Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 16 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2025
అవలోకనం

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

డా. అగర్వాల్, నిస్వార్థ సేవాభావాన్ని ఎలా పెంపొందించుకోవాలో, మన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా తొలగించుకోవాలో, అలాగే వైబ్రియానిక్స్ సేవను స్వామి పదపద్మాలకు సమర్పించే పవిత్ర నైవేద్యంగా ఎలా మార్చుకోవాలో మనకు గుర్తుచేస్తున్నారు. ప్రతి స్థాయిలో ఉన్న ప్రాక్టీషనర్లు ఎలాంటి సంకోచం లేకుండా తమ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి, సేవా అవకాశాలను పెంపొందించుకోవడానికి ముందుకు రావాలని, అలాగే తమ సూచనలను కూడా పంచుకోవాలని ఆయన పిలుపునిస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో ఈ క్రింది 12 ఆసక్తికరమైన కేసులు పొందుపరచబడ్డాయి: తీవ్రమైన బహిష్టు నొప్పి; అలర్జిక్ రైనైటిస్; దీర్ఘకాలిక ఆసనద్వార పగుళ్లు; మోకాళ్ల ఆస్టియోఆర్థ్రైటిస్; అనేక ఆహార పదార్థాలకు అలర్జీ; అజీర్ణం (డిస్పెప్సియా); వంధ్యత్వం; కుక్కలో ఆస్టియోసార్కోమా; ఆస్టియోఆర్థ్రైటిస్; చిత్రాలతో కూడిన చీముపొక్కులు; ప్లాంటర్ ఫాసియైటిస్; మరొక మోకాళ్ల ఆస్టియోఆర్థ్రైటిస్.

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

2023లో అర్హత సాధించిన ఇద్దరు అంకితభావం గల ప్రాక్టీషనర్ల గురించి తెలుసుకోండి. మొదటి ప్రాక్టీషనర్ సాయి కుటుంబంలో జన్మించి, చురుకైన బాలవికాస్ గురువుగా, గాయనిగా సేవలందిస్తూ, దైవానుగ్రహంతో వైబ్రియానిక్స్ వైపు నడిపించబడ్డారు. సేవ పట్ల అంకితభావంతో, క్లిష్టమైన ప్రయాణాలు అవసరమైన దూర ప్రాంత ఆరోగ్య శిబిరాలకు కూడా వెనుకాడకుండా హాజరవుతూ, వివిధ రకాల మరపురాని స్వస్థత అనుభవాలను పంచుకుంటున్నారు. రెండవ ప్రాక్టీషనర్ చురుకైన సేవాదళ్ వాలంటీర్‌గా సేవలందిస్తూ, పదవీ విరమణ అనంతరం తన సమయాన్ని వైబ్రియానిక్స్ సేవకు అంకితం చేశారు. SVIRT కు ఖాతాల నిర్వహణలో వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు, కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు త్వరితగతిన, శాశ్వత ఫలితాలు పొందేందుకు వివిధ కాంబోలను రూపొందిస్తూ, వాటిలో కొన్నింటిని పంచుకుంటున్నారు.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్నలు జవాబులు

తెలుసుకోవడానికి చదవండి: 108CC పుస్తక సూచికలో కావలసిన రెమెడీ కనిపించనప్పుడు ఎలా ముందుకు సాగాలి? రోగిలో కనిపించే కొత్త లక్షణం పుల్‌అవుట్‌ అయినా కాకపోయినా దానిని ఎలా పరిష్కరించాలి? తాజా పరిశోధనల ఆధారంగా, మన ప్రగతిశీల దృక్పథానికి అనుగుణంగా, హోమియోపతి చికిత్స పొందుతున్న రోగికి వైబ్రియానిక్స్‌ను దానితో పాటు ఎలా ఇవ్వవచ్చు? అలాగే వైబ్రియానిక్స్‌ను ఇతర చికిత్సా విధానాలతో సురక్షితంగా కలిపి ఉపయోగించవచ్చా? స్వామి ఆశీర్వదించిన SRHVP ద్వారా ఉత్పన్నమయ్యే దివ్య స్పందనలను బలమైన విద్యుదయస్కాంత వికిరణాలు నిజంగా నిర్వీర్యం చేయగలవా? కొన్ని శస్త్రచికిత్సల అనంతరం బరువు తగ్గడానికి గల మూలకారణం ఏమిటి? అలాంటి పరిస్థితిని పరిష్కరించడంలో వైబ్రియానిక్స్ ఎలా సహాయపడుతుంది?

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్యవాణి

మంచి ఆరోగ్యం కోసం ఏమి ఆచరించాలో, సమాజ సేవలో విజయాన్ని సాధించేందుకు ఎలాంటి ఆచరణను అనుసరించాలో స్వామి ప్రేమతో మార్గనిర్దేశం చేస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో జరగనున్న వార్షిక సమావేశం, అలాగే భారతదేశంలోని పుట్టపర్తిలో నిర్వహించనున్న శిక్షణా శిబిరాల వివరాలు.

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

అదనంగా ఈ సంచికలో • “మన జీవరక్తమే మన జీవశక్తి! దానిని సంరక్షించండి!” అనే శీర్షికతో చిత్రాలతో కూడిన ఆరోగ్య వ్యాసం -రక్తంలోని ప్రధాన భాగాలు, రక్తం ఎలా ఏర్పడుతుంది, రక్తపరీక్షల ప్రాముఖ్యత, మన రక్తగ్రూపును తెలుసుకోవాల్సిన అవసరం, వివిధ రక్త సంబంధిత వ్యాధులు, అలాగే మరొకరి ప్రాణాన్ని కాపాడగల అమూల్యమైన కానుక అయిన రక్తదానం గురించి తెలుసుకోండి. • SVIRT, పుట్టపర్తిలో నిర్వహించిన వర్చువల్ SVP ఫాలో-అప్ కోర్సు, అలాగే ఆంధ్రప్రదేశ్ ద్విభాషా శిక్షణా శిబిరం గురించి చిత్రాలతో కూడిన సారాంశం. • అనుభవాలు: డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి – రోగి నుండి ప్రాక్టీషనర్ వరకు: ఒక కుటుంబం విశ్వాసంతో వేసిన గొప్ప ముందడుగు! • స్మరణాంజలి: తన జీవితపు చివరి రోజుల వరకు సేవ చేస్తూ వేలాది జీవితాలను స్పృశించిన కేరళకు చెందిన అంకితభావం గల ఒక ప్రాక్టీషనర్‌కు మన ఘన నివాళి.

పూర్తి వ్యాసం చదవండి