జీవితం లోనికి ఒక అనూహ్యమైన మార్గంలో ప్రవేశించే నాటికి వీరు చాలా చిన్నవయసులో ఉన్నారు. ఆ వయసులో వీరి కుటుంబం ఒక ఘోరమైన ప్రమాదంలో చిక్కుకోగా, అందులో వీరి తండ్రి మరియు ఇతను అద్భుతంగా తప్పించుకున్నారు, కానీ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో నాస్తికుడు ఐన వీరి తండ్రి ఆమె రక్షింపబడడం కోసం హృదయ పూర్వకంగా ప్రార్థించగా బాబా దర్శనం లభించింది. తల్లి ప్రాణాలతో బయటపడిందని ఈ సంఘటన కుటుంబము మొత్తాన్ని స్వామివారి ఒడిలోకి తెచ్చిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రాక్టీషనరు మరియు అతని తోబుట్టువులు చిన్న వయస్సు నుండే సేవను ప్రారంభించి, స్థానికంగా మరియు పుట్టపర్తిలో సేవాదళ్ గా  పనిచేశారు.

 1996 లో వీరి తల్లిదండ్రులు ఇద్దరూ ఐదు నెలల వ్యవధిలో క్యాన్సర్‌తో మరణించడం ఖరీదైన అల్లోపతి చికిత్సకు ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి వీరికి మార్గనిర్దేశం చేయడంలో కీలకమైనది. అనేక సంవత్సరాలుగా, వీరు సమయం మరియు అవకాశము చిక్కినప్పుడల్లా, ఆయుర్వేదం, ప్రాణాయామం, ధ్యానం, సూర్య బింబము పై దృష్టి సారించడం, మొదలైన వాటి ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై స్నేహితులకు మరియు పరిచయస్తులకు ఉచిత సలహాలను అందించసాగారు. అయినప్పటికీ, వీరికి సంతృప్తి కలుగలేదు, ఎందుకంటే ఈ మార్గంలో పురోగతీ లేదు, సేవను కొనసాగించనూ లేనిస్థితి.2014 డిసెంబర్ లో, తన తోటి సాయి భక్తుడి నుండి వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు, తక్షణమే దానిని భగవంతుని పిలుపుగా గుర్తించారు. పర్యవసానంగా, తను కోర్సులో చేరి 2015 ఏప్రిల్ లో AVP గా అర్హత సాధించారు, మరియు 2016 మార్చిలో VP గా పదోన్నతి పొందారు.2016  డిసెంబర్ 31 న SVP కోసం తన అధికారిక దరఖాస్తును సమర్పించారు. మరుసటి రోజు జనవరి 1 న , వీరి కుమార్తె స్వామికి ప్రసాదం సమర్పిస్తున్న సందర్భంలో వీరి అపార్ట్‌మెంట్ పైకప్పు మొత్తం పెద్ద నీటి బిందువులతో కప్పబడి ఉండటం గమనించారు. పై కప్పు లీక్ అవుతుందేమో అని ఆందోళన చెంది తనిఖీ చేయడానికి ఒక ప్లంబర్‌ను పిలిపించారు. కానీ ఎటువంటి లీక్ కనుగొనబడలేదు, అంతేకాక తను నివశిస్తున్న రెండు స్వంత అపార్ట్‌మెంట్‌లలోనూ, పైన మరియు దిగువన ఎలాంటి సమస్య లేదు. అప్పుడే అది స్వామి అనుగ్రహించిన అమృతం (దివ్యఅమృతం) అనివారు గ్రహించారు. తను SVP కి దరఖాస్తు చేసుకున్నందుకు ప్రతిస్పందనగా స్వామి అందించిన ఒక గొప్ప ఆశీర్వాదంగా భావించారు. ఈ రోజు వరకు కూడా, ఈ అమృత బిందువులు గోడలపైకి జాలువారుతున్న గుర్తులు ఉన్నాయి. 2017 నవంబర్ లో వారు SVP కోర్సును పూర్తి చేసారు, మరుసటి సంవత్సరం, వైబ్రియోనిక్స్ సేవకు పూర్తి సమయం కేటాయించడం కోసం ముందస్తు పదవీ విరమణ పొందారు.

ఈ రోజు వరకు, వీరు 4500 మంది రోగుల వైవిధ్యమైన వ్యాధులకు చికిత్స అందించారు, ముఖ్యంగా క్యాన్సర్లు మరియు కణితులు, జీర్ణ రుగ్మతలు, స్త్రీ సమస్యలు, జ్వరాలు & అంటువ్యాధులు, నోరు మరియు తలకు సంబంధించిన సమస్యలు, SMJ సమస్యలు మరియు చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో 90% పైగా విజయాన్ని సాధించారు. వైబ్రియోనిక్స్ యొక్క ఆశావాహ ధృక్పధం మరియు దాని ఫలితంగా మానవజాతి సంక్షేమం గురించి అవగాహన ప్రజలలో పెరుగుతూ ఉండడంతో గరిష్ట సంఖ్యలో వ్యక్తులను చేరుకోవడానికి ఈ ప్రాక్టీషనరును ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ స్పూర్తే వీరి జిల్లాలో స్థానిక సాయి కేంద్రాల నుండి భక్తులు చురుకుగా పాల్గొనడంతో నెలవారీ శిబిరాలను ప్రారంభించడానికి దారితీసింది, మొట్టమొదటి క్యాంప్ 2016 జనవరి16 న వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ఒక బిజీగా ఉండే మార్కెట్‌ ప్రాంతంలో జరిగింది. ఈ క్యాంపు ప్రాక్టీషనరు మరియు ఇతర వాలంటీర్లకు మొదటి అనుభవం ఐనప్పటికీ, వారు 8 గంటల వ్యవధిలో అన్ని వయసులకు చెందిన 80 మంది రోగులకు సేవలు అందించారు. ఇంతకంటే హృదయ పూర్వక సంతృప్తి నిచ్చేది ఇంకేమీ కావాలి?, రీఫిల్ కోసం వచ్చే రోగుల శాతం నిరంతరం పెరుగుతూనే ఉంది. ప్రతీ శిబిరంలోనూ, ఈ ప్రాక్టీషనరు స్వామి తాలూకు ఉనికిని అనుభవిస్తూ ఇది వీరిని ఎంతో ఆనందింప చేసేది. ఒక గుర్తింప దగిన కేసు ఏమిటంటే 60 ఏళ్ల వ్యక్తి కాలిపైన కాలిన గాయములతో రాగా CC10.1 Emergencies + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.4 Stings & Bites + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions, తో నెల రోజులలోనే 80% కోలుకోవడం, అతి త్వరలోనే పూర్తిగా కోలుకోవడం జరిగింది. వీరి అనుభవంలో 15 ఏళ్ల ఆస్తమా కేసుతో సహా కేవలం సింగిల్-డోస్ తోనే వ్యాధి నివారణ జరిగిన అనేక సందర్భాలను ని వేదిస్తున్నారు. ఒక సంవత్సరం నుండి చెవి నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి కేవలం ఒక డోస్‌తోనే వ్యాధి అదృశ్యమయ్యింది. వీరి పుట్టపర్తి సందర్శనల సమయంలో, ఇట్టి తక్షణ నివారణల కథలు విన్న తర్వాత భక్తులు వీరు సేవాదళ్ భవనంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు చికిత్స కోసం చుట్టుమూగేవారు. క్యాంపులలో రెమిడీల కోసం వచ్చే ప్రజలందరి అవసరాలు తీర్చడానికి తన వద్ద తగినంత సామాగ్రి లేదని స్వామిని వేడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ స్వామి ఎప్పుడూ తనకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. క్యాంప్ పరిస్థితులలో, సాధారణంగా జీర్ణక్రియ, SMJ, శ్వాసకోశ, చర్మం మరియు మానసిక సమస్యల కోసం త్వరగా మరియు సులభంగా పంపిణీ చేయడానికి ఎక్కువ కోంబోలు ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి. 2016 సెప్టెంబర్-అక్టోబర్ లో, ఢిల్లీలో చికున్‌గున్యా వ్యాప్తి సమయంలో, వీరు 150 కి పైగా కుటుంబాలకు ముందస్తు నివారణ కోసం రెమిడీ అందించి అద్భుతమైన ఫలితాలను పొందారు.     

కామర్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంబీఏ డిగ్రీ మరియు సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్‌గా పని అనుభవం వీరిని అనేక అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లకు అద్భుతంగా సరిపోయేలా చేసింది. ఈ ప్రాక్టీషనరు తన సీనియర్ల నుండి అపారమైన ప్రేమ, మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలు పొందడం తన అదృష్టంగా భావిస్తున్నారు. డాక్టర్ అగర్వాల్ ఒకసారి వీరితో “సేవ చెయ్యాలంటే రెండు విషయాలు చాలా ప్రధానం - సమయము మరియు భక్తి అవి రెండూ నీకు ఉన్నాయి” అన్నారు. ఈ ప్రోత్సాహ పూరిత వాక్కులు తనతో పదిలంగా ఉంచుకొని గత ఐదు సంవత్సరాలుగా, వీరు అనేక అడ్మిన్ విధులు నిర్వహిస్తూ వచ్చారు; కొన్నింటిని ప్రస్తావించడం కోసం, మెంటరింగ్(కొత్త ప్రాక్టీషనర్లకు మార్గదర్శకత్వం), డేటాబేస్ నవీకరణ, ప్రాంతీయ సమావేశాలను నిర్వహించడం, AVP మాన్యువల్ యొక్క హిందీ అనువాదాలలో సహాయం చేయడం, భూగోళము పై శాంతిని నెలకొల్పడానికి తలపెట్టిన ప్రపంచ శాంతి హీలింగ్ ప్రక్రియ భారత దేశంలో ప్రారంభించేటట్లు చేయడం, కొత్త వెబ్‌సైట్ అభివృద్ధికి సహాయపడటం, మరియు విషూచిక పరిశోధన ప్రాజెక్ట్‌లో పాల్గొనడం. వీటిలో ప్రతీ ఒక్కటి వీరికి ఒక అభ్యాస అనుభవం కల్పించింది. 2016 ప్రారంభంలో, వీరు నెలవారీ నివేదికల కోసం ఫాలో అప్ సేవను చేపట్టారు. ఈ అడ్మిన్ సేవ వీరిని వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు మానవ మనస్తత్వశాస్త్రంపై అంతర్దృష్టితో కూడిన ప్రయాణం చేయిస్తుందని మొదట్లో గ్రహించలేదు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, అతను ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు. ఇది వీరి జీవితంలో ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకునేలా చేసింది: "వ్యక్తులు మరియు పరిస్థితులతో వ్యవహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది ప్రేమతో సాధించడం, అప్పుడు ఎవరైనా ఏదైనా లక్ష్యాన్ని సాధించవచ్చు". ఈ విషయంలో అకుంఠిత దీక్షతో చేసిన వీరి నిరంతర ప్రయత్నాలు ఎంతగానో ఫలించాయి, డిసెంబర్ 2016 నాటికి వీరి జాబితాలో ఉన్న ప్రాక్టీషనర్లు అందరూ గడువు తేదీకి ఒక రోజు ముందే వారి నెలవారీ నివేదికలను సమర్పించసాగారు.

బ్రాడ్ కాస్టింగ్ (చికిత్సా కంపనాల ప్రసారం) చేసే బాధ్యత ఇవ్వబడడంతో ఇది వీరిని స్వామికి దగ్గరగా తీసుకు వెళ్లడానికి మరియు స్వామితో దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడింది. స్వచ్ఛమైన ప్రేమతో ఈ సేవ చేస్తే 95% కంటే ఎక్కువ విజయవంతమైన ఫలితాలను పొందవచ్చని వీరు కనుగొన్నారు. చాలా మంది ప్రాక్టీషనర్లు, బ్రాడ్ కాస్టింగ్  యొక్క నిజమైన సామర్థ్యాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు. ఈ మహమ్మారి సమయంలో, వీరు సుమారు 100 కోవిడ్ -19 రోగులకు ప్రసారం చేసి అద్భుత ఫలితాలు పొందారు. 2020 జనవరి లో వీరు వైబ్రియోనిక్స్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ అయ్యారు, మరియు IASVP డైరెక్టర్ నాయకత్వంలో ఇమ్యునిటీ బూస్టర్ (IB) అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఆరుగురు ఇతర SVP లతో కూడిన ప్రాజెక్ట్‌ ద్వారా 2020 మార్చి నుండి IB అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. (ఇప్పటి వరకు IB గ్రహీతల సంఖ్య 487,089).

వ్యక్తిగతంగా, వీరు ప్రతీరోజూ 'హార్ట్‌ఫుల్‌నెస్' ధ్యానాన్ని అభ్యసిస్తారు, దీనిలో స్వామికి హృదయపూర్వక ప్రార్థనలు జరుగుతాయి, ఫలితంగా మనస్సును దాటి హృదయం నుండి ప్రేమ ప్రకంపనలు పంపబడతాయి. లోలోపల జరుగుతున్న సంఘర్షణ పరిష్కారానికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగకరంగా ఉందని వీరు కనుగొన్నారు; దీనికీ అదనంగా 'క్షమాపణ టెక్నిక్' కూడా చేర్చి దీనిలో సంవత్సరాలుగా తనను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని తనతో సహా జాబితా చేసి స్వామి నుండి క్షమాపణ కోరి ఆ జాబితాను కాల్చివేయడం. ఇది వీరికి తక్షణ ఉపశమనాన్ని విడుదలను ఇస్తుంది. ఈ  పద్ధతులు రోగుల సేవ చేసే సమయంలో సుదీర్ఘ కాలం దృష్టి పెట్టడానికి ప్రత్యేకించి ప్రసార సమయంలో ఏకాగ్రత నిల్పడానికి వీరికి సహాయం చేసాయి. 2017 లో స్వామి జన్మదినం సందర్భంగా, పుట్టపర్తిలో ఉన్నప్పుడు, అతను తన మూలాధార చక్రం ఆక్టివేషన్ అయినట్లు భావించారు, తద్వారా పరిసరాలపై మరింత అవగాహన, భవిష్యత్తుపై మరింత విశ్వాసం మరియు స్వామితో సాన్నిహిత్యం అనుభవించారు.

ఒక ప్రాక్టీషనరుగా, వీరు స్వామి మార్గదర్శకత్వం మరియు దయతో మానవాళికి సేవ చేసే అవకాశాన్ని పొందినందుకు అదృష్టంగా భావిస్తున్నారు. దీని ద్వారా వీరు భౌగోళిక సరిహద్దులకు మించి రోగులకు చికిత్స చేయగల సామర్ధ్యం చేకూరినట్లు భావిస్తారు. స్వామి యొక్క సరళమైన మరియు గాఢమైన సూక్తి ‘అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి’ మరియు ‘ఎల్లప్పుడూ సహాయపడండి, ఎవ్వరినీ బాధించ వద్దు’ ఈ ప్రాక్టీషనరుకు మార్గదర్శకత్వం మరియు స్ఫూర్తినిస్తూ తన ఉదారత మరియు సామర్ధ్యాలను ఉపయోగించు కోవడానికి ఎప్పుడు పిలిచినా తన ఆకట్టుకునే సేవను విస్తరిస్తూనే ఉంటారు.

భాగస్వామ్యము వహించిన కేసులు :

 

ప్రాక్టీషనర్ల వివరాలు 03594 & 03521...USA

ప్రాక్టీషనర్లు 03594 & 03521…USA ఇద్దరూ ఇంజనీరింగ్ పట్టభద్రులు, భర్త IT మేనేజర్‌గానూ, మరియు భార్య ట్యాక్స్ స్పెషలిస్ట్‌ గానూ  పనిచేస్తున్నారు. భర్త ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందింప బడ్డ  కుటుంబంలో పెరిగారు. వారు క్రమం తప్పకుండా పొరుగువారి ఇంటిలో సాయి భజనలకు హాజరయ్యేవారు. ఇతను చెన్నైలో చదువుతున్నప్పుడు అనేక సందర్భాలలో స్వామివారి దర్శనంతో ఆశీర్వదించబడ్డారు. భార్య తన వివాహం తర్వాత మాత్రమే స్వామి గురించి తెలుసుకున్నారు, మధురమైన సాయి భజనలతో మంత్రముగ్ధురాలయ్యేవారు. ఐతే ఆమెకు 2004 లో వారి ప్రధమ పుత్రిక జననం తరువాత ఆమెను స్వామి ఆశీర్వాదం కోసం తీసుకు వెళ్ళినపుడు మాత్రమే ఆమెకు స్వామి ప్రధమ దర్శనం లభించింది. 2000 సంవత్సరం నుండి వారు నివసిస్తున్న న్యూయార్క్‌కు తిరిగి వచ్చిన తరువాత, వారు భజనలకు హాజరు కావడం ప్రారంభించారు, క్రమంగా నెలకు ఒకసారి వారి స్వంత ఇంటిలో భజనకు ఆతిథ్యమివ్వడానికి అవకాశం ఏర్పడింది. 2008 లో వారు స్థానిక సాయి సెంటర్ యొక్క వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు: నిరాశ్రయులైన వారికి షెల్టర్‌లలో మరియు వంటశాలలలో వంట చేయడం మరియు వడ్డించడం, క్రిస్మస్ సమయంలో సంరక్షణ వస్తు సామగ్రి కిట్లను సిద్ధం చేయడం మరియు తమ స్థానిక ఫుడ్ బ్యాంక్‌లో పంపిణీ చేయడానికి వీలుగా వివిధ వస్తువులను ప్యాకింగ్ చేయడం చేసేవారు. భార్య ఈ సెంటరుకు ప్రధమంలో సేవా సమన్వయ కర్త, ఆ తరువాత అధ్యాత్మిక సమన్వయకర్త అయ్యారు.   

2010 లో పదిరోజుల పాటు అమెరికా నుండి పర్తికి నిర్వహించిన తీర్ధయాత్ర వారి జీవితాలలో ఒక మలుపుగా మారింది. ఈ పర్యటన కోసం వారి సాధనలో భాగంగా, వారు స్వామివారి అనేక ఉపన్యాసాలను తీవ్రంగా అధ్యయనం చేశారు. ఇది ఇతరులతో పాటు తమలోనూ దైవత్వాన్ని చూడటం మరియు గుర్తించడం గురించి వారి అవగాహనను విస్తృత పరిచింది. మరియు ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి సాధనలో సేవ యొక్క ప్రాధమిక లక్ష్యము స్వీయ-పరివర్తన అని నేర్చుకున్నారు. పుట్టపర్తి వార్షిక సందర్శనల ద్వారా ఈ పరిణామం వీరిలో చోటు చేసుకుంది.

2014 లో వారాంతపు సత్సంగ సమయంలో, ఒక అల్లోపతి వైద్యుడు సాయి వైబ్రియోనిక్స్ స్వామిచే ఆశీర్వదించబడిన ప్రత్యామ్నాయ వైద్య పద్ధతిగా పేర్కొన్నారు. ఇది వారిలో ఆసక్తి మరియు ఉత్సుకతని పెంచింది, కాబట్టి వారు వెబ్‌సైట్ ద్వారా, వార్తాలేఖలను చదవడం మరియు సోల్‌జర్న్స్ వీడియోలను చూడటం ద్వారా అధ్యయనం చేసారు. ఈ కోర్సులో చేరడానికి ముందస్తు వైద్య అనుభవం అవసరం లేదని వీరు గ్రహించి అందరికీ ఉచిత వైద్యసేవ అందించే స్వామి మిషన్ లో పాల్గొనడానికి ఇది చక్కని  అవకాశమని వారు భావించారు. వారిద్దరూ మార్చి 2015 లో AVP లుగా శిక్షణ పొందారు మరియు సెప్టెంబర్ 2016 లో SVP లు అయ్యారు.

వారు అభ్యాసం ప్రారంభించిన మొదటి వారంలో, మూడు నెలలుగా మెడమీద నొప్పితో బాధపడుతున్న ఒక అల్లోపతి వైద్యుడికి CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine. ఇవ్వబడింది. మరుసటి రోజు ఉదయం ఆమె ఫోన్ చేసి, మునుపటి రాత్రి కేవలం ఒక డోస్ తీసుకున్న తర్వాత, ఉదయం నిద్రలేచిన తరువాత 100% నొప్పి లేకుండా ఉందని తన తలను కూడా హాయిగా కదిలించగలుగుతున్నట్లు చెప్పారు. ఇది ఈ ప్రాక్టీషనర్ల జంటకు ఎంతో ఆనందాన్ని అందించడమే కాక వారి ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప జేసిన ఈ ఘటన ఒక అద్భుతమైన లీలకు తక్కువేమీ కాదు. మూడు నెలల తర్వాత కూడా రోగి వ్యాధి  పునరావృతం కాకుండా బాగానే ఉన్నారు. మరొక విశేషమైన కేసు విషయంలో, వారి సాయి కేంద్రానికి చెందిన 55-ఏళ్ల-మహిళ శ్లేష్మం మరియు దగ్గుకు నెలరోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆమె అల్లోపతి ఔషధం తీసుకోవడానికి ఇష్టపడలేదు కనుక ఆమెకు CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic. ఇవ్వబడ్డాయి. మరునాటికల్లా దగ్గు పూర్తిగా మాయమైందని రోగి తెలిపారు! 

ఈ ప్రాక్టీషనర్లు CC15.1 Mental & Emotional tonic ప్రత్యేకంగా ఈ ఒకటి మాత్రమే ఇచ్చినా లేదా ఇతర రెమెడీలతో కలిపి ఇచ్చినా, ముఖ్యంగా టీనేజర్‌లకు చికిత్స చేసేటప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంటుందని గుర్తించారు. ఇది సానుకూల మనస్సును మరియు భావోద్వేగ శ్రేయస్సును అందిస్తుందని, తద్వారా రెమిడీలో చేర్చబడిన ఇతర వైబ్రేషన్‌ల శోషణను మెరుగుపరుస్తుందని గ్రహించారు. వారు CC17.2 Cleansing అనేది శరీరంలో పేరుకుపోయిన విషపదార్ధాలు లేదా టాక్సిన్‌లను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని తద్వారా చికిత్స వేగవంతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది కానీ, పుల్ అవుట్ అయ్యే అవకాశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గమనించారు. ఈ జంట ఈ రెమిడీని తమకు తామే తరుచుగా ఉపయోగించుకొని చక్కని ఫలితాన్ని పొందారు. నిస్వార్ధంగా సేవ చేస్తూ ఫలితము మీద దృష్టి లేకుండా ఉండడానికి రెమిడీలు తయారుచేసే సందర్భంలోనే వారు స్వామిని ప్రార్ధిస్తూ ఫలితాన్ని వారికే సమర్పిస్తారు. రోగ నిర్ధారణ విషయంలో వారు 108CC పుస్తకంలోని సూచికను మరియు ఇతర కేసు చరిత్రల నుండి సేకరించిన సమాచారం ఉపయోగించుకున్నప్పటికీ, వారు తమ హృదయంలో ఉన్న స్వామితో అనుసంధానింపబడడం పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ప్రతీ రోగి ప్రత్యేకమైన వారే, సహాయం కోరి వచ్చిన కేసు విషయంలో ఇతర రెమిడీలు చేర్చడానికి వారు తరచుగా మార్గనిర్దేశం చేయబడుతూనే ఉంటారు. 

వారు సేవా అవకాశాలను వెదకడంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. భారతదేశానికి ప్రయాణించేటప్పుడు, వారు వైబ్రో గురించి అవగాహన కల్పిస్తూ తమ కుటుంబ సభ్యులు మరియు పొరుగువారికి చికిత్స చేస్తూ ఉంటారు. కోవిడ్ వ్యాప్తి పెరగడంతో వారు రోగనిరోధక లేదా ఇమ్యూనిటీ బూస్టర్ (IB) సీసాలను రోగులతో పాటు వైద్య నిపుణులకు నివారణ కోసం అందుబాటులో ఉంచేవారు. వైబ్రియానిక్స్ అడ్మిన్ సేవ విషయంలో కూడా వీరు ఇద్దరూ చాలా చురుకుగా ఉంటారు. 2017 నుండి వారు కొత్త AVP లకు మెంటరింగ్ నిర్వహిస్తున్నారు మరియు బ్రాడ్కాస్టింగ్ ప్రసార సేవలో పాల్గొంటున్నారు. భార్య 2016 డిసెంబర్ నుండి 2018 మే వరకు కేస్ హిస్టరీస్ రాసే బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆ తరువాత అడ్మిషన్ల విభాగంలో ఆమెకు ప్రముఖ పాత్ర ఇవ్వబడింది. ఆమె భర్త డేటాబేస్ అప్‌డేట్‌ చేయడానికి సహాయం చేస్తున్నారు.

వైబ్రియోనిక్స్ విధానం ఆరోగ్యము విషయంలో సంపూర్ణమైన విధానం యొక్క ప్రాముఖ్యత మరియు శక్తి గురించి వారిద్దరికీ అవగాహన కల్పించింది. వ్యాధి యొక్క బాహ్య లక్షణాలు ఆ వ్యాధికి గల సరియైన కారణాన్ని ప్రతిబింబించవని సరియయిన చికిత్స జరగాలంటే అంతర్లీన కారణాన్ని తెలుసుకోవలసి ఉంటుందని, దీనికి కేవలం రెమిడీలను సూచించడమే కాకుండా రోగితో ఆంతరంగికంగా కనెక్ట్ అవడం ద్వారా వారి పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడం అవసరం అని వీరి భావన. ఈ సేవ వారి జీవితాలకు ఒకఅర్ధాన్ని, ఒక  ప్రయోజనాన్ని అందించింది. తమ రోగులతో ప్రేమ మరియు కరుణను పంచుకోవడానికి తమను సాధనంగా మలచి ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి వారు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది అత్యంత సంతృప్తితో హృదయాన్ని విశాలం చేసుకునేందుకు వ్యక్తిగత పరివర్తనా ప్రయాణం. వారి ప్రార్థనా పరిధి కేవలం వారి రోగులనే కాక వారికి తారస పడిన కష్టాల్లో ఉన్నవారు ఎవరినైనా చేరుకునేందుకు విస్తృత మైంది. సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లుగా ఈ జంట ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు.  

భాగస్వామ్యం వహించిన కేసులు :

 

ప్రశ్న జవాబులు

Q1. వార్తాలేఖ సంపుటి 12 సంచిక 3 లో 6 వ ప్రశ్నలో రోగి సుదీర్ఘకాలం ఒక రెమిడీని తీసుకున్నప్పుడు దానికి నిరోధకతను పెంచుకొనే అవకాశం ఉంటుందని నేను అర్ధం చేసుకున్నాను. మేము IB ని కోవిడ్ ప్రారంభ మైనప్పటినుండి ఒక సంవత్సరం పైగా తీసుకుంటున్నందున అది ఇకపై అంత ప్రభావ వంతంగా ఉండదని అర్ధం చేసుకోవచ్చా? 

A. అవును, మనము అన్ని సమయాలలో ఒకే IB ని తీసుకుంటే ఇది జరిగి ఉండవచ్చు. కానీ కోవిడ్ -19 వైరస్ వేగంగా పరివర్తన చెందుతున్నందున (DNA వైరస్ కాకుండా RNA ఉండటం), మా IB అనేకసార్లు సవరించబడింది, అందువల్ల మునుపటిలాగానే ప్రభావవంతంగా ఉంటుంది.   

_______________________________________________________________________________

Q2. 108 CC బాక్సులో ఒక సాధారణ కోంబోలో బహుళ నివారణలు ఉంటాయి. ఇట్టి మిశ్రమము ప్రతీ రెమిడీ యొక్క వ్యక్తిగత వైబ్రేషన్ ను నిలుపు కుంటుందా? అంతేకాక మేము తరుచుగా ఒక బాటిల్ లో అనేక కోంబోలను కలుపుతాము, రోగ నివారణకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? 

A. మీరు అనేక రెమిడీలను కలిపి నప్పుడు ఆ మిశ్రమం దానిలోని అన్ని కాంపోజిట్ వైబ్రేషన్‌లను కలిగి ఉంటుంది. కానీ ఈ మిశ్రమ కంపనం దాని ప్రతి వ్యక్తిగత రెమిడీల చికిత్సా శక్తిని నిలుపుకుంటుంది. ఏమైనప్పటికీ మనము అనేక వైబ్రేషన్‌లతో కూడిన కోంబోలను కలిపినప్పుడు, ఇది ప్రతీ వైబ్రేషన్ చర్యను తగ్గిస్తుంది (పలుచన ప్రభావం వలన). అందువల్ల రోగి యొక్క అనారోగ్యానికి సంబంధించిన కాంబోలను మాత్రమే మనం జాగ్రత్తగా ఎంచుకోవాలని సిఫార్సు చేయబడింది. అంతేకాక ప్రాక్టీషనరు యొక్క విశ్వాసం మరియు ప్రార్థన చాలా ముఖ్యం మరియు రోగికి వైబ్రియోనిక్స్‌పై విశ్వాసం మరియు ప్రాక్టీషనరు పై నమ్మకం ఉంటే అది చాలా బాగా  సహాయపడుతుంది. రెమిడీ తయారు చేసేటప్పుడు ప్రాక్టీషనరు యొక్క సానుకూల భావము అత్యంత ప్రధానమైనది!

_______________________________________________________________________________

Q3. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న రోగికి రెండు వారాల పాటు CC15.2 Psychiatric disorders తో చికిత్స చేసిన తర్వాత, రోగికి 15 సంవత్సరాల క్రితం తీవ్రమైన ఆటో ప్రమాదం కారణంగా ఎక్కడైతే ఫ్రాక్చర్స్ ఏర్పడ్డాయో అక్కడ నొప్పి తిరిగి ఏర్పడింది. నేను ఆమెకు ఒక వారం పాటు CC10.1 Emergencies ఇచ్చాను, నొప్పి తగ్గి పోయింది. నిద్రలేమి విషయంలో, CC15.6 Sleep disorders పని చేయలేదు కానీ CC10.1తో కలిసినప్పుడు, అది ఒక మంత్రం లాగా పనిచేసింది. ప్రాక్టీషనర్లు అనేక విభిన్న కాంబోలకు CC10.1 ని జోడించిన అనేక సందర్భాలను నేను వార్తాలేఖలలో చూసాను. దీని అర్థం, వాటి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మేము దీనిని అన్ని కాంబోలకు జోడించవచ్చా?   

A. మీ మొదటి రోగిలో ఫ్రాక్చర్ నొప్పి మళ్లీ కనిపించడం అనేది 3 వ రకం పుల్ అవుట్ కు సంబంధించింది. అందుకే CC10.1 Emergencies మీ రోగిపై పనిచేసి, సమస్యను తగిన విధంగా పరిష్కరించింది. 2 వ రోగిలో, నిద్రలేమికి అంతర్లీన కారణం ట్రామా కావచ్చు లేదా భావోద్వేగ సమస్య కావచ్చు, దానికి CC10.1 మంచి నివారిణి కనుక ఇది చక్కగా పనిచేసింది. ఏదేమైనా, పైన 2 వ ప్రశ్నలో వివరించిన విధంగా ప్రతి కాంబోకి CC10.1 జోడించడాన్ని మేము సిఫార్సు చేయము. ఎల్లప్పుడూ రోగ లక్షణాలకు సంబంధించిన కాంబోలను మాత్రమే ఇవ్వండి. చికిత్సా సమయంలో, గత రోగ లక్షణములు పునరావృతమైతే దానికి CC10.1 సరియైన ఎంపిక అని భావిస్తే, అప్పుడు దీనిని ఇవ్వండి. 

_______________________________________________________________________________

Q4. రోగి భూమిపై తన ఆఖరు క్షణాలలో మరణాన్ని సులభతరం చేయడానికి ఏదైనా రెమిడీ ఉందా ?

A. అవును, SR272 Arsen Alb CM వ్యక్తి యొక్క ఆఖరి క్షణాలను ప్రశాంతంగా మరియు తేలికగా అయ్యేలా చేస్తుంది.  SRHVP లేని వారికి, 108CC బాక్స్ నుండి CC15.2 Psychiatric disorders (యాదృచ్ఛికంగా, ఇందులో SR272 ఉంది) అంతే ప్రభావవంతంగా ఉంటుంది.

_______________________________________________________________________________

Q5. నా స్వీయ అనారోగ్యం కోసం, నాకు నేను చికిత్స చేసుకోవడం మంచిదా లేక నేను మరొక ప్రాక్టీషనరును అడగాలా?

A. తీవ్రమైన (ఎక్యూట్)అనారోగ్యం కోసం, మీరు వెంటనే చికిత్స తీసుకోవడం ప్రారంభించగలరు కనుక మీరే చికిత్స చేసుకోవడం ఉత్తమం. అయితే, దీర్ఘకాలిక సమస్య కోసం, సంపూర్ణ సమాధానం సంచిక 7 సంపుటి 3 లో అందించబడింది. చికిత్స కోసం మరొక అభ్యాసకుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిదే, ఎందుకంటే ప్రేమ మరియు ప్రార్థన అందించడం మరియు స్వీకరించడం వైద్యప్రక్రియలో ఒక భాగం. అలాగే, మరొక ప్రాక్టీషనరు నుండి రెమిడీలు  తీసుకునేటప్పుడు మనం వారు చెప్పిన షెడ్యూల్‌ను అనుసరించడములో నిబద్ధత ఉంటుంది. ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత పురోగతిని నివేదించమని కూడా మీరు ఆ ప్రాక్టీషనరుచేత అడగబడతారు. అసౌకర్యం ఎక్కువగా ఉంటే మీరు ప్రశాంతంగా ఆలోచించలేరు అందువల్ల మరొక ప్రాక్టీషనరును సంప్రదించడం మరింత ముఖ్యం. గతంలో ఒక నిర్దిష్ట రెమిడీ మీకు బాగా పనిచేసి ఉన్నట్లైతే మీరు మరొక ప్రాక్టీషనరు వద్దకు వెళ్లకుండా దాన్ని ఉపయోగించాలనుకోవాలని భావించిన సందర్భాల్లో, మీ స్వంత రెమిడీ తయారు చేయడం మంచిది.

_______________________________________________________________________________

Q6. వార్తాలేఖలు సంచిక 4 సంపుటి 5, సంచిక 7 సంపుటి 3 మరియు సంచిక 12 సంపుటి 3 లలో స్పష్టం చేసినట్లుగా, మనం ఆరోగ్యకరమైన జీవనశైలికి మారకపోతే దీర్ఘకాలిక అనారోగ్యం తిరిగి వచ్చే అవకాశం ఉందని నేను అర్థం చేసుకున్నాను. నేను నా రోగులతో ఈ విషయం గురించి చెప్పినప్పుడు, వారు దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడడంలేదు. అలాంటి పరిస్థితిని నేను ఎలా పరిష్కరించు కోవాలి?   

A. ఒక విధానం ఏమిటంటే, రోగితో జరిపే అనేక సంప్రదింపుల సమయంలో వారి జీవనశైలి సమాచారాన్ని సేకరించడం (ఒకొక్క సమయంలో కొంచెం, కొంచం) మీరు రోగితో ఒక అనుబంధాన్ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించడం, ఉదాహరణకు, డయాబెటిక్ రోగి నుండి, అతను రోజువారీ వ్యాయామం చేస్తారా అని మీరు అడగవచ్చు, మరియు అలా అయితే, ఎంత సేపు చేస్తారు ? ఒక BP రోగి నుండి, వారు తమ ఆహారంలో ఉప్పును అదనముగా కూరలు వగైరాలలో చల్లుకొంటున్నారా? అని మీరు అడగవచ్చు. మీ రోగిని బాగా అర్ధం చేసుకోవడం, మరియు జీవనశైలిలోని వివిధ అంశాలపై సమాచారాన్ని సేకరించడం ద్వారా, మీరు నెమ్మదిగా (1 లేదా 2 సార్లు) సానుకూల జీవనశైలి సిఫార్సులను ప్రవేశపెట్టవచ్చు. గుర్తుంచుకోండి, ఒక ప్రాక్టీషనరు గా మీకు మీరే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి మరియు మీ రోగులకు రోల్ మోడల్‌గా ఉండాలి, అప్పుడే మీ సలహా పాటించబడుతుంది.

దివ్యవైద్యుని దివ్య వాణి

మీరు శారీరక బలాన్ని పెంపొందించుకోవాలంటే, దానికి సమతుల్య ఆహారం అవసరం. మీరు అన్నం మరియు చపాతీ తినవచ్చు. చెడు ఆలోచనలను పోగొట్టుకొనడానికి మీరు మానసిక బలాన్ని పెంపొందించుకోవాలి. మీకు మానసిక బలం ఉన్నప్పుడు, మీకు కష్టాలు మరియు దుఃఖాలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ఉండగలరు ... మీరు శారీరక మరియు మానసిక శక్తిని పెంపొందించుకున్నప్పుడు, మీ ఆధ్యాత్మిక శక్తి కూడా మెరుగుపడుతుంది. మీరు ఆధ్యాత్మికత మార్గాన్ని అనుసరించినప్పుడు, మీరు అన్ని సందేహాలు మరియు భ్రమల నుండి విముక్తి పొందుతారు. చెడు ఆహారము, కోపం, వాంఛ మరియు ఉద్రిక్తత వంటి చెడు ధోరణులకు దారితీస్తుంది మరియు అన్ని సమస్యలను సృస్టిస్తుంది. అందువల్ల, మీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన (సాత్విక) ఆహారాన్ని మాత్రమే తినడం అవసరం.

... శ్రీ సత్యసాయి బాబా, “సంపూర్ణ జ్ఞానం నుండి పరిపూర్ణ ఆనందం లభిస్తుంది” దివ్య వాణి 1996 సెప్టెంబర్ 1                             http://sssbpt.info/ssspeaks/volume29/d960901.pdf

 

సేవలను అందించండి, ప్రేమను స్వీకరించండి. ఇదే దైవత్వాన్ని అనుభవించడానికి త్రోవ. కానీ ఈరోజులలో సేవ హృదయపూర్వకంగా అందించబడుటలేదు. కొద్దిమంది మాత్రమే ప్రేమతో సేవ చేస్తారు కనుక అట్టి కొద్దిమంది మాత్రమే దేవుని కృపను పొందుతారు. ఐతే ఇట్టి కొద్దిమంది ప్రేమ కూడా స్వీయ-కేంద్రీకృతమైనది, అందరూ నావాళ్ళు అనే భావం లోపించినది. మన ప్రేమ అనేది మన బంధువులకు మాత్రమే పరిమితం కాకూడదు. అది కుటుంబానికి అతీతంగా మొత్తం సమాజానికి, తర్వాత దేశమంతా విస్తరించి, చివరకు ప్రపంచం మొత్తాన్ని తనలోనే చూసుకోగలగాలి

  …శ్రీ సత్యసాయి బాబా, “పుట్టినది సేవ చేయడానికే” దివ్యవాణి, 1987నవంబర్ 19                               http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf 

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహించబోయే వర్క్ షాపులు*

  • USA : విర్చువల్ AVP వర్క్ షాప్** వారానికి-రెండు తరగతులు 2021 సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 23 వరకు సంప్రదించ వలసినవారు సూషన్ వెబ్సైట్  [email protected]
  • UK లండన్ : UK జాతీయ వార్షిక రిఫ్రెషర్ సెమినార్ 2021 సెప్టెంబర్ 19 సంప్రదించ వలసినవారు జెరమ్ పటేల్, వెబ్సైట్    [email protected]
  • ఇండియా పుట్టపర్తి : విర్చువల్ AVP ప్రాక్టికల్ వర్క్ షాప్, 2021 నవంబర్ 1-18** అనంతరం పుట్టపర్తిలో ప్రత్యక్ష వర్క్ షాప్ 2021 నవంబర్ 24-26 సంప్రదించ వలసినవారు లలిత, వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: AP వర్క్ షాప్ 2021 డిసెంబర్ 16-18, సంప్రదించ వలసినవారు పద్మ, వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8329-848 898
  • ఇండియా పుట్టపర్తి: విర్చువల్ SVP వర్క్ షాప్ 2022 జనవరి ** తేదీలు తరువాత ప్రకటింప బడతాయి సంప్రదించ వలసినవారు హేమ్ వెబ్సైట్ [email protected]

*AVP మరియు SVP వర్క్ షాప్ లు అన్నీ ప్రవేశ ప్రక్రియ, e కోర్సు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే. రిఫ్రెషర్ సెమీనార్లు ప్రస్తుతం ఉన్న ప్రాక్టీషనర్లకు నిర్వహింప బడతాయి.  

**మార్పులు ఉండవచ్చు   

 

అదనంగా

1. ఆరోగ్య చిట్కాలు   

తృణధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహారం

 మీరు తినే ఆహార రకం మీరు నిలుపుకోగల మీ ఏకాగ్రత స్థాయిని నిర్ణయిస్తుంది; దాని నాణ్యత మరియు పరిమాణం మీ స్వీయ నియంత్రణ ఎంత తగ్గిందో లేదా పెరిగిందో నిర్ణయిస్తుంది... శ్రీ సత్యసాయిబాబా1

1. ధాన్యాలు - సంపూర్ణ మైనవి మరియు అసంపూర్ణ మైనవి                                                                                           1.1 సంపూర్ణ ధాన్యము : తృణధాన్యాలు లేదా నిజమైన ధాన్యం అని కూడా పిలుస్తారు, ఇది సహజ స్థితిలో గడ్డి లాంటి మొక్క యొక్క పూర్తి విత్తనం లేదా పప్పువంటిది. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి - ఊక(బ్రాన్), అంకురము(జెర్మ్) మరియు బీజపోషకము(ఎండో స్పార్మ్) (చిత్రాన్ని చూడండి); దీనిలో పిండి పదార్థాలు, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైటోకెమికల్స్‌ వంటి మంచి పోషకాలు కలిగిఉండి, సహజంగా సంతృప్త కొవ్వు మరియు ఉప్పు తక్కువగా పాళ్లలో ఉంటాయి. ఈ ధాన్యాలను సంపూర్ణ ధాన్యాలని ఎప్పుడు పిలుస్తామంటే మొత్తం మూడు భాగాలలో 100% కలిగిఉండి, మొత్తం ధాన్యం విత్తనంలోని సహజ పోషకాలను వాటి అసలు నిష్పత్తిలో కలిగి ఉన్నప్పుడే అలా పిలువబడతాయి.2-6

తృణధాన్యాలలోని ఆహార ఫైబర్ జీర్ణాశయ మార్గాన్ని శుభ్రపరిచి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తంలో చక్కెరను సమతుల్యం చేస్తుంది మరియు బరువు పెరుగుట మరియు ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తృణధాన్యాలలోని పోషకాలు శరీరముపై వాపులను తగ్గించడానికి, సంపూర్ణ  ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, క్యాన్సర్‌ను నివారించడానికి, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ నుండి రక్షించడానికి సహాయపడతాయి.2-6 

1.2 : సూడో-ధాన్యాలు : ఇవి గడ్డిగా వర్గీకరించబడని మొక్కల నుండి లభించే ధాన్యం లాంటి విత్తనాలు, కానీ వాటికి సరిపోలే పోషక విలువలు ఉన్నకారణంగా తృణధాన్యాలుగానే పరిగణించబడతాయి. అంతేగాక అవి సహజంగా గ్లూటెన్ రహితంగా ఉండి వాటి పూర్ణ రూపంలో అందుబాటులో ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి -మరాంత్, బుక్వీట్, క్వినోవా, కానివా మరియు వైల్డ్ రైస్.7-9

1.3 శుద్ధి చేసిన ధాన్యాలు : వాస్తవానికి అన్ని తృణధాన్యాలు రవాణా లేదా నిల్వలో క్షీణించకుండా నిరోధించడానికి శుభ్రపరచబడి స్వల్పంగా ప్రాసెస్ చేయబడతాయి, అయినప్పటికీ అవి అన్ని పోషకాలను నిలుపుకుంటాయి. ఊక లేదా పైన ఉండే పొట్టు మరియు నూనెవంటి జిగురుగా ఉండే సూక్ష్మకపొర (వేడి మరియు కాంతికి గురైనప్పుడు దుర్వాసన నిచ్చేవి) తొలగింపబడి మృదువైన మరియు సులభంగా జీర్ణమయ్యే ఎండోస్పెర్మ్‌ని మాత్రమే మిగిల్చినప్పుడు అవి శుద్ధి చేసిన ధాన్యాలుగా మారతాయి. వాటి పోషక విలువలు గణనీయంగా తగ్గిపోతాయి, షెల్ఫ్-లైఫ్ పెరుగుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది మరియు అవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. శుద్ధి చేసిన ధాన్యాలు అన్ని ప్రాసెస్ చేసిన తృణధాన్యాలు, పాస్తా మరియు అనేక రకాలైన బేకింగ్ వస్తువులలో ఉపయోగించబడతాయి.10-13

1.4 సుసంపన్నమైన/బలవర్థకమైన ధాన్యాలు : అనేక శుద్ధి చేసిన ధాన్యాలు ప్రాసెసింగ్ సమయంలో కోల్పోయిన వాటిని లేదా వాటిలో లేని కొన్ని పోషకాలతో సుసంపన్నం చేయబడతాయి లేదా బలపరచబడతాయి. ప్రాసెసింగ్ చేసే సమయంలో వాటిలో సహజంగా ఉండే ప్రోటీన్ అలానే ఉంటుంది, ఐతే తొలగింపబడిన బి విటమిన్లు మరియు ఇనుమును తిరిగి జోడిస్తారు కానీ వాటి సహజత్వానికి భిన్నంగా ఉంటాయి. ఫైబర్ మరియు ఫైటోకెమికల్స్ తిరిగి జోడించబడవు మరియు శాశ్వతంగా తొలగిపోతాయి. కొవ్వు, చక్కెర లేదా లవణం వంటివి కూడా జోడించవచ్చు. బలవర్థకమైన ఆహారాలు కొంతమంది ప్రజలలో ఉండే పోషకాహార లోపాలను మరియు సంబంధిత అనారోగ్య సమస్యలను నిరోధించాయి, ఉదా. ఇనుము మరియు B విటమిన్‌లతో బలవర్థకమైన శిశువుల కిచ్చే తృణధాన్యాలు రక్త హీనతను నిరోధించ డానికి, పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి ఫోలిక్ యాసిడ్‌తో బలవర్థకమైన గోధుమ పిండి అందిస్తారు. 11-14

2. సంపూర్ణ మరియు మిధ్యా ధాన్యాలు గ్లూటెన్-రహితమైనవి భారతీయ పేర్లు కుండలీకరణంలో ఇవ్వబడినవి   

2.1 అమరాంత్ (చోలై/ రామదాన/ రాజ్ గిరా) : అధిక ప్రోటీన్ కంటెంట్ (13-14%), విటమిన్ E, అధిక నాణ్యత గల B- కాంప్లెక్స్ విటమిన్లు మరియు కాల్షియం, ఇనుము, మాంగనీస్ మరియు జింక్ వంటి ఖనిజలవణములతో కూడిన చక్కని ధాన్యం. జంతువులలో ఉండే ప్రోటీన్‌తో సమానంగా పరిగణించబడే పూర్తి ప్రోటీన్ దీనిలో లభ్యమవుతుంది. క్వినోవా మినహా ధాన్యాలలో కనిపించే అరుదైన మరియు ముఖ్యమైన లైసిన్‌తో సహా మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను దీని పొట్టులో ఉంటాయి. 8 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నానబెట్టి ఉడికించినప్పుడు ఇది బాగా గ్రహింపబడి జీర్ణమవుతుంది.6-11,15-18 (మూలికలపై ఆరోగ్య వ్యాసము కొరకు సంచిక 13 సంపుటి 3 చూడండి).   

2.2 బ్రౌన్/పాలిష్ చేయని బియ్యం (భూర చావల్) : ప్రపంచంలో సగభాగం ఆహారం కొరకు ప్రధానంగా బియ్యం మీదనే ఆధారపడుతుంది. సంపూర్ణ ధాన్యమునకు సంబంధించిన బియ్యం సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది, కానీ నలుపు, ఊదా లేదా ఎరుపు రంగులలోనూ ఉంటుంది. గోధుమరంగు పూత ఈ బియ్యానికి చక్కని పోషకాలు, నమలడంలో ఆహ్లాదకరమైన రుచిని ఇస్తుంది. ఇతర తృణధాన్యాల కంటే ఇందులో ఫైబర్ తక్కువగా ఉన్నప్పటికీ తెల్ల బియ్యం కన్నా దీనిలో మూడు రెట్లు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, సెలీనియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి, అలాగే ఎక్కువ ప్రస్తావింపబడక పోయినా సరైన ఆరోగ్యానికి అవసరమైన మాంగనీస్ కూడా దీనిలో అధికంగా ఉంటుంది. ఈ బియ్యంలో ఉండే ప్రోటీన్ అందులోని పిండి పదార్థాలతో సమతుల్యంగా ఉంటుంది. అధిక కేలరీలు కలిగిఉండే నల్ల బియ్యం, బ్రౌన్ రైస్ కంటే ఎక్కువ పోషకకర మైనది. భూటాన్ రెడ్ రైస్ కూడా అంతే పోషకకరమైనది.6,19-21

2.3 బక్ వీట్ (కుట్టు) 33% ఎక్కువ ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్లను అందిస్తుంది, కానీ అమరాంత్ కంటే చాలా తక్కువ కాల్షియం కలిగి ఉంటుంది. ఆంటీ ఆక్సిడెంట్ రుటిన్ అధిక స్థాయిలో ఉన్న ఏకైక ధాన్యం ఇది.6,22,23

 

2.4 మొక్కజొన్న(మక్క) : సాధారణంగా పసుపు రంగులో ఉండే ఇది, అనేక ఇతర రంగులలో కూడా ఉంటుంది. కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది కంటి మరియు చర్మ ఆరోగ్యానికి అద్భుతమైనది. బీన్స్ లేదా కూరగాయలతో మొక్కజొన్న కలిపి తినడం వల్ల ప్రోటీన్ విలువను పెంచే అమైనో ఆమ్లాలను సమృద్ధిగా అందిస్తుంది. వండినప్పుడు దాని పోషకాలు బాగా గ్రహించబడతాయి. స్వీట్ కార్న్ అనేది గింజలు పూర్తిగా పరిపక్వం చెందడానికి ముందు పంటకు వచ్చే ఒకరకమైన మొక్కజొన్న; కాబట్టి, ఇందులో చక్కెర మరియు పిండిపదార్ధాలు  ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 6,16,24,25 (సంచిక 11 సంపుటి 5 లో కూరగాయలపై ఆరోగ్య వ్యాసాన్ని చూడండి)

2.5 చిరు ధాన్యాలు : తక్కువ పరిమాణంతో గట్టివిత్తనాలుగా ఉండే ఈ తృణధాన్యాల పంటలు, తక్కువ సంరక్షణ, తక్కువ వ్యయం, నీటియెద్దడిని తట్టుకునే విధంగానూ మరియు బియ్యం మరియు గోధుమలకు అవసరమైన పంట కాలమునకు సగం సమయంలోనే పంటకు వస్తాయి. ఆహార ఔషధం అని పిలువబడే ఈ చిరుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి పిండి పదార్ధాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ధాన్యాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, బి విటమిన్స్, మరియు ఫైబర్, సమృద్ధిగా ఉంటాయి, ఆరోగ్యానికి అద్భుతమైనవి మరియు ఎదుగుతున్న పిల్లలకు అనువైనవి.26-30

కొన్ని ప్రసిద్ధ చిరుధాన్యాల రకాలు:

2.5.1 బార్న్యార్డ్ మిల్లెట్ (సన్వా చావల్) : ఉడికించిన అన్నం రుచిని పోలి ఉంటుంది, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయి మరియు బరువును తగ్గిస్తుందనే నానుడి కలిగినది.31

2.5.2 ఫింగర్ మిల్లెట్ (రాగి) : అన్ని తృణధాన్యాలలో అత్యంత పోషకమైనదిగా పరిగణించబడుతోంది, దీనిలో కాల్షియం ఇతర తృణధాన్యాల కంటే ఐదు నుండి ముప్పై రెట్లు, మరియు పాలు కంటే మూడు రెట్లు ఉంటుంది. బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి ఇచ్చే సప్లిమెంట్‌లకు ఉత్తమ ప్రత్యామ్నాయం. ఆరోగ్యానికి కీలకమైన అమైనో ఆమ్లాలు సమృద్ధిగా కలది, సులభంగా శోషించదగిన ప్రోటీన్, ఫాస్ఫరస్ మరియు ఐరన్, రాగి ధాతువు కలిగిన ఈ పంట దక్షిణ భారతదేశంలోని శిశువులకు మొదటి ఘన ఆహారం. ఇది పోషకాహార లోపం మరియు రక్తహీనతను నివారిస్తుంది, పిల్లలలో మెదడు పెరుగుదలను సులభతరం చేస్తుంది. ఇది రక్త స్థాయిని నియంత్రించగలదు మరియు మధుమేహం ఉన్నవారిలో గాయం నయం చేయడాన్ని కూడా వేగవంతం చేస్తుంది.29,32,33

 

2.5.3 పెర్ల్ మిల్లెట్ (బజ్రా), విటమిన్ బి మరియు ఆహార ఖనిజలవణాలు అధికంగా ఉంటాయి, (ముఖ్యంగా ఇనుము) అమైనో ఆమ్లాల సమతుల్యతను కలిగి ఉంటాయి. ఋతు సమయంలో వచ్చే తిమ్మిరి మరియు సంబంధిత మానసిక ఆందోళనకు ఇది ఉత్తమ గృహ నివారణలలో ఒకటి.29,34


2.5.4 జొన్న/గ్రేట్ మిల్లెట్ (జోవర్/మిలో) : కిరణజన్య సంయోగక్రియ విషయంలో అత్యంత సమర్థవంతమైన ఈ మొక్క, చాలా త్వరగా పరిపక్వం చెందుతుంది కనుక కొంతమంది శాస్త్రవేత్తలు ఆహార సరఫరా తగినంతగా లేనప్పుడు భవిష్యత్తు పంటగా దీనిని భావిస్తారు. సాధారణంగా పిండిరూపంలో లభించే దీనిలో యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి, అత్యంత పోషకకరమైనది- పిల్లలకు ఉత్తమ మైనది.29, 35, 36


2.5.5 టెఫ్ : ఇది పెంచబడే ప్రతీచోటా నమ్మదగిన ప్రధాన ఆహారంగా భావిస్తారు. బహుళ ప్రయోజనములు కలిగినది మరియు దీనిని సిద్ధం చేయడం చాలా సులభం, ఈ చిన్నగా కనిపించే ఈ చిరుధాన్యం ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనది, రక్తహీనత రాకుండా నివారిస్తుంది, మరియు చికిత్స కూడా చేస్తుంది, హార్మోన్ స్థాయిలను సహజంగా సమతుల్యం చేస్తుంది. కోకో మరియు హాజెల్ నట్ అండర్‌టోన్‌లతో టెఫ్ తియ్యగా ఉంటుంది, ఉడికించినప్పుడు ఈ చిరు ధాన్యాలు దగ్గరకు అతుక్కొని ఉంటాయి కనుక వెచ్చని పోలెంటా మరియు గంజి తయారీకి బాగా సరిపోతుంది.37,38

 

2.5.6 ఇతర పోషక కరమైన చిరు ధాన్యాలు : ఫాక్స్టైల్ మిల్లెట్39 (కంగ్ని/కొర్రా) ఖనిజలవణాలు అధికంగా కలిగి రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి అవసరమైన ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు కలిగి ఉంటుంది. కోడో మిల్లెట్36 (కోడ్రావ్) గోధుమ మరియు మొక్కజొన్న కంటే మూడు రెట్లు మరియు బియ్యం కంటే 10 రెట్లు ఆహార సంబంధిత ఫైబర్ కలిగి ఉంటుంది. లిటిల్ మిల్లెట్40  (కుట్కి/సమాయ్) ఇతర మిల్లెట్ల కంటే సమృద్ధిగా ఇనుప ధాతువు ఉంటుంది, ఇది అన్ని వయసుల వారికి యోగ్యమైనది. ప్రోసో/రెడ్/వైట్ చిరు ధాన్యాలు పక్షి ఆహారంగా పరిగణించబడే, ఈ ఆహారం మానవ వినియోగం కోసం క్రమంగా అంగీకరించబడుతోంది. అధిక లెసిథిన్ కంటెంట్‌తో కూడిన లిపిడ్‌ల సంక్లిష్ట మిశ్రమం ఉండడంతో నాడీ మరియు మానసిక రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది .41  

2.6 ఓట్స్ : తృణధాన్యాలు మరియు బేకింగ్ చేసిన వస్తువులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వోట్ గ్రోట్స్ (వోట్స్ నుండి పొట్టు తొలగించగా ఏర్పడేవి) ను పొడి చేసిగానీ, రవ్వగా గానీ, ఆవిరి ద్వారా లేదా ఉడికించి వాడడం ద్వారా గానీ దానిలోని వనరులను  మెరుగుపరచడానికి మరియు వంట సమయాన్ని తగ్గించడానికి వీలవుతుంది. మరింత గాఢ లేదా సాంద్రీకృత పోషక పదార్ధాల కోసం వాటిని అలాగే తినవచ్చు, కానీ వాటిని మెత్తగా చేయడానికి రాత్రంతా నానబెట్టవలసి ఉంటుంది. మార్కెట్ లో లభించే ఇన్స్టంట్ వోట్స్ కూడా ముందుగా వండినవి, ఎండబెట్టి రోల్ చేసినవి గా ఉంటాయి. అత్యంత పోషకకారకమైన ఈ ఓట్స్ లో బీటా-గ్లూకాన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల గుండెకుఆరోగ్యకరమైన ఆహారం. అలాగే, LDL కొలెస్ట్రాల్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి రక్త నాళాలను రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలంగా ఇది చెప్పదగినది.6,42-44

హెచ్చరిక : ఓట్స్ సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి, అయితే అనేక రకాల ఓట్స్ గ్లూటెన్-అధికంగా ఉండే పంటలు పండించే ప్రదేశాల దగ్గర పెరుగుతాయి లేదా గోధుమ, బార్లీ మరియు రే వంటివి ప్రాసెస్ చేయబడిన సౌకర్యాలలోనే ప్రాసెస్ చేయబడతాయి; కనుక కలుషితమయ్యే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము. కనుక ఓట్ మీల్ ప్యాకేజీలపై గ్లూటెన్ రహిత లేబుల్స్ కోసం చూడండి. 6,42-44

2.7 క్వినోవా : అమరాంత్ తర్వాత అంత పుష్కలంగా పోషకాలు లభ్యమయ్యే చిరుధాన్యము ఇదే. ఇది కార్బోహైడ్రేట్ మరియు ప్రోటీన్ అధిక నిష్పత్తితో కూడిన 9 అతి ముఖ్యమైన వాటితో సహా మొత్తం 20 అమైనో ఆమ్లాలతో కూడిన సంపూర్ణ ప్రోటీన్ గా పరిగణింప బడుతుంది. క్వినోవా లో అనేక రకాలు ఉన్నాయి, కొన్న్జి ముఖ్యమైనవి ఐవరీ వైట్ (అందరికీ తెలిసినవి మరియు సులభంగా వండబడేవి), ఎరుపువి (చల్లని సలాడ్‌లకు ఉత్తమమైనది), మరియు నలుపువి (తీపి రుచితో కూడినవి, ఉడికించడానికి 15-20 నిమిషాలు అవసరం). కానివా అనేది పోషకాలు, మరియు వినియోగంలో దీనితో పోలి ఉంటుంది కానీ క్వినోవాలో సగం పరిమాణం మాత్రమే ఉంటుంది.46

2.8 అడవి బియ్యము : ఇది బియ్యం కాదు, మిధ్యా-ధాన్యమునకు చెందినది ; దీనిని బియ్యంతో సహా ఇతర ధాన్యాలతో కలిపి తీసుకుంటారు. ఇది బ్రౌన్ రైస్ లో ఉన్న ఫైబర్ మరియు ప్రోటీన్ కు రెండింతలు కలిగి ఉంటుంది కానీ తక్కువ ఇనుము మరియు కాల్షియం కలిగి ఉంటుంది.47

 

3. సంపూర్ణ ధాన్యాలుగ్లూటెన్ కలిగి ఉంటాయి, భారతీయ పేర్లు కుండలీకరణంలో ఇవ్వబడినవి     

ఈ ధాన్యాలలో ఉండే గ్లూటెన్ బేకరీ ఉత్పత్తులు, పాస్తా మొదలైన ఆహారాలను రూపొందించడానికి, మరియు ఆకృతి తీసుకురావడానికి సహాయపడుతుంది కానీ కొంతమందికి గ్లూటెన్ అసహనం ఉంటుంది. వీరికి అలాగే ఉదరకుహర వ్యాధి(సీలియాక్ డీసీజ్) వంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నవారికి గ్లూటెన్ రహిత ఆహారం మాత్రమే వారికి ఏకైక మార్గం.48-53

3.1 బార్లీ (జావు) : ప్రాసెస్ చేయబడిన పెర్ల్ బార్లీ (పాలిషింగ్ సమయంలో దాని ఊక పొరను కోల్పోయినట్టిది) కంటే పొట్టుతో ఉన్న బార్లీ ఆరోగ్యకరమైనది, పోషకాలతో కూడినది విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది, చాలా తృణధాన్యాల కంటే దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు ఆహార ఫైబర్ అధికంగా ఉంటుంది. బార్లీ బ్రెడ్, బార్లీ గంజి మరియు బార్లీ సూప్ వంటివి అందరూ బాగా ఇష్టపడతారు. బార్లీ నీటిని నిత్యమూ పరిమితంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల నుండి విష పదార్ధాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది మరియు వాటిలో రాళ్లను నివారించడానికి, కరిగించడానికి, మరియు తొలగించడానికి ఉపయోగ పడుతుంది.54,55

3.2 రై మరింత పోషకకరమైనది మరియు గోధుమ లేదా బార్లీ తక్కువ గ్లూటెన్ కలిగి ఉంటుంది, ముదురు రంగు రై పిండిలో ఊక మరియు బీజదళాలు అధికంగా ఉంటాయి కనుక ఇది ఆరోగ్యకరమైనది.56

3.3 సంపూర్ణ గోధుమ (గెహూన్) : ప్రధానంగా పిండి పదార్ధాలతో కూడి ఉండే ఇది శక్తిని ఇచ్చే పోషకకరమైన ఆహారం. ఇది అనేక రకాలుగా ఉంటుంది: బుల్గుర్, ఎండి చీల్చ బడియున్న గోధుమ; ఫార్రో, ఐంకార్న్, ఎమ్మర్, స్పెల్ట్ లేదా డింకెల్ గోధుమ వంటి పేర్లతో వివిధ ప్రదేశాలలో పరస్పరం మార్చుకోబడుతు ఉంటుంది. దురం (అత్యంత సాధారణ మైనది); ఫ్రీకా - గట్టిగా ఉండే దురం గా ఉండే ఇది ఎండబెట్టబడి, చీల్చ బడిన దానిగా విక్రయించబడుతుంది. కముట్/ఖోరాసన్ - పరిమాణంలో పెద్దది, సాధారణ గోధుమ కంటే ఎక్కువ ప్రోటీన్ మరియు విటమిన్ ఇ, ఉంటుంది, గోధుమ అలెర్జీ ఉన్నవారికి ఇది అనువైనది. ట్రిటికెల్ దురం గోధుమ మరియు రై యొక్క హైబ్రిడ్ రకము; హోల్ వైట్ పై రకాలతో పోలిస్తే సమాన పోషకకరమైనది మరియు రుచిలో తేలికగా ఉంటుంది.2,6,57-60

హెచ్చరిక : గోధుమలో ఉండే ఒకరకమైన ప్రోటీన్ వల్ల అలర్జీ ఏర్పడి, దద్దుర్లు, పొక్కులు, వాపు అలాగే అలర్జీకి గురయ్యే అవకాశం గల పిల్లల్లో సాధాహరణంగా శ్వాసలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి (అవి సాధారణంగా వయసుతో పాటు పెరుగుతాయి) మరియు. ఇది అలర్జీ కానటువంటి గ్లూటెన్ అసహనానికి భిన్నంగా ఉంటుంది.58,61

4. తృణధాన్యాల ఉత్తమ ఫలితాన్ని పొందడానికి చిట్కాలు

  • లేబుల్‌లను తనిఖీ చేసి GMO-యేతర, శుద్ధి చేయని మరియు ధాన్యపు శాతం అధికముగాగల దానిని మాత్రమే ఎంచుకోండి.2-6,12,13, 62
  • నాణ్యమైన వాటిని గాలి-చొరబడని చక్కని ప్యాకేజీలో ఉండే పొడి ధాన్యాలను మాత్రమే ఎంచుకొని, గాలి చొరబడని ఫ్రీజర్ బ్యాగ్‌లలో తాజాదనం పోకుండా ఉంచడానికి ఫ్రీజ్ చేయడము గానీ లేదా చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వీలుగా వాటిమధ్య బే ఆకులను ఉంచండి; పురుగుల బెడద లేకుండా ఉండడానికి దాల్చిన చెక్కను మరియు లవంగాలను జోడించండి.62-65
  • రోజుకు 200 గ్రాముల (6-8 ఔన్సుల) ధాన్యాలు మన ఆహారంలో కలిగి ఉండటము ఆదర్శవంతమైనది, వీటిలో ఆరోగ్యాన్ని పెంచడానికి మరియు వ్యాధిని నివారించడానికి కనీసం 50% తృణధాన్యాలు ఉండడం మంచిది. 4,10,11,66   
  • పోషకాల యొక్క ఉత్తమ గుణాలను పొందడానికి వివిధ రకాల తృణధాన్యాల సమ్మేళనాన్ని ఉపయోగించండి. నిజానికి, ఒకే ధాన్యపు ఆహారం మీద ఆధారపడటం అనేది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.2-6,12,15,27
  • యాంటిన్యూట్రియెంట్‌లను తొలగించడానికి, గ్లూటెన్ కంటెంట్‌ను తగ్గించడానికి మరియు జీర్ణశక్తిని పెంచడానికి వీటిని రాత్రిపూట నానబెట్టి ఉపయోగించండి.6,12,15,27  
  • కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు మలబద్దకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు తీసుకోవడం క్రమంగా పెంచండి; జీర్ణవ్యవస్థ మార్గం ద్వారా కదలికకు సహాయపడటానికి పుష్కలంగా నీరు త్రాగండి.43
  • ధాన్యపు ఆహారాలు చక్కగా జీర్ణమై శక్తిని విడుదల చేయడానికి వీలుగా నిద్రవేళకు కనీసం 2-3 గంటల ముందు తీసుకోవడం మంచిది.29

రిఫరెన్సులు మరియు లింకులు 

  1. Food and Health, Sathya Sai Speaks : https://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-31.pdf
  2. Whole grains : https://wholegrainscouncil.org/definition-whole-grain
  3. Whole grains & benefits : https://draxe.com/nutrition/whole-grains/
  4. https://www.hsph.harvard.edu/nutritionsource/what-should-you-eat/whole-grains/
  5. https://www.glnc.org.au/grains/grains-and-nutrition/wholegrains/
  6. https://www.masterclass.com/articles/what-are-whole-grains-learn-how-to-cook-with-whole-grains#what-are-whole-grains
  7. Pseudograins: https://www.glnc.org.au/when-is-a-grain-not-a-grain-when-its-a-pseudo-grain/
  8. https://sharonpalmer.com/what-are-pseudograins/
  9. https://paleofoundation.com/complete-list-of-grains-and-pseudograins/
  10. Refined grains : https://www.masterclass.com/articles/all-about-grains-21-types-of-grains
  11. https://wholegrainscouncil.org/whole-grains-101/whats-whole-grain-refined-grain
  12. https://diet.mayoclinic.org/diet/eat/whole-grains-vs-regular-grains?xid=nl_MayoClinicDiet_20160421
  13. https://www.betterhealth.vic.gov.au/health/healthyliving/cereals-and-wholegrain-foods#when-wholegrains-are-refined
  14. Fortified grains : https://www.hsph.harvard.edu/nutritionsource/processed-foods/
  15. Amaranth : https://draxe.com/nurition/amaranth/
  16. https://wholegrainscouncil.org/whole-grains-101/whole-grains-z;
  17. https://www.glnc.org.au/grains/types-of-grains/amaranth/
  18. https://www.nutrition-and-you.com/amaranth-grain.html
  19. Brown rice : https://draxe.com/nutrition/brown-rice-nutrition/
  20. https://www.hsph.harvard.edu/nutritionsource/food-features/rice/
  21. Bhutanese red rice : https://healthyeating.sfgate.com/nutritional-information-cooked-bhutanese-red-rice-1150.html
  22. Buckwheat : https://draxe.com/nutrition/buckwheat-nutrition/
  23. Amaranth versus Buckwheat : https://calories-info.com/compare/buckwheat-amaranth/
  24. Corn : https://draxe.com/nutrition/nutritional-value-of-corn/
  25. https://wholegrainscouncil.org/whole-grains-101/grain-month-calendar/corn-%E2%80%93-october-grain-month
  26. Millets : https://vikaspedia.in/health/nutrition/nutritive-value-of-foods/nutritive-value-of-cereals-and-millets/milletsthe-nutricereals
  27. Benefits of millet : http://www.whfoods.com/genpage.php?tname=foodspice&dbid=53
  28. https://www.thehindu.com/news/national/andhra-pradesh/include-millets-in-regular-diet-say-experts/article3248602.ece
  29. Importance of millets : Finger/pearl/sorghum : https://fdocuments.in/document/food-body-by-sadhguru.html
  30. https://blog.slurrpfarm.com/millets/different-types-of-millet/
  31. Barnyard millets : https://www.medindia.net/dietandnutrition/top-5-health-benefits-of-barnyard-millet.htm
  32. Finger millet (Ragi): https://isha.sadhguru.org/in/en/blog/article/7-health-benefits-of-ragi-6-great-ragi-recipes
  33. https://www.netmeds.com/health-library/post/ragi-nutrition-health-benefits-uses-for-skin-and-hair-side-effects
  34. Pearl millet : https://www.medindia.net/dietandnutrition/health-benefits-of-pearl-millet.htm
  35. Sorghum : https://draxe.com/nutrition/sorghum/
  36. https://foodtank.com/news/2018/04/icrisat-millets-sorghum-forgotten-foods-future/
  37. Teff : https://draxe.com/nutrition/teff/
  38. https://wholegrainscouncil.org/whole-grains-101/grain-month-calendar/millet-and-teff-%E2%80%93-november-grains-month
  39. Foxtail millet : https://www.netmeds.com/health-library/post/foxtail-millet-nutrition-health-benefits-ayurvedic-uses-and-recipes
  40. Little millet : https://www.medindia.net/dietandnutrition/little-millet-the-immune-boosting-indigenous-grain.htm
  41. Proso millet : https://www.mdpi.com/2077-0472/9/3/64/htm
  42. Oats : https://wholegrainscouncil.org/whole-grains-101/grain-month-calendar/oats-%E2%80%93-january-grain-month#
  43. https://draxe.com/nutrition/oatmeal-nutrition/
  44. https://www.bobsredmill.com/blog/healthy-living/is-oatmeal-gluten-free/
  45. Quinoa : https://draxe.com/nutrition/10-quinoa-nutrition-facts-benefits/
  46. Kaniwa versus quinoa : https://nuts.com/healthy-eating/kaniwa-vs-quinoa#
  47. Wild rice : https://wholegrainscouncil.org/whole-grains-101/whole-grains-z#wildrice
  48. What is gluten : https://wholegrainscouncil.org/whole-grains-101/whats-whole-grain-refined-grain/gluten-free-whole-grains
  49. What is Gluten intolerance : https://www.medicalnewstoday.com/articles/312898#symptoms
  50. Are gluten-free grains healthy : https://www.mayoclinic.org/healthy-lifestyle/nutrition-and-healthy-eating/expert-answers/is-gluten-free-healthy/faq-20348653
  51. https://www.mayoclinic.org/healthy-lifestyle/nutrition-and-healthy-eating/in-depth/gluten-free-diet/art-20048530
  52. https://draxe.com/nutrition/gluten-free-grains
  53. Is gluten-free diet always good ? : https://www.medicalnewstoday.com/articles/288406#benefits
  54. Barley: https://draxe.com/nutrition/barley-nutrition/
  55. Barley water : https://www.1mg.com/articles/did-you-know-barley-water-aids-dissolution-of-renal-stones/
  56. Rye : https://draxe.com/nutrition/rye-flour/
  57. Wheat berries/whole wheat : https://draxe.com/nutrition/wheat-berries/
  58. Wheat : https://www.healthline.com/nutrition/foods/wheat#nutrition
  59. Wheat Bulgur : https://www.healthline.com/nutrition/bulgur-wheat#nutrition
  60. Wheat family : Farro : https://www.healthline.com/nutrition/farro-benefits#TOC_TITLE_HDR_2
  61. Wheat allergy different from gluten intolerance : https://acaai.org/allergies/types/food-allergies/types-food-allergy/wheat-gluten-allergy
  62. Storage of whole grains : https://wholegrainscouncil.org/recipes/cooking-whole-grains/storing-whole-grains
  63. https://www.indiatoday.in/lifestyle/what-s-hot/story/tips-ways-get-rid-of-weevils-grain-beetles-bugs-ghuns-entering-spices-grains-monsoon-lifest-331259-2016-07-25
  64. https://www.thekitchn.com/tips-bay-leaves-in-the-pantry-69557
  65. https://kitchenhandsdown.com/kitchen-extras/how-to-store-grains-in-your-kitchen/
  66. Intake of whole grains : https://wholegrainscouncil.org/sites/default/files/atoms/files/WG_HowMuch.pdf

___________________________________________________________________________

2. ప్రేరణాత్మకమైన కధానికలు

2.1. క్లెన్సింగ్ కొంబో రక్తంలో చెక్కరను సాధారణ స్థితికి తీసుకురావడం! 01001…ఉరుగ్వే   

2018 మే 23న, 73 సంవత్సరాల వయస్సు గల ఈ వృద్ధురాలు ఈ ప్రాక్టీషనరును చూడటానికి వచ్చినప్పుడు, ఆమె నాలుగు సంవత్సరాలుగా మెట్‌ఫార్మిన్ తీసుకుంటుంది, కానీ ఇది ఆమె రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. ఆమెకు CC6.3 Diabetes + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic ఇవ్వగా నాలుగు నెలలు మెట్‌ఫార్మిన్‌తో పాటు TDS గా తీసుకున్నారు. అయినప్పటికి ఎటువంటి మెరుగుదల లేక ఆమె చక్కెర స్థాయిలో, ఎల్లప్పుడూ 150 mg/dl వద్ద ఉంటోంది. కొన్నిసార్లు 200 mg/dl కి పెరుగుతోంది. సెప్టెంబరులో ఎంతో ఆందోళనతో, ఆమె తన సమస్యకు మూల కారణం భయం మరియు ఫలితంగా ఏర్పడిన ఒత్తిడి, ప్రధార కారణంగా విశ్వసిస్తున్నట్లు తన మనసు విప్పి తెలిపారు. చనిపోయిన తన మాజీ భర్తను తన ఇంటిలో చూస్తున్నట్లు అనిపిస్తూ వారి సంతోషరాహిత్యమైన బంధాన్ని గుర్తుచేస్తూ వేదనకు గురిచేస్తోంది. ప్రాక్టీషనరు ఎంతో నమ్మకంతో  CC17.2 Cleansing ఆమె ఇంటి చుట్టూ పది రోజులు పిచికారీ చేయడానికి సిద్ధం చేశారు. ఒక వారంలోనే ఆమె షుగర్ లెవల్ 125 mg/dl స్థిరంగా నెలపాటు నిలిచిపోగా అక్టోబర్‌లో 110 mg/dl మరియు చివరకు నవంబర్ 9 న 98 mg/dl వద్ద సాధారణమైంది. ఆమె చివరికి తన ఇంట్లో మాజీ భర్త ఉనికినే కోల్పోయారు!

2.2. స్వప్నంలో చెవినొప్పి తగ్గిపోవడం 03566…USA

ప్రాక్టీషనరుకు బ్యాంకులో పనిచేసే మహిళా స్నేహితురాలు ఉంది. 2018 జులై లో ఆమె తన హెడ్‌ఫోన్‌లను ఉపయోగించి సంగీతం వినడం ప్రారంభించి పని చేస్తున్నకాలమంతా వింటూ ఉండేది. అక్టోబర్ నాటికి ఆమె రెండు చెవులలో చెవినొప్పి పెరగడం తో ఆమె హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం మానేసింది, కానీ చెవులలో బాధ కొనసాగింది. నొప్పి చాలా ఎక్కువగా ఉండడంతో ఆమె రోజూ ఇబుప్రోఫెన్ తీసుకోవలసి వచ్చేది. 2019 నూతన సంవత్సర భజన సందర్భంగా, ప్రాక్టీషనరు ఆమెకు వైబ్రియోనిక్స్ చికిత్సను అందించారు. ఐతే ఆమెకు జనవరి 7న, డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉండడంతో రెమిడీ నిరాకరించారు. జనవరి 5 న, స్నేహితురాలికి ఒక కల వచ్చింది, దీనిలో ఆమె డోర్‌బెల్ రింగ్ వినిపించింది. తలుపు వద్ద, ప్రాక్టీషనరు నిలబడి ఆమె సమస్యకు తనవద్ద ఔషధం ఉందని పేర్కొన్నారు. ఇద్దరూ నేలమీద ఎదురెదురుగా కూర్చున్నారు. ప్రాక్టీషనరు ద్రవంతో నిండిన ఆకుపచ్చ గిన్నెను ఇచ్చి రోగిని తాగమని అడిగారు. అది తాగగానే, చెవి నొప్పితో పాటు ప్రాక్టీషనర్‌ కూడా అదృశ్యమైనారు! కల కరిగిపోయి మెలకువ వచ్చింది. ఆమె ఎన్నడూ ENT స్పెషలిస్ట్‌ని చూడలేదని చెప్పడానికి వేరే చెప్పనక్కరలేదు. ఈ రోజు వరకు, ఆమె అప్పుడప్పుడు హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ ఆమెకు చెవి నొప్పి కలగలేదు.  

2.3 పశువైద్య నిపుణులు ఆశలు వదులుకున్న పెంపుడు జంతువులను వైబ్రియానిక్స్ రక్షించింది ! 00512…స్లొవేనియా    

లూనా, అనే 10 సంవత్సరాల పూడ్లే జాతికి చెందిన కుక్క, క్యాన్సర్‌తో బాధపడుతున్నందున, 2021 ఫిబ్రవరి 6 న గర్భాశయం తొలగించబడింది. శస్త్రచికిత్స సమయంలో, క్యాన్సర్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందినట్లు పశువైద్య నిపుణుడు కనుగొని, దాని జీవితకాలము ఇక రోజులలోనే ఉందని తెలిపారు. ఈ కుక్క శస్త్రచికిత్స అనంతర జ్వరంతో బాధపడుతూ నాలుగు రోజుల వరకూ ఏమీ తినలేదు; పశువైద్యుడు అనాయాస మరణాన్ని సిఫార్సు చేశారు. శస్త్రచికిత్సకు ముందు రోజు, నుండి ప్రాక్టీషనరు CC9.2 Infections acute రోజుకు రెండుసార్లు ప్రసారం చేయడం ప్రారంభించారు. లూనా ఫిబ్రవరి 11 నుండి తినడం మొదలుపెట్టి, రోజురోజుకు ఆరోగ్యంగా మారడంతో, ఫిబ్రవరి 16 న చికిత్స నిలిపివేయబడింది, ఆ సమయానికి ఆమె సంతోషకరమైన జీవితంతో నిండి ఉంది! పశువైద్యుడు చాలా ఆశ్చర్యపోయాడు. లూనా యజమాని మాటల్లో చెప్పాలంటే, “2015 నుండి నేను ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడల్లా వైబ్రియోనిక్స్ చికిత్స తీసుకుంటున్నాను, నేను ఎంతో కృతజ్ఞతా భావంతో దానిపై ఆధారపడి ఉంటాను. నా కుక్కపిల్లకి చికిత్స చేస్తున్నప్పుడు నేను వైబ్రియోనిక్స్ యొక్క అద్భుత శక్తిని తెలుసుకో గలిగాను. లునాకు కొత్త జీవితానికి అవకాశం లభించినందుకు నేను ఎంతో కృతజ్ఞుడను. ఇప్పుడు ఈ కుక్కపిల్ల కొత్త శక్తితో మైదానం చుట్టూ ఆనందంగా పరుగెత్తుతోంది. పశువైద్యుడు తాను ఇటువంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదని, వినలేదని ఒప్పుకున్నారు.”

13 ఏళ్ల డాల్మేషియన్ కుక్క ‘ఫ్లోకి’ 2014 లో గుండెపోటుకు గురైంది, ఇది అతని మోటార్ వ్యవస్థను దెబ్బతీసి దాని  సమతుల్యతను దెబ్బతీసింది. దీనికి మూత్రంలో చర్మ సమస్యలు, వివిధ అలర్జీలు మరియు మూత్రంలో ఇసుక వంటిది రావడం, కానీ అన్నింటికంటే ముఖ్యంగా, దాని తోక కింద ఏర్పడిన కణితి శస్త్రచికిత్సను అత్యంత ప్రమాదకరంగా చేసింది, కనుక పశువైద్యుడు ఎట్టి సహాయమూ చేయలేకపోయారు. ప్రాక్టీషనరు 13 నెలలకు పైగా CC1.1 Animal tonic + CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths నీటితో వినియోగించడమే కాక ప్రసారం కూడా చేయసాగారు. తత్ఫలితంగా, చికిత్స నిలిపివేసిన ఆరు నెలల తర్వాత, సెప్టెంబర్ 2016 లో అది ప్రశాంతంగా కన్నుమూసే సమయానికి, ఎలాంటి పరిమితులు లేకుండా సంతోషంగా, పూర్తి జీవితాన్ని గడిపిందని ఫ్లోకి యొక్క శ్రేయోభిలాషి నివేదించారు.   

టిమ్, అనే 4 ఏళ్ల జాక్ రస్సెల్ టెర్రియర్, జుట్టు పాక్షికంగా కోల్పోవడం చర్మం ఎర్రబడడం(పౌల్ట్రీ & సౌందర్య సాధనాలకు అలెర్జీ) మరియు రక్తస్రావం అయ్యే వరకు గోకడం అనే నాడీ సంబంధిత అలవాటు వంటి లక్షణాలకు అల్లోపతి నుండి ఉపశమనం లభించక పోవడంతో అనేక నెలలుగా బాధపడుతూ ఉండేది. 2018 జులై లో దానికి CC1.1 Animal tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC21.1 Skin tonic + CC21.3 Skin allergies, నీటిలో ఇవ్వడం జరిగింది. రెండు నెలల్లో గోకడం పూర్తిగా ఆగిపోయింది మరియు ఇతర లక్షణాలు కూడా తగ్గిపోయాయి. అయితే, తరువాత సంవత్సరం 2019 లో, దానికి దుమ్ము మరియు పొద్దుతిరుగుడు పుప్పొడికి అలెర్జీ ఏర్పడింది. పై కాంబో ప్రారంభమైన వెంటనే అలర్జీ మాయమైపోయినప్పటికీ రెమెడీని రెండు నెలలు కొనసాగించబడింది. అది పూర్తిగా కోలుకోవడం జరిగింది.

___________________________________________________________________________

3. వర్క్ షాప్ లు మరియు సెమినార్లు

వర్చువల్ AVP వర్క్ షాప్, 2021 జూన్ 2 నుండి జులై 16 వరకు; ప్రాక్టికల్ వర్క్ షాప్ పుట్టపర్తి 2021జులై 26-27   

భారతదేశంలో ఇటీవల ప్రారంభించిన వర్చువల్ AVP వర్క్‌షాప్‌ల శ్రేణిలో 2 వది ఐన ఈ అత్యంత ఇంటరాక్టివ్ మరియు ప్రాక్టికల్ ఓరియెంటెడ్ వర్క్‌షాప్‌ను ఇద్దరు సీనియర్ టీచర్లు చక్కటి ప్రణాళికతో నిర్వహిస్తున్నారు, ఇందులో 28 సెషన్‌లు ఉన్నాయి. వర్చువల్ ప్లాట్‌ఫాం ప్రాక్టీషనర్లు తమ ఇళ్ల నుండే సౌకర్యవంతంగా హాజరు కావడం సులభతరం చేసింది. అదే సమయంలో అనేక మంది కొత్త ఉపాధ్యాయులు 11568,11583,12051  ఇప్పుడు సుదూర ప్రయాణం చేయకుండానే బోధనలో పాల్గొనడం ద్వారా అవసరమైన అధ్యాపకుల విస్తరణకు తోడ్పడింది. వైబ్రియోనిక్స్ మిషన్ యొక్క అనేకమంది అనుభవజ్ఞులు హాజరైన వారితో తమ జ్ఞానాన్ని మరియు అనుభవాలను పంచుకున్నారు. ఈ కనెక్టివిటీ అనేది పుట్టపర్తి నుండి పాల్గొన్న మన కొత్త శిక్షణ సమన్వయకర్త 03518 ద్వారా సులభతరం చేయబడింది, ఆమె పాల్గొన్న వారితో సత్సంబంధాలు ఏర్పరచుకొనడం ద్వారా మరియు వారికి ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించారు!

 వర్క్‌షాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు:                                                        

  • వర్చువల్ వర్క్‌షాప్ లలో మొట్టమొదటి సారి కనిపించిన వైబ్రియోనిక్స్ కుటుంబంలోని అత్యంత సీనియర్ సభ్యురాలు మరియు రీసెర్చ్ విభాగపు అధికారి పాట్ హంట్‌, వ్యాధికి సంబంధించి అవసరమైన కాంబోలకు మాత్రమే రెమిడీ లను పరిమితం చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఎక్కువ రెమిడీలు ఉపయోగించడం ద్వారా దాని ప్రభావం డైల్యూట్ లేదా పలుచన అయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఆమె హోమియోపతిపై తన అవగాహనను లోతుగా పరిశీలిస్తూ ప్రతీ కాంబోని నిర్ధారించుకొనే ముందు తనలో ఉన్న అంతర్గత స్వామికి కనెక్ట్ అవుతారు. IB కూడా ఈ విధంగా ఉద్భవించినదే. 
  • డాక్టర్ అగర్వాల్ గారి నుండి 108CC భావన అనేది ఎలా ఉద్భవించిందో తెలుసుకోవడం కొత్త ప్రాక్టీషనర్లకు ఆసక్తికరంగా ఉంది. రోగికి ప్రేమతో వ్యవహరించేటప్పుడు, మనం తగు జాగ్రత్త తీసుకోవాలని, ఆందోళన మరియు అహం వంటి భావాలను మన హృదయంలోనికి రాకుండా చూసుకోవాలని, అవి వైద్య ప్రక్రియను మందగించగలవని కూడా డాక్టర్ అగర్వాల్ ముఖ్యమైన చిట్కా తెలియ జేసారు. హేమ్ అగర్వాల్ మాట్లాడుతూ పిల్లల విషయంలో మనం వారి స్థాయికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తామో, అలాగే ప్రాక్టీషనర్లు కూడా రోగి స్థాయికి వెళ్ళి, వారి బాధను మనసులో భావన చేస్తూ, రోగి గురించి ఎట్టి తీర్పు బయటకు ప్రకటించకుండా జాగ్రత్త పడుతూ, స్వామిపై పూర్తి దృష్టి కేంద్రీకరించి ప్రార్థనతో, ప్రశాంత చిత్తంతో రెమిడీ తయారుచేసి అందించాలి అని చెప్పారు.    
  • మన ఉత్తర అమెరికా సమన్వయకర్త 01339 108CC బాక్స్‌ని ఎలా జాగ్రత్తగా సంరక్షించాలి, మరియు ఎలా ఉపయోగించాలి అనే చక్కని చిట్కాలు అందించడమే కాక పాల్గొన్నవారి ప్రశ్నలకు సమాధానములు కూడా ఇచ్చారు.   
  • డాక్టర్లు గా ఉన్న ఇద్దరు ప్రాక్టీషనర్లు 11567 & 11610 పాల్గొన్నవారికి కొన్ని సాధారణ మరియు కొన్ని జీవనశైలి వ్యాధులను ఎలా నిర్ధారణ చేయాలి అనే విషయాలు, కొన్ని ఆరోగ్య చిట్కాలు, వ్యాధి రహిత జీవితానికి పోషకాహార ప్రాముఖ్యత వంటివి వారికి అవగాహన కల్పించారు, మరియు ప్రాక్టీషనర్లు అందరూ రోల్ మోడల్‌గా ఉండాలని మరియు రోగులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.    
  • IASVP వింగ్ డైరెక్టర్ ద్వారా వైబ్రియోనిక్స్ సంస్థ నిర్మాణంపై ఒక చిన్న ప్రదర్శన ఇవ్వబడింది.

చివరి రోజున, ఉత్తీర్ణత పొందిన AVP లు తమ 108CC బాక్సులను ఎంతో భక్తి మరియు ఆరాధనా భావంతో సాయి వైబ్రియోనిక్స్‌తో సేవ చేయడంలో వినయపూర్వకమైన సాధనంగా ఉండాలనే సంకల్పంతో స్వీకరించారు.