దివ్య వైద్యుని దివ్యవాణి
Vol 10 సంచిక 5
September/October 2019
“గుండె జబ్బులకు కారణం ఏమిటి ? చాలామంది వైద్యులు ధూమపానం, కొవ్వుపదార్థాలు తీసుకోవడం, అతిగా తినటం మరియు ఇతర అలవాట్లు అని చెప్తూ ఉంటారు. ఆహారము మరియు అలవాట్ల మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. భౌతిక శరీరం మరియు అంతర్గత భావాలు అనగా ఆత్మ మధ్య సమతుల్యత ఉండేలా మనం చూడాలి. ఆధునిక మనిషి నిరంతరం ఆతృతతో ఉంటాడు ఈ ఆత్రుత ఆందోళన అవుతుంది ఇది శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది గుండె సమస్యలకు ప్రధాన కారణం హర్రీ, వర్రీ, కర్రీ లేదా ఆతృత, ఆందోళన, కూర (కొవ్వు పదార్థాలు )అని చెప్పవచ్చు."
... సత్యసాయిబాబా వారి సమగ్ర వ్యాధి నివారణ విధానం దివ్యవాణి 1993 ఫిబ్రవరి 6
http://www.sssbpt.info/ssspeaks/volume26/sss26-04.pdf
"దేవుడు మిమ్మల్ని ఎప్పుడు, ఎక్కడ సేవ చేశారు అని ప్రశ్నించడు, మీరు ఏ భావంతో సేవ చేశారు, మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏమిటి అనే అడుగుతాడు. మీరు సేవ పరిమాణాన్ని దాని గురించి ప్రగల్భాలు పలకవచ్చు. కానీ దేవుడు మీ హృదయ పవిత్రతను మనసు యొక్క స్వచ్ఛతను సంకల్పం యొక్క పవిత్రతను మాత్రమే చూస్తాడు."
... సత్య సాయి బాబా సేవా సమితి పై పాఠాలు దివ్యవాణి 19 81 నవంబర్ 19
http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-31.pdf