Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 12 సంచిక 5
సెప్టెంబర్ / అక్టోబర్ 2021


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఇప్పుడు గడుస్తున్న కాలం ఈ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన పండుగ సమయాలలో ఒకటి. మనము ప్రస్తుతం రెండు ముఖ్యమైన పండుగలను గమనించాము - ఓనం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి, సాధారణ పరిస్థితులలో ప్రశాంతి నిలయంలో అత్యంత ఉత్సాహ హర్షాతిరేకంతో జరుపుకుంటారు. కానీ మహమ్మారి మనకు నేర్పించిన పాఠం ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మనమంతా మన అంతరంగ ప్రయాణానికి సన్నద్దం కావడం. ఈ రెండు పండుగల నుండి మనం నేర్చుకోవడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇవి ప్రేమ, త్యాగం మరియు అన్నింటికంటే ముఖ్యంగా నిస్వార్థ సేవ యొక్క రూపాలుగా ఉన్నాయి. స్వామి ఇలా అంటారు, "మీ కార్యకలాపాలన్నిటినీ దేవునికి సమర్పణగానూ మరియు మీరు చేసే పనులన్నీ దేవుని పనిగానే భావించండి. పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగరడానికి రెండు రెక్కలు మరియు సైకిల్ ముందుకు కదలడానికి రెండు చక్రాలు ఎంత అవసరమో, అలాగే మనిషి తన అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ప్రేమ మరియు సేవ అవసరం. ప్రేమ లేని సేవను అందించడం ద్వారా ఎటువంటి ప్రయోజనము కలగదు. మీరు చేసే సేవా కార్యకలాపాల నుండి ఎటువంటి ఫలితాన్ని ఆశించవద్దు. సేవను అందించడం ద్వారా మీరు పొందిన సంతృప్తే ఒక అపూర్వ బహుమతి." – శ్రీ సత్య సాయి బాబా, కృష్ణ జయంతి ఉపన్యాసం, 1999 సెప్టెంబర్ 3. మీ అందరికీ తెలిసినట్లుగా, సాయి వైబ్రియోనిక్స్ యొక్క లక్ష్యం ఈ నిస్వార్థ సేవ మరియు షరతులులేని ప్రేమపై ఆధారపడింది!

మా సోదర సోదరీమణులు యుఎస్, కెనడా, గయానా మరియు ట్రినిడాడ్ నుండి ప్రాక్టీషనర్ల కోసం సురక్షితమైన ప్రైవేట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అయిన “వైబ్రియోనిక్స్ సర్కిల్ ఆఫ్ నార్త్ అమెరికన్ ప్రాక్టీషనర్స్ ("VCNAP") ను, ప్రారంభించారని మీకు తెలుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అద్భుత మైలురాయి సాధనలో ఉత్తర అమెరికా సమన్వయకర్త చేసిన అవిరళ కృషి, ప్రాక్టీషనర్ 02844 నుండి అందిన సాంకేతిక సహకారంతో, సుసంపన్నమైన వేదికను రూపొందించడానికి సాధ్యమైంది. దీనిద్వారా అభిప్రాయాలను పంచుకోవడం, పూర్తి సహకార చేయూత, ప్రశ్నోత్తరాలు, ప్రేరణ, స్వామి లీలలు, ప్రత్యక్ష ప్రకటనలు, ప్రార్థన అభ్యర్థనలు స్వీకరించుట, ఇంకా మరెన్నో కార్యక్రమాల నిర్వహణ సుసాధ్యమైంది. ఈ నెట్వర్క్ గతంలో నిర్వహించిన నెలవారీ జూమ్ కాల్‌లను భర్తీ చేస్తూ ప్రతిరోజూ పర్యవేక్షించబడుతోంది. ప్రాక్టీషనర్ల ప్రశ్నలకు ముగ్గురు అనుభవజ్ఞులైన SVP ల ప్యానెల్ సమాధానమిస్తుంది, మరియు ఈ ప్రాంతంలోని అందరి ప్రయోజనం కోసం ఫోరమ్‌లో పోస్ట్ చేయబడుతుంది.  

భారతదేశంలో మహమ్మారి యొక్క మూడవ తరంగం నియంత్రణలోకి వచ్చినందున, మా ఇమ్యునిటీ బూస్టర్ IB కి డిమాండ్ మందగించడం ప్రారంభమైంది. ఏదేమైనా, పుట్టపర్తిలో IB పంపిణీ స్థానిక ప్రాక్టీషనర్లు మరియు వైబ్రియోనిక్స్ అడ్మిన్ మరియు ఇతర వాలంటీర్ల ద్వారా చాలా చురుకుగా కొనసాగుతున్నది. ఒరిస్సాకి చెందిన ప్రాక్టీషనర్ 02835 స్వల్ప వ్యవధిలో ఇచ్చిన నోటీసుకు వెంటనే ప్రతిస్పందించి 550 IB సీసాలను సిద్ధం చేయడం ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అంశము. భారతదేశంలో IB యొక్క మొత్తం లబ్ధిదారుల సంఖ్య, మేము ఈ వార్తాలేఖ ముద్రణకు వెళుతున్నప్పుడు 487,089 కి చేరుకుంది. అలాగే, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆంక్షలను సడలించడంతో, ప్రాక్టీషనర్లు వ్యక్తిగత శిబిరాలను ప్లాన్ చేయడం మరియు క్లినిక్‌లను తిరిగి ప్రారంభించడం మనం చూస్తున్నాము. సాయి ఆర్గనైజేషన్ వారు నిర్వహించే వైద్య శిబిరాలలో తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రజలకు చేరువ కావలసిందిగా ప్రాక్టీషనర్‌లను నేను హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తున్నాను. ఈ సందర్భంగా మీ నివేదికలను స్వీకరించడానికి మరియు ఆయా శిబిరాలలో మీ అనుభవాలను గురించి వినడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. 

కోవిడ్ మహమ్మారి సమయంలో బ్రాడ్‌కాస్టింగ్ కోసం మన చొరవ అద్భుతంగా రూపుదాల్చి, ప్రస్తుతం, ప్రసార అభ్యర్థనలలో గణనీయమైన పెరుగుదల వ్యక్తమవుతోంది; ప్రధానంగా, మన సరికొత్త మరియు మెరుగైన వెబ్‌సైట్ నుండి ఎక్కువ అభ్యర్ధనలు వస్తున్నాయి. SRHVP మెషిన్ ఉన్న ప్రాక్టీషనర్లు అందరూ ఈ సేవ కోసం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పనిచేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మనము బ్రాడ్కాస్టింగ్ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసిడ్యూర్ SOP) మరియు మార్గదర్శకాలను ఖరారు చేశాము, అది త్వరలో ప్రాక్టీషనర్ వాలంటీర్ లకు పంపబడతాయి. SRHVP లేని అభ్యాసకులందరూ తమ ప్రాంతీయ సమన్వయకర్తలను ప్రసార అభ్యర్థనలతో సంప్రదించాలని కూడా నేను అభ్యర్థిస్తున్నాను.

సాయి వైబ్రియానిక్స్ ని మరింతగా ప్రజలకు చేరువ చేయాలనే మన లక్ష్యానికి అనుగుణంగా, మన స్థానిక సాయి కమ్యూనిటీకి చెందిన సభ్యులలో ఎవరైతే తమ పరిసరాల్లో మరియు సమీప గ్రామాలలో క్యాంపులు మరియు కమ్యూనిటీ సెంటర్లలో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారిని గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలి. దీని కోసం మేము ఒక కొత్త వర్గం వైబ్రియోనిక్స్ టార్చ్ బేరర్స్ గా చెప్పదగిన అసిస్టెంట్ ప్రాక్టీషనర్‌ (AP) అనే విధానం రూపొందించాము. వారి కోసం మేము సరళమైన మరియు వేగవంతమైన అడ్మిషన్ ప్రాసెస్‌ రూపొందించాము, దాని తర్వాత వారి స్థానిక భాషలో ఇ-కోర్సు మరియు వర్క్‌షాప్ శిక్షణ ఉంటుంది. ప్రాక్టీషనర్లు అందరూ అటువంటి చురుకైన అభ్యర్ధులను గుర్తించి మాతో సంబంధం నెరపే విధంగా తగిన కృషి చేయవలసిందిగా అభ్యర్ధన. ప్రస్తుతం 2021 డిసెంబర్ లో షెడ్యూల్ చేయబడిన వర్క్‌షాప్‌లో హిందీలో శిక్షణ పొందుటకు మొదటి బ్యాచ్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నాము.   

“స్ప్రెడ్ ద వర్డ్” ప్రచారం లో భాగంగా మనం నిర్వహించిన అనేక ఇంటరాక్టివ్ అవేర్‌నెస్ వెబినార్‌ల దృష్ట్యా చూస్తే ఇది చాలా ఫలవంతమైన సంవత్సరం. అటువంటి అవగాహన చర్చ కోసం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని సుప్రసిద్ధ చిన్మయ మిషన్‌ వారు సహకరించినందుకు ఎంతో గౌరవ ప్రదంగా భావిస్తున్నాము. ఇక్కడ చేసిన ప్రసంగానికి మంచి ఆదరణ లభించడంతో పాటు ఆ తరువాత నిర్వహించిన ఆసక్తికరమైన మరియు శ్రేయోదాయకమైన ప్రశ్నోత్తరాల సెషన్, భవిష్యత్తు కోసం అవకాశాలను మెరుగుపరుస్తుందని నేను సంతోషంగా నివేదిస్తున్నాను. సాయి వైబ్రియోనిక్స్ మిషన్ ను మరింత వ్యాప్తి చేయడానికి వైబ్రియోనిక్స్ ప్రాంతీయ కోఆర్డినేటర్లు తమ రాష్ట్ర కోఆర్డినేటర్లతో సంబంధాలు పెట్టుకొని సాయి భక్తుల కోసం తగిన వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి చర్చలను ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రతిపాదిస్తున్నాము. అటువంటి కార్యక్రమాలను సులభతరం చేయడానికి మీకు అవసరమైన ఏదైనా సహాయంతో మీకు సహకరించడానికి మేము ఆనందంగా సంసిద్ధులమై ఉన్నాము. మరింత సమాచారం కోసం మీరు మాకు [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు.

రోగుల యొక్క అనుభవాలు టెస్టిమోనియల్స్ (ఆడియో, వీడియో, టెక్స్ట్) మరింత ఎక్కువగా పంపవలసిందిగా ఎప్పటిలాగే, ప్రాక్టీషనర్లందరికీ నేను వినయపూర్వకమైన అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. మన సంస్థ ప్రాక్టీషనర్ల అనుభవాల పైనే ఎక్కువగా ఆధారపడుతుంది కనుక మీ అందరి నుండి ఎంత ఎక్కువ సహకారం లభిస్తుందో అంత ఎక్కువగా మనము సమిష్టిగా నేర్చుకుంటూ ఎదుగగలుగుతాము.

మీ అందరికీ సుసంపన్నమైన కాలాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి, బృహత్తరమైన ఈ గొప్ప సేవను కొనసాగించండి!

సాయికి ప్రేమపూర్వక సేవలో

జిత్ కె అగర్వాల్