Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 10 సంచిక 5
September/October 2019
అవలోకనం

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ఇటీవల , శ్రీకృష్ణ జన్మాష్టమిని మనము ఘనముగా జరుపుకున్నాము. త్వరలో గణేశ చతుర్ధీ వేడుకలలో పాల్గొనబోతున్నాము. ఈ సందర్భములో శుభాకాంక్షలు తెలుపుతూ, డా. అగర్వాల్ వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్స్ అందరూ తమ అంతిమ లక్ష్యాన్ని తమ దృక్పధములో వుంచుకొని, స్వీయ పరివర్తనపై దృష్టి పెట్టాలని కోరారు. వైబ్రియానిక్స్ సేవలో విజయము సాధించడానికి, మన అల్ప ప్రవుత్తులను ఉన్నత స్థాయికి గొనిపోవడానికి, స్వార్ధానికి అతీతముగా ఎదగడానికి, విశ్వ కల్యాణం కోసం, మనలో ప్రతి ఒక్కరిలో అంతర్లీనముగా ఉన్న స్వస్థత శక్తిని జాగృతము చేయడానికి ప్రయత్నించాలని, వీటిని సాధించడానికి సూచించిన విధముగా క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అనుసరించాలని, లక్ష్యముపై దృష్టి పెట్టి, సూత్ర నియమావళిని పాటించాలని డా. అగర్వాల్ తెలియజేశారు. వారు వైబ్రియానిక్స్ కు సంబంధించిన కొన్ని ఆధునిక విధానములను కూడా ప్రాక్టీషనర్స్ తో పంచుకున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఆసక్తికరమైన 10 కేసుల వివరాలను తెలియజేశారు. పిల్లిలో బలవంతముగా వెంట్రుకలు తినే వ్యాధి, సూక్ష్మ జాతి గులాబీ శీతా కాలములో వాడిపోవడం , మెడ వద్ద వెన్ను పూస క్షీణత, గర్భాశయ డిస్క్ లో మార్పులు, పునరావృత టైఫాయిడ్, ప్రాధమిక వంధ్యత్వమ్, ద్విద్రువ రుగ్మత, ( బై పోలార్ డిజార్డర్ ), ముఖం పై షింగిల్స్, వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ, నిద్రలో పళ్ళు కొరుకుట , ఋతుక్రమంలో అధిక రక్తస్రావం (మెనోరేజియా), దీర్ఘ కాలిక ముంజేయి మరియు మోకాలి నొప్పి.

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

ఇక్కడ ఇద్దరు వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్స్ ను పరిచయము చేస్తున్నాము. మొదటి వారు అర్హత, అనుభవము కలిగిన వొక ఫిజియో థెరపిస్ట్. వీరు చురుకైన బాల వికాస్ గురువు కూడా. అక్టోబర్ 2016 నుండి వీరు వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హృదయ స్పందనలను ఆలకించడానికి, జంతువులకు చికిత్స చేయడానికి, ఇంటి ఆవరణలో వికసిస్తున్న తోటను నిర్వహించడానికి, ప్రధానముగా వైబ్రియానిక్స్ ఆమెకు తోడ్పడింది. ఆసక్తితో, అంకిత భావముతో, వైబ్రియానిక్స్ పురోగతికి పాటు పడుతూ, వైబ్రియానిక్స్ నిర్వహణ సేవలో వీరు పాల్గొంటున్నారు. రెండవ వ్యక్తి జీవ వైవిధ్య మరియు అటవీ పర్యావరణ వ్యవస్థలలో నిపుణుడు. వీరు 2007 లో ప్రపధమముగా స్వామి వారి దర్శనము చేసుకున్నారు. అంతకు ముందే స్వామి వీరికి స్వప్న దర్శనమిచ్చి, మార్గ నిర్దేశం చేశారు. ఇది అతని యోచననే కాక , జీవిత గమనాన్నే మార్చింది; వేద మంత్రోచ్ఛారణ చేయడానికి, వేద మంత్రాలను ఫ్రెంచి భాషలోకి అనువదించడానికి అతనిని ప్రేరేపించింది. అంతరాత్మ ప్రబోధముతో అతను 2018 లో వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ అయ్యారు. వైబ్రియానిక్స్ రంగం అతనిలో ఆత్మావలోకనానికి, ప్రేమ భావముతో, మరింత మెరుగ్గా సమాజ సేవ చెయడానికి తోడ్పడింది.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్నలు జవాబులు

వ్యాధి నిరోధమునకు వైబ్రియానిక్స్ ను ఎలా ఉపయోగించాలో, ఇథైల్ ఆల్కహాల్ ను పొదుపుగా వినియోగించడం, రొగులు కొందరు ప్రాక్టీషనర్శ్ వారివద్దకు వెళ్ళాలని, లేదా రెమెడీని అందించాలని ఆశించినపుడు పరిస్థితిని ఏ విధముగా చక్క దిద్దుకోవాలో ఈ వార్తా లేఖలో తెలియజేశారు. ఇంకా, రొగులు ప్రాక్టీషనర్శ్ ను వైద్యునిగా సంబోధించినపుడు , ఏ విధముగా ప్రతిస్పందించాలో, మియాస్మ్ ను ఒంటరిగా గాని, కాంబోతో గాని ఎప్పుడు ఇవ్వాలో ఈ లేఖలో తెలియజేశారు.

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్యవాణి

ఆతృత, ఆందోళన, ఆహారపు అలవాట్లు హృద్రోగ వ్యాధులకు దారి తీస్తాయని చెబుతూ స్వామి వ్యాధి నివారణోపాయాలను కూడా తెలియజేశారు. భగవంతుడు వ్యక్తులలో పవిత్ర హృదయాన్ని, మనో నై ర్మల్యాన్ని, సత్సంకల్పముతో సేవలో పాల్గొనే అభిలాషను మాత్రమే చూస్తాడని స్వామి చెప్పారు.

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

క్రొయేషియా, యు.కె, ఫ్రాన్స్ మరియు భారతదేశం (పుట్టపర్తి) లో రాబోయే వర్క్‌షాప్‌లు గురించి తెలియపరిచాము.

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

అవగాహనతో సరియైన రీతిలో శ్వాసించండి’ అన్న మా ఆరోగ్య శీర్షికలో ఈ క్రింది విషయాలు చర్చించ బడ్డాయి . శ్వాస పై దృష్టి, సాధారణ శ్వాస ప్రక్రియ, ఆదర్శవంతమైన శ్వాస పౌనఃపున్యం, నాశికా శ్వాస యొక్క ప్రాముఖ్యత, నోటి శ్వాస వలన కలిగే దుష్ఫలితాలు, ప్రత్యామ్నాయ నాశికా శ్వాస ప్రక్రియ, డయాఫ్రగ్మాటిక్ శ్వాస చేసే విధానము, సూచనలు, పాటించవలసిన జాగ్రత్తలు, శ్వాస యోగము ద్వారా సత్య శోధన చేసి, జీవన్మరణ చక్రాన్ని దాటడం. అలాగే ఈ లేఖలో అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో జరిగిన అవగాహనా కార్యక్రమాన్ని వివరించారు. పుట్టపర్తిలో జరిగిన ఏవీ పీ వర్క్ షాప్, భిల్వారా, రాజస్థాన్ లో ప్రాక్టీస్ చేస్తున్న వారి సేవలు ఇక ముందు కూడా కొనసాగడానికి, మారు మూల ప్రాంతాలలో ప్రాక్టీస్ చేస్తున్న వారి సేవల నాణ్యతను పెంచి, ప్రస్తుతము అనుసరిస్తున్న కఠిన నిబంధనలకు అనుగుణమైన స్థాయికి తీసుకు రావాడానికి హిందీలో నిర్వహించిన వర్క్ షాప్ వివరాలు పొందుపరచబడ్డాయి.

పూర్తి వ్యాసం చదవండి