Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 10 సంచిక 5
September/October 2019


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

జన్మాష్టమి, అనగా భగవంతుడైన కృష్ణుడి పుట్టినరోజును, ఇటీవలే నిర్వహించుకోవడం జరిగింది. ప్రస్తుతం గణేష్ చతుర్థి మరియు ఓణం పండుగలు, ప్రశాంతి నిలయంలో అంగరంగ వైభోగంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రత్యేక ఉత్సవాల ద్వారా, మనలో ఉండే దివ్యత్వం యొక్క అందాన్ని వైభవాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటాం. స్వామి మాటలలో “శ్రీకృష్ణ అవతారం ప్రపంచానికి ఒక శాశ్వతమైన సందేశాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడినది. కృష్ణుడు తన కోసం ఏమి కోరుకోలేదు. అలాగే తన కోసం ఏమీ దాచుకోలేదు. అంతా ప్రజలకి ధార పోసాడు. కృష్ణుడు కిరీటం లేని రాజు, రాజులకే రాజు. కృష్ణుడికి సొంత రాజ్యం అంటూ ఏదీ లేదు కానీ  లక్షలాది మంది ప్రజల హృదయాలను పరిపాలించారు. ఈ అద్భుతమైన సత్యాన్ని కృష్ణ తత్వం ప్రకటిస్తుంది. మీరు లోతుగా విచారిస్తే, ప్రతీ అవతారం మానవాళికి ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వడానికి మరియు నిర్దిష్ట లక్ష్యాన్నినిర్వహించడానికి భూమిపైకి వచ్చిందని కనుగొనగలరు” -- జన్మాష్టమి సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఉపన్యాసం సెప్టెంబర్ 1996.

గణేశుడు మేథస్సు మరియు ఆత్మ సాక్షాత్కారానికి ప్రభువు, అన్ని అడ్డంకులను తొలగించేవాడు మరియు జ్ఞానానికి అధిపతి అయిన విద్యా స్వరూపుడు ఇతడే. అన్ని బాధలను మరియు ఇబ్బందులను తొలగించి స్వచ్ఛమైన హృదయం తో తనను ప్రార్థించే వారికి శాంతిని మరియు ఆనందాన్ని ఇస్తాడు.

ప్రియమైన అభ్యాసకులారా, మన వైబ్రియానిక్స్ సేవలో విజయం సాధించాలంటే, మనల్ని మనం పరివర్తన అనే సముద్రంలో ముంచి  తేల్చాలి. మనలోని  ప్రతీ ఒక్కరిలో ఉన్న హీలింగ్ పవర్ ను ప్రవహింప చేయడానికి ఇది ఉత్తమమైన మార్గం. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి మనము SAI అనే మాట లేదా మంత్రం కన్నాఎక్కువ చూడవలసిన అవసరం ఏదీలేదు ---“S” అంటే స్పిరిట్యువల్ అనగా ఆధ్యాత్మిక మార్పు, “A” అంటే అసోసియేషన్ లేదా సంఘంలో మార్పు,” I “ అంటే నేను అనగా వ్యక్తిగత మార్పు. కాబట్టి ఇది ఈ మూడింటి  పరివర్తన యొక్క ప్రక్రియ. ఈ విధంగా మనం స్వార్ధాన్ని విడనాడి మనలో ఉన్న పశు లక్షణాలను దూరం చేసుకుని విశ్వ శ్రేయస్సుకోసం అనంతమైన మూలము నుండి శక్తిని మన ద్వారా ప్రవహింప చేయవలసిన ఆవశ్యకత ఉంది. 

స్వామి ఏం చెప్పారంటే “ఆత్మ సాక్షాత్కారం మానవ ఉనికి యొక్క లక్ష్యం. ఇది ఆత్మ విశ్వాసం, ఆత్మ సంతృప్తి, మరియు త్యాగం అనే మూడు దశల ద్వారా చేరుకోవాలి.” -- కొడైకెనాల్ లోని సాయి శృతి లో 12 ఏప్రిల్ 1996 న చేసిన ప్రసంగం నుండి. ఈ సందర్భంగా నేను నా స్వీయ అనుభవాన్ని మీతో పంచుకోదలిచాను. స్వీయ క్రమశిక్షణ తో కలిపి అంకితభావంతో చేసే సేవ --అభ్యాసకుడికి మరియు రోగికి కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. దీన్ని ఆచరణలో పెట్టాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అనుసరించాల్సి ఉంటుంది -- అనగా నిర్ణీత సమయంలో ధ్యానం చేయడం, నియంత్రిత సమయంలో నిస్వార్థ సేవ చేయడం, ప్రిస్క్రిప్షన్ ప్రకారము ఖచ్చితంగా వైబ్రియనిక్స్ రెమెడీనిను మనకు మనమే తీసుకోవటం, మన పురోగతి మరియు విజయాలను రికార్డు చేయడం, రోజూ వ్యాయామం చేయడం, నియంత్రిత ఆహారము మరియు శారీరక విశ్రాంతి మరియు నిద్ర, వర్తమానంలో జీవించడం మొదలగున్నవి. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నియమాలతో జీవితం గడపడం గురించి నేను నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు ప్రతీ ఒక్కరికి సాధారణ - ప్రాతిపదిక అయ్యింది.

మన వైబ్రియానిక్స్ మిషను కు సంబంధించిన, కొన్ని కొత్త పోకడలను మీతో పంచుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైబ్రియానిక్స్ పైన అవగాహన పెరుగుతోంది. ఇప్పటివరకు ఆఫ్రికా ఖండంలో మనకు చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండేది కానీ ఈ సారి గురుపూర్ణిమ అనంతరం ఏర్పాటు చేసిన AVP వర్క్ షాప్ లో శిక్షణ  పొందటానికి గాబాన్, బెనిన్, మరియు దక్షిణ ఆఫ్రికా నుండి అభ్యాసకులు రావడం ఒక పెద్ద మార్పు గా భావిస్తున్నాను. అనేకమంది అభ్యాసకులు మన యొక్క వార్తాలేఖ లో “అదనంగా అనే” విభాగంలో “ఇన్స్పిరేషనల్ కార్నర్” పరిచయం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు, అక్కడ వారు తమ జీవితంలో పొందిన అసాధారణ అనుభవాలను (ఇవి రోగ చరిత్రలు కాదు) పంచుకోవచ్చు. స్వామి ప్రదర్శించిన లీలలు గాని లేదా వైద్యానికి సంబందించిన అద్భుతాలు కానీ ఫోటోలను కానీ మాతో పంచుకోండి. అభ్యాసకులు తమ అద్భుత అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతర అభ్యాసకులకు ప్రేరణాత్మకముగా ఉండాలన్నదే ఈ విభాగం యొక్క ప్రధాన ఉద్దేశ్యము. అభ్యాసకులను పెంచుకోవడం కోసం మరియు మన మిషన్నువిస్తృతపరిచే ఉద్దేశ్యంతో వైబ్రియానిక్స్ పుస్తకాలను అనేక భారతీయ భాషల్లోకి అనగా హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ భాషలోనికి అనువాదం చేయడం కూడా కొనసాగుతోంది. ఈ స్థితిలో అభ్యాసకులునుండి ఇటువంటి సేవ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.

మన ప్రియతమ అభ్యాసకులు తాము చేసే నిస్వార్థ సేవా యత్నంలో  సఫలీకృతులు కావాలని ఆకాంక్షిస్తూ నేను పైన తెలిపిన విషయాలకు ముగింపునిస్తున్నాను. స్వామి మీకు ఎంతో ఆనందాన్ని చక్కటి ఆరోగ్యాన్ని ఆత్మ వికాసాన్ని అందించాలని కోరుకుంటూ!

 ప్రేమతో సాయి సేవలో మీ

జిత్. కె. అగర్వాల్