దివ్యవైద్యుని దివ్య వాణి
Vol 12 సంచిక 5
సెప్టెంబర్ / అక్టోబర్ 2021
మీరు శారీరక బలాన్ని పెంపొందించుకోవాలంటే, దానికి సమతుల్య ఆహారం అవసరం. మీరు అన్నం మరియు చపాతీ తినవచ్చు. చెడు ఆలోచనలను పోగొట్టుకొనడానికి మీరు మానసిక బలాన్ని పెంపొందించుకోవాలి. మీకు మానసిక బలం ఉన్నప్పుడు, మీకు కష్టాలు మరియు దుఃఖాలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ఉండగలరు ... మీరు శారీరక మరియు మానసిక శక్తిని పెంపొందించుకున్నప్పుడు, మీ ఆధ్యాత్మిక శక్తి కూడా మెరుగుపడుతుంది. మీరు ఆధ్యాత్మికత మార్గాన్ని అనుసరించినప్పుడు, మీరు అన్ని సందేహాలు మరియు భ్రమల నుండి విముక్తి పొందుతారు. చెడు ఆహారము, కోపం, వాంఛ మరియు ఉద్రిక్తత వంటి చెడు ధోరణులకు దారితీస్తుంది మరియు అన్ని సమస్యలను సృస్టిస్తుంది. అందువల్ల, మీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన (సాత్విక) ఆహారాన్ని మాత్రమే తినడం అవసరం.
... శ్రీ సత్యసాయి బాబా, “సంపూర్ణ జ్ఞానం నుండి పరిపూర్ణ ఆనందం లభిస్తుంది” దివ్య వాణి 1996 సెప్టెంబర్ 1 http://sssbpt.info/ssspeaks/volume29/d960901.pdf
సేవలను అందించండి, ప్రేమను స్వీకరించండి. ఇదే దైవత్వాన్ని అనుభవించడానికి త్రోవ. కానీ ఈరోజులలో సేవ హృదయపూర్వకంగా అందించబడుటలేదు. కొద్దిమంది మాత్రమే ప్రేమతో సేవ చేస్తారు కనుక అట్టి కొద్దిమంది మాత్రమే దేవుని కృపను పొందుతారు. ఐతే ఇట్టి కొద్దిమంది ప్రేమ కూడా స్వీయ-కేంద్రీకృతమైనది, అందరూ నావాళ్ళు అనే భావం లోపించినది. మన ప్రేమ అనేది మన బంధువులకు మాత్రమే పరిమితం కాకూడదు. అది కుటుంబానికి అతీతంగా మొత్తం సమాజానికి, ఆ తర్వాత దేశమంతా విస్తరించి, చివరకు ప్రపంచం మొత్తాన్ని తనలోనే చూసుకోగలగాలి.
…శ్రీ సత్యసాయి బాబా, “పుట్టినది సేవ చేయడానికే” దివ్యవాణి, 1987నవంబర్ 19 http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf