Vol 7 సంచిక 3
May/June 2016
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
సహాయం కొరకు మార్చ్/ఏప్రిల్ వార్తాలేఖలో మేమిచ్చిన పిలుపుకు అద్భుతమైన ప్రతిస్పందన లభించిందని అపారమైన ఆనందంతో తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా భారతదేశం, UK మరియు USA నుండి అధిక సంఖ్యలో చికిత్సా నిపుణులు వైబ్రియానిక్స్ సాధనకు అత్యవసరమైన పరిపాలనా సంభందిత కార్యక్రమాల కోసం వారి సేవలను అందచేయుటకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో నేను, పరిపాలనా సంభందిత సేవను అందచేయడానికి నూతన మరియు అనుభవంగల స్వచ్ఛంద సేవకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతా భావాన్నితెలుపుకుంటున్నాను.
మన వైబ్రియానిక్స్ సమూహంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్సా విధానంపై అవగాహన కూడా పెరుగుతున్న కారణంగా, పరిపాలన(అడ్మిన్) సంభందిత సేవలను అందచేయడానికి మాకు అధిక సంఖ్యలో స్వచ్చంద సేవకుల అవసరం ఉండవచ్చు. ప్రత్యేక సేవల గురించి కనుగొనడంలో ఆశక్తి ఉన్న చికిత్సా నిపుణులు [email protected] ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.
సహకారం యొక్క శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని మేము ప్రపంచ వ్యాప్తంగా రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించాము:
- చికిత్సా నిపుణులకు అవసరమైన ప్రేరణ మరియు ప్రోత్సాహాన్ని అందచేసే ఉద్దేశంతో మేము వార/ నెలవారీ సమావేశాలు, వ్యక్తిగతంగా లేదా/మరియు వీడియో సమావేశం (స్కైపు ద్వారా). రోగ చరిత్రలను మరియు సందేహాలు/ప్రశ్నలను ఇతర నిపుణులతో చర్చించడానికి, భారత దేశం, UK మరియు USA లో చికిత్సా నిపుణుల సమూహాలు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ స్థానిక బృందాలు, సభ్యుల సమస్యలు/సందేహాలు తీర్చడానికి మద్దతు అందచేయడమే కాకుండా పరిశోధన కూడా నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమం అందరికి ముఖ్యంగా, అనుభవయుక్త చికిత్సా నిపుణుల సహాయం ఎక్కువ అవసరమున్న నూతన చికిత్సా నిపుణులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాను.
- రెండవ నూతన పదకమైన, వైబ్రియానిక్స్ ప్రసరణ నెట్‌వర్క్, మన USA మరియు కనడా సమన్వయకర్తచే 01339 ప్రారంభించ పడుతోంది. SRHVP మశీను ఉన్న స్వచ్చంద చికిత్సా నిపుణులు AVP లు మరియు VP లతో కలిసి, స్వస్థముచేసే(హీలింగ్) వైబ్రేషన్లను, వైబ్రో మందులను తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న రోగులకు (ఆశ్పత్రిలో అడ్మిట్ అయ్యున్నవారు, అపస్మారక స్తితిలో ఉన్నవారు, దుర్బల స్థితిలో ఉన్నవారు లేదా సుదూర ప్రాంతాలలో ఉన్నవారు) ప్రసరణ ద్వారా అందచేస్తారు.
సహభాగిత సమావేశాలు నిర్వహించేందుకు మరియు ప్రసార నెట్వర్క్ సంభందించిన ప్రక్రియ మరియు ఫలితాలను తెలుసుకొనేందుకు అవసరమైన మార్గదర్శకాలను అభివృద్ధి చేసే పని ప్రారంభమైనది. ఈ ప్రథమ యత్నం నుండి ఆసక్తికరమైన మరియు అత్యంత లాభదాయకమైన ఆలోచనలు పుట్టుకొస్తాయని మము బలంగా నమ్ముతున్నాము.
ఇది వైబ్రియానిక్స్ కి ఒక ఉత్తేజకమైన సమయము మరియు వైబ్రియానిక్స్ లో జరుగుతున్న పరిణామాలను మీయందరికీ తెలియచేయడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ఇతర దేశాల్లో నకలు చేసే ఉద్దేశంతో, పైనిచ్చియున్న కార్యక్రమాల పురోగతిని, తదుపరి వార్తాలేఖలో నివేదించడానికి నేను ఎదురుచూస్తున్నాను.
శాశ్వతంగా మా సారథియై యుండాలని ప్రియమైన స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
మీ అందరికి ప్రేమను మరియు కాంతిని పంపిస్తూ,
ప్రేమపూర్వకంగా సాయి సేవలో,
జిత్ కే అగ్గర్వాల్
ల్యుకేమియా (పాండురోగం) 10728...India
ఒక 21 సంవత్సరాల వైద్య విద్యార్ధి, ఆమ్లపిత్తము (ఎసిడిటీ), నిద్రలేమి, విపరీతమైన నీరసం మరియు భరువు కోల్పోవడం వంటి లక్షణాలతో భాధపడేది. ఆశ్పత్రిలో చేసిన రక్త పరీక్షల ద్వారా ఆమెకు ల్యుకేమియా వ్యాధి (పాండురోగం) ఉందని నిర్ధారించబడింది. ఈ క్యాన్సర్ నాలుగవ స్థాయికి చేరుకుందని తెలిసింది. రోగి యొక్క రక్తవర్ణం మరియు రక్త(కణ)పట్టికల సంఖ్య అతి తక్కువగా ఉంది. ఆమె ఎక్కువ కాలం జీవించి యుండడం కష్టమని వైద్యులు విషాదభరితమైన నిరూపణ చేసారు. ఆమె ఎక్కువ కాలం జీవించియుండడం అసాధ్యమని వైద్యులు చెప్పడంతో, లండన్లో చదువుకుంటున్న రోగి యొక్క సోధరుడను పిలిపించారు. ఆశ్పత్రిలో ఉన్న రోగి తన మంచం నుండి క్రిందకు దిగలేక పోయేది. రోగి యొక్క తండ్రి వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. 2015 నవంబెర్ 13న రోగికి క్రింది మందులు ఇవ్వడం జరిగింది
ల్యుకేమియా సమస్యకు:
#1. CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC3.1 Heart tonic + CC3.2 Bleeding disorders + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic...QDS
అసిడిటీ మరియు బలహీనత సమస్యకు:
#2. CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS
నిద్రలేమి సమస్యకు:
#3. CC15.6 Sleep disorders + CC18.1 Brain disabilities...half an hour before going to bed, and again just before going to bed.
నవంబెర్ 30 న, రోగికి భగంధరము సమస్య మొదలైందని రోగి యొక్క తండ్రి తెలపడంతో క్రింది మందులు ఇవ్వబడినాయి:
భగంధరము సమస్యకు (ఆనల్ ఫిస్టులా) :
#4. CC4.4 Constipation + CC13.3 Incontinence...QDS
ఒక నెల రోజులలో భగంధరము సమస్య పూర్తిగా నయమవ్వడంతో, #4 మందు క్రమంగా ఆపివేయబడింది. డిసెంబెర్లో చలి కాలం రావడంతో, రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. ఈ కారణంగా, డిసెంబెర్ 9న క్రింది మందులు అదనంగా ఇవ్వబడినాయి:
శ్వాస సమస్యకు:
#5. CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic...QDS
ఆకలి లేకపోవడం సమస్యకు:
#6. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS
ఒక నెల లోపున రోగి యొక్క శ్వాస సమస్య పూర్తిగా తగ్గి ఆమె ఆకలి కూడా పెరిగింది. #5 మరియు #6 మందులను ఆపివేయడం జరిగింది.
2015 జనవరిలో రోగిని కాన్సెర్ ఆశ్పత్రిలో చేర్చారు. రోగికి రసాయనచికిత్స (కీమోతెరపి) మరియు ఎముక మజ్జ మార్పిడి జరిగింది. దీని కారణంగా రోగి చాలా బలహీనపడింది. అదే సమయంలో రోగికి జుట్టు రాలిపోయింది. ఆశ్పత్రిలో చికిత్స పొందిన సమయంలో రోగి #1, #2 మరియు #3 తీసుకోవడం కొనసాగించి వేగంగా కోలుకుంది. ఆమె జుట్టు తిరిగి పెరగడం మొదలైంది. ఆశ్పత్రి నుండి డిశ్చార్జ్ చేయబడి ఏప్రిల్ లో రోగి ఆమె సొంతూరు చేరుకుంది. ఏప్రిల్ 4న చేసిన స్క్రీనింగ్ పరీక్షల్లో రోగి యొక్క రక్త(కణ)పట్టికల మరియు రక్తవర్ణ సంఖ్యలలో అభివృద్ధి కలిగింది. రోగికి నిద్రలేమి సమస్య పూర్తిగా తగ్గడంతో, #3ను ఆపివేయడం జరిగింది. గతంలో తప్పిపోయిన కళాశాల పరీక్షలను రాయగలిగింది. ఆగస్ట్ లో కళాశాల తరగతులకు హాజరు కావటం ప్రారంభించి, ఆమె వైద్య శిక్షణను కొనసాగించింది. 17 సెప్టెంబర్ న చేయబడిన పరీక్షల్లో కాన్సెర్ కణాల చాయ మాత్రమైనా కనపడలేదు. రక్తవర్ణ స్థాయి మరియు రక్త కణాల సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంది. ఈ కారణంగా #1 మరియు #2 BD గా తగ్గింపబడింది. పూర్తిగా కోలుకున్న ఆ మహిళ మరియు ఆమె తల్లి తండ్రులు క్రుతజ్ఞ్యతతో సాయి మందిరంలో క్రమముగా జరపబడే భజనల్లో పాల్గొనడం ప్రారంభించారు. డిసెంబెర్ 30న, ఈ మహిళ తన తల్లి తండ్రులతో పాటు నూతన సంవత్సర వేడుకలు చూడడానికి పుట్టపర్తికి వచ్చింది. ఈమె పర్తిలో పది రోజులు సేవ చేసింది. 2016 జనవరిలో #1 మరియు #2 యొక్క మోతాదు వారానికి మూడు సార్లు కి(3 ) తగ్గించ బడింది. ప్రతి నెల ఈ మహిళ చేయించుకున్న స్క్రీనింగ్ పరీక్షల నివేదికలు సాధారణంగానే ఉన్నాయి. 2016లో ఈమె జుట్టు తిరిగి పూర్తిగా పెరగడమే కాకుండా ఈమె పూర్తి స్వస్థతను పొందింది. దీని కారణంగా ఈమెకు వైబ్రో చికిత్స పూర్తిగా ఆపివేయబడింది.
రక్తప్రదరము, గర్భాశయ కణితి 10728...India
గత ఆరు నెలలుగా తీవ్ర రక్తప్రదరము (మేనోర్ర్హేజియా) సమస్యతో భాదపడుతున్న ఒక 48 ఏళ్ళ మహిళ, 2013 జూన్ లో వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఆమె జూన్ నెలంతా నొప్పితో కూడిన తీవ్ర రక్తస్రావంతో భాధపడింది. పరిశోధనల ద్వారా ఆమె గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఉన్నాయని, శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించాలని వైద్యులు సలహా ఇచ్చారు. శస్త్రచికిత్స చేయించుకోకుండా వైబ్రియానిక్స్ చికిత్సను ఎంచుకుంది. ఆమె ప్రయాణం చేసేవంటి పరిస్థితిలో లేన కారణంగా, మొదటి నియామకమునకు ఆమె యొక్క భర్త రావడం జరిగింది. చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇచ్చారు:
#1. CC10.1 Emergencies. రోగి యొక్క భర్తకు, తమ ఇల్లు చేరుకున్న వెంటనే ఆమె నోటిలో ఒక డోస్ వేయవలసిందిగా చెప్పబడింది.
#2. CC8.4 Ovaries & Uterus + CC8.6 Menopause...QDS
#3. CC20.6 Osteoporosis...QDS
రుతువిరతి కారణంగా బోలో ఎముక సమస్య (ఆస్టియోపోరోసిస్) కలుగుతుంది కాబట్టి #3 ఇవ్వబడింది.
ఈ చికిత్స తీసుకున్న రెండు నెలల తర్వాత ఆమె రుతుక్రమం పూర్తిగా ఆగిపోయింది. ఆపై చేసిన స్కాన్ పరీక్షల్లో ఫైబ్రాయిడ్లు తొలగిపోయాయని తెలిసింది. ఆమె గర్భాశయాన్ని తొలగించే అవసరం లేదని వైద్యులు చెప్పారు. పూర్తిగా నయంకావడంతో ఆమె చాలా ఆనందించింది మరియు ఎంతో ఉత్సాహంతో తన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
సంతానం లేమి 10728...India
వివాహం జరిగి ఎనిమిది సంవత్సరాలైనా సంతాన ప్రాప్తి లేకుండుట కారణంగా ఒక జంట 2014 మార్చ్ 14న చికిత్సా నిపుణుడను సంప్రదించడం జరిగింది. ఆరోగ్య సమస్యలు ఏమిలేని ఆ మహిళ వయసు 34 సంవత్సరాలు. వివాహం అయిన కొంత కాలానికి ఆమె గర్భం ధరించింది కాని గర్భస్రావం జరిగింది. ఆపై ఆమె తిరిగి గర్భవతి కాలేక పోయింది. ఆమె భర్త యొక్క కుటుంభ సభ్యులు, లోపం ఆమెలోనే ఉందని అగుపించడంతో ఆమె చాలా ఒత్తిడికి గురియైంది. వైధ్యుడను సంప్రదించడంతో ఆమె ఆరోగ్యకరంగా ఉన్నట్లు , 45 ఏళ్ళ ఆమె భర్తకు వీర్యకణాల సంఖ్య తక్కువ ఉన్నట్లు వెల్లడైంది. అతను మధుమేహం సమస్య నియంత్రణకు అల్లోపతి మందులు వాడేవాడు. క్రింది మందులు వారిద్దరికి ఇవ్వబడినాయి:
భార్యకు:
#1. CC8.4 Ovaries & Uterus + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS
భర్తకు:
#2. CC12.1 Adult tonic + CC14.3 Male infertility + CC15.1 Mental & Emotional tonic...QDS
2015 జనవరి 15న చేసిన పరీక్షలో ఆమె గర్భావతియని తెలిసింది. ఎంతో ఆనందించిన ఆ జంటను, చికిత్సా నిపుణుడు #1 మరియు #2 నిలిపివేయమని చెప్పారు. భార్యకు క్రింది మందులు ఇవ్వబడినాయి:
గర్భధారణ మరియు వికారము కోసం:
#3. CC8.2 Pregnancy tonic + CC8.9 Morning sickness + CC15.1 Mental & Emotional tonic...QDS
ఆమెకు గర్భధారణ సునువుగా కొనసాగింది. 2015 ఆగస్ట్ 27న, ఈ జంట ఎంతో ఆనందించే విధంగా ఒక ఆరోగ్యకరమైన శిశువు సాధారణ ప్రసవం ద్వారా జన్మించింది. దీని తర్వాత #3 నిలిపి వేయబడింది. తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంత అద్భుతమైన వరాన్ని ప్రసాదించినందుకు ఆ జంట సాయి వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు
తలలో పేల సమస్య 11573...India
గత ఆరు నెలలుగా పేలు సమస్యతో 13 మరియు 9 సంవత్సరాలు వయసుగల ఇద్దరు సోదరీమణులు, 2015 జూన్ ఐదున చికిత్సా నిపుణుడను సంప్రదించారు. వారికి వివిధ రకములైన నివారణలు ఉపయోగించినప్పుడు ఫలితం లభించలేదు. వీళ్ళకి క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
CC11.2 Hair problems + CC12.2 Child tonic…TDS
పదిహేను రోజుల్లోనే మెరుగుదల కనపడింది. ఆపై వారం రోజులకి సోదరీమణులు ఇద్దరికి పేల సమస్య పూర్తిగా తొలగిపోయింది. మరో వారం రోజులు చికిత్సను కొనసాగించిన తరవాత నిలపడం జరిగింది. ఇప్పటివరకు వారిద్దరకి తిరిగి పేల సమస్య రాలేదు.
మదుమేహ సంభందిత దద్దుర్లు 03516...Canada
మూడు సంవత్సరాలకు పైగా, చర్మంపై మధుమేహం కారణంగా వచ్చిన ధద్దుర్లతో భాదపడుతున్న ఒక 66 ఏళ్ళ వ్యక్తి, 2015 జనవరి 15న చికిత్సా నిపుణుడను సంప్రదించారు. అనేక భాగాలలోనున్న దద్దుర్లు ఎర్రగాను మరియు చీముతో నిండినవిగాను ఉండేవి. అల్లోపతి వైధ్యులచే ఇవ్వబడిన వివిధ పైపూత మందుల ద్వారా ఉపశమనం కలగలేదు. ఈ రోగికి దురద మరియు నొప్పి కారణంగా చాలా ఇబ్బంది కలిగేది. స్వామి, వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని ఆశీర్వదించారని, చికిత్సా నిపుణుల ద్వారా తెలుసుకున్న ఈ రోగి, వెంటనే వైబ్రో మందులను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో రోగి ఏ విధమైన పైపూత మందులను ఉపయోగించడం లేదు. మెట్ఫార్మిన్ (తక్కువ మోతాదు) ద్వారా మధుమేహం నియంత్రణలో ఉండేది.
ఈ రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.1 Adult tonic + CC14.1 Male tonic + CC21.3 Skin allergies + CC21.6 Eczema...TDS
మౌఖికంగా వైబ్రో మందును తీసుకోవడంతో పాటు, రోగికి, ఐదు గోలీలను 200ml ఆలివ్ నూనెలో కలిపి, ప్రతిరోజు ధద్దుర్లపై పైపూత మందుగా రాయవలసిందిగా చెప్పబడింది.
ఒక వారం తర్వాత దురదలు నుండి కొంత ఉపశమనం కలిగింది. ఒక నెల తర్వాత దురదలు 90% తగ్గిపోయాయి మరియు దద్దుర్లు 30 శాతం తగ్గాయి. రెండు నెలల తర్వాత దురదలు పూర్తిగా తగ్గి, దద్దుర్లు 50% తగ్గాయి. మూడు నెలల తర్వాత దద్దుర్లు 90% తగ్గిపోయాయి. క్రమముగా అతనికి దద్దుర్లు పూర్తిగా తగ్గిపోవడం కారణంగా మందు యొక్క మోతాదు OD గా తగ్గించ బడింది. అదే సమయంలో, వైబ్రో మందును పైపూతగా రాయడం కూడా ఆపారు. 2016 మార్చ్ నాటికి రోగికి దద్దుర్లు సమస్య తిరిగి రాలేదు.ఇప్పటికి అతను మందును రోజుకి ఒకసారి తీసుకోవడం కొనసాగిస్తున్నారు.
కాలిచీలమండలో ఎముక విరుపు (ఫ్రాక్చర్) 11520...India
2015 సెప్టెంబర్ 28న ఒక 53 ఏళ్ళ వ్యక్తికి కింద పడిపోవడం కారణంగా ఎడమ కాలి చీలమండ లో స్నాయువులు (లిగమెంట్) భాదితతో పాటు ఎముక విరుపు కలిగింది. కాలు వాచడంతో పాటు తీవ్ర నొప్పి కలిగింది(పటం చూడండి).
అప్పటికే, రోగికి, శరీరంలో తగినంత రక్తప్రసరణము జరగనందువల్ల తొంటికీలులో బంతిగిన్నెకీలు కలిసిపోయి, చలనశక్తి క్షీణించింది. వైబ్రో చికిత్స ద్వారా రోగి సొంతంగా నడవ గలిగేవారు మరియు రోజువారి చర్యలు చేసుకో గలిగేవారు. అయితే, చీలమండ ఎముక విరుపు ద్వారా కలిగిన నొప్పి కారణంగా అతనికి దినచర్యలు కొనసాగించడంలో ఇబ్బంది కలిగింది. సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో నొప్పి మరింత తీవ్రంగా ఉండేది. కాలుని ఎనిమిది వారాల వరకు ప్లాస్టిక్ మూసలో (కాస్ట్) ఉంచమని వైధ్యులచే సలహా ఇవ్వబడింది కాని రోగి దానికి నిరాకరించారు. తనకి ఉన్న తొంటికీలు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని రోగి భయపడ్డారు. అందువల్ల వైద్యులు రోగిని పెయిన్ కిల్లెర్లతో పాటు కాల్శియుం మరియు పైపూత మందును తీసుకోమని మరియు చల్లని కాపడం పెట్టుకోమని సలహా ఇచ్చారు. అయితే రోగి ఈ సలహాలని కూడా నిరాకరించారు. చల్లని కాపడం పెట్టుకున్నారు కాని వాతావరణం చల్లగా ఉన్న కారణంగా మానేశారు. రోగి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా క్రింది వైబ్రో మందులు రోగికి ఇవ్వడం జరిగింది:
NM7 CB7 + NM67 Calcium + SM28 Injury + SR280 Calc Carb + SR295 Hypericum + SR311 Rhus Tax + SR353 Ledum + SR398 Nat Carb + SR550 Gnaphalium + SR574 Tendonitis + SR503 Ligament + CC10.1 Emergencies…6TD
ఎనిమిది దినాలలో, నొప్పి మరియు వాపులో 45% మెరుగుదల కనపడింది. రోగి, రోజువారి దినచర్యలు కొంత సహాయంతో చేసుకోవడం ప్రారంభించారు. మందుల మోతాదు QDS కి తగ్గించడం జరిగింది.
పదిహేను రోజుల తర్వాత వాపు పూర్తిగా తగ్గి, నొప్పి 65% వరకు తగ్గింది. రోగి దినచర్యలను సొంతంగా చేసుకోవడం తిరిగి ప్రారంభించారు. ఈ కారణంగా మోతాదు TDS కి తగ్గించ బడింది.
24 రోజుల తర్వాత, అక్తోబెర్ 22న, రోగికి 100% ఉపశమనం కలిగింది. వాపు మరియు నొప్పి తగ్గి, కాలు సాధారణ స్థితికి వచ్చింది (పటం చూడండి). ఒక వారం రోజులకు మోతాదును BD కి, ఆపై OD కి తర్వాత OW కి తగ్గించడం జరిగింది. 2015 నవంబెర్ 14న వైబ్రో చికిత్స పూర్తయింది. అయితే, రోగి తన తొంతికీలు సమస్యకు వైబ్రో మందును వాడడం కొనసాగిస్తున్నారు.
సంపాదకుడి వివరణ: SR280 Calc Carb వాచిన మరియు మృదువైన ఎముకకు, SR295 Hypericum నరాల గాయాలకు; SR311 Rhus Tax అస్థిబంధకాల నొప్పులకు; SR353 Ledum చీలమండ వాపుకు; SR398 Nat carb బలహీనమైన చీలమండకు; SR550 Gnaphalium చీలమండ కీలుకు మరియు SR574 Tendonitis నొప్పితో కూడిన వాపుకు
After treatment
Before treatment
బెల్ పక్షవాతం 03529...UAE
2015 సెప్టెంబర్ 20న చికిత్సా నిపుణుడు ఆకస్మికంగా, 34 ఏళ్ళ వయసున్న తన సహచరుడుని చూసినప్పుడు, అతని ముఖం అసాధారణంగా ఉండడం గమనించింది. ఒక వైరల్ సంక్రమణ(ఇన్ఫెక్షన్) కారణంగా బెల్ పక్షవాతం కలిగి, రెండు వారాలుగా పనికి హాజరు కాలేకపోయానని చికిత్సా నిపుణురాలికి అతను చెప్పారు. తన ముఖంలో కలిగిన తీవ్ర వక్రతను గమనించిన వెంటనే వైధ్యుడను సంప్రదించడంతో, రోగికి కార్తికోస్టీరాయిడ్లు ఇవ్వబడినాయి. అయితే, ఈ మందుల ద్వారా ఉపశమనం కలగలేదు. అతను దవడ చుట్టూ నొప్పి, కంటి రెప్పపాటు, మాటలలో అస్పష్టత, తినడం లేదా తాగడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో భాధపడేవాడు. ఈ కారణంగా వైద్యుడు ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫిజియోథెరపీ మొదలుపెట్టమని సలహా ఇచ్చారు. చికిత్సా నిపుణురాలిని కలిసిన సమయంలో ఏ విధమైన మందులను అతను తీసుకోవడం లేదు. ఆమె ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న రోగి, వైబ్రో మందులను తీసుకోవడానికి వెంటనే అంగీకరించాడు. మరుసటి రోజునుండి రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities + CC18.4 Paralysis…6TD
ఒక వారం తర్వాత, రోగికి 50% వరకు నయమై పోయింది. రోగి యొక్క మాటల్లో 70% మెరుగుదల, కంటి రెప్పపాటు సమస్యలో మరియు తినే లేదా త్రాగే సమయంలో కలిగే ఇబ్బందిలో 50% మెరుగుదల కలిగింది. దవడ నొప్పి 50% తగ్గిపోయింది. రోగి మందును తనకు సూచించ విధంగా 6TD మోతాదులో కాకుండా QDS మోతాదులో తీసుకుంటున్నట్లుగా రోగి ఒప్పుకున్నారు.
ఆపై మూడు వారాల తర్వాత వ్యాధి లక్షణాలన్నిటిలోను 80 శాతం నుండి 90 శాతం మెరుగుదల కనపడింది. ఇంత త్వరగా ఉపశమనాన్ని అనుభవించిన రోగి అల్లోపతి వైధ్యుడను సంప్రదించే అవసరం లేదా ఫిజియోథెరపి చేసే అవసరం లేదని నిర్ణయించుకొని వైబ్రో చికిత్సను కొనసాగించారు.
ఆపై రెండు వారాలకు రోగి 100 శాతం కోలుకున్నారు. ఈ కారణంగా మోతాదు OD కి తగ్గించబడి, 2015 నవంబెర్ 30 వరకు ఈ చికిత్స కొనసాగించ బడింది. 2016 మార్చ్ నాటికి అతను ఆరోగ్యకరంగా ఉన్నారు.
దీర్ఘకాల మోకాలి కీళ్ళ నొప్పులు 02899...UK
2014 మే 2న, మోకాలి కీళ్ళ నొప్పులతో భాదపడుతున్న ఒక 58 ఏళ్ళ వ్యక్తి చికిత్సా నిపుణుడను కలవడం జరిగింది. అతని రోగ చరిత్ర: 11 ఏళ్ళ క్రితం, అతనికి తీవ్ర వీపు నొప్పి వచ్చినప్పుడు రైకి చికిత్స ద్వారా కోలుకున్నారు. గత మూడేళ్ళ నుండి, కొంత దూరం నడిచేసరికి అతనికి మోకాళ్ళలో తీవ్ర నొప్పి రావడంతో, తనకి కీళ్ళ వాతపు సమస్య మొదలైందని రోగి తలచారు. రోగికి కొన్ని సంవత్సరాల క్రితం కుడి మోకాలు నుండి ఒక గడ్డ తొలగించబడింది. బహుశా దీని కారణంగా కీళ్ళ నొప్పి మొదలై యుండవచ్చని రోగి తలచారు. నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం కొరకు, వైద్యుడి సలహా పై, అతను పారాసిటమోల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను తీసుకొనేవారు.
రోగికి 2014 మే 9న, క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis...TDS
పుల్ అవుట్ కలిగే సంభావ్యత ఉందని ముందుగానే రోగికి చెప్పడం జరిగింది. చికిత్సను ప్రారంభించిన రెండు రోజుల తర్వాత, రోగికి పుల్ అవుట్ కారణంగా స్వల్ప అతిసారం కలిగింది. రోగికి సాదారణంగా కొంత దూరం నడిచిన తర్వాత వచ్చే నొప్పిలో 25% ఉపశమనం కలిగింది మరియు శక్తివంతంగా అనిపించింది. ఒక నెల తర్వాత, రోగికి మోకాలి నొప్పి 75% తగ్గిందని మరియు ఎక్కువ దూరం నడిచిన తర్వాత కూడా నొప్పి కలగడం లేదని తెలియచేసారు. నాలుగు నెలల తర్వాత రోగికి 100% ఉపశమనం కలిగింది. ఆపై రెండు నెలల వరకు రోగి TDS మోతాదులో వైబ్రో మందును కొనసాగించారు. ఆ తర్వాత, 2015 జనవరి నుండి మోతాదు తగ్గించ బడింది. రెండు నెలల వరకు మందును BD మోతాదులోను, ఆ తర్వాత రెండు నెలల వరకు OD మోతాదులో మరియు ఆపై ఆరు నెలల వరకు OW మోతాదులో తీసుకున్నారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో రోగికి కీళ్ళ నొప్పులు తిరిగి రాలేదు. 2015 అక్తోబెర్ లో చికిత్స నిలిపివేయబడింది. వైబ్రియానిక్స్ చికిత్స ప్రారంభించిన తర్వాత రోగి అల్లోపతి మందులను ఉపయోగించలేదు.
2016 జనవరిలో, ఒక కఠినమైన కృషి చేసినందువల్ల మరియు వాతావరణం చల్లగా ఉన్న కారణంగాను రోగికి కొంత నొప్పి కలిగిందని చికిత్సా నిపుణుడకు తెలియచేయడంతో, తిరిగి మందును OD మోతాదులో ప్రారంభించబడింది. కొద్ది రోజులలో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. పూర్తి ఉపశమనం కలిగినందుకు ఈ వ్యక్తి ఆనందం వ్యక్తం చేసారు. 2016 మార్చ్ నాటికి ఈ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నారు.
సెగగుల్లలు (లైకెన్ ప్లానస్, ఒక చర్మ రోగము) 03507...UK
ఇరవై ఏళ్ళగా ఒక 62 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఒక సంకటమైన చర్మరోగంతో భాదపడుతున్నారు. 2015 నవంబెర్ 15న చికిత్సా నిపుణుడను సంప్రదించినప్పుడు, తనకి ఉన్నదీ విచర్చిక (సోరియాసిస్) చర్మరోగమని చెప్పారు. రోగి యొక్క కాళ్ళు మరియు చేతులు గాయపుమచ్చలతో నిండియున్నాయి. రోగి యొక్క నుదుటి పైన కూడా ధద్దుర్లున్నాయి. అంతే కాకుండా రోగి యొక్క తలపై చర్మం కూడా చర్మవ్యాధి కారణంగా తెల్ల పొలుసులతో నిండియుంది. వీటి వల్ల కలిగే దురద కారణంగా ఈ వ్యక్తికి ఇబ్బందిగా ఉండేది. ఈ వ్యక్తి ఉపశమనం కొరకు అల్లోపతి, ఆయుర్వేదం మరియు హోమియోపతి వైద్యాలు తీసుకున్నారు కాని ఫలితం లభించలేదు. క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:
విచర్చిక (సోరియాసిస్) చర్మరోగముకు:
#1. CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema + CC21.10 Psoriasis, స్వచ్చమైన ఆలివ్ నూనెలో ప్రతియొక్క మందును రెండు చుక్కలు వేసి కలపాలి. TDS, దద్దుర్లు పైన రాయాలి.
#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + #1…QDS
ఒక వారం తర్వాత దద్దుర్లు తగ్గాయి, అయితే రోగికి, ముఖ్యంగా రాత్రి వేళల్లో దురదలు ఎక్కువయ్యాయి. దీని కారణంగా రోగికి నిద్రపట్టేది కాదు. ఈ కారణంగా, మందు కలిపిన ఆలివ్ నునెను కేవలం ఉదయం వేళ మాత్రమే రాయమని, రాత్రి వేళ రాయడం నిలిపివేయమని రోగికి చెప్పబడింది. మూడు వారాల వరకు దురద తీవ్రంగా ఉండేది. పైగా తోటలో కొద్ది సేపు పనిచేశాక రోగి యొక్క వీపు,చేతులు మరియు కాళ్ళ చర్మం పై ఎర్రటి మచ్చలతో కూడిన దద్దుర్లు వచ్చాయి. రోగిని #1 పైపూత మందును ఆపివేసి, ఒక చర్మ నిపుణుడను సంప్రదించ వలసిందిగా చెప్పబడింది. పరిశీలన తర్వాత వైద్యుడు, రోగికి ఉన్నదీ లైకెన్ ప్లానస్ (సెగగుల్లలు) అని, విచర్చిక చర్మరోగం కాదని (సోరియాసిస్) నిర్ధారించారు. దద్దుర్లు తగ్గెంత వరకు స్టీరాయిడ్ లేపనం వాటి పై రాయవలసిందిగా వైధుడు సలహా ఇచ్చారు. అయితే, రోగి స్టీరాయిడ్ లేపనాన్ని ఉపయోగించకుండా, వైబ్రో చికిత్సా నిపుణుడు వద్దకు చికిత్స కొరకు వచ్చారు. 2016 జనవరి 10న మందులను మార్చివ్వడం జరిగింది:
సెగగుల్లలు సమస్యకు:
#3. CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema,two drops ప్రతి మందును రెండు చుక్కలు 200 గ్రా సుగంధం లేని తేమ కలిగించే లెపనమున్న (మాయిశ్చరైసింగ్ క్రీమ్) సీసాలో కలపాలి…TDS, ధద్దుర్లపై రాయాలి.
#4. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + #3…QDS
ఒక వారం తర్వాత దురదలు పూర్తిగా తగ్గిపోయాయి. చర్మ వ్యాధిలో 60% ఉపశమనం కలిగింది- ఎరుపు పూర్తిగా తగ్గి, దద్దులు తగ్గడం ప్రారంభమయింది. రోగికి ఒత్తిడి పెరిగినప్పుడు లేదా రాత్రి వేళ టీవీ చూడడం కారణంగా విశ్రాంతి తీసుకోనప్పుడు, దద్దుర్లు తిరిగి వచ్చేవి. రోగిని క్రమ శిక్షణ పాటించమని, రాత్రి వేళ త్వరగా నిద్రించమని సలహా ఇవ్వబడింది. రెండు వారాల తర్వాత దద్దుర్లు పూర్తిగా తగ్గాయి. రోగి యొక్క వీపు మరియు కాళ్ళ పైనున్న దద్దుర్లు చాలా వరకు తగ్గాయి,అయితే, రోగి చేతి గోళ్ళతో గోకడం కారణంగా కొన్ని చిన్న చిన్న పుండ్లు ఉండిపోయాయి. రోగికి గోకరాదని సలహా ఇవ్వబడింది. ఆరు వారాల తర్వాత, 2016 మార్చ్ 7న రోగికి 100% నయమైంది. కొత్త దద్దుర్లు రావడం ఆగిపోయింది మరియు అంతకు ముందున్న దద్దుర్లు పూర్తిగా ఎండిపోయాయి. తలచర్మం పై పొరలు ఏర్పడడం ఆగిపోవడం గమనించిన రోగి ఎంతో సంతోష పడ్డారు. రోగికి, #4 ను ఆపై నాలుగు నెలల వరకు కొనసాగించమని, ఆ తర్వాత TDS కి తగ్గించమని చెప్పబడింది. రోగికి తేమ కలిగించే లేపనమును చర్మం పై రాయమని సలహా ఇవ్వబడింది.
పక్క తడపటం 11422...India
దీర్ఘకాలంగా పక్కతడిపే సమస్యున్న ఒక 11 సంవత్సరాలు వయసున్న అమ్మాయి యొక్క తల్లి 2014 ఆగస్ట్ 11న, వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణుడను సంప్రదించింది. పది సంవత్సరాలు వయసునుండి, ఆ అమ్మాయి ప్రతిరోజు పక్క తడపటం ప్రారంభించింది. తనకి రాత్రి వేళ నిద్దురలో భయంగా ఉంటోందని ఆ బాలిక తెలియ చేసింది. తల్లి తండ్రులు ఈ విషయం పై రోగికి ఏ చికిత్సా చేయించలేదు.
చికిత్సా నిపుణుడు క్రింది మందులను తయారు చేసి ఇవ్వడం జరిగింది:
#1. CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC13.3 Incontinence + CC15.2 Psychiatric disorders…TDS
మూడు వారాల తర్వాత, పక్కతడిపే లక్షణం మరియు భయం 50% వరకు తగ్గిపోయాయని తెలియచేసింది. #1 మందును కొనసాగించమని అదనంగా ఒక మందు ఇవ్వదబడింది:
#2. NM21 KBS…TDS
ఒక వారం తర్వాత, #2 మందిచ్చిన రోజు నుండి పక్క తడపడం పూర్తిగా తగ్గిపోయిందని, రోగి యొక్క తల్లి తెలిపింది. భయం యొక్క తీవ్రత 75% తగ్గిపోయింది. #1 మరియు #2 ఆపై మూడు నెలల వరకు TDS మోతాదులో కొనసాగించడం జరిగింది.
నాలుగు నెలల తర్వాత 2014 డిసెంబెర్ లో, రోగికి భయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ కారణంగా #1 మరియు #2 మందుల మోతాదును OD కి మరియు ఆపై ఒక నెల వరకు OW కి తగ్గించబడింది.
2016 ఫెబ్రవరిలో, ఈ బాలిక యొక్క తల్లి పక్క తడిపే సమస్య లేదా భయం తిరిగి రాలేదని తెలిపింది.
Practitioner Profile 10728...India
కర్ణాటకలో మంగళూరుకు చెందిన చికిత్సా నిపుణురాలు 10728…India, దీర్ఘకాలంగా స్వామి భక్తురాలు. స్థానిక సాయి కేంద్రంలో జరిగే కార్యకలాపాలలో ఈమె ఉత్సాహంతో పాల్గొంటుంది. ఒకప్పుడు బాలవికాస్ విద్యార్థినియైన ఈమె, ఇప్పుడొక బాలవికాస్ గురువు. 2004లో ముంబైలో సత్యసాయి ఏడూకేర్ లో డిప్లొమా పూర్తి చేసింది. ఉపాద్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, మంగళూరు చుట్టు ప్రక్క ప్రాంతాలలో ఉన్న గ్రామీణ పాఠశాలల్లో మరియు 45 పిల్లలున్న ఒక అనాధ ఆశ్రమంలో శిక్షణ అందచేస్తోంది. ఏ విధమైన సేవను అందచేసినా ఆత్మానందం కలుగుతుందని ఈమె యొక్క భావన.
ఈ చికిత్సా నిపుణురాలు మొట్టమొదట సాయి వైబ్రియానిక్స్ గురించి తన సాయి కేంద్రానికి పంపబడిన సమాచార పత్రం మరియు దరఖాస్తు పత్రం చూసి తెలుసుకుంది. సేవ చేయడంలో ఈమెకున్న ఆశక్తి గురించి తెలిసిన ఈమె సమితి అధ్యక్షులు వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణురాలుగా శిక్షణ పొందడానికి ఈమెను ఎంపిక చేసారు. 2009లో ఈమె వైబ్రో శిక్షణ పూర్తి చేసింది. చేసిన వెంటనే ఈమె సాయి కేంద్రంలో, ప్రతి గురువారం జరిగే ఒక క్లినిక్ ను ప్రారంభించారు. ఈ క్లినిక్ లో ఇప్పటివరక్లు ఈమె 6,500 రోగులకు విజయవంతంగా చికిత్సను అందచేసారు. అత్యవసరం ఉన్నవారికి, అన్ని వేళల్లోనూ ఈమె చికిత్సను అందచేస్తోంది.
రోగులను తన ద్వారా స్వామి నయం చేస్తున్నారన్న విశ్వాసమున్న ఈమె, ఈ సేవా సాధన, ప్రతిఫలదాయకంగా ఉందని భావిస్తోంది. స్వామి యొక్క వినమ్ర సాధనంగా ఉన్నందుకు తను ఎంతో ఆనంద పడుతోంది. ఈమె వైబ్రో క్లినిక్ నడుపుతున్న సాయి కేంద్రానికి స్వామి స్వయంగా రెండు సార్లు వచ్చి దర్శనం ఇచ్చియున్నారు. ఈ కారణంగా క్లినిక్లో రోగులకు చికిత్స ఇస్తున్న సమయంలో తీవ్రమైన స్వస్థతా తరంగములను అనుభవిస్తున్నట్లుగా ఈమె చెబుతున్నారు.
ఏడు సంవత్సరాల అభ్యాసంలో, తనకు శిక్షణ సమయంలో చెప్పబడిన సూచనలను సలహాలను పాటించింది. ఈమె నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాటం: "స్వామికి ఏది అసాధ్యం కాదు". రోగుల వద్ద నుండి వస్తున్న మహత్తరమైన ప్రతిస్పందనను చూసి, దైవాన్ని పూర్తిగా విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఈమె చెబుతోంది. ఈమె బృందావన్లో మరియు మంగళూరు చుట్టూ ఉన్న గ్రామాలలో ఇతర చికిత్సా నిపుణులతో కలిసి వైబ్రో సేవను చేసింది. ఈమె వద్దనున్న 108CC పెట్టె ద్వారా, క్రింద ఇవ్వబడిన అనేక రకముల వ్యాధులకు చికిత్సనిచ్చింది: వివిధ క్యాన్సెర్లు, మానసిక మరియు నరాలకు సంభందించిన రోగాలు, సంతానంలేమి సమస్య, చర్మ రోగాలు, కీళ్ళ వాతపు సమస్యలు, జంతువులు మరియు మొక్కలకు సంభందించిన సమస్యలు.
ఏడు సంవత్సరాలుగా చేస్తున్న వైబ్రియానిక్స్ సాధన ద్వారా ఈమెకు మరింత స్వామి సేవ చేయాలన్న ప్రేరణ కలిగింది. మనశ్శాంతి మరియు సంతృప్తి ఈ సేవ ద్వారా తనకు అందిన ప్రతిఫలములని ఈమె చెబుతోంది. ఈ కారణంగా ఈమె తన సేవా కార్యక్రమానికి అధిక ముఖ్యత్వం ఇస్తోంది. సేవ చేయడానికి ఈమె అధిక సమయం కేటాయిస్తున్న కారణంగా ఈమె ఎల్లపుడు తన భర్త మరియు బిడ్డలను ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలా ప్రోత్సాహించేది. "అమ్మ దివ్య కార్యం చేయడానికి దేవుని ద్వారా ఎంపిక చేయబడింది; ఆమెకు అటువంటి సేవా కార్యం చేయడానికి సమయం ఉండాలి" అని ఈమె కుమారుడు యొక్క భావన.
----------------------------------------------------------------------------------------------------------------
పంచుకుంటున్న రోగ చరిత్రలు
Practitioner Profile 01180...Bosnia
చికిత్సా నిపుణుడు 01180…బోస్నియా, క్లిష్టమైన ధీర్గకాల వ్యాధులకు మరియు సాధారణంగా వచ్చే రోజువారి రోగ సమస్యలకు, గత 17 సంవత్సరాలుగా చికిత్సను అందచేస్తున్నారు. వైబ్రో చికిత్స అభ్యసించడంలో ధీర్గకాల అనుభవమున్న ఈ నిపుణుడకు హోమియోపతి చికిత్సా విధానంలో కూడా నైపుణ్యముంది. ఇతను నూతన హోమియోపతి వైద్యులకు ఆధునిక హోమియోపతి పై శిక్షణనిచ్చే ఒక అధ్యాపకుడు. ఈ కారణంగా ఇతనికి రోగనిర్ధారణ చేసే మరియు చికిత్సనిచ్చే ప్రవీణత ఉంది.
1999లో, చికిత్సా నిపుణుడి యొక్క సొంత ఊరిలో, డా.జే.కే.అగ్గర్వాల్ దంపతులచే నిర్వహించబడిన శిక్షణా శిబిరంలో మొట్టమొదటి సారిగా ఇతనికి వైబ్రియానిక్స్ చికిత్సా విధానం గురించి తెలుసుకొనే అవకాశం కలిగింది. తక్షణమే ఇతనికి వైబ్రియానిక్స్ తో ఒక గట్టి సంభంధం ఉన్నట్లుగా భావన కలిగింది. అప్పటినుండి ఇతను వైబ్రియానిక్స్ సేవను తన మతముగాను, అభిరుచిగాను మరియు తన జీవితంగాను భావిస్తున్నారు. వైబ్రియానిక్స్ మరియు హోమియోపతి పై జ్ఞ్యానాన్ని పెంచుకొనే నిమిత్తమై, ఇతను అనేక సంవత్సరాలు, ఈ రెండు చికిత్సా విధానాల పై అధ్యయనం చేసారు. ఇతను రోగులకు కేవలం వైబ్రో చికిత్సను మాత్రమే అందచేస్తున్నారు. అనేక సంవత్సరాలు తీవ్ర అధ్యయనం మరియు కృషి చేసినప్పటికీ, ఇంకా వైబ్రియానిక్స్ మందుల పై పూర్తి అవగాహన కలగలేదని ఇతను భావిస్తున్నారు. అయితే, చికిత్స కొరకు ఇతని వద్దకు రోగులు అధిక సంఖ్యలో రావడం మరియు వారందరికీ సంపూర్ణ అర్పనా భావంతో సేవను అందచేయడం, ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని ఇతను భావిస్తున్నారు. స్వామీ ఇతనిని ఒక శిక్షకుడిగా సేవ చేయడానికి అవకాశం ఇవ్వడం ద్వారా అవసరమైన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించారని అభిప్రాయపడ్డారు.
ఇతను, వైబ్రియానిక్స్ లో విజయాన్ని సాధించడానికి రెండు ప్రధాన మార్గదర్శక సూత్రాలున్నాయని భావిస్తున్నారు: క్షమా భావన మరియు దైవ రక్షణ కోసం ప్రార్థన. తన సొంత జీవితంలో క్షమాబుద్ధి కలిగియుండడం మరియు రోగులను ఈ సద్భావాన్ని ఆచరించమని భోధన చేయడం ద్వారా దివ్యత్వంతో తనకున్న సంబoదాన్ని మరింత బలపరచడానికి సహాయపడిందని ఇతను నమ్ముతున్నారు. ఈ దివ్య సాధన వ్యక్తి యొక్క గుండెలో సంభవించే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా, మీరు నిశ్శబ్దముగా ఉంటూ అందరితో/అంతటితోను ఒక మానసిక అనుసంధానం ఏర్పరచుకోవాలి - మీలో దుష్ట భావాలను కలుగ చేసిన ప్రతియొక్క వ్యక్తి, జంతువు, సంస్థ మరియు ప్రతియొక్క సంఘటనతోను ఈ అనుసంధానాన్ని ఏర్పర్చుకోవాలి. మనసులోనే మీరు ప్రతియొక్క వ్యక్తిని క్షమాపణ కోరాలి మరియు వారిని మీరు క్షమించాలి. అదే సమయంలో మీరు వారి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి. మీరు వారికి విముక్తులను చేయడంతో పాటు వారి నుండి విముక్తి కోరాలి.
అందరిని క్షమించే ఈ సాధనను చేసే రోగులలో, ఆరా (కాంతిమండలం) లో ఏర్పడే మార్పులను ఇతను చూడగలుగుతున్నారు. ఈ సాధనను చేయడం ద్వారా అనేక రోగులకు అనేక అద్భుతమైన అనుభూతులు కలిగాయి. క్షమించే సాధనను చేసిన తర్వాత తమ కోరికలు తక్షణమే అనుకూలమైన నిశ్చితమైన అనుభూతులుగా వెల్లడిస్తున్నాయని అనేక మంది రోగులు నిర్ధారించి చెబుతున్నారు. అసాధ్యమైన సమస్యలకు పరిష్కారం అతి సులభంగా లభిస్తోంది. " నేను ముందున్న మనిషిని కాదు ; ఎల్లప్పుడూ నేను ఏ విధంగా ఉండాలని అనుకున్నానో, అదే విధంగా ఉంటున్నాను" అని కొందఱు రోగులు తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఈ మార్పుల కారణంగా వారు వేగంగా కోలుకుంటున్నారు.
చికిత్సా నిపుణులకు ఇతనొక సిఫార్సు చేస్తున్నారు: సేవా సమావేశాన్ని ప్రారంభించే ముందుగా, తమను దివ్య కాంతితో కప్పమని దైవానికి నిశబ్దంగా ప్రార్థన చేయాలి లేదా ఫిల్లిస్ క్రిస్టల్ పద్ధతి ప్రకారం తామొక బంగారు సిలెండరులో ఉన్నట్లుగా ఊహించుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు, వివిధ రోగాలు మరియు ఇతర సమస్యలతో వారిని సంప్రదించే రోగుల ప్రతికూలమైన కంపనాలు లేదా శక్తుల ప్రభావం చికిత్సా నిపుణుల పై పడకుండా ఉంటుంది.
ఈ చికిత్సా నిపుణుడు తన యౌవనం నుండి ఆత్మజ్ఞానంతో కూడిన ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నారు. చిన్న వయసులోనే, కుడి చేతిలో మరియు కాలిలో కదలికను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న కారణంగా మరియు వ్యక్తిగత జీవితంలో అనేక నష్టాలను ఎదుర్కొన్న కారణంగా దైవానికి మరింత ధగ్గెరయ్యారు. ఒక వ్యక్తిగత ఇంటర్వ్యూ తో పాటు అనేక సార్లు స్వామీ యొక్క దర్శనం ముఖాముఖిగా ఇతనికి లభించింది. కొన్ని నిమిషాల పాటు కొనసాగిన పాదనమస్కారం సమయంలో, ఇతనికి, విశ్వంతో ఒకటిగా ఉన్నట్లు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. స్వామి యొక్క ఉనికి నిరంతరం ఇతని జీవితంలో ఉన్న కారణంగా ఇతను నిర్విరామంగా వైబ్రియానిక్స్ సేవను అందించగలుగుతున్నారు.
ఇతను 4000 పైగా రోగులకు వైబ్రో సేవనందిoచియున్నారు మరియు క్రిందివ్వబడిన అనేక రోగ సమస్యలకు విజయవంతంగా చికిత్సనిచ్చారు : గుండె మరియు రక్త నాళాలకు సంభందించిన వ్యాధులు, నొప్పి, వాపు మరియు కొవ్వు వంటి కాలేయ సమస్యలు; సంతానలేమి, గర్భాశయ ద్వారంలో, పొత్తికడుపులో, అండాశయంలో వాపు వంటి ఆడవారి మరియు మొగవారి జననమండలములకు సంభందించిన సమస్యలు ; తలనొప్పి మరియు మైగ్రేనులు, అధిక మరియు తక్కువ రక్తపోటు, తల నొప్పులు పిల్లలలో ప్రవర్తనా సంభందించిన సమస్యలు, విద్యార్థుల్లో ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం మరియు పాఠాలు నేర్చుకోవడంలో సమస్య; మూత్రపిండంలో వాపు మరియు రాళ్ళు; ఆహారం మరియు సిగరెట్ వ్యసనాలు; జ్ఞ్యాపకశక్తి నశించడం మరియు మెదడుకు సరైన రక్తప్రసరణ లేకపోవడం; ఎముకలకు సంభందించిన సమస్యలు, బోలు ఎముకల వ్యాధి, సియాటికా, కీళ్ళ వాతం, మోకాలి మరియు నడుము కీళ్ళ సమస్యలు; చర్మ రోగాలు- ఎనుగుగజ్జి, పుండ్లు, చర్మకీలములు, బొబ్బలు, మాంసగ్రంథులవాపు.
శస్త్ర చికిత్సానంతరం రోగులకు ఎంతో అవసరమైన మద్దతును ఇతను అందచేస్తున్నారు. గమనించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, రోగులు మరియు వైద్యులు ఆశలను వదులుకున్న అనేక సందర్భాలలో, ఈ చికిత్సా నిపుణుడు విజయవంతమైన చికిత్సను అందచేసారు. ఇతనికి అద్భుతమైన ఫలితాలు లభించడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి: మొట్టమొదటిగా ఇతని ఊహాజ్ఞ్యానం, రెండవది, హోమియోపతిలో ఇతనికి ఉన్న పరిజ్ఞ్యానం. ఇతను 108CC పెట్టెలో ఉన్న మిశ్రమాలను కూడా ఇదే నైపుణ్యంతో ఉపయోగిస్తున్నారు.
ఎంచుకున్న కొన్ని 108CC మిశ్రమాలను కలపడం ద్వారా సిద్ధం చేయబడిన కొన్ని వ్యాధులకు సంభందించిన ప్రత్యేక మిశ్రమాలు; వీటి ద్వారా ఈ చికిత్సా నిపుణుడు కొన్ని అసాధారణమైన ఫలితాలను పొందారు.
1. ఊపిరితిత్తుల కాన్సెర్: CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC3.2 Bleeding disorders + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC17.2 Cleansing + CC19.1 Chest tonic + CC20.1 SMJ tonic + CC21.1 Skin tonic…6TD
శ్వాసకోశములో కాన్సెరున్న ఒక రోగికి శస్త్రచికిత్స తర్వాత కాన్సెర్ తిరిగి శోకింది. పైనివ్వబడిన మిశ్రమాల ద్వారా నాలుగు నెలల్లో రోగికి కాన్సెర్ వ్యాధి పూర్తిగా నయమై పోయింది. అంతేకాకుండా రోగి పొగ త్రాగడం వ్యసనాన్ని మానేశాడు. అనేక సంవత్సరాల తర్వాత ఆ రోగి ఇప్పటికి ఆరోగ్యంగా జీవిస్తున్నాడు.
2. ప్రోస్త్రేట్ గ్రంధి కాన్సెర్: #1. CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC3.1 Heart tonic + CC3.2 Bleeding disorders + CC4.2 Liver & Gallbladder tonic + CC6.3 Diabetes + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.2 Kidney & Bladder infections + CC14.1 Male tonic + CC14.2 Prostate + CC14.3 Male infertility + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC15.6 Sleep disorders + CC17.2 Cleansing + CC18.3 Epilepsy + CC19.7 Throat chronic + CC20.4 Muscles & Supportive tissue + CC21.2 Skin infections + CC21.7 Fungus…6TD ఒక సంవత్సరం వరకు ( 60 ఏళ్ళు దాటిన మొగవారికి మూడేళ్ళ వరకు). ఆపై #2. CC14.1 Male tonic…TDS రెండేళ్ళు.
3. గుండె జబ్బులు: CC3.1 Heart tonic + CC3.2 Bleeding disorders + CC3.4 Heart Emergencies + CC3.6 Pulse irregular + CC6.3 Diabetes + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC18.3 Epilepsy + CC19.1 Chest tonic + CC20.4 Muscles & Supportive tissue + CC21.2 Skin infections…6TD అల్లోపతి మందులతో పాటు.
మెరుగుదల ఏర్పడిన తర్వాత, అల్లోపతి మందుల యొక్క మోతాదును క్రమంగా తగ్గించాలి. ఒక మోతాదు అల్లోపతి మందుకు బదులుగా ఒక మోతాదు SR543 Agaricus Mus 200C తీసుకోవాలి (అల్లోపతి మందు పూర్తిగా ఆపెంత వరకు). వైద్య పరీక్షలు గుండె స్వస్థతను నిర్ధారించిన తర్వాత, ఈ మిశ్రమాల యొక్క మోతాదును TDSకి తగ్గించాలి. గుండె యొక్క స్వస్థత రెండవ సారి నిర్ధారించిన తర్వాత రోగి CC3.1 Heart tonic…OD నివారణ కొరకు తీసుకోవాలి.
4. పిత్తాశయములో రాళ్ళు: CC4.2 Liver & Gallbladder tonic + CC4.7 Gallstones…6TD రెండు నెలల
తర్వాత 80 ఏళ్ళ వయసు పైనున్న రోగులకు కూడా సత్ఫలితాలు లభించాయి.
5. థైరాయిడ్ బుడిపెలు: #1. CC2.3 Tumours & Growths + CC3.2 Bleeding disorders + CC4.2 Liver & Gallbladder tonic + CC6.1 Hyperthyroid (or CC6.2 Hypothyroid) + CC6.3 Diabetes + CC9.2 Infections acute + CC13.1 Kidney & Bladder tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC19.1 Chest tonic + CC19.7 Throat chronic + CC20.4 Muscles & Supportive tissue + CC21.2 Skin infections + CC21.8 Herpes…6TD. #2. SR268 Anacardium 30C…TDS
బుడిపెలు తొలగి పోయాయని వైద్యుడు రూఢిచేసిన తర్వాత, ఈ చికిత్స మరొక నెల రోజులు కొనసాగించాలి…TDS. రోగి అల్లోపతి మందులను తీసుకుంటున్న సందర్భంలో, ఒక మోతాదు అల్లోపతి మందుకు బదులు ఒక మోతాదు SR543 Agaricus Mus 200C తీసుకుంటూ క్రమముగా అల్లోపతి మందును పూర్తిగా ఆపివేయాలి.
పది సంవత్సరాలకు పైన థైరాయిడ్ బుడిపెల కోసం హార్మోన్ చికిత్స తీసుకున్న తర్వాత బుడిపెలు పెరుగుతున్న రోగులకు ఇతనిచ్చిన చికిత్స ద్వారా సమస్య తొలగింది. పైనివ్వబడిన మందులను తీసుకున్న తర్వాత, బుడిపెలు పూర్తిగా తొలగిపోవడమే కాకుండా, జీవితాంతం హార్మోన్లను తీసుకోవాలని వైద్యుల చే చెప్పబడిన రోగులు కూడా అల్లోపతి మందులను తీసుకోవడం పూర్తిగా నిలిపేశారు.
6. ఫ్లూ జ్వరం, రొంప, వాపు: CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases… తరచుగా (ప్రతి 10 లేదా 15 నిమిషాలు)
ఉపశమనం కలిగిన తర్వాత, క్రమముగా 6TD కి తగ్గించాలి, ఆపై TDS కి, చివరిగా OD కి తగ్గించాలి. ఈ ప్రక్రియ మొత్తం పదిహేను రోజుల వరకు కొనసాగాలి. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు, జ్వరం తగ్గే వరకు ప్రతి ఐదు లేదా పది నిమిషాలకు ఒకసారి ఒక డోస్ ఇవ్వాలి. ఇతని చికిత్సా అభ్యాసంలో ఒక బాలుడికి మాత్రము జ్వరం తగ్గడానికి మూడు గెంటలు పట్టింది; ఇతర కేసులలో అంతకన్నా తక్కువ సమయం పట్టింది. పైనివ్వబడిన కలయిక ద్వారా జంతువులకు కూడా విజయవంతంగా చికిత్సనివ్వడం జరిగింది.
7. నోటిలో పొక్కులు: CC11.5 Mouth infections + CC15.2 Psychiatric disorders + CC21.1 Skin tonic + CC21.11 Wound & Abrasions…6TD
ఒక రోగికి ప్రతి వసంత మరియు శరదృతువులో నోటి లోపల మరియు బయట పొక్కులు వచ్చేవి. పైనివ్వబడిన మందును తీసుకోవడంతో పొక్కులు ఒక వారం రోజులలో తొలగిపోయాయి. బాక్టీరియా లేదా వైరల్ అంటువ్యాధి నుండి నివారణ కొరకు ఈ మందులను మరో రెండు వారాల వరకు TDS మోతాదులో తీసుకోవడం జరిగింది.
8. అధైర్యస్థితి/నరాల బలహీనత, కుంగిపోవడం, వ్యాకులత: CC3.1 Heart tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC15.5 ADD & Autism + CC17.2 Cleansing + CC18.2 Alzheimer's disease + CC19.2 Respiratory allergies + CC20.1 SMJ tonic...6TD together with prescribed dosage of allopathic medicine.
రోగి యొక్క పరిస్థితి నిలకడగా ఉన్నప్పుడు, ఒక మోతాదు అల్లోపతి మందుకు బదులు ఒక మోతాదు SR543 Agaricus Mus 200C ఇవ్వడం ప్రారంభించాలి. ఈ ప్రక్రియను క్రమముగా పదిహేను రోజుల వరకు కొనసాగించాలి. చికిత్సా నిపుణుడు సలహా పై, ఈ విధానం అనుసరించడం ద్వారా 50కి పైన రోగులు (17 నుండి 65 ఏళ్ళు వయసు గల రోగులు), ఒక వారం నుండి ఆరు నెలల సమయంలో పూర్తిగా కోలుకున్నారు.
ఈ వ్యక్తులు ప్రస్తుతం అల్లోపతి మందులను తీసుకోవడం లేదు. ఈ చికిత్సా నిపుణుడి దృష్టిలో వైబ్రియానిక్స్ ద్వారా సేవనందించడానికి మూడు ప్రధాన లక్షణాలు అవసరం: సేవ చేయాలని ఒక బలమైన కోరిక, ఔదార్యము మరియు జ్ఞానం. ఈ అంశాల్లో ఏయోక్క అంశం లేకపోయినా, రోగులు నయంకావడానికి మూలకారణమైన స్వచ్చమైన ప్రేమ మీ నుండి వెలువడడానికి అవకాశముండదు.
దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
“సమతులిత వ్యక్తులుగా వికసించడానికి, సేవ ఒక ముఖ్యమైన లక్షణం. మనిషి నుండి అహాన్ని తొలగించడమే సేవ యొక్క గొప్ప లక్ష్యం. సేవ, ప్రేమ మరియు ఆప్యాయతలను ప్రోత్సహిస్తుంది. సేవ, ప్రాపంచిక ద్రుక్పధం నుండి మనిషిని దూరం చేసి దైవ మార్గంలో ఉంచుతుంది. సేవా భావము మనిషికి దివ్యత్వం యొక్క అర్థాన్ని వివరిస్తుంది. ఇది మానవజాతి అంతటికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నిజానికి, ఆధ్యాత్మిక మార్గంలో వికసించడానికి సేవ మొదటి అడుగు.”
-సత్యసాయి బాబా, "మానవ సేవే మాధవ సేవ" బృందావనంలో సమ్మర్ షవర్స్, 1973
http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf
“ఆరోగ్యకరంగా జీవించడం ఎలా? నా సొంత ఆరోగ్యం గురించి చెప్తాను. నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు, మీరు నమ్ముతారో లేదో, నా పద్నాలుగో ఏట నుండి నిరంతరంగా నా భరువు 108 పౌండ్లు మాత్రమే ఉంది. అది ఎప్పుడు 109 కి పెరగలేదు ల్లేదా 107కి తగ్గనులేదు. ఈ విధమైన సంతులనం మరియు నియంత్రణను మీరు సాధించినప్పుడు, మీరు ఆరోగ్యకరంగా జీవించగలుగుతారు. నేను అదనపు ఆహారాన్ని కొంచం కూడా తీసుకోను. భోజనానికి నన్ను ఒక లక్షాధికారి ఆహ్వానించినా లేదా ఒక భిక్షగాడు ఆహ్వానించినా నేను మితముగానే భుజిస్తాను. నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ, నా శరీరం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంది. నేను ఏ విధమైన నొప్పులతోను బాధపడడం లేదు మరియు నా గుండె ఒక రాతి వలె గట్టిగా ఉంది. నేను శ్రమించే విధముగా శ్రమించే వారు ఎవ్వరు లేరు. నా ధృడమైన ఆరోగ్యానికి కారణము నా నియంత్రిత ఆహార అలవాట్లు మాత్రమే. ఆహారం, భుద్ధి మరియు దైవం ....వీటిలో ఏకత్వం మరియు సామరస్యాన్ని సాధించడానికి, ఇదే మార్గం."
-సత్యసాయి బాబా, " అవతారం మరియు భక్తులు" దివ్యోపన్యాసం, 23 నవంబెర్, 1994
http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-31.pdf
ప్రశ్న జవాబులు
1. ప్రశ్న: కొన్ని సందర్భాలలో పూర్తిగా నయమైన దీర్ఘకాలిక వ్యాధి కొంత కాలం తర్వాత తిరిగి వస్తోంది. దీనికి కారణం ఏమిటి?
జవాబు: మన జీవన శైలి లేదా జీవిత మార్గం పై అవగాహన కలగడానికి, ఒక వ్యాధి ఏ విధంగా ఒక గొప్ప అవకాశాన్ని మనకి అందచేస్తుందన్న పరంగా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. వ్యాధి అనేది, దాని ద్వారా కలిగిన నొప్పి లేదా అసౌకర్యం పై మన దృష్టిని మళ్ళించే ఆవశ్యకతను మరియు మన జీవనశైలిలో పరివర్తన తీసుకువచ్చే ఆవశ్యకతను చూపించే ఒక ముఖ్యమైన సూచకం. జీవనశైలియంటే మన వైఖిరి, దుర్గుణాలు, ఆహారపు అలవాట్లు, పంచేంద్రియాల ద్వారా తీసుకొనే ఆహరం, వ్యాయామం, ఆలోచించే విధానం మొదలైనవి.
వైబ్రేషన్ల ద్వారా మాత్రమే రోగులకు చికిత్సంధించడం దీర్ఘకాల /శాశ్వతమైన పరిష్కారం కాదు. వైబ్రియానిక్స్ ఒక పూర్ణరూపాత్మకమైన చికిత్సా విధానం కనుక, వ్యాధి యొక్క మూలకారణాన్ని కనుగొనే విధంగా, శరీరం, మనస్సు మరియు ఆత్మ స్థాయిలను దృష్టిలో పెట్టుకొని, చికిత్సా నిపుణులు రోగులకు ఉత్తమమైన యోచనలు/సలహాలు చెప్పటం/చికిత్సందచేయడం వివేకముగల పద్ధతి. శాశ్వతమైన స్వస్థతను సమకూర్చే ఆరోగ్యకరమైన జీవన శైలిను పాటించడానికి, రోగి తరఫు నుండి జాగరూకగల లేదా చేతనముగల ప్రయత్నం అవసరం. ఈ దృష్టికోణంలో చికిత్సా నిపుణులు రోగుల జీవన విధానాలలో మరియు రోజువారి అలవాట్లలో పరివర్తన తీసుకు వచ్చే ఆదర్శ వ్యక్తులుగా ఉండవచ్చు. వ్యాధిని, మనలో పరివర్తన తీసుకురావడానికి దైవం యొక్క అనుగ్రహంగా భావించాలి.
________________________________________
2. ప్రశ్న: చికిత్సా నిపుణులుగా మేము మా కోసం తయారు చేసుకొనే వైబ్రో మందులు ఎల్లప్పుడు ఎందుకు పనిచేయవు?
జవాబు: రోగులకు ఉపశమనాన్ని అందచేసిన మిశ్రమాలు అదే సమస్యకు ఉపయోగించినప్పుడు కొంత మంది చికిత్సా నిపుణుల పై ప్రభావం చూపక పోవడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో కొన్ని:
- వేగంగా కోలుకోవాలన్న ఆందోళన కారణంగా చికిత్సా నిపుణులకు ఫలితాల పై ఎక్కువ ఆశక్తి ఉండవచ్చు. దీని కారణంగా సంపూర్ణ అర్పనా భావం ఉండకపోవచ్చు.
- సంప్రదింపు సమయంలో, రోగికి మందును ఇవ్వడానికి ముందుగా, రోగి సంబంధిత సమాచారాలను చికిత్సా నిపుణులు నిష్పాక్షికంగా రాసుకోవడం జరుగుతుంది. అయితే, తన కోసం మందులను తీసుకొనే సమయంలో, తన రోగానికి సంభందించిన సమాచారాలను విపులముగా రాసుకోక పోవచ్చు. దీని కారణంగా తన రోగం యొక్క మూలకారణం తెలుసుకొనే అవకాశం ఉండదు.
- రోగులు చికిత్సా నిపుణులను తమ వైద్యులుగా భావించి, చికిత్సా నిపుణులు తమకిచ్చే సూచనలను నమ్మకముగా పాటిస్తారు. అయితే ఒక చికిత్సా నిపుణుడు తీసుకోవలసిన జాగ్రతలను పాటించకపోవచ్చు మరియు తగిన మోతాదులో మందును తీసుకోకపోవచ్చు.
- స్వస్థతను సమకూర్చడానికి కావలసిన నిజమైన మందు మొదటి ప్రశ్న యొక్క జవాబులో మీకు లభిస్తుంది.
________________________________________
3. ప్రశ్న: వైబ్రో చికిత్స పై విశ్వాసం లేని రోగికి మందును ఇవ్వవచ్చా?
జవాబు: వైబ్రియానిక్స్ చికిత్స పై విశ్వాసం లేని ఒక వ్యక్తి మీ వద్దకు మందు కొరకు వస్తే కనుక, ఆ వ్యక్తికి మీరు మందును ప్రేమతో ఇవ్వాలి. అయితే, మందును తీసుకోమని, ఆ రోగిని ఒప్పించే ప్రయత్నం లేదా బలవంత పెట్టడం చేయరాదు. ముఖ్యంగా, రోగికి వైబ్రో చికిత్సను స్వీకరించడానికి లేదా నిరాకరించడానికి స్వేచ్చనివ్వాలి. రోగికి, చికిత్సా నిపుణుడిగా మీ పై పూర్తి విశ్వాసం ఉన్నంతవరకు మీ రోగికి, మీరిచ్చే మందుకి మధ్యలో అడ్డంకులేవి ఉండవు.
________________________________________
4. ప్రశ్న: వైబ్రో మందులు నీటిలో మరింత ప్రభావ వంతంగా ఉంటాయని అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. అయితే, ప్రస్తుతమున్న రోగులు ఈ కొత్త మార్పుకు నిరోధకంగా ఉంటున్నారు. మేము ఏమి చేయాలి?
జవాబు: మందులను గోలీల రూపంలో తీసుకోవడానికి అలవాటు పడిన రోగులకు నీటిలో కలిపి తీసుకోమని చెప్పడం కంటే కొత్తగా వచ్చే రోగులకు చెప్పడం చాలా సులభం (ఇది ఖచ్చితంగా ప్రతియొక్క రోగి విషయంలోనూ చేయాలి). ప్రస్తుతపు రోగులకు నీటిలో తీసుకోవడం కారణంగా మందు యొక్క సామర్ధ్యత పెరుగుతుందని తెలియచేయాలి. అయితే నీటిలో తీసుకోవడానికి సిద్ధంగా లేన రోగులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేయరాదు. ఇది రోగిలో ప్రతికూలమైన భావన కలగడానికి దారితీస్తుంది.
________________________________________
5. ప్రశ్న: ప్రక్షాళన మందును (క్లీన్సింగ్ రెమెడీ) ప్రతిరోజు పది నిమిషాలకు ఒకటి చప్పున రెండు గంటలు తీసుకోవచ్చా?
జవాబు: తీసుకోరాదు. ఎందుకంటే ప్రక్షాళన మందు, తీవ్ర తీసివేత (పుల్ అవుట్) ప్రక్రియను కలిగించే అవకాశముంది. అందువల్ల, సూచించబడిన విధముగా TDS మోతాదులో తీసుకోవడం మంచిది.
________________________________________
6. ప్రశ్న: ఎప్పుడైనా SRHVP ద్వారా ప్రతికూలమైన వైబ్రేషన్లను ఉత్పత్తి చేయవచ్చా?
జవాబు: లేదు. SRHVP ఎప్పుడు ప్రతికూలమైన వైబ్రేషన్లను ఉత్పత్తి చేయదు. అయితే ఇదే నమూనాలో ఉన్న ఇతర పరికరాల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. స్వామీ ఒక ఇంటర్వ్యు లో SRHVP దివ్యమైన వైబ్రేషన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని ధ్రువీకరణ చేసి చేప్పారు.
________________________________________
7. ప్రశ్న: మనం ఎప్పుడైనా SRHVP డయల్ను లాక్ చేయాలా?
జవాబు: డయల్ ను ఎప్పుడు లాక్ చేయరాదు. ప్రయాణం చేసే సమయంలో కూడా లాక్ చేసే అవసరం లేదు.
________________________________________
8. ప్రశ్న: స్వస్థతను ఇచ్చే వైబ్రేషన్లను నిరంతరంగా ప్రసరణ (బ్రాడ్ కాస్టింగ్)చేసే సమయంలో SRHVP యంత్రమును ఒక బట్టతోనో లేక ఒక ప్లాస్టిక్ కాగితంతో కప్పవచ్చా?
జవాబు: అవును, కప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా యంత్రంలోనున్న వెల్స్ లో దుమ్ము చేరకుండా రక్షించవచ్చు.
________________________________________
9. ప్రశ్న: మీకు తెలియకుండానే మీరు మీ రోగి యొక్క సమస్యలను తీసుకొనే అవకాశం ఉందా?
జవాబు: అవును, అవకాశముంది. కొందఱు చికిత్సా నిపుణులు ఇటువంటి అనుభవాలను మాకు తెలియచేసారు. ఒక రోగికి చికిత్సనంధించే సమయంలో, కర్త మీరు కాదన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా రోగులకు చికిత్సనిచ్చేది మీరు కాదు. ప్రేమతో సేవ చేయాలని, దైవాన్ని లేదా మీ అంతరాత్మను ప్రార్థించండి. సంపూర్ణ శరణాగతి భావంతో మీరు సేవ చేసినప్పుడు, రోగుల సమస్యల యొక్క ప్రభావం మీపై పడదు. దైవ ప్రార్థన మరియు శరణాగతి కారణంగా మీరు పూర్తిగా రక్షించబడతారు.
ప్రకటనలు
జరగనున్న శిక్షణా శిబిరాలు
ఇటలీ పడువా, వినైస్: పునశ్చరణ గోష్టి (రిఫ్రెషర్ సెమినార్) 2016 మే 21న, సంప్రదించవలసిన వ్యక్తి మనోలిస్, ఈ-మెయిలు చిరునామా: [email protected]
ఫ్రాన్స్ డోర్దోగ్నే: పునశ్చరణ గోష్టి మరియు AVP శిక్షణా శిబిరం 2016 జూన్ 18-19, సంప్రదించవలసిన వ్యక్తి డానియెల్, ఈ-మెయిలు చిరునామా: [email protected]
ఇండియా కాసర్గోడ్, కేరళ: AVP శిక్షణా శిబిరం 2-3 జూలై 2016, సంప్రదించవలసిన వ్యక్తి రాజేష్, ఈ-మెయిలు: [email protected] లేదా ఫోను నంబెర్: 8943-351 524 / 8129-051 524
ఇండియా పుట్ట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 14-18 జూలై 2016, సంప్రదించవలసిన వ్యక్తి హేమ, ఈ-మెయిలు: [email protected]
USA శేపెర్డ్స్ టౌన్, WV: AVP శిక్షణా శిబిరం 15-17 జూలై 2016, సంప్రదించవలసిన వ్యక్తి సూసన్ ఈ-మెయిలు [email protected]
అదనపు సమాచారం
కొనసాగుతున్న స్వామీ దీవెనలు..,
చికిత్సా నిపుణురాలు 12051 విజయవంతంగా ఒక రొమ్ము కాన్సెర్ రోగికి బెంగలూరులో చికిత్సనివ్వడంతో, అనేక భక్తులు ఆమెను వైబ్రో మందులు కోరారు. 2015 అక్తోబెర్ 15న, గురువారం రోజున, ఆమె ఒక భక్తుడింటికి చికిత్సనివ్వడం కోసం వెళ్ళడం జరిగింది. ఆమె తన 108CC పెట్టెను, దేవుడి మందిరం వద్ద పెట్టడం జరిగింది. కొద్ది నిమిషాలలో, ఆమె యొక్క 108CC పెట్టె మరియు వెల్నెస్ పెట్టె పైన సమృద్ధిగా విభూతిని ప్రసాదించడం ద్వారా స్వామి దీవెనలను అందించారు(చిత్రాన్ని చూడండి)
చికిత్సా నిపుణుడు02787, 2016 జనవరి 4న ధ్యానం పూర్తిచేసుకున్న తర్వాత తన 108CC పెట్టె పైన విభూతి ఉండడం చూసి ఆనందపడ్డారు. (చిత్రం చూడండి)
US మరియు కెనడా సమన్వయకర్త 01339 2016 జనవరి 10న, స్థానిక సాయి కేంద్రానికి ఒక సమావేశానికి హాజరైంది. ఆ తర్వాత, ఒక SVP యొక్క 108CC పెట్టెను రీచార్జ్ చేయాలని అనుకోని మాస్టర్ పెట్టెను దేవుని మందిరం వద్ద పెట్టింది. సమావేశం పూర్తయిన తర్వాత, ఆమె పెట్టిన మాస్టర్ పెట్టె పైన విభూతి ప్రసాదాన్ని చూసి ఎంతో సంబర పడింది.
సాయి యొక్క ప్రేమ మరియు దీవెనలతో
ఓం సాయి రామ్!