ప్రశ్నలు జవాబులు
Vol 10 సంచిక 5
September/October 2019
1. వైబ్రో ఉపయోగించి వ్యాధి నుండి నయం అయిన ఆరోగ్యకరమైన రోగులలో వ్యాధులు రాకుండా నివారించడానికి నేను వైబ్రియోనిక్స్ ని ఎలా ఉపయోగించగలను?
జవాబు: శ్రీ సత్యసాయి బాబా తన ప్రసంగాలలో తరచుగా నొక్కిచెప్పినట్లుగా వ్యాధి నివారణ చాలా ముఖ్యం. అభ్యాసకుడు తన రోగులకు వైబ్రియోనిక్స్ లో ఉన్న వ్యాధినిరోధక శక్తిని పెంచే రెమెడీ గురించి మరియు అది వ్యాధి నయం అయినప్పుడు వాడటానికి సరైన సమయం అని తగిన విధంగా తెలియజేయాలి. వారికి CC12.1 Adult tonic ఒక నెల, తరువాత నెల CC17.2 Cleansing మరలా CC12.1 Adult tonic ఒక నెల, తరువాత నెలలో CC17.2 Cleansing ఇలా ఒక సంవత్సరం పాటు ఇవ్వవచ్చు. ఈ నివారణ సైకిల్ యొక్క మోతాదు రెండవ సంవత్సరంలో BD కి మరియు మూడవ సంవత్సరంలో OD కి తగ్గించవచ్చు. రోగి మధ్యలో ఏదైనా వ్యాధికి గురైతే, వ్యాధికి తగిన రెమెడీ ఇచ్చి ప్రక్షాళన సైకిల్ కొనసాగవచ్చు, కాని 2 రెమెడీలు తీసుకునే మధ్య ఒక గంట వ్యవధి ఉండాలి. లేదా ప్రత్యామ్నాయంగా, మీరు ప్రక్షాళన సైకిల్ ఆపివేసి, వ్యాధి తీవ్రత తగ్గే వరకు వ్యాధికి మాత్రమే అదనపు రెమెడీను ఇవ్వవచ్చు మరియు తరువాత ప్రక్షాళన సైకిల్ తిరిగి ప్రారంభించవచ్చు. రోగి తన ఆరోగ్యకరమైన కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను కూడా ఇటువంటి నివారణ చికిత్స గురించి చెప్పి ఒప్పించటానికి ప్రేరేపించవచ్చు.
______________________________________
2 . మా దేశంలో ఇథైల్ ఆల్కహాల్ సులభంగా దొరకనందున నేను ఇథైల్ ఆల్కహాల్ వాడకాన్ని ఎలా తగ్గించగలను?
జవాబు: మా వార్తాలేఖ యొక్క వాల్యూమ్ 10 # 2 లో )క్రింద ఇవ్వబడిన లింక్ ),20 మి.లీ (2 డ్రామ్) బాటిల్ మాత్రలకు 1 చుక్క ఆల్కహాల్ సరిపోతుందని వివరించబడింది. అయినప్పటికీ, కొంతమంది అభ్యాసకులు ఒకటి కంటే ఎక్కువ చుక్కలను జోడించడం వల్ల వేగంగా ఫలితాలు వస్తాయని తప్పుగా అనుకుంటున్నారు; దీనివలన ఎక్కువ ఆల్కహాల్ మాత్రమే ఖర్చు అవుతుంది. వైబ్రేషన్ అనేది స్వచ్ఛమైన శక్తి అది గుణాత్మక స్థాయిలో పనిచేస్తుంది. వ్యాధి అత్యంత తీవ్రంగా ఉన్న పరిస్థితులలో, మీరు నివారణ చేయడానికి ఒక చుక్కను నేరుగా 200 మి.లీ నీటిలో చేర్చవచ్చు. క్యాంప్ నిర్వహించవలిసిన పరిస్థితులలో ఒకే వ్యాధికి ఎక్కువ బాటిల్స్ అవసరమైనప్పుడు, 450 గ్రాముల మాత్రలకు (ఒక ప్యాకెట్) కేవలం 15 చుక్కల కాంబోను జోడించవచ్చు. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202019-03%20Mar-Apr%20HS.pdf
______________________________________
3. తెలిసిన రోగులు, బంధువులు, స్నేహితులు లేదా ఉన్నత కార్యాలయం లేదా హోదాను కలిగి ఉన్నవారు, చికిత్స ఆశిస్తున్నప్పుడు లేదా చికిత్స కోసం వైద్యుడు వారిని సందర్శించాలని అనుకున్నప్పుడు పరిస్థితిని ఎలా పరిష్కరించాలి?
జవాబు: ఇది అంత తేలికైన పరిస్థితి కాదు, కానీ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన సవాలు. ప్రతి సమస్యకు పరిస్కారం ఉంది. అన్నింటికంటే ముఖ్యముగా, ప్రతి పరిస్థితిని మనం అప్రమత్తమైన మనస్సుతో, దయగల హృదయంతో చూడాలి. అదే సమయంలో, అభ్యాసకులుగా మన వృత్తిని మనం గౌరవిస్తూ క్రమశిక్షణకు కట్టుబడి రోగిని వ్యక్తిగతంగా చూడవలసి ఉంటుంది, అది క్లినిక్ వద్ద (అది ఇంట్లో ఉండవచ్చు (మరిఎక్కడైనా క్రమం తప్పకుండా రోగులను చూసే నిర్ణీతప్రదేశంలో అయి ఉండాలి. ఇంకా, రోగి వివరాలకు సంబందించిన రికార్డును సరిగ్గా నిర్వహించాలి, రెమెడీ జాగ్రత్తగా తయారుచేయాలి మరియు మొదటి మోతాదును ప్రేమగా మరియు ప్రార్థనతో అందించాలి. రోగి అభ్యాసకుడిని సందర్శించాలి అనే సాధారణ ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వ్యక్తి డిమాండ్ ఉన్నప్పుడు, క్రమం తప్పకుండా రోగులను చూసే నిర్ణీతప్రదేశాన్ని సందర్శించడానికి వారిని మనం మర్యాదపూర్వకంగా ఆహ్వానించవచ్చు, తద్వారా వారికి సరైన చికిత్సను చేయవచ్చు. మనం ప్రార్థన చేసి, దేవునితో కనెక్ట్ అయ్యి మరియు ఆయనను మన ద్వారా పనిచేయడానికి అనుమతించినప్పుడు, ఆయన ఏమిచేయాలో స్పష్టత ఇస్తాడు. ఎప్పుడు క్రమశిక్షణను కఠినంగా పాటించాలో మరియు ఎలాంటి పరిస్థితులలోనైనా మన వృత్తిపరమైన ప్రమాణాలు లేదా నీతి విషయంలో రాజీ పడకుండా అటువంటి రోగులను భిన్నంగా ఎలాచూడగలమో మనకి తెలుస్తుంది. తప్పుడు మార్గాలను ఏర్పరచుకోవద్దని మరియు అందులో పడకూడదని మనం గుర్తుంచుకోవాలి.
______________________________________
4 . రోగులు నన్ను “డాక్టర్” అని సంబోధించినప్పుడు నా విధానం ఏమిటి, నేనుఎలా సమదాన పడగలను?
జవాబు: రోగి సాధారణంగా వ్యాధి నుండి ఉపశమనం పొందటానికి అభ్యాసకుడిని సందర్శిస్తాడు. అతనికి, అభ్యాసకుడు తను విశ్వసించే డాక్టర్ కంటే తక్కువ కాదు అనే నమ్మకం ఉంటుంది. అందువల్ల, మనలను సంప్రదించిన వారి విశ్వాసానికి భంగం కలిగించేలా మనం ఏమీ చెప్పకూడదు లేదా చేయకూడదు. అదే సమయంలో మనకై మనం డాక్టర్ గా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కనబడటానికి ప్రయత్నించకూడదు. మనం దేవునికి వినయపూర్వకమైన సాధనంగా పనిచేస్తున్నందున రోగి వ్యక్తం చేసిన ఎటువంటి ప్రశంసలు అయినా సరే మన లోపలవున్న ప్రభువుకు సమర్పించాలి.
______________________________________
5. కొన్నిసార్లు మియాజమ్ కాంబోతో పాటు మరియు కొన్నిసార్లు కాంబోకు ముందు మరియు తరువాత 3 రోజుల గ్యాప్‌తో మియాజమ్ ఒక్కటే సిఫార్సు చేయబడుతుంది? దయచేసి దీని గురించి వివరణ ఇవ్వగలరు.
జవాబు: ప్రతి మియాజం శరీరంలోని అనేక వ్యాధులకు సంబందించిన మూలాన్ని కలిగి ఉంటుంది. మనలో చాలా మందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మియాజమ్ నిద్రాణంగా ఉంటాయి, అవి జీవనశైలి సరిగ్గా లేకపోవటం మరియు మానసిక వ్యతిరేక విధానాల వల్ల బయటపడవచ్చు. ప్రతి మియాజం రెమెడీ లోతుగా పనిచేయటం వల్ల పుల్లౌట్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఒక సమయంలో ఒకే మియాజం ఉపయోగిస్తారు మరియు ఒక వ్యక్తి అన్ని విధాలా మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వబడుతుంది. దీనికి ముందు, సమర్ధవంతంగా పనిచేయడానికి తగిన భూమిక కోసం SR218 Base Chakra 7 రోజులు పాటు OD గా ఇవ్వడం మంచిది. అలాగే, మియాజం ప్రారంభించడానికి 3 రోజుల ముందు అన్ని ఇతర రెమెడీలు ఆపివేయబడతాయి మరియు మియాజం మోతాదు ఇచ్చిన వారం తరువాత మాత్రమే రెమెడీలు కొనసాగుతాయి. ఈ జాగ్రత్తలన్నీ మియాజం దాని ప్రయోజనాన్ని సాధించడానికి సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాధి లక్షణాలు తగ్గించటానికి అవకాశం లేనప్పుడు, ఒక వ్యాధి చికిత్సకు సహాయపడటానికి ఇతర నివారణలతో ఏకకాలంలో ఒక మియాజం ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ, పుల్లౌట్ కి చాలా తక్కువ అవకాశం ఉంది. 108 సిసి పెట్టెలోని చాలా కాంబోలలో కొన్ని వ్యాధుల నుండి పుల్లౌట్ రాకుండా ఉపశమనం కలిగించడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మియాజం లు ఉన్నాయి. ఇవి అన్నిరకాల క్యాన్సర్లు మరియు కణితులు, అన్ని రకాల అంటువ్యాధులు వ్యాధినిరోదక శక్తి లేకపోవటం వల్ల వచ్చే వ్యాధులు, మానసిక సమస్యలు, మెదడులో లోపాలు పక్షవాతం మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధులను విస్తృతంగా కవర్ చేస్తాయి.