Vol 16 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2025
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన ప్రాక్టీషనర్లారా,
ఇటీవలే మనం పవిత్రమైన వినాయక చవితి పండుగను జరుపుకున్నాము. విఘ్నాలను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించే వినాయకుని ఆరాధించిన ఆనందంతో మన హృదయాలు నిండిపోయాయి. ఈ పండుగ మనకు బాహ్య ఆశీర్వాదాలను మాత్రమే కోరుకోవాలని కాకుండా, మన ఆధ్యాత్మిక పథంలో నిజమైన అడ్డంకులైన గర్వం, అహంకారం, స్వార్థాన్ని అంతర్గతంగా తొలగించుకోవడానికి కృషి చేయాలని కూడా గుర్తుచేస్తుంది.
స్వామి దీనిని సాధించడానికి అత్యంత నిశ్చితమైన మార్గాన్ని మనకు చూపించారు: “సేవ అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధన. ప్రార్థన, ధ్యానం, శాస్త్రజ్ఞానం, యోగ సాధనలలో ప్రావీణ్యం—ఇవన్నీ ద్వితీయ సహాయాలు మాత్రమే. అహంకారమనే దుష్ప్రభావాన్ని తొలగించడానికి సేవ అత్యంత సమర్థవంతమైన సాధనం. కాబట్టి సేవా భావాన్ని పెంపొందించుకోండి; ఇతరులకు నిస్వార్థ సేవను అందించడంలో ఆనందాన్ని పొందండి.” (వినాయక చవితి ప్రసంగం, 10 సెప్టెంబర్ 1979, ప్రశాంతి నిలయం)
వైబ్రియానిక్స్‌లో మనకు, ప్రతి రోగిని చూడటం, ప్రతి రెమెడీని అందించడం కేవలం స్వస్తత చేయడం మాత్రమే కాదు—అది ఆయన పద్మపాదాల వద్ద సమర్పించే పవిత్రమైన సేవ!
శతాబ్ది సమర్పణ కోసం పంపబడిన అసాధారణ అనుభవాలు మరియు కేసు చరిత్రలను పరిశీలిస్తున్నప్పుడు, అద్భుతమైన చికిత్సలను సూచించి, విశేషమైన ఫలితాలను సాధించిన మన ప్ప్రాక్టీషనర్ల అసాధారణ అనుభవాలు నన్ను ఎంతో ప్రేరేపించాయి. ఈ అనుభవాలు మనకు సమాజంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సేవ చేయగల అపారమైన సామర్థ్యం ఉందని మరోసారి నిర్ధారిస్తున్నాయి. SVP గా పదోన్నతి పొందాలని ఆకాంక్షిస్తున్న VP లందరూ తమ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా [email protected] కు ఇమెయిల్ చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. తదుపరి శిక్షణా కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబర్లో జరగనుంది (ప్రకటనల విభాగాన్ని చూడండి). ఈ ఉన్నత స్థాయి శిక్షణా కార్యక్రమానికి మరెంతో మందిని ఆహ్వానించగలమని ఆశిస్తున్నాము. అలాగే, మన ప్ప్రాక్టీషనర్ల సంఖ్యను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో, తగిన రోగులు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను వైబ్రియానిక్స్ సేవ అనే ఈ పవిత్ర మార్గాన్ని స్వీకరించేందుకు ప్రేరేపించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
ఈ వార్తాపత్రిక ప్రతి సంచికలో ఒకరు లేదా ఇద్దరు ప్ప్రాక్టీషనర్ల వైబ్రియానిక్స్ సేవా ప్రయాణాన్ని పరిచయం చేస్తున్నాము. ఇటీవల కొందరు కొత్త ఆలోచనలను సూచించారు—ఉదాహరణకు, ఇటీవల శిక్షణ పొందిన AVPలు/APల సమూహాలను పరిచయం చేయడం, దేశం లేదా రాష్ట్రం వారీగా జరుగుతున్న సేవను వివరించడం, లేదా పరిపాలన/బోధనా సేవలో నిమగ్నమైన వారిని ప్రత్యేకంగా పరిచయం చేయడం వంటివి. ఈ విభాగం మన సమాజానికి మరింత స్ఫూర్తినిచ్చేలా, వైబ్రియానిక్స్ సేవ యొక్క విస్తృతిని మరింత చక్కగా ప్రతిబింబించేలా చేయడానికి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే, దయచేసి [email protected] కు రాయండి.
ముఖ్యంగా భారతదేశంలో సేవా శిబిరాల ద్వారా వేలాది మంది రోగులకు సేవ అందుతున్న విషయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. పెద్ద ఎత్తున శిబిరాలను నిర్వహించి తమ సేవను విస్తరించాలనుకునే వారు, సహాయం అడగడానికి సంకోచించవలసిన అవసరం లేదు. SVIRT సిబ్బంది, అవసరమైన సామగ్రి మరియు నిర్వహణా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. సంకోచించకుండా [email protected] కు రాయండి. మనమందరం కలిసి మరింతమంది అవసరంలో ఉన్నవారిని చేరుకోవచ్చు.
పుట్టపర్తిలో కూడా సేవకు నిరంతర అవకాశాలు ఉన్నాయి. SVIRTలో, అలాగే ఆశ్రమంలోని లేడీస్ మరియు జెంట్స్ సేవాదళ్ భవనాల్లో వైబ్రియానిక్స్ క్లినిక్‌లు క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్నాయి. పుట్టపర్తిని సందర్శించే ప్ప్రాక్టీషనర్లు ఈ పవిత్రమైన క్లినిక్‌లలో తమ సమయాన్ని సేవకు అందించమని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ ప్రయాణ వివరాలు మరియు మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని [email protected] కు తెలియజేయండి. ఆయన దివ్య నివాసమైన పుట్టపర్తిలో మరింత ఎక్కువగా సేవ చేసే అవకాశాలను స్వామి మనకు ప్రసాదించాలని మనం నిరంతరం ప్రార్థిద్దాం.
నవంబర్‌లో 12 మంది కొత్త ప్ప్రాక్టీషనర్లకు శిక్షణ ఇచ్చేందుకు AVP వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నాము. వారు అర్హత సాధించిన తరువాత, వారి ప్రారంభ సేవా ప్రయాణంలో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేయడానికి రిమోట్ మెంటర్లు అవసరం ఉంటుంది. వైబ్రియానిక్స్ విస్తరిస్తున్న కొద్దీ, ఇతరులకు బోధించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్న అనుభవజ్ఞులైన ప్ప్రాక్టీషనర్ల అవసరం కూడా పెరుగుతోంది. ఈ మహోన్నతమైన సేవ కోసం VPలు మరియు SVPలు అందరూ ముందుకు వచ్చి, [email protected] కు రాయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తగిన శిక్షణ మరియు సహాయం అందించబడుతుంది. మెంటరింగ్ అనేది మన జ్ఞానం మరియు అనుభవాన్ని తదుపరి తరానికి అందించే ఒక అమూల్యమైన అవకాశం. గతంలో మెంటర్లుగా సేవ చేసిన అనేకమంది, ఈ ప్రక్రియ ద్వారా తమకే కొత్త అవగాహనలు కలిగాయని, ఎంతో నేర్చుకున్నామని పంచుకున్నారు. నిజంగా, స్వామి దివ్య సంకల్పానికి సాధనాలుగా మనమందరం కలిసి ఎదగడానికి ఇది ఒక ఆశీర్వాదకరమైన మార్గం.
వినాయక చవితి ఆనందోత్సవాల నుండి పొందిన దివ్య స్ఫూర్తిని మనతో ముందుకు తీసుకెళ్దాం. వినాయకుడు మరియు మన ప్రియమైన స్వామి మన అంతర్గత అడ్డంకులను తొలగించి, మన సేవను ఆశీర్వదించి, ప్రేమతో కూడిన సేవా మార్గంలో ప్రతి అడుగులో మనకు మార్గదర్శకత్వం వహించుగాక!
సాయికి ప్రేమపూర్వక సేవలో,
జిత్ కె. అగర్వాల్
తీవ్రమైన నెలసరి నొప్పి 11658...भारत
20 ఏళ్ల యువతి 2019లో తొలిసారి నెలసరి ప్రారంభమైనప్పటి నుంచి, గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెలా కింది పొత్తికడుపు మరియు వెన్నులో తీవ్రమైన నెలసరి నొప్పితో బాధపడుతోంది. సాధారణంగా ఆమెకు నెలసరి 3–4 రోజులు కొనసాగేది. మొదటి రెండు రోజుల్లో నొప్పి తీవ్రంగా ఉండటంతో, వైద్యులు సూచించిన నొప్పి నివారణ మందులను తీసుకునేది. రోజంతా పొత్తికడుపుపై వేడి కాపడం పెట్టుకోవాలని కూడా సూచించారు. అయినప్పటికీ కేవలం 20% మాత్రమే ఉపశమనం లభించేది. నొప్పి తీవ్రత ఆమె రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేది. రెండు రోజులపాటు కాలేజీకి కూడా వెళ్లలేకపోయేది. తన అత్త ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తరువాత, ఆమె ప్రాక్టీషనర్‌ను సంప్రదించింది.
1 మార్చి 2024న ఆమెకు క్రింది రెమెడి ఇవ్వడం జరిగింది:
CC8.7 Menses frequent…TDS
మార్చి 6న ప్రారంభమైన నెలసరి సమయంలో ఆమె అల్లోపతి మందులు మరియు వేడి కాపడం కొనసాగించింది.
చికిత్స పురోగతి:
- 8 మార్చి 2024: నొప్పిలో 50% మెరుగుదల.
- 12 ఏప్రిల్ 2024: 90% మెరుగుదల; ఎన్నో సంవత్సరాల తరువాత తొలిసారిగా నెలసరి సమయంలో కాలేజీ కు హాజరైంది.
- 10 మే 2024: అల్లోపతి మందులు లేదా వేడి కాపడం అవసరం లేకుండా నొప్పి పూర్తిగా తగ్గిపోయింది; మోతాదును BD కి తగ్గించారు.
- 12 అక్టోబర్ 2024: మోతాదును క్రమంగా తగ్గిస్తూ చివరకు రెమెడీని నిలిపివేశారు.
జూలై 2025 నాటికి, ఆమెకు నెలసరి సమయంలో ఎటువంటి నొప్పి లేకుండా కొనసాగుతోంది.
ముక్కుకు సంబంధించిన అలర్జీ సమస్య (అలెర్జిక్ రైనైటిస్) 11658...भारत
వృత్తిరీత్యా డ్రైవర్ అయిన ఒక 36 ఏళ్ల వ్యక్తి, జనవరి 2022 నుంచి శ్వాసకోశ అలర్జీతో బాధపడుతున్నారు. డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు కోవిడ్-19 తో బాధపడిన తన యజమానితో ఎక్కువసేపు కలసి ఉండటంతో ఆయనకు ఈ అలర్జీ మొదలైంది. ఆ తర్వాత, దుమ్ము, సీలింగ్ ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు మరియు డ్రైవింగ్ కారణంగా ఎక్కువై ప్రతిరోజూ తుమ్ములు మరియు ముక్కు కారడం జరుగుతుండేది.
2022 ఏప్రిల్‌లో ఆయుర్వేద చికిత్స మొదలుపెట్టి, ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో నాలుగు నెలల తరువాత దానిని నిలిపివేశాడు. 28 మార్చి 2023న అల్లోపతి చికిత్సను ప్రారంభించాడు. ఇందులో నోటి ద్వారా తీసుకునే మందులు మరియు నాసల్ స్ప్రే ఉన్నాయి. డిసెంబర్లో ఉపశమనం లేకపోవడంతో నోటి మందులను నిలిపి వేసి, చాలా స్వల్పమైన ఉపశమనం కలిగినా నాసల్ స్ప్రేను మాత్రమే కొనసాగించాడు. ఆర్థిక పరిమితుల కారణంగా ప్రత్యామ్నాయ చికిత్స కోసం చూస్తున్న సమయంలో వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుని, 21 మే 2024 న ప్రాక్టీషనర్‌ను కలవగా అతనికి ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:
#1. IB (vol 13 #5)…OD
#2. Covid recuperation (vol 12 #4)…OD, రెండింటినీ రెండు వారాల పాటు ఇచ్చారు. అతను నాసల్ స్ప్రేను కొనసాగించాడు.
చికిత్స పురోగతి:
- 4 జూన్ 2024: శరీర శుద్ధి కోసం #3. CC17.2 Cleansing…TDSను 15 రోజుల పాటు ఇచ్చారు.
- 22 జూన్ 2024: అలెర్జీ కోసం #4. CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic…TDS ఇచ్చారు.
- 4 జూలై 2024: లక్షణాల్లో ఎటువంటి మార్పు లేదు. అందువల్ల #4ను #5. CC19.5 Sinusitis + #4 గా మెరుగు పరచి, ఈ కాంబోను డిస్టిల్డ్ వాటర్‌లో కూడా కలిపి నాసల్ డ్రాప్స్ గా, రెండింటినీ TDSగా ఇచ్చారు.
- 7 జూలై 2024: తుమ్ములు పూర్తిగా ఆగిపోయాయి. గత మూడు రోజుల్లో ఒక్కసారి మాత్రమే స్వల్పంగా ముక్కు కారింది. ఇకపై అల్లోపతి నాసల్ స్ప్రే అవసరం లేకపోయింది.
- 28 జూలై 2024: గత మూడు వారాల్లో మళ్లీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదు.
- 9 ఆగస్టు 2024: మోతాదును BDకి తగ్గించారు.
- 30 అక్టోబర్ 2024: మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత రెమెడీని నిలిపివేశారు.
2025 నాటికి రోగి ఆరోగ్యంగా ఉన్నాడు. SOS అవసరానికి #5 ను తన వద్ద ఉంచుకున్నప్పటికీ, గత ఒక సంవత్సరంలో సమస్య మళ్లీ పునరావృతం కాలేదు.
దీర్ఘకాలిక మలద్వార పగుళ్లు (క్రానిక్ అనల్ ఫీస్సర్స్) 11654...भारत
50 ఏళ్ల గృహిణి 2020 జనవరిలో ఫీసురెక్టమీ (మలద్వార పగుళ్లు తొలగించే ఆపరేషన్) చేయించుకున్నారు. అంతకుముందు ఐదు నెలలుగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స జరిగిన కొద్దికాలానికే మళ్లీ కొత్త పగుళ్లు ఏర్పడ్డాయి. వాటితో చర్మపు చిన్న మాంసపు పెరుగుదల (స్కిన్ ట్యాగ్), మల విసర్జన సమయంలో నొప్పి, మలద్వారం వాపు, తీవ్రమైన నొప్పి మరియు అప్పుడప్పుడు చీము గడ్డలు కూడా ఏర్పడేవి. ఈ సమస్యలు సాధారణంగా గట్టి మలం కారణంగా తీవ్రమయ్యేవి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి ప్రతి నెలా తప్పనిసరిగా చేయాల్సి వచ్చే సుదీర్ఘ కారు ప్రయాణాల సమయంలో ఇవి ఎక్కువగా పునరావృతమయ్యేవి. ఈ పరిస్థితి కారణంగా నడవడం లేదా కూర్చోవడం కూడా అసౌకర్యంగా మారి, ఆమె మెరుగైన జీవన ప్రమాణంపై తీవ్ర ప్రభావం చూపింది.
మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవాలనే భయంతో ఆమె తదుపరి అల్లోపతి వైద్య సంప్రదింపులను నివారించారు. బదులుగా హోమియోపతి, పైపూతగా ఉపయోగించే అల్లోపతి మరియు ఆయుర్వేద క్రీములు, ఆహారంలో మార్పులు వంటి వాటిపై ఆధారపడ్డారు. ఈ విధానంతో వాపు మరియు నొప్పి సుమారు 20 రోజుల్లో తగ్గిపోయేవి, అయితే తదుపరి సుదీర్ఘ ప్రయాణంతో మళ్లీ సమస్య పునరావృతమయ్యేది. సమస్య తీవ్రమైన సందర్భాల్లో అల్లోపతిలో మలాన్ని మెత్తగా చేసే మందులు తీసుకునేవారు.
సులభమైన మరియు మరింత ప్రభావవంతమైన పరిష్కారం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ, ఆమె వైబ్రియానిక్స్‌ను ఆశ్రయించారు. 5 మే 2023న తొలిసారి వచ్చినప్పుడు, రెండు రోజుల పాటు గట్టి మలం కారణంతో మలద్వారం వద్ద నాలుగు పగుళ్లు, చీము గడ్డలు, చర్మపు చిన్న మాంసపు పెరుగుదల, అలాగే వాపుతో పాటు నొప్పి ఉన్నట్లు ఆమె తెలిపారు. క్రీములతో సహా ఇతర అన్ని మందులను ఆమె అప్పటికే నిలిపివేశారు. ఆమెకు ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:
#1. CC4.4 Constipation + CC15.1 Mental & Emotional tonic…TDS
చికిత్స పురోగతి:
- 12 మే 2023: వాపు మరియు నొప్పిలో 20% మెరుగుదల. #1ను పెంచి: #2. CC2.3 Tumours & Growths + #1…TDS ఇచ్చారు.
- 1 జూన్ 2023: వాపు పూర్తిగా తగ్గిపోయింది. ప్రయాణ సమయంలో కూడా గట్టి మలం రాలేదు. చర్మపు చిన్న మాంసపు పెరుగుదల పరిమాణం తగ్గింది. పగుళ్లు, చీము గడ్డలు మరియు నొప్పిలో 30% మెరుగుదల కనిపించింది. నీటిలో కలిపి స్ప్రే చేయడానికి #3. CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing…BDను జోడించారు
- 10 జూన్ 2023: మొత్తం మీద 60% మెరుగుదల; కడుక్కునే సమయంలో మాత్రమే నొప్పి ఉండేది. #2ను పెంచి #4. CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC21.11 Wounds & Abrasions + #2…TDS ఇచ్చారు.
- 17 జూన్ 2023: 80% మెరుగుదల. పగుళ్లు మరియు అబ్సెస్లు ఇంకా కొద్దిగా ఉన్నట్లు అనిపించాయి. #3 స్థానంలో వాజ్లిన్లో #5. CC20.2 SMJ Pain + CC21.11 Wounds & Abrasions…BDను కలిపి పైన పూతగా రాయడానికి ఇచ్చారు.
- 24 జూన్ 2023: నాలుగు పగుళ్లు మరియు చీము గడ్డళ్లలో మూడు పూర్తిగా నయం అయ్యాయి. నడిచేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు ఉండే నొప్పి 85% తగ్గింది. స్కిన్ ట్యాగ్ 50% తగ్గింది. మరింత స్వస్థతకు సహాయపడేందుకు #4ను పెంచి #6. CC10.1 Emergencies + CC20.4 Muscles & Supportive tissue + #4. అలాగే #5ను పెంచి #7. CC4.4 Constipation + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue + #5 ఇచ్చారు
- 8 జూలై 2023: ఒక పగులు మరియు చీము గడ్డ ఇంకా అలాగే వున్నాయి. #6 మరియు #7ను ఒక వారం పాటు నిలిపివేశారు. ఆ సమయంలో శరీర శుద్ధి కోసం #8. CC17.2 Cleansing…TDS ఇచ్చారు.
- 27 జూలై 2023: అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించారు. #6ను 10 రోజుల పాటు ODకి తగ్గించి, తరువాత రెమెడీలను క్రమంగా తగ్గిస్తూ నిలిపివేయమని సూచించారు.
- 9 ఆగష్టు 2023: తల్లి ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె రెమెడీలను కొనసాగించలేకపోయారు.
ఒక సంవత్సరానికి పైగా ఆమె ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నారు. ఒత్తిడి మరియు తరచూ ప్రయాణాలు ఉన్నప్పటికీ సమస్య పునరావృతం కాలేదు. అయితే 13 డిసెంబర్ 2024న లక్షణాలు మళ్లీ కనిపించాయి. ఆమె ఆ సమయంలో పట్టణానికి బయట ఉండటంతో, 6 ఫిబ్రవరి 2025 వరకు హోమియోపతి చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఉపశమనం లభించలేదు. నొప్పి మరింత తీవ్రమవడంతో 10 ఫిబ్రవరి 2025న ఆమె మళ్లీ ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. ఆమెకు రోజుకు 3–4 సార్లు మల విసర్జన జరుగుతోంది. అందులో కనీసం ఒకసారి గట్టి మలం ఉండేది. మల విసర్జన తరువాత 5–6 గంటల పాటు తీవ్రమైన నొప్పి కొనసాగేది. స్కిన్ ట్యాగ్ కూడా మళ్లీ ఏర్పడింది. ఆమెకు #9. CC3.2 Bleeding disorders + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + #6 ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, ఒక గంటపాటు, ఆ తరువాత రోజుకు మూడు సార్లు ఇవ్వమని సూచించారు. అలాగే #7…కొబ్బరి నూనెలో కలిపి BD , నీటిలో 6TDగా స్ప్రే చేయమని ఇచ్చారు.
- 3 Mar 2025: అన్ని లక్షణాల్లో 50% మెరుగుదల. #9ను 6TDకి తగ్గించారు
- 10 Mar 2025: లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. #7ను నిలిపివేశారు. #9ను TDSకి, తరువాత 10 మే 2025న ODకి తగ్గించారు.
ఆగస్టు 2025 నాటికి సమస్య మళ్లీ పునరావృతం కాలేదు. అయితే నిర్వహణ కోసం రోగి #9ను OD గా కొనసాగిస్తున్నారు.
సంపాదకుని గమనిక: లక్షణాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రాక్టీషనర్ #9కు సాధారణ మోతాదు విధానానికి భిన్నంగా ఉద్దేశపూర్వకంగా మోతాదును నిర్ణయించారు.
మోకాళ్ళ అరుగుదల 11654...भारत
71 ఏళ్ల సన్నగా ఉన్న వ్యక్తి 2021లో ప్రారంభమైన, మూడు సంవత్సరాలుగా క్రమంగా తీవ్రమవుతున్న మోకాళ్ల సమస్యతో ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న తరువాత మొదట కుడి మోకాలిలో స్వల్ప నొప్పి, క్లిక్ అనే శబ్దం ప్రారంభమయ్యాయి. మార్చి 2023లో స్వైన్ ఫ్లూ వచ్చిన తరువాత సమస్య మరింత తీవ్రమైంది. మోకాలి ప్యాడ్లు ధరించడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆయన పరిస్థితిని నిర్వహించుకున్నారు. జూలై 2023 నాటికి ఎడమ మోకాలు కూడా ప్రభావితమైంది. మార్చి 2024లో మరో వైరల్ అనారోగ్యం వచ్చిన తరువాత నొప్పి మరింత పెరిగి, వాపు మరియు ఉదయం వేళల్లో మోకాళ్ల బిగుతు (morning stiffness) ఏర్పడ్డాయి. ఆయనకు ఆర్థోపెడిక్ వైద్యుడు నోటి ద్వారా తీసుకునే నొప్పి నివారణ మందులు, లేపనం, కాల్షియం మరియు మోకాలి ప్యాడ్లను సూచించారు. ఆయన నొప్పి నివారణ మందులు తీసుకోవడానికి నిరాకరించారు. ఒక నెలపాటు లేపనం మరియు కాల్షియం ఉపయోగించినా ప్రయోజనం లేకపోయింది; మోకాలి ప్యాడ్ల వల్ల పరిమిత ఉపశమనం మాత్రమే లభించింది. మార్చి 2024 నుంచి మూడు నెలలపాటు ఆయుర్వేద చికిత్స తీసుకున్నప్పటికీ ప్రయోజనం కలగలేదు.
మే 2024 నాటికి, ముఖ్యంగా కదిలేటప్పుడు నొప్పి మరియు బిగుతు మరింత తీవ్రమయ్యాయి. ఒక స్నేహితుడి సలహాతో ఆయన ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. ఆ సమయంలో ఆయన రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు, బిగుతుతో కుంటుకుంటూ నడుస్తున్నారు. మోకాళ్లను వంచడం లేదా మోకాలి ప్యాడ్లు ధరించడం కూడా సాధ్యమయ్యేది కాదు. వైబ్రియానిక్స్ మరియు భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో, ఆయన 25 మే 2024న చికిత్స ప్రారంభించారు:
#1. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis… మొదటి రోజు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చొప్పున ఆరు సార్లు, తరువాత రోజు నుండి రోజుకు మూడు సార్లు చొప్పున. అదనంగా రోజులో పలుమార్లు నీటిలో కలిపి స్ప్రే చేయడం, అలాగే ఆవ నూనెలో కలిపి BDగా.
చికిత్స పురోగతి:
Ø 25 మే 2024: ప్రారంభంలో నొప్పి కొద్దిగా పెరిగింది, అయితే భరించగలిగే స్థాయిలోనే ఉంది. రెండు రోజుల్లో నొప్పి తగ్గిపోయింది. 1 జూన్ 2024న ఆర్థోపెడిక్ వైద్యుడిని తిరిగి కలవాల్సి ఉంది. స్కాన్ చేసిన తరువాత వైద్యుడు వెంటనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే రోగి ఆ తరువాత మళ్లీ ఆ వైద్యుడిని కలవలేదు!
Ø 15 జూన్ 2024: కుడి మోకాలిలో నొప్పి మరియు వాపు 50% తగ్గాయి, ఎడమ మోకాలిలో 30% తగ్గాయి. సాధారణంగా నడవగలిగారు.
Ø 19 జూన్ 2024: శారీరక శ్రమ తరువాత రెండు మోకాళ్లలోనూ లక్షణాలు మళ్లీ కనిపించాయి. విశ్రాంతి తీసుకోవాలని, #1ను కొనసాగించాలని సూచించారు.
Ø 3 జూలై 2024: కుడి మోకాలిలో 70%, ఎడమ మోకాలిలో 50% మెరుగుదల. మోకాళ్లపై ఒత్తిడి పడినప్పుడు మాత్రమే నొప్పి ఉండేది. ఉదయం వేళల్లో నొప్పి లేదా వాపు ఇక లేదు. స్నానం చేయడానికి అరగంట ముందు ఆవాల నూనెను పూయడం ద్వారా నొప్పిలో వెంటనే ఉపశమనం లభించింది.
Ø 12 జూలై 2024: కుడి మరియు ఎడమ మోకాళ్లలో వరుసగా 80% మరియు 65% మెరుగుదల.
Ø 31 జూలై 2024: మోకాలి ప్యాడ్ లేకుండా నడిచినప్పుడు కుడి మోకాలిలో స్వల్ప వాపు మరియు నొప్పి. ఎడమ మోకాలిలో 90% మెరుగుదల, తాకినప్పుడు స్వల్ప నొప్పి మాత్రమే. #1ను రోజుకు మూడు సార్ల నుంచి రెండు సార్లకు తగ్గించారు.
Ø 9 ఆగస్టు 2024: మోకాలి ప్యాడ్లు లేకుండా నడిచినా లేదా మోకాళ్లను తాకినా నొప్పి లేదా వాపు లేదు.
Ø 7 సెప్టెంబర్ 2024: #1ను ఒక వారం పాటు 6TD, తరువాత ఒక నెలపాటు TDSకి తగ్గించారు. ఎక్కువ దూరం నడిచినప్పుడు అప్పుడప్పుడు వచ్చే స్వల్ప నొప్పి, నూనె రెమెడీ పూయడంతో తగ్గిపోయింది.
Ø 29 సెప్టెంబర్ 2024: కీళ్ల ఆరోగ్యం కోసం కొల్లాజెన్ సప్లిమెంట్ తీసుకున్న తరువాత నొప్పి మరియు వాపు తిరిగి వచ్చాయి. #1 స్థానంలో #2. CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + Bitter leaf Potentised* 1M…6TD మరియు ఆవ నూనెలో…BD, దీనివల్ల త్వరగా ఉపశమనం లభించింది.
Ø 19 అక్టోబర్ 2024: వాపు 50% తగ్గింది; నడిచేటప్పుడు మాత్రమే నొప్పి ఉండేది.
Ø 2 జనవరి 2025: శారీరక శ్రమ లేదా బయట నడిచేటప్పుడు మాత్రమే నొప్పి మరియు వాపు ఉండేవి. ఇంట్లో మాత్రం మోకాలి ప్యాడ్లు అవసరం లేకుండా పోయాయి.
Ø 21 జనవరి 2025: ఎక్కువ శ్రమ చేసినప్పుడు మాత్రమే స్వల్ప నొప్పి మరియు వాపు ఉండేవి. #2ను TDSకి తగ్గించారు.
Ø 6 ఫిబ్రవరి 2025: లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. రెమెడీలను క్రమంగా తగ్గించిన తరువాత 6 ఏప్రిల్ 2025న పూర్తిగా నిలిపివేశారు. ఇకపై మోకాలి ప్యాడ్లు కూడా అవసరం లేకపోయాయి.
ఆగస్టు 2025 నాటికి, వ్యాధి మళ్లీ తిరగబెట్టలేదు; రోగి తన సాధారణ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. తాను భయపడిన పెద్ద శస్త్రచికిత్సను నివారించగలిగినందుకు సాయివైబ్రియానిక్స్ పట్ల తన ఆనందాన్ని, కృతజ్ఞతను ఆయన వ్యక్తం చేశారు. చికిత్స ద్వారా వచ్చిన సానుకూల ఫలితంతో ప్రభావితుడైన ఆయన, ఇప్పుడు తన ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య కూడా సాయివైబ్రియానిక్స్ చికిత్స తీసుకుంటున్నారు.
సంపాదకుల గమనిక: ప్రాక్టీషనర్ ఎముకల సంబంధిత సమస్యలకు బిట్టర్ లీఫ్ తో శక్తివంతం గావించిన రెమెడీని విజయవంతంగా ఉపయోగించారు.
చాలా ఆహార పదార్ధాలకు ఎలర్జీ 10001...भारत
దుబాయ్‌కు చెందిన 10 ఏళ్ల బాలిక, తన తల్లితో కలిసి భారతదేశానికి వచ్చినప్పుడు, చాలా కాలంగా కొనసాగుతున్న అలెర్జీ లక్షణాలకు చికిత్స కోసం సంప్రదించింది. 2021 నుంచి రెండు సంవత్సరాలుగా ఆమెకు పదేపదే తీవ్రమైన తుమ్ముల దాడులు, ఆ తరువాత ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడేవి. ముక్కు బాగా మూసుకుపోవడం వల్లే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఉండవచ్చని భావించారు. యాంటీ-అలెర్జీ మాత్రలు తీసుకున్నప్పటికీ, ప్రతి ఎపిసోడ్ సుమారు ఒక వారం పాటు కొనసాగేది.
ఈ సమస్యలు ముఖ్యంగా ఆవు పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులతో పాటు స్ట్రాబెర్రీలు, నారింజ మరియు ఇతర సిట్రస్ పండ్లు తిన్నప్పుడు తప్పకుండా ప్రేరేపించబడేవి. ఈ ఆహార పదార్థాలను నివారించడం చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఆమెకు ఎప్పటినుంచో ఎంతో ఇష్టమైన ఆహారం కావడంతో మరింత ఇబ్బందిగా ఉండేది. 2022లో 2–3 నెలలు హోమియోపతి చికిత్స తీసుకున్నప్పటికీ ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఈ పరిస్థితి తల్లీకూతుళ్లిద్దరికీ ఎంతో బాధను కలిగించింది.
5 జనవరి 2023న, తల్లి అభ్యర్థన మేరకు, ప్రాక్టీషనర్ మొదట పాల ఉత్పత్తుల వల్ల వచ్చే అలెర్జీపై చికిత్స ప్రారంభించారు:
#1. Cow milk Potentised 200C…TDS
చికిత్స పురోగతి:
Ø 5 మార్చి 2023: ఆవు పాలు మరియు పనీర్‌ను జాగ్రత్తగా ఆహారంలో తిరిగి ప్రవేశపెట్టడం ప్రారంభించారు.
Ø 15 మార్చి 2023: పై ఆహార పదార్థాలను తీసుకున్న తరువాత ఎటువంటి అలెర్జీ లక్షణాలు కనిపించలేదు. #1ను ODకి తగ్గించారు.
Ø 12 ఏప్రిల్ 2023: మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత #1ను నిలిపివేసి పండ్ల వల్ల వచ్చే అలెర్జీ కోసం #2. Strawberry & orange Potentised 200C…TDS ఇచ్చారు.
Ø 19 మే 2023: స్ట్రాబెర్రీ లేదా సిట్రస్ పండ్లు తిన్న తరువాత ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. #2ను ODకి తగ్గించారు.
Ø 15 జూన్ 2023: మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత #2ను పూర్తిగా నిలిపివేశారు
ఆగస్టు 2025 నాటికి, బాలిక ఎటువంటి సమస్య పునరావృతం లేకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను ఆనందంగా తీసుకుంటోంది.
అజీర్ణం 11618...भारत
35 ఏళ్ల ఫైనాన్షియల్ అనలిస్ట్ 2013 నుంచి ఏడు సంవత్సరాలుగా పై పొత్తికడుపులో నొప్పితో బాధపడుతున్నారు. ప్రారంభంలో నొప్పి స్వల్పంగా ఉండేది. ప్రతి 3–4 నెలలకు ఒకసారి వచ్చి, 2–3 రోజులు కొనసాగేది. మజ్జిగ తాగడం మరియు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉపశమనం లభించేది. 2015 నాటికి, నొప్పి ప్రతి 1–2 నెలలకు ఒకసారి రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా రాత్రి షిఫ్టుల్లో పనిచేసేటప్పుడు తీవ్రమైన వికారం కూడా ఉండేది. క్రమం లేని పని వేళల కారణంగా ఏర్పడిన అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి మరియు తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం దీనికి కారణమని ఆయన భావించారు.
2016లో, డాక్టర్ ఆయనకు అజీర్ణం ఉన్నట్లు నిర్ధారించి కడుపులోని ఆమ్లాన్ని తగ్గించే మందులు సూచించారు. వాటిని మూడు నెలలు తీసుకున్న సమయంలో లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే మరో మూడు నెలల తరువాత మళ్లీ లక్షణాలు ప్రారంభమయ్యాయి. మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆందోళనతో, ఈ చికిత్సను కొనసాగించడానికి ఆయన ఇష్టపడలేదు. అక్టోబర్ 2017లో ఆరు నెలల పాటు హోమియోపతి చికిత్స తీసుకున్నారు. జూలై 2018లో మూడు నెలల పాటు ఆయుర్వేద చికిత్సకు మారారు. ఈ రెండు చికిత్సలతో మంచి ఉపశమనం లభించినప్పటికీ, మందులు ఆపిన కొద్దికాలానికే లక్షణాలు మళ్లీ రావడం కొనసాగింది. తరువాతి రెండు సంవత్సరాల్లో ఆయన పరిస్థితి క్రమంగా మరింత తీవ్రమైంది. ఇప్పుడు తీవ్రమైన నొప్పి దాడులతో పాటు వికారం, అప్పుడప్పుడు మలబద్ధకం మరియు స్వల్పంగా రక్తం కలిసిన మలం కూడా ఉండేవి. ఈ ఘటనలు ప్రతి 2–3 నెలలకు ఒకసారి వచ్చి, సుమారు ఒక వారం పాటు కొనసాగేవి.
పరిస్థితి తీవ్రత పెరుగుతున్నప్పటికీ, ఇతర సమయాల్లోనూ మరియు కార్యాలయ సమయంలో కూడా తరచుగా కొద్దిసేపు నడవడం మినహా ఆయన ఎలాంటి ఇతర చికిత్స తీసుకోలేదు; ఇలా నడవడం ఆయనకు కొంత ఉపశమనాన్ని కలిగించేది. అయన పనిచేసే చోట ఒక సహోద్యోగి ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుని, 14 జూన్ 2020న ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. అదే సమయానికి ఆ నొప్పి రెండు రోజుల క్రితమే ఆయనకు ప్రారంభమైంది. ప్రాక్టీషనర్ ఆయనకు ఈ క్రింది రెమెడీ ఇచ్చారు:
CC4.2 Liver & Gallbladder tonic + CC4.4 Constipation + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…TDS
దీనితో పాటు తన దినచర్యలో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేర్చుకోవాలని, వీలైనంత వరకు అర్ధరాత్రి సమయంలో తినడం నివారించాలని సూచించారు.
చికిత్స పురోగతి:
- 17 జూన్ 2020: నొప్పి మరియు వికారంలో 30% మెరుగుదల. మల విసర్జన సాధారణమైంది.
- 20 జూన్ 2020: అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక తరచుగా నడవాల్సిన అవసరం లేకపోయింది.
- 15 సెప్టెంబర్ 2020: రెమెడీ ప్రారంభించినప్పటి నుంచి ఎటువంటి క్రొత్త లక్షణాలు రాలేదు.
- 30 సెప్టెంబర్ 2020: బాటిల్లోని రెమెడీ పూర్తవడంతో దానిని నిలిపివేశారు. అయితే మోతాదును క్రమంగా తగ్గించే విధానాన్ని ఆయన పాటించలేదు.
ఆగస్టు 2025 నాటికి, సమస్య మళ్లీ పునరావృతం కాలేదు. రోగి ఇప్పటికీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా తన నడకను కొనసాగిస్తున్నారు.
సంతానలేమి 11618...भारत
ఒక జంట (2020 నాటికి మహిళ వయసు 40 సంవత్సరములు మరియు భర్త వయసు 45 సంవత్సరములు) 2004లో వివాహం జరిగినప్పటి నుంచి 16 సంవత్సరాలుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు. వారు ఎప్పుడూ ఎలాంటి గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించలేదు. భార్యకు జనవరి 2011 వరకు నెలసరి సక్రమంగా, క్రమం తప్పకుండా వచ్చేది. ఆ సమయంలో ఆమెకు ఎక్కువ రోజులు కొనసాగే అధిక రక్తస్రావంతో కూడిన నెలసరి సమస్య ప్రారంభమైంది. పరీక్షల అనంతరం ఆమెకు హైపోథైరాయిడిజం మరియు ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమెకు థైరాయిడ్ మందులు సూచించడంతో పాటు లాపరోస్కోపీ నిర్వహించారు. ఒక నెలలోనే రక్తస్రావం సాధారణ స్థితికి వచ్చింది, అయితే నెలసరి క్రమబద్ధంగా మాత్రం కొనసాగలేదు. మరో మూడు సంవత్సరాలు గడిచినా గర్భధారణ జరగకపోవడంతో, 2014లో వారు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వాటిలో భార్య అండాల నాణ్యత తక్కువగా ఉందని, భర్తకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు వాటి నాణ్యత కూడా సరిగా లేదని తేలింది. ఈ సంవత్సరాలన్నింటిలో వారు భారతదేశంలోనూ, విదేశాల్లోనూ అనేక మంది వైద్యులను సంప్రదించారు. అయినప్పటికీ, 2017 నుంచి 2019 మధ్య చేసిన మూడు IVF (టెస్ట్ ట్యూబ్ బేబీ) చికిత్సలతో సహా అన్ని చికిత్సలు విఫలమయ్యాయి. ఈ కాలం వారిద్దరికీ ఎంతో బాధాకరంగా, నిరాశాజనకంగా గడిచింది.
2020లో వారు ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. ఆ సమయంలో భార్య, ప్రాక్టీషనర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడుతూ సంతానం కలగకపోవడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడిని, విమర్శలను ఎదుర్కొంటున్నానని ఆమె కన్నీళ్లతో పంచుకున్నారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో ఆమె మరింత కలత చెందారు. అలాగే, రెండు సంవత్సరాలుగా, ఆమె కడుపులో మంటతో బాధపడుతున్నారు. ఈ మంట కొన్ని నిమిషాల పాటు ఉండేది, అయితే ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి తిరిగి వచ్చేది. ఇందుకోసం ఆమె ఎలాంటి చికిత్స తీసుకోలేదు. ఆమె పైకి గంభీరంగా కనిపించినా ఎంతో నిరాశకు లోనైనట్లు కనిపించారు. ఆమె అనుభవిస్తున్న బాధను చూసి ప్రాక్టీషనర్ ఎంతగానో చలించిపోయి, 4 ఆగస్టు 2020న దైవానికి హృదయపూర్వక ప్రార్థనలు చేస్తూ, క్రింది రెమెడీలను సిద్ధం చేశారు:
భార్య కోరకు: CC4.10 Indigestion + CC6.2 Hypothyroid + CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders…TDS
భర్త కోరకు: CC10.1 Emergencies + CC14.1 Male tonic + CC14.3 Male infertility + CC15.1 Mental & Emotional tonic…TDS
చికిత్స పురోగతి:
- 15 అక్టోబర్ 2020: భార్య థైరాయిడ్ స్థాయులు సాధారణ స్థితికి వచ్చాయి. డాక్టరు థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించారు. డిసెంబర్ 2020లో మందులను పూర్తిగా నిలిపివేశారు. పొత్తికడుపులో మంట కూడా పూర్తిగా తగ్గిపోయింది. దంపతులు ఎంతో ప్రశాంతత పొందారు.
- 2 జనవరి 2021: భార్య గర్భం దాల్చి రెమెడీలను నిలిపివేశారు.
- 10 అక్టోబర్ 2021: ఆరోగ్యవంతమైన మగ శిశువు సాధారణ ప్రసవం ద్వారా జన్మించాడు!
కుక్కకు ఎముక క్యాన్సర్ 02876...यूएसए
ప్రాక్టీషనర్కు చెందిన షెల్బీ అనే ఆడ జర్మన్ షెపర్డ్ కుక్క థెరపీ కుక్క గా శిక్షణ పొందింది. ఆమెను కలిసిన ప్రతి ఒక్కరికీ ఆమె ఎంతో ఓదార్పును, ఆనందాన్ని కలిగించేది. ఆమెకు కేవలం ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు, 2000 నవంబర్‌లో, ఎక్సోక్రైన్ ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియెన్సీ (బాహ్యస్రావ క్లోమ లోపం) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ పరిస్థితిలో క్లోమం (ప్యాంక్రియాస్) జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోతుంది. దీనిని క్రియాన్ అనే మనుషుల కోసం ఉపయోగించే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ మందుతో నియంత్రించారు. దాని సహాయంతో ఆమె ఆరోగ్యంగా, సాధారణ జీవితాన్ని గడపగలిగింది.
2012లో, ఆమె వెనుక కుడి కాలిలో ఆస్టియోసార్కోమా (ఎముక క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది తీవ్రమైన నొప్పిని కలిగించే, వేగంగా అభివృద్ధి చెందే వ్యాధి; దీనివల్ల కాలును తొలగించాల్సి వస్తుంది. అందువల్ల, ఆసుపత్రిలో ఆమెకు ముందుగా ఒకసారి రేడియేషన్ థెరపీ ఇచ్చి, ఆ తరువాత మూడు వారాల పాటు కీమోథెరపీ ఇవ్వాలని చికిత్స ప్రారంభించారు. అదే సమయంలో, 12 సెప్టెంబర్ 2012న ప్రాక్టీషనర్ ఆమెకు ఈ క్రింది రెమెడీలను అందించారు:
#1. CC1.1 Animal tonic + CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC12.4 Autoimmune diseases…TDS
చికిత్స పురోగతి:
Ø 12 అక్టోబర్ 2012: #1 ను #2. CC18.5 Neuralgia + CC20.7 Fractures + #1…TDS గా మార్చారు.
Ø 4 డిసెంబర్ 2012: పొత్తికడుపు ఉబ్బరం, నీరసం మరియు మూత్రం/మలంపై నియంత్రణ లేకపోవడం వంటి లక్షణాల కారణంగా స్కాన్ చేయగా, ప్లీహం (స్ప్లీన్) పెద్దదిగా ఉన్నట్లు గుర్తించారు. అయితే, అందులోని కణితికి క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఎక్కువగా లేదని తేలింది.
Ø 20 మార్చి 2013: కొన్ని నిమిషాల పాటు స్పృహ తప్పినట్లుగా అయింది. ఆమెకు #3. CC3.3 High Blood Pressure (BP) + CC3.6 Pulse irregular…TDS ఇచ్చారు.
Ø 30 ఆగస్టు 2013: ఆమెకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి పల్లాడియా అనే అల్లోపతి మందును ప్రారంభించారు. అవసరమైనప్పుడు అల్లోపతి నొప్పి నివారణ మందులు కూడా ఇచ్చారు.
ఒక నెల పాటు రేడియేషన్ మరియు కీమోథెరపీ చికిత్స తీసుకుంటూ, ప్రతిరోజూ వైబ్రియానిక్స్ చికిత్సను కూడా కొనసాగించినప్పటికీ, షెల్బీ నడిచే సామర్థ్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు; 19 నెలల పాటు ఎటువంటి నొప్పి లేకుండా ఉంది. 12 ఏప్రిల్ 2014న, 14 సంవత్సరాల వయస్సులో ఆమె ప్రశాంతంగా కన్నుమూసింది. ఆడ జర్మన్ షెపర్డ్ కుక్కల సగటు ఆయుష్షు 10 నుంచి 14 సంవత్సరాలు.
సంపాదకుల గమనిక: ఆస్టియోసార్కోమా సాధారణంగా పెద్ద జాతి కుక్కలను ప్రభావితం చేసే, నొప్పితో కూడిన తీవ్రమైన వ్యాధి. సాధారణంగా అనుసరించే పశువైద్య చికిత్సా విధానంలో, క్యాన్సర్ ముదిరినప్పుడు కుక్కలు ప్రభావితమైన కాలిపై సాధారణంగా బరువు మోయలేకపోవడం వల్ల, ఆ కాలును తొలగిస్తారు. అయితే, కాలు తొలగించినప్పటికీ వ్యాధి నిర్ధారణ అనంతర అంచనా (prognosis) ఆశాజనకంగా ఉండదు. ఎందుకంటే క్యాన్సర్ ఊపిరితిత్తులకు, ఇతర ఎముకలకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. చికిత్స లేకుండా చాలా కుక్కలు కేవలం 3–6 నెలలు మాత్రమే జీవిస్తాయి; ప్రభావిత కాలును తొలగించి, కీమోథెరపీ ఇచ్చినప్పుడు 6–12 నెలలు జీవిస్తాయి. అయితే, షెల్బీకి కాలు తొలగించకుండానే ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలిగింది. ఆమె చురుకుగా ఉండి, 19 నెలల పాటు ఎలాంటి నొప్పి లేకుండా ఆనందంగా జీవించింది. పశువైద్యుడు దీనిని నిజంగా అసాధారణమైన విషయంగా గుర్తించారు.
Editor’s note: Osteosarcoma is a painful and aggressive disease that typically affects large breeds. The standard veterinary approach is to amputate the affected leg, since dogs generally cannot bear weight on it once the cancer advances. Even with amputation, the prognosis is poor, as cancer tends to spread rapidly to the lungs and other bones. Most dogs survive only 3-6 months without treatment, and 6-12 months with amputation plus chemotherapy. Shelby, on the other hand, was able to walk comfortably without amputation, stayed active and lived pain-free with joy for 19 months; this was considered truly remarkable by the veterinarian.
కీళ్ళు అరిగిపోవడం 11632...भारत
68 ఏళ్ల మహిళ 2024 జనవరి నుంచి, గత నాలుగు నెలలుగా, రెండు మోకాళ్లలో నిరంతర నొప్పితో బాధపడుతున్నారు. అలాగే కుడి కాలిలో తీవ్రమైన నొప్పి మరియు తిమ్మిరి, పొత్తికడుపు కింది భాగం నుంచి మోకాలి వరకు వ్యాపించేది. నొప్పి ఎంత తీవ్రంగా ఉండేదంటే, ఆమెకు సౌకర్యంగా కూర్చోవడం లేదా పడుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఆమె సాయి సమితిలో క్రమం తప్పకుండా భజనలకు హాజరవుతూ, గంటకు పైగా కాళ్లు మడిచి కూర్చునేవారు. అయితే ఇప్పుడు 15 నిమిషాలు మాత్రమే అలా కూర్చోగలిగేవారు. ఇంటిపని చేసినప్పుడు నొప్పి మరింత తీవ్రమయ్యేది మరియు రెండు రోజులకు ఒకసారి కనిపించేది. తాత్కాలిక ఉపశమనం కోసం అప్పుడప్పుడు నొప్పి నివారణ మందులు తీసుకోవాల్సి వచ్చేది. అయితే వాటి దుష్ప్రభావాలను నివారించడానికి, ఎక్కువగా స్ప్రేలు మరియు బామ్‌లు ఉపయోగించేవారు.
5 మే 2024న, తన సాయి సమితిలో భజనల అనంతరం జరిగిన వైబ్రియానిక్స్ క్యాంప్‌లో ఆమెకు ఈ క్రింది రెమెడీస్ ఇచ్చారు:
#1. CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue...BD బాహ్యంగా పూయడాని ఆవ నూనెలో కలిపి ఇచ్చారు.
#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + #1...TDS, అలాగే నీటిలో కలిపి తరచుగా రాయడానికి.
చికిత్స పురోగతి:
- 2 జూన్ 2024: తిమ్మిరిలో 50%, కాలినొప్పిలో 30%, రెండు మోకాళ్ల నొప్పిలో 20% మెరుగుదల.
- 14 జూలై 2024: #2ను #3. NM97 Sciatica + NM113 Inflammation + #2…TDSగా ఇచ్చారు.
- 4 ఆగస్టు 2024: కాలినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మోకాళ్ల నొప్పి మరియు తిమ్మిరిలో 75% మెరుగుదల.
- 8 సెప్టెంబర్ 2024: తిమ్మిరి పూర్తిగా తగ్గిపోయింది. మోకాళ్ల నొప్పిలో కూడా కొంత మెరుగుదల కనిపించింది.
- 6 అక్టోబర్ 2024: మోకాళ్ల నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. #1ను ODకి, #3ను BDకి తగ్గించారు.
ఆగస్టు 2025 నాటికి సమస్య మళ్లీ పునరావృతం కాలేదు. కొన్ని రోజులపాటు రోగి #1 మరియు #3ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా వైబ్రియానిక్స్ చికిత్స తీసుకుంటున్నారు.
చీము పొక్కులు 11659...भारत
40 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఆమెకు 29 మే 2024న నొప్పితో కూడిన చీము నిండిన పొక్కులు ఏర్పడ్డాయి. తరువాతి మూడు రోజుల్లో, ఆమె ముఖం, మెడ మరియు వీపుపై 2–3 మి.మీ. పరిమాణంలో చీము నిండిన పొక్కులు కనిపించాయి. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో నొప్పి, వాపు మరియు అసౌకర్యం కూడా కలిగాయి. ఆమె వైద్య సహాయం తీసుకోలేదు; ప్రభావిత ప్రాంతాల్లో కేవలం పసుపు మాత్రమే రాసుకున్నారు, అయితే దాంతో ఎలాంటి ఉపశమనం కలగలేదు.
అదే విభాగంలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న ప్రాక్టీషనర్ ఆమె పరిస్థితిని గమనించి, చికిత్స అందించడానికి ముందుకు వచ్చారు. అందుకు రోగి వెంటనే అంగీకరించారు. మైక్రోబయాలజీ కల్చర్ ప్లేట్లను సురక్షితమైన పద్ధతిలో నిర్వహించకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని ఆమె అనుమానించారు. ఎందుకంటే రోగి తరచుగా గ్లౌజులు లేదా మాస్క్ ఉపయోగించకుండా ఆ కల్చర్ ప్లేట్లను శుభ్రం చేసేవారు. అందువల్ల, 1 జూన్ 2024న ఆమెకు ఈ క్రింది రెమెడీలను ఇచ్చారు:
#1. Cow dung Potentised* 200C…BD విభూతిలో కలిపి చర్మం పైన పూయడానికి
#2. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + #1… ఒక గంటపాటు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చొప్పున, తరువాత 6TDగా ఇచ్చారు
#3. IB…OD (See vol 13 #5)
అదనంగా, పని ప్రదేశంలో మరియు ఇంట్లో సరైన పరిశుభ్రత పాటించాలని, ముఖ్యంగా తినే ముందు లేదా ముఖాన్ని తాకే ముందు సబ్బుతో చేతులను పూర్తిగా శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
చికిత్స పురోగతి:
Ø 3 జూన్ 2024: చీము కారడం ఆగిపోయింది. గాయాలు ఎండిపోవడం ప్రారంభించాయి. నొప్పిలో 50% తగ్గుదల కనిపించింది.
Ø 4 జూన్ 2024: లక్షణాల్లో 80% మెరుగుదల.
Ø 7 జూన్ 2024: పూర్తిగా నయం అయిపోయింది. #2ను BDకి తగ్గించారు. ఇదే సమయంలో రోగి కుమార్తె ముఖంపై కూడా ఇలాంటి నొప్పితో కూడిన గాయాలు ఏర్పడ్డాయి. ఆమెకు #1ను పూయడం ప్రారంభించగా, మూడు రోజుల్లో లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి.
Ø 13 సెప్టెంబర్ 2024: మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత రోగి రెమెడీలను నిలిపివేశారు.
ఆగస్టు 2025 నాటికి సమస్య మళ్లీ పునరావృతం కాలేదు.
* ఈ ఆలోచనకు ప్రేరణ ఆవు పేడలోని శుద్ధి చేసే గుణాల గురించి స్వామి చేసిన ఉపన్యాసం నుంచి వచ్చినది.
సంపాదకుల వ్యాఖ్య: ఆవు పేడను ఆయుర్వేద వైద్య విధానంలో దాని క్రిమినాశక మరియు ఇన్ఫెక్షన్ను నివారించే గుణాల కారణంగా సాంప్రదాయకంగా గౌరవిస్తారు.



అరికాలి కండర పట్టీ వాపు 03623...ज़िम्बाब्वे
ప్రాక్టీషనర్కు స్నేహితురాలైన 39 ఏళ్ల మహిళకు మార్చి 2023 నుంచి కుడి పాదం మొత్తం, అలాగే ఎడమ పాదంలోని ఒక వేలు ఎముకలో నొప్పి బాధిస్తోంది. మొదట్లో నొప్పి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేది; సుమారు ఒక గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత తగ్గిపోయేది. అయితే, గత ఆరు నెలలుగా నొప్పి క్రమంగా తీవ్రమైంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఆమెకు తీవ్రమైన నొప్పి ఉండేది. ఆ నొప్పి రోజంతా కొనసాగుతూ, నడిచేటప్పుడు లేదా నిలబడేటప్పుడు మరింత ఎక్కువయ్యేది. ఆమె ఉద్యోగంలో తరచుగా నిలబడటం, నడవడం అవసరం కావడంతో, పాదాలపై ఒత్తిడి తగ్గించుకోవడానికి పాదాల బయటి అంచులపై బరువు వేస్తూ, బాతు నడకలా నడవడం ప్రారంభించారు. అయినప్పటికీ, గణనీయమైన అసౌకర్యం లేకుండా ఆమె 15 నిమిషాలకు మించి నడవలేకపోయేవారు.
జూన్ 2023లో ఒక డాక్టర్ పరీక్షించి నొప్పి, కండరాలకు సంబంధించినదని నిర్ధారించి, 10 రోజుల పాటు నొప్పి నివారణ మందులు తీసుకోవాలని సూచించారు. అయితే ఆమె ఆ మందులు తీసుకోకూడదని బదులుగా, మర్దన చేసుకోవడం, గోరువెచ్చని నీటిలో పాదాలను పెట్టడం, అలాగే పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడటం వంటి వాటిపై ఆధారపడ్డారు. అయినప్పటికీ, ఆమెకు ఇష్టమైన అనేక కార్యకలాపాలను వదులుకోవాల్సి వచ్చింది. వాటిలో బ్యాడ్మింటన్ ఆడటం, పిల్లలతో కలిసి ఆడే తాడు ఆట కూడా ఉన్నాయి. 24 డిసెంబర్ 2024న ప్రాక్టీషనర్ ఆమెకు ఈ క్రింది రెమెడీలను ఇచ్చారు:
#1. CC20.2 SMJ pain…TDS
#2. IB…OD ఉదయం నిద్రలేచిన వెంటనే వేసుకోవడానికి (vol 15 #2)
చికిత్స పురోగతి:
Ø 26 జనవరి 2025: నొప్పిలో 60% మెరుగుదల. ఇప్పుడు 30–40 నిమిషాలు నొప్పి లేకుండా సాధారణంగా నడవగలిగారు.
Ø 15 మార్చి 2025: నొప్పిలో 75% మెరుగుదల. నడవడం లేదా నిలబడడం మరింత సౌకర్యంగా అనిపించింది. రోగి #2ను నిలిపివేశారు.
Ø 19 ఏప్రిల్ 2025: నొప్పి దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. తనకు ఇష్టమైన క్రీడలను మళ్లీ ఆడటం ప్రారంభించారు. అప్పుడప్పుడు స్వల్ప నొప్పి చల్లని వాతావరణం కారణంగా వచ్చేది; 30 నిమిషాల విశ్రాంతితో అది తగ్గిపోయేది.
Ø 10 మే 2025: నొప్పి పూర్తిగా లేకుండా పోయింది. #1ను BDకి తగ్గించారు.
Ø 20 మే 2025: మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత రెమెడీని నిలిపివేశారు.
9 ఆగస్టు 2025 నాటికి, ఆమె నొప్పి లేకుండా ఉన్నారు. సాధారణ ఆరోగ్యం కోసం ప్రస్తుతం CC12.1 Adult tonic…TDS తీసుకుంటున్నారు
రోగి మాటల్లో:
2023 నుంచి నేను ప్లాంటార్ ఫాసియైటిస్తో బాధపడుతున్నాను. నా స్నేహితురాలి ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నాను. నేను 15 నిమిషాల కంటే ఎక్కువ నడవలేకపోయేదాన్ని, గెంతడం కూడా సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నేను సులభంగా ఒక గంట పాటు నడవగలను, తాడుతో గెంతగలను. నా ఫలితాల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ రెమెడీలకు కృతజ్ఞతలు, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్లీ సాధారణ జీవితాన్ని ఆనందించగలుగుతున్నాను.
మోకాళ్లలో ఆస్టియోఆర్థరైటిస్ (కీళ్ల అరుగుదల) 11570...भारत
56 ఏళ్ల మహిళా పాఠశాల ఉపాధ్యాయురాలు, BMI 28.3తో, గత 13 సంవత్సరాలుగా రెండు మోకాళ్లలో నొప్పితో బాధపడుతున్నారు. 2011లో ఆమెకు ఆర్థ్రైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయి, వైద్యులు సూచించిన నొప్పి నివారణ మందులు ప్రారంభించారు. అయితే 2014 నాటికి పరిస్థితి క్రమంగా మరింత తీవ్రమై, నొప్పితో పాటు వాపు మరియు బిగుతు కూడా ఏర్పడ్డాయి. ఆమె తన శారీరక కార్యకలాపాలను గణనీయంగా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎక్కువసేపు నిలబడటం లేదా నడవడం నివారించాల్సి వచ్చేది. ఆమెకు మోకాలి బ్రేస్‌లు కూడా సూచించారు. చివరకు ఆమె తరగతులను కూడా కూర్చునే స్థితిలోనే బోధించాల్సి వచ్చింది.
2016లో, MRI స్కాన్‌లో రెండు మోకాళ్లలో స్టేజ్ 3 ఆస్టియోఆర్థ్రైటిస్ ఉన్నట్లు వెల్లడైంది. సూచించిన నొప్పి నివారణ మందులు మరియు వాపు తగ్గించే మందులు ప్రభావవంతంగా పనిచేయలేదు. తరువాత ఆమెకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి, ఆ తరువాత మరోసారి యాంటీ-ఇన్ఫ్లమేటరీ మందుల కోర్స్ ఇచ్చారు. రక్త పరీక్ష అనంతరం విటమిన్ D సప్లిమెంట్లు కూడా ప్రారంభించారు. అయితే ఆమె కదలికలు క్రమంగా మరింత పరిమితమై, చివరకు సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్నారు. అల్లోపతి చికిత్సపై నిరాశ చెందినప్పటికీ, రోజువారీ నొప్పి నివారణ మందును మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. ఒక స్నేహితురాలు వైబ్రియానిక్స్‌ను సూచించడంతో ఆమె ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. 10 జూన్ 2024న, ఆమెకు:
#1. CC3.7 Circulation + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…TDS
#2. CC20.2 SMJ Pain + CC20.4 Muscles & Supportive tissue…BD కొబ్బరి నూనెలో కలిపి బాహ్యంగా పూయడానికి
ఆమెకు ఇంట్లో తయారు చేసిన ఆహారం మాత్రమే తీసుకోవాలని, ఆహారంలో మొలకలు, పండ్లు మరియు సలాడ్లు చేర్చాలని, అలాగే ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం నివారించాలని సూచించారు.
చికిత్స పురోగతి:
- 15 జూలై 2024: అన్ని లక్షణాల్లో 30% మెరుగుదల. శరీరం తేలికగా అనిపించింది. నొప్పి నివారణ మందు ఇప్పుడు వారానికి ఒక్కసారి మాత్రమే అవసరమైంది!
- 29 ఆగస్టు 2024: 40% మెరుగుదల. నొప్పి నివారణ మందు వినియోగం నెలకు రెండుసార్లకు తగ్గింది.
- 16 సెప్టెంబర్ 2024: 60% మెరుగుదల. నొప్పి నివారణ మందును పూర్తిగా నిలిపివేశారు. నడకను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
- 26 అక్టోబర్ 2024: 10 నిమిషాల పాటు నొప్పి లేకుండా నడవగలిగారు!
- 14 డిసెంబర్ 2024: ఉదయం 20 నిమిషాలు నడవడం ప్రారంభించారు. అయితే రెండవ రోజు చల్లని వాతావరణం కారణంగా మోకాళ్లలో బిగుతు ఏర్పడి నడవడం కష్టంగా అనిపించింది. అయినప్పటికీ ఆమె నడకను కొనసాగించగలిగారు. #1ను #3. CC20.1 SMJ tonic + #1…TDS నీటిలో కలిపి ఇచ్చారు.
- 21 జనవరి 2025: ఇప్పుడు రోజుకు 2000 అడుగులు, అంటే సుమారు 30 నిమిషాల నడక చేస్తున్నారు. #2ను OD, #3ను BDకి తగ్గించారు
- 22 february 2025: లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. #2ను నిలిపివేశారు. ఇప్పుడు రోజుకు 6000 అడుగులు, సాధారణ వేగంతో మరియు స్థిరంగా నడవగలుగుతున్నారు. నిర్వహణ కోసం #3ను ODకి తగ్గించారు.
ఆగస్టు 2025 నాటికి సమస్య మళ్లీ పునరావృతం కాలేదు.
రోగి వాంగ్మూలం:
ముందుగా, గత కొన్ని నెలలుగా ప్రాక్టీషనర్ నాకు అందిస్తున్న వైబ్రియానిక్స్ చికిత్సకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను మరింత ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటున్నాను. నాకు ఎంతో ఇష్టమైన పనైన సోర్‌డో బ్రెడ్ తయారీ, అలాగే కొద్దిగా తేలికపాటి వంట చేయడం వంటి పనులను, ఉద్యోగం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఉత్సాహంగా చేయగలుగుతున్నాను. ఇటీవల నేను విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. సాధారణంగా అంతర్జాతీయ విమానాశ్రయంలో నా టెర్మినల్ వరకు నడిచి వెళ్లడం నాకు చాలా కష్టమైన పనిగా ఉండేది. కానీ ఈసారి నేను తగినంత వేగంతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా నడిచి వెళ్లగలిగాను. ఇది నాకు ఎంతో గొప్ప విజయంగా అనిపిస్తోంది, నా గురించి నేను గర్వపడుతున్నాను.
ప్రాక్టీషనర్ వివరములు 11658...भारत
లక్ష్మీ రాజేశ్వరి 11658...ఇండియా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగిన ఈమె వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయురాలు. ప్రస్తుతం పార్ట్‌టైమ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తున్నారు. సాయి కుటుంబంలో జన్మించిన ఈమెకు, తండ్రి స్థానిక సమితి కన్వీనర్ అలాగే ఆమె
బాల వికాస్ గురువు; తల్లి ఆమె భజన్ గురువుగా ఉన్నారు. ఆమె నాలుగేళ్ల పసి వయస్సు నుంచే భజనలు పాడుతున్నారు. గత 26 సంవత్సరాలుగా బాల వికాస్ పిల్లలకు బోధిస్తున్నారు. ప్రస్తుతం భజన్ కోఆర్డినేటర్‌గా సేవలందిస్తూ, ఆన్లైన్ భజన్ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు.
2021లో చెవి శస్త్రచికిత్స అనంతరం తలలో తీవ్రమైన మంట తో ఆమె ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, 2023లో స్వామి చిత్రపటం ముందు కూర్చుని తీవ్రంగా ప్రార్థించేలా చేశాయి. ఆ క్షణంలో, ఇంతకు ముందు ఎప్పుడూ వినని “వైబ్రియానిక్స్” అనే పదం ఆమె మనస్సులో మెరిసింది. ఇది దైవిక మార్గదర్శకత్వమే అని భావించే విధంగా, నాగ్‌పూర్ వైబ్రియానిక్స్ బృందం రీజినల్ కోఆర్డినేటర్ కూడా అయిన తన యూనిట్ కన్వీనర్ ద్వారా ఆమెకు వైబ్రియానిక్స్ పరిచయమైంది. కేవలం మూడు రోజుల్లోనే 15 నెలలుగా ఉన్న తన సమస్యలో 95% ఉపశమనం పొందారు! ఇదే ఆమె వైబ్రియానిక్స్ ప్రయాణానికి నాంది పలికింది. ఆమె నవంబర్ 2023లో AVP, జూలై 2024లో VP అయ్యారు.
ఈ ప్రాక్టీషనర్ తనకు గుర్తుండిపోయిన కొన్ని అద్భుతమైన స్వస్థతా సంఘటనలను వివరించారు. ఒక రాత్రి, ఆమె 94 ఏళ్ల మామగారికి అకస్మాత్తుగా ముక్కు నుంచి విపరీతంగా రక్తస్రావం ప్రారంభమైంది. ఆమె భర్త వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయబోతున్నారు. ఆమె వెంటనే నీళ్ల గిన్నెలో CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis ఇచ్చి, ప్రతి 10 నిమిషాలకు కొద్దికొద్దిగా తాగమని చెప్పారు. అయితే ఆయన పొరపాటున మొత్తం మందును ఒకేసారి తాగేశారు. ఆశ్చర్యకరంగా, కేవలం ఐదు నిమిషాల్లో రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది. ఆయనకు నిద్ర ముంచుకొచ్చి త్వరలోనే నిద్రపోయారు. ఇది నిజంగా ఒక అద్భుతానికి ఏమాత్రం తక్కువ కాదు.
మరో సంఘటనలో, వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఒక దూడ రోడ్డుపై స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ప్రాక్టీషనర్, తాను ఎప్పుడూ వెంట ఉంచుకునే CC10.1 Emergenciesను ఒక సీసా మూతలో నీటితో కలిపి, అక్కడ ఉన్న ఒక వ్యక్తి సహాయంతో దూడకు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా, మూడు నిమిషాల్లోనే దూడకు స్పృహ వచ్చింది, అంతేకాకుండా నిలబడటానికి కూడా ప్రయత్నించింది. అయితే దాని కాలు విరిగి ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మరొక సందర్భంలో, తన భర్త పాదంలోని పెద్ద గోరు కొన్ని రోజులుగా నల్లగా మారడంతో, ఆమె CC21.9 Nailsను పెట్రోలియం జెల్లీతో కలిపి రాశారు. ఆశ్చర్యంగా, మరుసటి ఉదయానికే ఆ గోరు తెల్లగా మారింది!
ఈమెకు CC19.6 Cough chronic + CC19.7 Throat chronic రెండు మూడు బాటిళ్ల దగ్గు సిరప్లు కూడా పనిచేయని మొండి, దీర్ఘకాలిక దగ్గును ఒక్క రాత్రిలోనే తగ్గించి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. తాను విజయవంతంగా చికిత్స చేసిన కనీసం 25–30 కేసుల్లో, ఏదైనా తగిన రెమెడీకి CC15.1 Mental & Emotional tonicను జోడిస్తే దాని స్వస్థతా శక్తి మరింత పెరుగుతుందని ఆమె గమనించారు. అలాగే, 45 సంవత్సరాలు పైబడిన మహిళల్లో శరీర నొప్పి, నడుము నొప్పి లేదా మోకాళ్ల నొప్పికి తగిన కాంబోకు CC8.6 Menopauseను జోడిస్తే ఎంతో చక్కగా పనిచేస్తుందని ఆమె గుర్తించారు. సోరియాసిస్‌కు ఆర్థరైటిస్ మరియు ఆస్టియోపోరోసిస్‌తో సంబంధం ఉండవచ్చని భావించి, ఎముకలకు సంబంధించిన రెమెడీలలో CC21.10 Psoriasisను జోడించడం ద్వారా మరింత మెరుగైన సహాయాన్ని ఎముకలకు అందించగలమని ఆమె తెలిపారు.
కాంబోలను ఎంపిక చేసేటప్పుడు ఆమె 108CC పుస్తకంలోని నిర్దేశిత మార్గదర్శకాలను క్రమశిక్షణతో పాటిస్తారు. ఆమె దానిని “ప్రాక్టీషనర్ బైబిల్” అని పిలుస్తారు. రెమెడీని సూచించిన తరువాత, స్వస్థతను స్వామికి సమర్పిస్తారు. వైబ్రియానిక్స్‌తో పాటు కొన్ని సరళమైన గృహచికిత్సలను ఉపయోగించడం వల్ల కోలుకునే ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ఆమె గమనించారు. ఉదాహరణకు, నీటిలో జామ ఆకులను మరిగించి తాగడం ల్యూకోరియా (తెల్లబట్ట) నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని, కొద్దిగా కాల్చిన కొబ్బరి పీచు పొడిని కలిపిన పలుచని మజ్జిగ పైల్స్ సందర్భాల్లో శరీర వేడిని తగ్గించడానికి సహాయపడుతుందని, అలాగే నాభిలో ఒక చుక్క నూనె వేయడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆమె తెలిపారు. మన వార్తాపత్రికలోని “అదనంగా” విభాగాన్ని, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని, ఆమె అపారమైన జ్ఞాననిధిగా భావిస్తారు.
ప్రాక్టీషనర్‌గా మారిన తరువాత, ఆమె స్వయంగా కూడా మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించారు. తనలో సహనం మరియు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందని చుట్టుపక్కల వారు గమనించారు. వైబ్రియానిక్స్ తన జీవితంలో ఈ మార్పులను తీసుకువచ్చినందుకు ఆమె ఎంతో ఆశీర్వదించబడినట్లు భావిస్తున్నారు.
రెండేళ్లు పూర్తికాకముందే, ఆమె 500 మందికి పైగా రోగులకు చికిత్స అందించారు. ప్రతి నెలా జరిగే మూడు ఆరోగ్య శిబిరాల్లో ఆమె చురుకుగా స్వచ్ఛంద సేవ అందిస్తున్నారు. ఈ శిబిరాల్లో ఒకదానికి చేరుకోవడానికి బైక్‌పై 10 కి.మీ., ఆ తరువాత అంబులెన్స్‌లో 50 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న మహిళా రోగులు, తమకు చికిత్స అందించే ఏకైక మహిళా ప్రాక్టీషనర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముఖాలను చూసినప్పుడు, ప్రయాణంలోని అన్ని కష్టాలు ఆమె మరచిపోతారు. ఇలాంటి క్షణాలే ఆమెకు మరింత శక్తిని అందించి, తనకు సాధ్యమైన ప్రతి విధంగానూ సేవ చేయాలనే సంకల్పాన్ని బలపరుస్తాయి. సాయి వైబ్రియానిక్స్ స్వామి తన సేవ కోసం ఎంచుకున్న మార్గమని, ఆయన దివ్య సంకల్పంలో భాగస్వామి కావడానికి ఇది ఎంతో అమూల్యమైన సాధనమని ఆమె భావిస్తున్నారు.
పంచుకుంటున్న కేసులు:
ప్రాక్టీషనర్ వివరములు 11654...भारत
గణేశన్ సుబ్రమణియన్ 11654...ఇండియా విస్తృతమైన ఆదాయపు పన్ను మరియు కంపెనీ ఆర్థిక వ్యవహారాల అనుభవం కలిగిన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, విశాఖపట్నంలోని RINLలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసి 2023లో పదవీ విరమణ
చేశారు. 1992లో వివాహం అనంతరం సాయి కుటుంబంలోకి ఆకర్షితులైన ఆయన, 1993 నుంచి సాయి భజనలు మరియు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. నోయిడా సమితితో కలిసి పుట్టపర్తి సేవతో పాటు యువజన సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. వీటిలో రక్తదానం, టీకాల కార్యక్రమాలు, పోలియోకు సంబంధించిన సరిదిద్దే శస్త్రచికిత్సలు, వస్త్రాల పంపిణీ వంటి సేవలు ఉన్నాయి. 2008 నుంచి విశాఖపట్నంలోని తన స్థానిక సాయి సమితిలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వారి సేవా ట్రస్ట్‌కు కోశాధికారిగా వ్యవహరిస్తూ, ఖాతాలు మరియు పన్ను సంబంధిత నిబంధనల అమలును పర్యవేక్షిస్తున్నారు.
సాయి వైబ్రియానిక్స్లోకి ప్రయాణం తన భార్యపై వైబ్రియానిక్స్ చూపిన అద్భుతమైన ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత మొదలైంది. చురుకైన సాయి సేవకురాలైన ఆయన భార్య తీవ్రమైన మోకాళ్ల నొప్పి కారణంగా సేవా కార్యక్రమాలకు దూరమయ్యారు. వైద్యులు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరం కావచ్చని హెచ్చరించారు. స్వామి మార్గదర్శకత్వంతో, వైబ్రియానిక్స్ ద్వారా కోలుకున్న ఒక సహభక్తురాలిని ఆమె కలుసుకున్నారు. బాబాపై సంపూర్ణ విశ్వాసంతో, 2022 చివర్లో ఆమె వైబ్రియానిక్స్ చికిత్సను మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. కేవలం 4–5 నెలల్లోనే ఆమె పూర్తిగా కోలుకుని, మరింత ఉత్సాహంతో తన సేవలను తిరిగి ప్రారంభించారు. ఆమె ప్రోత్సాహంతో గణేశన్ సుబ్రమణియన్ కూడా వైబ్రియానిక్స్ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునే ముందు ప్రశాంతి నిలయంలో బాబా ఆశీస్సులు కోరుకున్నారు. నిజాయితీగా సేవ చేయాలనే సంకల్పంతో ఎంపికైన ఆయన ఏప్రిల్ 2023లో AVP, జనవరి 2024లో VP అయ్యారు.
ప్రతి రెమెడీని తయారు చేసే ముందు ప్రార్థన మరియు ధ్యాన దృశ్యీకరణ ద్వారా స్వామితో అనుసంధానం కావడం, క్లిష్టమైన కేసుల్లో ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుకోవడం తనకు ఎంతో ఆశీర్వాదంగా అనిపిస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ సేవ ద్వారా పొందుతున్న తృప్తి కారణంగా పదవీ విరమణ అనంతరం వచ్చిన అనేక ఉద్యోగ అవకాశాలను ఆయన తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా వైబ్రియానిక్స్ సేవకే అంకితమయ్యారు. ఆయన ఒక శిబిరంలో మూడేళ్ల వయస్సు నుంచే మైగ్రేన్‌తో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు చికిత్స చేసిన మధురానుభూతిని గుర్తుచేసుకున్నారు. ఆ రోజు ఆమె తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. వైబ్రియానిక్స్ యొక్క ఒక్క డోస్ తీసుకున్న తరువాత ఆ రాత్రంతా ఆమెకు నొప్పి లేకుండా పోయింది. రెమెడీ ప్రభావాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కేవలం నెలకు పైగా వ్యవధిలోనే ఆమె తలనొప్పుల నుంచి పూర్తిగా విముక్తి పొందింది. ప్రస్తుతం వైద్య కళాశాలలో ప్రవేశం కోసం కష్టపడి చదువుకోగలుగుతోంది.
మరో సందర్భంలో, దూర ప్రాంతంలో ఉన్న ఒక రోగికి రెమెడీ పంపుతున్నప్పుడు, చివరి నిమిషంలో చర్మ దురద కోసం మరొక రెమెడీ కూడా కావాలని అభ్యర్థన వచ్చింది. ఆయన సరైన రెమెడీని పంపారు. అయితే అది వేరొక రోగి కోసం ముందుగా తయారు చేసిన బాటిల్ కావడంతో, దానిపై “Cow Dung: Potentised” అనే లేబుల్ ఉంది. తొందరలో ఆయన లేబుల్‌ను మార్చడం మర్చిపోయారు. తరువాత, ఆవును పవిత్రంగా భావించని విశ్వాసానికి చెందిన తన రోగి దీనిని చూసి బాధపడవచ్చేమోనని ఆయన ఆందోళన చెందారు. స్వామిని ప్రార్థించి, జరిగిన పొరపాటును మనసులోనే వివరించారు. ఆయనకు ఎంతో ఉపశమనంగా, మూడు రోజుల తరువాత ఆ రోగి ఆనందంగా పూర్తిగా కోలుకున్నానని తెలియజేశారు!
ప్రాక్టీషనర్ మోకాలు, వెన్ను మరియు భుజాల నొప్పి కోసం ఒక శక్తివంతమైన కాంబోను రూపొందించారు: CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + Bitter Leaf (Vernonia amygdalina): Potentized 200C. కీళ్ల, నరాల మరియు రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలకు ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయన గమనించారు. అనేక సందర్భాల్లో శస్త్రచికిత్సను నివారించడానికి కూడా ఇది సహాయపడింది. నీటిలో స్ప్రే చేయడం లేదా ఆవ నూనెలో కలిపి పూయడం ద్వారా ఉపశమనం మరింత మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. తనకు వచ్చిన తీవ్రమైన మోచేతి నొప్పి కూడా ఈ విధంగా రెండు రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయింది. ఈ కాంబోతో ఆయన 150 మందికి పైగా రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు. అతి సున్నితత్వం లేదా జీర్ణ సమస్యల వల్ల వచ్చే మైగ్రేన్‌తో సహా ఏ రకమైన మైగ్రేన్కైనా ఆయన ఈ సమగ్ర కాంబోను రూపొందించారు: CC3.7 Circulation + CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.2 Psychiatric disorders + CC18.5 Neuralgia. దీర్ఘకాలంగా ఉన్న అనేక కేసులు దీనితో తగ్గిపోయాయి. వాటిలో పదేళ్లకు పైగా ఉన్న ఒక కేసు కూడా మూడు నెలల్లోనే పూర్తిగా పరిష్కారమైంది!
54 ఏళ్ల మహిళ ఐదేళ్లుగా ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS)తో బాధపడుతున్నారు. తరచుగా మల విసర్జన, విరేచనాలు ఉండటంతో పాటు, ఈ సమస్యల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కూడా ఆమె ఆందోళన చెందేవారు. 2024 ఆగస్టులో ఆయన ఆమెకు ఈ కాంబోను ప్రారంభించారు: CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic. ఒక నెలలోనే ఆమె 80% కంటే ఎక్కువ ఉపశమనం పొందినట్లు తెలిపారు. తరువాతి ఏడు నెలల్లో మెరుగుదల కొనసాగింది. చివరకు ఎన్నో సంవత్సరాలుగా ఆధారపడిన అల్లోపతి మందులను పూర్తిగా నిలిపివేశారు.
రోగుల నుంచి వచ్చిన అనుభవాల ద్వారా, రెమెడీలు ప్రతి వ్యక్తిపై వేర్వేరు విధంగా పనిచేస్తాయని, నిజమైన వైద్యుడు స్వామియే అని ప్రాక్టీషనర్ తెలుసుకున్నారు. సమర్థవంతమైన రోగ నివారణలో రెమెడీ మోతాదు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, నీటితో రెమెడీలను పైపూతగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలకే కాకుండా ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలకు కూడా ప్రభావవంతంగా ఉంటుందని ఆయన గమనించారు. ఇంటివద్ద రోగులను చూడటంతో పాటు, నెలకు రెండుసార్లు సేవా శిబిరాలకు హాజరవుతారు. క్లిష్టమైన కేసులపై విలువైన అవగాహన పొందేందుకు సీనియర్ ప్రాక్టీషనర్లతో కూడా కలిసి పనిచేస్తున్నారు. అకౌంట్స్ మరియు పన్నుల రంగంలో తన నైపుణ్యాన్ని ఉపయోగించి SVIRTకు విలువైన వృత్తిపరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర వైబ్రియానిక్స్ సదస్సు నిర్వహణలో కూడా సహాయం చేశారు.
ఇప్పటివరకు 600 మందికి పైగా రోగులకు చికిత్స అందించిన ఈ ప్రాక్టీషనర్, ఈ సేవ తన జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిన ఒక గాఢమైన అంతరంగిక పరివర్తన ప్రయాణంగా భావిస్తున్నారు. ఇతరుల శ్రేయస్సును తన శ్రేయస్సుకంటే ముందుగా ఉంచే అలవాటు తనలో ఏర్పడిందని ఆయన చెబుతున్నారు. ఈ మార్గం తనలో తీసుకువచ్చిన అంతరంగిక మార్పుకు ఆయన ఎంతో వినయంతో, కృతజ్ఞతతో ఉన్నారు. ఆయనకు ప్రతి కోలుకున్న రోగి ఒక ఆశీర్వాదం; ప్రతి సవాలు తన విశ్వాసాన్ని బలపరచడానికి, సేవ పట్ల తన నిబద్ధతను మరింత లోతుగా చేయడానికి స్వామి ప్రేమతో అందించే ఒక అవకాశంగా భావిస్తారు.
Cases to share:
ప్రశ్నలు జవాబులు
Q1. 108CC పుస్తకంలోని మెడికల్ టర్మ్స్ గ్లోసరీలో కొన్ని వ్యాధుల పేర్లు ఉన్నాయి. అయితే వాటికి సంబంధించిన రెమెడీలు ఇండెక్స్‌లో ఇవ్వబడలేదు. అలాంటి రెమెడీలను కూడా ఇండెక్స్‌లో చేర్చవచ్చా?
A. గ్లోసరీలో అనేక వైద్య పదాలకు సులభంగా అర్థం చేసుకునేందుకు వివరణలు అందించబడ్డాయి. 108CC పుస్తకం సాధారణంగా ఎక్కువగా కనిపించే మరియు విస్తృతంగా తెలిసిన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన రెమెడీలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అందువల్ల, తక్కువగా కనిపించే కొన్ని వ్యాధులు ఇండెక్స్‌లో చేర్చబడలేదు. ఇండెక్స్‌లో పేర్కొనబడని ఏదైనా ఆరోగ్య సమస్యకు మీరు చికిత్స చేయాలనుకుంటే, దానికి సంబంధించిన గ్లోసరీ వివరణను పరిశీలించి, సరైన రెమెడీని గుర్తించేందుకు దాన్ని మార్గదర్శకంగా ఉపయోగించవచ్చు. ఇండెక్స్‌లో లేని సాధారణంగా ఎక్కువగా కనిపించే ఏదైనా ఆరోగ్య సమస్య మీకు ఎదురైతే, దయచేసి [email protected] కు తెలియజేయండి. తద్వారా దానిని తదుపరి సవరించిన ఎడిషన్‌లో ఇండెక్స్‌లో చేర్చవచ్చు.
________________________________________________________________________________
Q2. నేను ఒక రోగికి కాళ్ల నొప్పికి చికిత్స అందించాను. 14 రోజుల్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఆ తరువాత అతని అరికాళ్లు మెత్తగా, సున్నితంగా మారి, నడవడం కష్టంగా అనిపించింది. ఇంతకు ముందు ఈ సమస్య ఎప్పుడూ లేదు. ఇది రెండవ రకం పుల్‌అవుట్ వల్ల జరిగి ఉండవచ్చా?
A: లేదు, పులౌట్ వల్ల ఈ మృదుత్వం, సున్నితత్వం రావడం జరిగినట్లు లేదు. ముఖ్యంగా, కాలి నొప్పి తగ్గిపోయిన తర్వాతే ఇవి కనిపించాయి కాబట్టి, పులౌట్ వల్ల ఇవి ఏర్పడ్డాయని భావించడం మరింత కష్టం. ఏదేమైనా, ఇది కొత్తగా ఏర్పడిన పరిస్థితి అయినా లేదా పులౌట్ కారణంగా వచ్చినదైనా, దీనికి తగిన చికిత్స అవసరం. అందువల్ల, దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. కారణం పోషకాహార లోపం, పెరిఫెరల్ న్యూరోపతి (చేతులు, కాళ్ల చివరి భాగాల్లోని నరాలకు సంబంధించిన సమస్య), ఇన్ఫెక్షన్, డెర్మటైటిస్ (చర్మవాపు), అలర్జీ లేదా పాదాలను ఎక్కువసేపు నీటిలో నానబెట్టడం కావచ్చు. ఈ సమాచారం లేకుండా, ఏ చికిత్స ఇవ్వాలో సూచించడం కష్టం.
________________________________________________________________________________
Q3. ప్రస్తుతం హోమియోపతి చికిత్స తీసుకుంటున్న ఒక రోగి నా వద్ద వైబ్రియానిక్స్ కోసం వచ్చారు. రెండు చికిత్సా విధానాలు సూక్ష్మ వైబ్రేషనల్ స్థాయిలో పనిచేస్తాయి కాబట్టి, హోమియోపతితో పాటు వైబ్రియానిక్స్ ఇవ్వడం సముచితమేనా? అలాగే, వైబ్రియానిక్స్‌ను ఇతర చికిత్సా విధానాలతో కలిపి సురక్షితంగా ఉపయోగించవచ్చా?
A. ఏదైనా సరైన హోమియోపతి రెమెడీ యొక్క వైబ్రేషన్‌ను వైబ్రియానిక్స్ రెమెడీకి జోడించవచ్చు. దీనివల్ల వైబ్రియానిక్స్ రెమెడీ ప్రభావం తగ్గదు. సరైన అవగాహనతో మరియు జాగ్రత్తగా ఉపయోగించినప్పుడు, ఈ కలయిక మొత్తం చికిత్సా ఫలితాన్ని మరింత మెరుగుపరచవచ్చు! ఒక రోగి ఇప్పటికే హోమియోపతి చికిత్స తీసుకుంటూ ఉండి, అదే సమయంలో వైబ్రియానిక్స్ ప్రారంభించాలనుకుంటే, అలా చేయడం పూర్తిగా ఆమోదయోగ్యమే. ఎందుకంటే ప్రేమతో సేవ చేయడం మన ప్రధాన కర్తవ్యం. అయితే ఉత్తమ ఫలితాల కోసం, రెండు రెమెడీల మధ్య కనీసం 20 నిమిషాల వ్యవధి ఉండేలా చూడాలి. ఒక రోగి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకుంటున్న సమయంలో హోమియోపతి డాక్టర్ని సంప్రదించాలని పట్టుబడితే, తాను వైబ్రియానిక్స్ చికిత్స తీసుకుంటున్న విషయాన్ని హోమియోపతి డాక్టర్‌కి తప్పనిసరిగా తెలియజేయాలి. ఎందుకంటే కొంతమంది హోమియోపతి డాక్టర్లు వైబ్రియానిక్స్‌ను హోమియోపతితో పాటు తీసుకోవడం వల్ల తాము ఎంచుకునే రెమెడీపై ప్రభావం పడవచ్చని, తద్వారా తమ చికిత్స ప్రభావం తగ్గవచ్చని భావిస్తారు.
వైబ్రియానిక్స్ ఇతర అనేక చికిత్సా విధానాలతో కూడా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో ఇది వైద్యం త్వరగా కోలుకునే ప్రక్రియకు కూడా సహాయపడవచ్చు. వైబ్రియానిక్స్, హోమియోపతి లేదా మరేదైనా శక్తి ఆధారిత చికిత్సా విధానంలో, ప్రాక్టీషనర్ యొక్క మానసిక స్థితి మరియు అంతర్దృష్టి చికిత్సా ఫలితాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
గమనిక: పై సమాచారం మా తాజా పరిశీలనలు మరియు అనుభవాల ఆధారంగా ఇవ్వబడింది. గతంలో ఇచ్చిన సమాధానాలతో ఏదైనా విభేదం ఉంటే, ఈ సమాధానాన్నే ప్రస్తుత మార్గదర్శకంగా పరిగణించాలి. ఇదే అంశానికి సంబంధించిన ప్రశ్నల కోసం Vol 14 #5, Q1; Vol 10 #4, Q1; Vol 2 #6, Q3 మరియు Vol 1 #2, Q1 చూడండి.
________________________________________________________________________________
Q4: సాయిబాబా SRHVP దివ్య వైబ్రేషన్లను ఉత్పత్తి చేస్తుందని ధృవీకరించారు. అలాంటప్పుడు బలమైన ఎలక్ట్రో మాగ్నెటిక్ కిరణాలు వాటిని నిజంగా నిర్వీర్యం చేయగలవా?
A. ఈ స్వస్థతను కలిగించే వైబ్రేషన్లు దైవిక మూలం కలిగినవిగా ఉండటంతో, అవి సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థాయిలో పనిచేస్తాయి. సాధారణ శక్తి ముద్రలతో పోలిస్తే అవి సహజంగానే మరింత స్థిరంగా ఉంటాయి. అయితే, వాటి దైవిక మూలం వాటికి ప్రత్యేకమైన శక్తిని, రక్షణను అందించినప్పటికీ, అవి ఆల్కహాల్, మాత్రలు లేదా నీరు వంటి భౌతిక మాధ్యమంలోకి ప్రసారం చేయబడతాయి. ఈ భౌతిక మాధ్యమం బలమైన విద్యుదయస్కాంత (ఎలక్ట్రోమాగ్నెటిక్ EM) రేడియేషన్ కి సున్నితంగా ఉండవచ్చు. దైవిక సారం యథాతథంగా ఉన్నప్పటికీ, ఆ వైబ్రేషన్‌ను నిలుపుకోవడం, ప్రసారం చేయడం వంటి భౌతిక మాధ్యమం సామర్థ్యం ఎక్స్-రేలు, విమానాశ్రయ స్కానర్లు లేదా మొబైల్ ఫోన్ల వంటి బలమైన EM క్షేత్రాలకు గురికావడం వల్ల బలహీనపడవచ్చు. అందువల్ల, ముందుజాగ్రత్తగా, స్వామి ప్రసాదించిన ఈ వరాన్ని దాని స్వచ్ఛమైన రూపంలో గౌరవించి, సంరక్షించేందుకు ఇటువంటి ప్రభావాలకు దూరంగా ఉండటం మంచిది.
________________________________________________________________________________
Q5. హార్ట్ సర్జరీ, కిడ్నీ లేదా లివర్ ట్రాన్స్‌ప్లాంట్, లేదా రాళ్ల తొలగింపు వంటి పెద్ద శస్త్రచికిత్సల తరువాత రోగులు బరువు తగ్గడం సాధారణంగా కనిపిస్తుంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటి? అలాగే, వైబ్రియానిక్స్ దీనిని ఎలా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది?
A. పెద్ద శస్త్రచికిత్స అనంతరం బరువు తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు, శస్త్రచికిత్స అనంతర ఒత్తిడి, తాత్కాలికంగా ఆకలి తగ్గడం, జీర్ణక్రియలో మార్పులు, మందుల దుష్ప్రభావాలు, శారీరక శ్రమ తగ్గడం లేదా కోలుకునే సమయంలో శరీరానికి అధికంగా శక్తి అవసరం కావడం వంటివి కారణాలు కావచ్చు. కొన్ని సందర్భాల్లో, పోషకాలను శరీరం గ్రహించే సామర్థ్యం కూడా తగ్గవచ్చు. వైబ్రియానిక్స్ ఈ క్రింది విధాలుగా కోలుకునే ప్రక్రియకు సహాయపడవచ్చు:
- జీర్ణక్రియ మరియు పోషక పదార్థాల శరీరంలోకి శోషణకు తోడ్పడటం
- శస్త్రచికిత్సకు సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గించడం ద్వారా త్వరగా కదలడానికి మరియు ఆకలి మెరుగుపడటానికి సహాయపడటం
- మొత్తం శక్తి స్థాయి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడటం
- స్వస్తతను ఆలస్యం చేసే మానసిక ఒత్తిడి మరియు నిద్రలో అంతరాయాలను పరిష్కరించడంలో సహాయపడటం
పై సమస్యలను పరిష్కరించేందుకు సాధారణంగా ఈ ప్రాథమిక కాంబో ఇవ్వవచ్చు: CC4.1 Digestion tonic + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic కనీసం ఒక నెల పాటు లేదా అవసరమైనంతకాలం ఇవ్వాలి. నిద్రపోవడంలో ఇబ్బంది ఉంటే, దానికి ప్రత్యేకంగా CC15.6 Sleep disorders తో చికిత్స చేయాలి. రోగి పరిస్థితిని బట్టి, ప్రాక్టీషనర్ ఒక ప్రత్యేకమైన కాంబోను తయారు చేయవచ్చు.
దివ్య వైద్యుని దివ్యవాణి
“ప్రపంచంలోని సంపద అంతా ఒకరి దగ్గర ఉన్నప్పటికీ, ఆరోగ్యం దెబ్బతింటే మనిషి దుఃఖంగా, దయనీయంగా జీవించాల్సి వస్తుంది. మంచి ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరూ కోరుకోవలసిన అత్యంత విలువైన సంపద. గ్రామంలో నివసించే వారైనా, పట్టణంలో నివసించే వారైనా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి మంచి ఆరోగ్యం ఎంతో అవసరం. భగవంతుని అనుగ్రహం ఎంతో అవసరమని గుర్తించండి. మందులతో పాటు, జీవన విధానంలో క్రమశిక్షణ మరియు నియంత్రణ కూడా అవసరం.”
… సత్య సాయి బాబా, డిసీస్ అండ్ డివినిటీ, దివ్య ప్రసంగం, సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం, 29 జనవరి 1994 https://sssbpt.info/ssspeaks/volume27/sss27-05.pdf
“సమాజానికి సేవ చేయాలనే మన ప్రయత్నంలో విజయాన్ని సాధించాలంటే, ముందుగా మన స్వంత కుటుంబానికి సేవ చేయడంలో విజయం సాధించడం మొదటి అడుగు కావాలి. మన ఇంటి సేవ నుంచి క్రమంగా సమాజ సేవ వైపు పురోగమించాలి. మన కుటుంబంలోని సమస్యలను పరిష్కరించడానికి ముందుగా, మన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. తన మనస్సును సమస్యలతో నింపుకున్న వ్యక్తి సమాజానికి సేవ చేయడం సాధ్యం కాదు. సమాజ సేవను మించిన యోగం మరొకటి లేదు.”
… సత్య సాయి బాబా దివ్య ప్రసంగం, యోగ యొక్క నిస్వార్ధ సేవ, 50వ జన్మదిన వేడుకల సందర్భంగా 3వ సేవాదళ్ సమావేశం, 16 నవంబర్ 1975 https://archive.sssmediacentre.org/journals/vol_13/01AUG15/Sathya-Sai-Speaks-on-The-Yoga-of-Selfless-Service.htm
ప్రకటనలు
రాబోయే వర్క్‌షాప్‌లు*
- యుకె లండన్: సాయి వైబ్రియానిక్స్ వార్షిక సమావేశం, 21 సెప్టెంబర్ 2025, సంప్రదించవలసిన ఇమెయిల్ [email protected]
- ఇండియా పుట్టపర్తి: వర్చువల్ AVP* ప్రాక్టికల్ వర్క్‌షాప్ 3-21 నవంబర్ 2025** అనంతరం ముఖాముఖి వర్క్‌షాప్ 26-28 నవంబర్ 2025**, సంప్రదించవలసిన ఇమెయిల్ [email protected]
- ఇండియా పుట్టపర్తి SVP* ప్రాక్టికల్ వర్క్ షాప్ 1-4 డిసెంబర్ 2025**, సంప్రదించవలసిన ఇమెయిల్ [email protected]
- ఇండియా పుట్టపర్తి: టీచర్స్ ట్రైనింగ్ *** ఈ-కోర్స్ టీచర్లు మరియు డిసెంబర్ 2024 TT వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారి కోసం వర్క్ షాప్ 9-11 డిసెంబర్ 2025** సంప్రదించవలసిన ఇమెయిల్ [email protected]
* అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసి, ఈ-కోర్స్‌లో పాల్గొన్న వారికి మాత్రమే;
** తేదీలలో మార్పు ఉండవచ్చు. ఏవైనా మార్పులు ఉంటే పాల్గొనేవారికి తెలియజేయబడుతుంది.
*** అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసిన వారికి మాత్రమే. అడ్మిషన్ ప్రక్రియ 15 అక్టోబర్ 2025 నుంచి ప్రారంభమవుతుంది
అదనంగా
1. ఆరోగ్య వ్యాసం
మన రక్తమే మన జీవశక్తి! దానిని జాగ్రత్తగా కాపాడుకుందాం!
“రక్తకణాలలో, ఇంకా అతి సూక్ష్మమైన కణాలలో కూడా ఎంతో పని జరుగుతూ ఉంటుంది. సృష్టి రహస్యాన్ని ఎవరూ పూర్తిగా గ్రహించలేరు!! శరీరం మొత్తం రక్తకణాలతో నిండి ఉంటుంది. ఒక కణంలో ఉన్నదే ఇతర కణాలలో కూడా ఉంటుంది. ప్రతి కణం శరీరాన్ని చైతన్యవంతం చేసి, అందంగా తీర్చిదిద్దుతూ, ఇతర కణాల కోసం త్యాగం చేస్తుంది. ఇది మానవాళికి త్యాగం యొక్క పాఠాన్ని బోధిస్తుంది; త్యాగంలోనే సంక్షేమం ఉంది. చేతిలో రక్తం ప్రసరిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం రక్తం చేతి నుంచి బయటకు వెళ్లి శరీరంలోని ఇతర భాగాలకు చేరుతుంది; అది త్యాగమే. రక్తం త్యాగం చేసి ప్రవహించకపోతే, అది గడ్డకట్టి, దిమ్మలు మరియు వ్యాధులకు దారితీస్తుంది. చేతి సంక్షేమం రక్తం చేసే త్యాగంలోనే ఉంది, కాదా? జీవితంలో ముందుకు సాగాలంటే త్యాగం అవసరం; అది మనలను అమరత్వం వైపు నడిపిస్తుంది.”… సత్య సాయి బాబా 1
గత సంచికలో² ఆరోగ్యకరమైన హృదయం మన చేతుల్లోనే ఉందని తెలుసుకున్నాం. ఈ సంచికలో, హృదయం నిరంతరం పంప్ చేసే మన జీవరక్తం వైపు మన దృష్టిని మళ్లిద్దాం. అది నిశ్శబ్దంగా నదిలా మన రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ, మన జీవితాన్ని నిలబెడుతుంది.
1. రక్తంలోని ప్రధాన అంశాలు
1.1 రక్తం అనేది శరీరంలోని ప్రధాన రవాణా వ్యవస్థగా పనిచేసే ఒక ప్రత్యేకమైన ద్రవం. ఇందులో ప్రధానంగా నాలుగు
అంశాలు ఉంటాయి: ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు (RBCs), తెల్ల రక్తకణాలు (WBCs), మరియు ప్లేట్లెట్లు. వీటిలో ప్రతి ఒక్కటి శరీరంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. సగటు శరీర పరిమాణం కలిగిన పురుషుని శరీరంలో సుమారు 5 లీటర్ల రక్తం, స్త్రీ శరీరంలో సుమారు 4 లీటర్ల రక్తం ఉంటుంది. ఇది వారి శరీర బరువులో సుమారు 7–8% ఉంటుంది.3,4
1.2 ప్లాస్మా రక్తంలోని ద్రవ భాగం, అలాగే రక్తంలో అత్యధికంగా ఉండే అంశం (55%). ఇది ప్రధానంగా
మనం తీసుకునే ఆహారం, పానీయాల నుంచి శరీరం గ్రహించే నీటితో ఏర్పడుతుంది. ఇందులో 92% నీరు, 7% ముఖ్యమైన ప్రోటీన్లు (ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజెన్), 1% చక్కెర, కొవ్వు, లవణాలు, హార్మోన్లు మరియు కాలేయం, ఇతర అవయవాల్లో ఉత్పత్తి అయ్యే పోషక పదార్థాలు ఉంటాయి. రక్తంలోని మిగిలిన మూడు అంశాలు ఈ ద్రవంలో తేలుతూ ఉంటాయి. పోషక పదార్థాలు, హార్మోన్లు, ముఖ్యమైన ప్రోటీన్లతో పాటు రక్తకణాలను శరీరమంతటా ప్రసరింపజేయడంలో, రవాణా చేయడంలో ప్లాస్మా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, రోగనిరోధక శక్తి, ద్రవ సమతుల్యత, pH సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడుతుంది. శరీరం నుంచి తొలగించాల్సిన వ్యర్థ పదార్థాలను కూడా ఇది రవాణా చేస్తుంది.3-6
1.3 ఎర్ర రక్తకణాలు (ఎరిత్రోసైట్లు) రక్తంలో అత్యధికంగా ఉండే కణాలు (44%). వీటి జీవితకాలం సుమారు 120 రోజులు. వీటిలో హీమోగ్లోబిన్ (Hb) ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ మరియు ఇనుముతో కూడిన సమ్మేళనం. హీమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లి, తిరిగి కార్బన్ డయాక్సైడ్ను ఊపిరితిత్తులకు తీసుకువస్తుంది, తద్వారా దాన్ని శ్వాస ద్వారా బయటకు పంపవచ్చు. శరీరానికి అవసరమైన ఇనుములో ఎక్కువ భాగం కాలేయం, ప్లీహం (స్ప్లీన్), ఎముక మజ్జ మరియు పాత ఎర్ర రక్తకణాల నుంచి తిరిగి వినియోగించబడిన ఇనుము ద్వారా లభిస్తుంది.3,4,7,8
1.4 WBCs (ల్యూకోసైట్లు) శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే యోధుల
వంటివి; ఇవి రక్తంలో 1% కంటే తక్కువగా ఉంటాయి. WBCలలో సగానికి పైగా ఉండే అత్యంత సాధారణ రకం న్యూట్రోఫిల్స్; ఇవి బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరానికి మొదటి రక్షణ వరుసగా పనిచేస్తాయి, వీటికి ఈసినోఫిల్స్ మరియు బేసోఫిల్స్ సహాయపడతాయి. దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని పరిరక్షించే WBCలు లింఫోసైట్లు; వీటిలోని శక్తివంతమైన T మరియు B కణాలు వ్యాధికారకాలను ఎదుర్కొంటాయి, కాగా వాటి నుంచి మిగిలే వ్యర్థాలను తొలగించడంలో మోనోసైట్లు సహాయపడతాయి.3,4,9
1.5 ప్లేట్లెట్స్ (థ్రాంబోసైట్స్) 5–9 రోజుల జీవితకాలం కలిగిన అతి చిన్న కణ శకలాలు.
మనకు కోత లేదా గాయం అయినప్పుడు, ఇవి వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని, ఒకదానికొకటి అతుక్కుని, రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రారంభిస్తాయి. దీనివల్ల అంటుకునే స్వభావం కలిగిన ఫైబ్రిన్ వల ఏర్పడి, గాయాన్ని మూసివేసి రక్తస్రావాన్ని ఆపుతుంది; ఆ వల తరువాత కొత్త కణజాలం పెరగడానికి తాత్కాలిక ఆధారంగా పనిచేసి, గాయం మానడానికి సహాయపడుతుంది.3,4,10
2. రక్తం ఎలా తయారవుతుంది
2.1 ఎముక మజ్జ, ప్రత్యేకమైన రక్తకణాల కర్మాగారం వంటిది. ఇది కొన్ని ఎముకల మధ్యభాగంలో ఉండే
జెల్లీ వంటి మెత్తటి స్పాంజ్‌లాంటి కణజాలం; ముఖ్యంగా పక్కటెముకలు, వెన్నెముక, కటి ఎముకలు మరియు స్టెర్నమ్లో ఉంటుంది. ఎముక మజ్జలో రెండు రకాలు ఉన్నాయి: ఎర్ర ఎముక మజ్జ, ఇది రక్తాన్ని తయారు చేస్తుంది; మరియు పసుపు ఎముక మజ్జ, ఇది ప్రధానంగా కొవ్వును నిల్వ చేస్తుంది, అయితే ఎముకలు, మృదులాస్థి, కండరాల ఏర్పాటుకు కూడా సహాయపడుతుంది. ఎర్ర ఎముక మజ్జలో, స్టెమ్ సెల్స్ అనే సూక్ష్మమైన ప్రారంభ కణాల నుంచి రక్తం ఏర్పడటం ప్రారంభమవుతుంది. సుమారు ఒక వారంలో, ఇవి రక్తంలోని మూడు ముఖ్యమైన రకాల కణాలైన RBCs, WBCs మరియు PLATELETsగా పరిపక్వం చెందుతాయి. ఎముక మజ్జ ఈ రక్తకణాలను ప్లాస్మాలోకి చేర్చడం ద్వారా, మన సిరలు మరియు ధమనుల ద్వారా ప్రవహించే సంపూర్ణ రక్తంగా మారుస్తుంది.
ఏడేళ్ల వయస్సు తర్వాత, ముఖ్యంగా జీవితంలోని మొదటి రెండు దశాబ్దాల్లో, పసుపు ఎముక మజ్జ క్రమంగా పెరుగుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే ప్రత్యామ్నాయ వ్యవస్థలా, రక్తస్రావం, తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా జ్వరం వంటి అధిక అవసరం ఏర్పడినప్పుడు, పసుపు ఎముక మజ్జ తిరిగి ఎర్ర ఎముక మజ్జగా మారగలదు. తద్వారా శరీరంలో సమతుల్యత పునరుద్ధరించబడే వరకు రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.11,12
2.2 స్టెమ్ సెల్స్ శరీరంలోని వివిధ భాగాల్లో కనిపించే ప్రత్యేకమైన కణాలు. ఇవి ఎముక మజ్జ, రక్తం, మెదడు, చర్మం, గుండెలో ఉంటాయి. అలాగే, 3–5 రోజుల ప్రారంభ దశలో ఉన్న
themselves and repair and replace damaged cellsపిండంలో, నవజాత శిశువుల బొడ్డుతాడు మరియు మాయలో కూడా ఉంటాయి. ఇవి ప్రత్యేకమైనవి కావడానికి కారణం, తమను తాము పునరుత్పత్తి చేసుకుని, తిరిగి కొత్త కణాలను ఏర్పరచుకునే సామర్థ్యంతో పాటు, దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేసి, వాటి స్థానంలో కొత్త కణాలను ఏర్పరచగలగడం. ప్రస్తుతం నయం చేయలేనివిగా భావిస్తున్న వివిధ వ్యాధులు ఎలా అభివృద్ధి చెందుతాయో అర్థం చేసుకోవడానికి, వాటికి చికిత్స చేసి నయం చేయగల ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి, అలాగే కొత్త మందుల భద్రత మరియు ప్రభావశీలతను పరీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా స్టెమ్ సెల్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి.13-15
3. రక్త పరీక్ష యొక్క ముఖ్య ఉదేశ్యం
రక్త పరీక్ష శరీర ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా తెలియజేస్తుంది, ఆరోగ్య సమస్యలను గుర్తిస్తుంది లేదా సరైన నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు అవసరమా అనే విషయాన్ని సూచిస్తుంది. మధుమేహం, థైరాయిడ్, కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు, విటమిన్ లోపం, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ మరియు ఆటోఇమ్యూన్ రుగ్మతలు వంటి పరిస్థితులను పర్యవేక్షించడానికి రోగులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటారు. అత్యంత సాధారణమైన రక్త పరీక్ష ఫుల్/కంప్లీట్ బ్లడ్ కౌంట్, దీనిలో RBC, WBC, Hb మరియు PLT స్థాయిలతో పాటు ఇతర ప్రమాణాలను కూడా కొలుస్తారు. ఈ విలువలు లింగం, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి మారవచ్చు; అలాగే పరీక్ష నిర్వహించే ప్రయోగశాలను బట్టి సాధారణ పరిధిలో కూడా స్వల్ప తేడాలు ఉండవచ్చు.16-21
4. మన రక్త గ్రూప్ తెలుసుకోవడం మంచిది
రక్తం యొక్క అంశాలు మరియు వాటి విధులు రక్తగ్రూపుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఒకే విధంగా ఉంటాయి.
రక్తగ్రూపులు ABO వ్యవస్థ ప్రకారం A, B, AB లేదా O గా ఉంటాయి. ఎర్ర రక్తకణాల (RBCs)పై యాంటిజెన్ A, యాంటిజెన్ B, రెండూ లేదా ఏవీ ఉండకపోవడాన్ని బట్టి ఈ వర్గీకరణ జరుగుతుంది. యాంటిజెన్ అనేది రోగనిరోధక వ్యవస్థ గుర్తించి, దానికి అనుగుణంగా ప్రతిస్పందించడానికి ఉపయోగపడే ఒక గుర్తు. ప్రతి రక్తగ్రూపును మరో గుర్తు అయిన Rh ఫ్యాక్టర్ (D యాంటిజెన్) ఉనికిని బట్టి పాజిటివ్ లేదా నెగటివ్‌గా మరింత వర్గీకరిస్తారు. దీనివల్ల మొత్తం ఎనిమిది రక్తగ్రూపులు ఏర్పడతాయి: A+, A–, B+, B–, AB+, AB–, O+, మరియు O–. రక్త మార్పిడి, అవయవ దానం, గర్భధారణ సమయంలో అనుకూలతను నిర్ధారించడంలో, అలాగే కొన్ని ఆరోగ్యపరమైన ప్రమాదాలను అంచనా వేయడంలో ఈ వర్గీకరణ ఎంతో ముఖ్యమైనది.22-23
5. రక్త సంబంధిత వ్యాధులు
రక్తానికి సంబంధించిన చాలా వ్యాధులు ఎముక మజ్జ (బోన్ మారో) సరిగా పనిచేయకపోవడం వల్ల ఏర్పడతాయి. దీని కారణంగా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు లేదా ప్లేట్లెట్ల ఉత్పత్తి తక్కువగా లేదా అధికంగా జరగవచ్చు. దీనికి వివిధ వైద్య పరిస్థితులు కారణం కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో కారణం తెలియకపోవచ్చు.24
5.1 ప్లాస్మాకు సంబంధించిన రుగ్మతలు రక్తం గడ్డకట్టే విధానం, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం లేదా శరీరంలోని ద్రవ
slow healing. A rare genetic disorder called haemoసమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. ప్లాస్మాలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉండే హైపర్లిపిడీమియా వల్ల గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్లాస్మాలో ప్రోటీన్ స్థాయి తక్కువగా ఉండే హైపోప్రోటీనీమియా వల్ల వాపు, రోగనిరోధక శక్తి బలహీనపడటం మరియు గాయాలు నెమ్మదిగా మానడం వంటి సమస్యలు కలగవచ్చు. హీమోఫీలియా అనే అరుదైన జన్యుపరమైన రుగ్మతలో ప్లాస్మాలో రక్తం గడ్డకట్టడానికి అవసరమైన కారకాలు లోపిస్తాయి. దీనివల్ల సులభంగా శరీరంపై దెబ్బల గుర్తులు పడటం, చిన్న కోతల నుంచి కూడా ఎక్కువసేపు రక్తస్రావం కావడం, అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. 25-27
5.2 ఎర్ర రక్త కణ రుగ్మతలు: రక్తహీనత (అనీమియా)21 అనేది అత్యంత సాధారణమైన రక్త సంబంధిత రుగ్మత. సాధారణంగా ఎర్ర రక్తకణాల 
సంఖ్య లేదా హీమోగ్లోబిన్ (Hb) స్థాయి తక్కువగా ఉండటం, లేదా తగినంత ఎర్ర రక్తకణాలు లేకపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. దీనికి తరచుగా సరైన పోషకాహారం లేకపోవడం, విటమిన్ లోపం లేదా కొన్ని వ్యాధులు కారణమవుతాయి. దీని లక్షణాల్లో అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, చేతులు మరియు కాళ్లలో చల్లదనం లేదా తిమ్మిరి వంటివి ఉంటాయి.28 కొన్ని రకాల రక్తహీనతలు వంశపారంపర్యంగా వస్తాయి. ఉదాహరణకు, సికిల్ సెల్ అనీమియాలో ఆకారం మారిన ఎర్ర రక్తకణాలు రక్తప్రసరణకు ఆటంకం కలిగించి నొప్పిని కలిగిస్తాయి. థలసీమియాలో శరీరం తక్కువ హీమోగ్లోబిన్ను, చిన్న పరిమాణంలోని ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. మరో అరుదైన రకం అప్లాస్టిక్ అనీమియా; ఇందులో దెబ్బతిన్న ఎముక మజ్జ తగినంత రక్తకణాలను ఉత్పత్తి చేయలేకపోతుంది. 28-31
పాలీసైథీమియా అనేది ఎర్ర రక్తకణాల సంఖ్య అధికంగా ఉండే పరిస్థితి. ఇది గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులు, స్టెరాయిడ్ల వాడకం,
ధూమపానం, అధిక ఎత్తులో నివసించడం లేదా శరీరంలో నీరు తగ్గిపోవడం వల్ల ఏర్పడవచ్చు. ఇది పాలీసైథీమియా వెరాగా మారవచ్చు. ఇది ఎముక మజ్జ అధికంగా ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసే ఒక రకమైన రక్త క్యాన్సర్. దీనివల్ల రక్తం చిక్కగా మారి, రక్తం గడ్డకట్టడం, గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది సాధారణంగా 60 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. దీని లక్షణాల్లో చర్మం దురద, చెవుల్లో శబ్దం వినిపించడం, పొత్తికడుపు నొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం, చూపు మసకబారడం లేదా ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటివి
ఉంటాయి.28,32
5.3 తెల్ల రక్త కణ రుగ్మతలు: ల్యూకీమియా అనేది ఒక సాధారణ రక్త క్యాన్సర్. ఇందులో ఎముక మజ్జ అధిక సంఖ్యలో 
అసాధారణమైన WBCలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన రక్తకణాలకు స్థలం లేకుండా చేసి, రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. దీని లక్షణాల్లో తరచుగా జ్వరం, శరీర నొప్పులు, గాయాలు నెమ్మదిగా మానడం, పదేపదే ఇన్ఫెక్షన్లు రావడం, అలాగే నిరంతర దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటాయి. WBCల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు (ల్యూకోపీనియా) కూడా ఇదే విధంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది.33-35
మల్టిపుల్ మైలోమాలో, ఎముక మజ్జ అసాధారణమైన ప్లాస్మా కణాలను (ఒక రకమైన WBC) అధికంగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఎముకల నొప్పి, సులభంగా దెబ్బల గుర్తులు పడటం, గుండె స్పందనలో క్రమబద్ధత లేకపోవడం మరియు తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. దీనికి ముందస్తు, తేలికపాటి రూపమైన MGUS వల్ల ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, అయితే కొన్ని సందర్భాల్లో ఇది క్యాన్సర్‌గా మారవచ్చు.36
5.4 ప్లేట్లెట్లకు సంబంధించిన రుగ్మతలు: ప్లేట్లెట్ల సంఖ్య సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని థ్రాంబోసైటోపీనియా 
అంటారు; దీనివల్ల అధిక రక్తస్రావం సంభవించవచ్చు. దీని లక్షణాల్లో సులభంగా దెబ్బల గుర్తులు పడటం, తరచుగా ముక్కు నుంచి రక్తం కారడం లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, మలంలో రక్తం కనిపించడం, అంతర్గత రక్తస్రావం, అధికంగా నెలసరి రక్తస్రావం, ప్లీహం పెద్దదవడం, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, చేతులు మరియు కాళ్లలో తిమ్మిరి, కాళ్లలో వాపు, తీవ్రమైన తలనొప్పి, బలహీనత లేదా తల తిరగడం వంటివి ఉంటాయి. ప్లేట్లెట్ల సంఖ్య సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని థ్రాంబోసైటోసిస్ అంటారు; దీనివల్ల అవసరం లేకుండానే రక్తం గడ్డకట్టి, స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్ డిస్ఫంక్షన్ అంటే ప్లేట్లెట్ల సంఖ్య సాధారణంగానే ఉన్నప్పటికీ, అవి ఆశించిన విధంగా పనిచేయకపోవడం.37
5.5 ఇతర రక్త సంబంధిత వ్యాధులు: హీమటోమా అనేది రక్తనాళాల వెలుపల రక్తం చేరి ఏర్పడే పరిస్థితి; సాధారణంగా ఇది రక్తం గడ్డకట్టి, ఆ ప్రాంతం రంగు మారినట్లు (దెబ్బతగిలిన 
మచ్చలా) కనిపిస్తుంది. చిన్న హీమటోమాలు సాధారణంగా కనిపిస్తాయి, అయితే పెద్ద హీమటోమాలు నొప్పి, వాపు లేదా తిమ్మిరిని కలిగించవచ్చు. తలకు గాయాలు అంతర్గత (సబ్డ్యూరల్) హీమటోమాలకు దారితీయవచ్చు. ఇవి తీవ్రమైన ప్రభావాలను కలిగించి, తలనొప్పితో పాటు మాట తడబడటం, చూపు మసకబారడం, తల తిరగడం, సమతుల్యత కోల్పోవడం లేదా శరీరంలోని ఒక వైపు బలహీనత వంటి స్ట్రోక్‌ను పోలిన లక్షణాలను కలిగించవచ్చు. దీర్ఘకాలిక సందర్భాల్లో జ్ఞాపకశక్తి కోల్పోవడం, అయోమయం ఏర్పడవచ్చు; చికిత్స చేయకపోతే పక్షవాతం, మూర్ఛలు లేదా కోమాకు దారితీయవచ్చు. సిరలో ఏర్పడే రక్తం గడ్డను డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు; ఇది సాధారణంగా కాలిలో ఏర్పడుతుంది. హీమరేజ్ అంటే పగిలిన రక్తనాళం నుంచి నిరంతరంగా రక్తస్రావం కావడం; ఇది బాహ్యంగా లేదా అంతర్గతంగా ఉండవచ్చు. అన్ని హీమటోమాలు హీమరేజ్ల వల్లే ఏర్పడతాయి, కానీ అన్ని హీమరేజ్‌లు హీమటోమాలకు దారితీయవు.38,39
6. రక్తదానం – మరొకరి జీవితానికి అమూల్యమైన బహుమతి!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి కొన్ని సెకన్లకు ఒకసారి ఎవరికో రక్త మార్పిడి అవసరమవుతుంది. ప్రమాదాలు, ప్రసవ సమయంలో ఏర్పడే సమస్యలు, తీవ్రమైన వ్యాధులు వంటి అనేక సందర్భాల్లో రక్తం అవసరం అవుతుంది. ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, మానవ రక్తానికి కృత్రిమ ప్రత్యామ్నాయం ఇంకా అందుబాటులో లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, రక్తదాతలు సాధారణంగా 18–65 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి, కనీసం 50 కిలోల బరువు ఉండాలి మరియు ఆరోగ్యంగా ఉండాలి. రక్తదానం చేసే కేంద్రాల్లో వైద్యులు దాత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రక్తదానానికి అర్హతను నిర్ధారిస్తారు. దానం చేసిన రక్తం మరియు ప్లాస్మాను వివిధ వ్యాధుల కోసం పూర్తిగా పరీక్షిస్తారు. దీనివల్ల క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారికి వారి ఆరోగ్య పరిస్థితిపై అదనపు అవగాహన కూడా లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్మా దానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్మాలో అనేక ముఖ్యమైన యాంటీబాడీలు మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య పరిస్థితుల చికిత్సలో ఉపయోగపడతాయి.40-44
చివరి మాట: మీ రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి; ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం, స్వచ్ఛమైన అలవాట్లతో దానిని పోషించండి. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని నీటితో సమృద్ధిగా ఉంచుకోండి, హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండండి, ఇన్ఫెక్షన్లు
మరియు గాయాలను నివారించండి. సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ, సేవ చేయడానికి భగవంతుడు ప్రసాదించిన వరంగా భావించే మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
రెఫరెన్సులు మరియు లింకులు
1. Sathya Sai Baba on blood cells: https://archive.sssmediacentre.org/www/ssspeaks/index/clips/?sid=127&cid=4&aid=19169
2. “Healthy Heart is in your hands”, Health article, Vibrionics newsletter July-Aug 2025, vol 16 issue 4, page 13-18, https://newsletters.vibrionics.org/english/News%202025-07%20Jul-Aug%20RG.pdf
3. Blood basics: https://www.hematology.org/education/patients/blood-basics
4. Lifeblood: https://my.clevelandclinic.org/health/body/24836-blood
5. Plasma: https://my.clevelandclinic.org/health/body/22865-plasma
6. https://www.stanfordchildrens.org/en/topic/default?id=what-is-plasma-160-37
7. RBCs: https://my.clevelandclinic.org/health/body/21691-function-of-red-blood-cells
8. Iron recycling in body: https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC8469827/
9. WBCs: https://my.clevelandclinic.org/health/body/21871-white-blood-cells
10. Platelets: https://my.clevelandclinic.org/health/body/22879-platelets
11. Bone marrow: https://my.clevelandclinic.org/health/body/22818-bone-marrow
12. Bone marrow: https://www.medicalnewstoday.com/articles/285666
13. Stem cells: https://byjus.com/biology/stem-cells/
14. Stem cells: https://my.clevelandclinic.org/health/body/24892-stem-cells
15. Power of stem cells: https://www.mayoclinic.org/tests-procedures/bone-marrow-transplant/in-depth/stem-cells/art-20048117
16. Blood test: https://my.clevelandclinic.org/health/diagnostics/24508-blood-tests
17. Complete blood count: https://my.clevelandclinic.org/health/diagnostics/4053-complete-blood-count
18. https://www.mayoclinic.org/tests-procedures/complete-blood-count/about/pac-20384919
19, https://www.ncbi.nlm.nih.gov/books/NBK2263/table/ch1.T1/
20. https://www.maxhealthcare.in/blogs/complete-blood-count-cbc-test
21. Health article on Anaemia & Hb level: Newsletter July-Aug 2018, https://news.vibrionics.org/en/articles/254
22. Blood Types: https://my.clevelandclinic.org/health/treatments/21213-blood-types
23. https://www.redcrossblood.org/donate-blood/blood-types.html
24. Blood disorders: https://my.clevelandclinic.org/health/diseases/24918-bone-marrow-failure
25. Hyperlipidaemia: https://my.clevelandclinic.org/health/diseases/21656-hyperlipidemia
26. Hypoproteinaemia: https://my.clevelandclinic.org/health/diseases/low-protein-in-blood-hypoproteinemia
27. Haemophilia: https://my.clevelandclinic.org/health/diseases/14083-hemophilia
28. RBC disorders: https://www.medicalnewstoday.com/articles/red-blood-cell-disorders-types-causes-and-symptoms
29. Sickle cell anaemia: https://my.clevelandclinic.org/health/diseases/12100-sickle-cell-disease
30. https://www.mayoclinic.org/diseases-conditions/sickle-cell-anemia/symptoms-causes/syc-20355876
31. Thalassemia: https://www.cdc.gov/thalassemia/about/index.html
32. Polycythaemia vera: https://my.clevelandclinic.org/health/diseases/17742-polycythemia-vera
33. WBC disorders: https://my.clevelandclinic.org/health/body/21871-white-blood-cells
34. Leukaemia: https://my.clevelandclinic.org/health/diseases/4365-leukemia
35. Leukopenia: https://my.clevelandclinic.org/health/diseases/17706-low-white-blood-cell-count
36. WBC Plasma cells disorder/Multiple Myeloma: https://my.clevelandclinic.org/health/diseases/6178-multiple-myeloma
37. Platelet disorders: https://my.clevelandclinic.org/health/diseases/platelet-disorders
38. Haematoma: https://my.clevelandclinic.org/health/diseases/21183-subdural-hematoma
39. Brain Haematoma & Haemorrhage: https://www.ganeuroandspine.com/blog/brain-hematoma-vs-brain-hemorrhage-whats-the-difference/?post_type=blog_post
40. Blood donation: https://www.who.int/news-room/questions-and-answers/item/blood-products-why-should-i-donate-blood
42. https://www.who.int/campaigns/world-blood-donor-day/2019/who-can-give-blood
43/ How donation works: https://eraktkosh.mohfw.gov.in/eraktkoshPortal/#/
44. All types of blood donations: https://www.redcrossblood.org/donate-blood/how-to-donate/types-of-blood-donations.html
45. Plasma donation guide: https://www.plasmahero.org/news/whats-difference-between-blood-and-plasma-donation
__________________________________________________________________________________
2. SVIRT కార్యాలయం, పుట్టపర్తిలో నిర్వహించిన వర్క్‌షాప్‌లు & కోర్సులు
2.1 వర్చువల్ SVP ఫాలో-అప్ కోర్సు, 26-27 జూలై 2025
స్వామి దివ్య మిషన్ పట్ల గాఢమైన అంకితభావంతో, డిసెంబర్ 2024 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు SVPలు 11635, 11646, 03611 వినయపూర్వకంగా తమ పేషెంట్ రికార్డులు మరియు కేస్ హిస్టరీలను సమర్పించారు. వీటన్నింటినీ వారు సిమ్యులేటర్ కార్డులను మాత్రమే ఉపయోగించి చికిత్స చేశారు. అనంతరం వారి కోర్స్ టీచర్లు 10375 & 11422తో ఫలప్రదమైన పరస్పర చర్చ జరిగింది. అదే బ్యాచ్‌కు చెందిన SVP 03590 కూడా సమానమైన అంకితభావంతో ఉన్నప్పటికీ, ఆమె తల్లి ఐసీయూలో చేరడంతో కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
జూలై 27న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ఆసక్తిగల SVPలు ఆన్లైన్లో చేరి, మన వ్యవస్థాపకులు డా. అగర్వాల్ మరియు హేమ అగర్వాల్ అందించిన ప్రేరణాత్మక ప్రసంగాన్ని ఆలకించారు. అన్ని ఇతర నివారణలు నిరంతరంగా కొనసాగుతున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనప్పుడు, వ్యాధిని మూలస్థాయిలో నిర్మూలించేందుకు మియాజమ్లను పరిమితంగా మరియు జాగ్రత్తగా ఉపయోగించడం గురించి వారు మార్గదర్శనం చేశారు. రోగి అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉండి నోటి ద్వారా రెమెడీలు తీసుకోలేని సందర్భాల్లో, మానసిక ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు లేదా దూర ప్రాంతంలో ఉండి రెమెడీలు పొందే అవకాశం లేనప్పుడు బ్రాడ్‌కాస్టింగ్‌కు ఉన్న ప్రత్యేక శక్తిని వివరించారు. అలాగే, భక్తి, ఏకాగ్రతతో కూడిన ప్రార్థన మరియు గాఢమైన విశ్వాసంతో వైబ్రియానిక్స్‌ను ఆచరించినప్పుడు దాని అపారమైన శక్తిని వివరించారు. ఈ సందర్భంలో SRHVPతో తమకు ఎదురైన కొన్ని అనుభవాలను వ్యవస్థాపకులు పంచుకుని, పాల్గొన్నవారి అనేక ప్రశ్నలకు ఆలోచనాత్మకంగా సమాధానాలు ఇచ్చారు.
__________________________________________________________________________________
2.2 ఏపీ హిందీ & తెలుగు వర్క్‌షాప్, 31 జూలై 2025 నుంచి 4 ఆగస్టు 2025 వరకు
వైబ్రియానిక్స్‌ను గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు విస్తరించాలనే మా నిరంతర కృషిలో భాగంగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు కొత్త అభ్యర్థుల కోసం ఐదు రోజుల వర్క్‌షాప్ నిర్వహించబడింది. తమ జ్ఞానాన్ని మరింత
మెరుగుపరుచుకోవాలనే ఆసక్తితో AVP10879 కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య సదుపాయాలు తక్కువగా లేదా అసలు లేని సమాజాలకు సేవ చేయాలనే గాఢమైన తపనతో వచ్చిన వీరంతా ఆసక్తిగల మరియు అంకితభావంతో కూడిన ప్రాక్టీషనర్లుగా తమను తాము నిరూపించుకున్నారు. అమూల్యమైన ప్రాక్టికల్ అనుభవాన్ని పొందేందుకు, వారు సమీప ప్రాంతాల నుంచి రోగులను కూడా తీసుకువచ్చారు. తమ టీచర్ల సన్నిహిత మార్గదర్శకత్వంలో, వారు నమ్మకంతో రెమెడీలను రూపొందించి, వాటిని అందించగలిగారు. ఇద్దరు సీనియర్ టీచర్లు 10375, 11422కు, అడ్మిషన్లను నిర్వహించడం మరియు పత్రాలను హిందీ, తెలుగు భాషల్లోకి అనువదించడం ద్వారా ప్రాక్టీషనర్లు 11573, 11567 సహకరించారు. వర్క్‌షాప్ సజావుగా సాగేందుకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రాక్టీషనర్లు 11573, 11634, 11650 ప్రత్యేకంగా హాజరయ్యారు.
ఆరుగురు అభ్యర్థులూ విజయవంతంగా APsగా అర్హత సాధించి, ప్రమాణ స్వీకారం చేసి, తమ పవిత్రమైన 108CC బాక్స్‌ను అందుకున్నారు. చివరి రోజున డా. అగర్వాల్ ప్రేరణాత్మక ప్రసంగం చేస్తూ, ఆశీర్వదించబడిన 108CC బాక్స్‌లో దైవశక్తి మాత్రమే నివసిస్తుందని గుర్తుచేశారు. తన ప్రారంభ దశలలోని అనుభవాలను పంచుకుంటూ, కొత్త ప్రాక్టీషనర్లు రెమెడీలను సరిగ్గా ఎంచుకోకపోయినా అవి పనిచేసేలా చేసి స్వామి ఎల్లప్పుడూ వారికి విశ్వాసాన్ని కలిగిస్తారని భరోసా ఇచ్చారు. తమ బాధ్యతను హృదయపూర్వకంగా స్వీకరించి, విశ్వాసంతో చికిత్స కొనసాగించాలని, తమ శ్రేష్ఠమైన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఎప్పుడైనా రోగులు లేకపోతే స్వామిని గాఢంగా ప్రార్థించాలని ప్రోత్సహించారు. అవసరమైతే దూర ప్రాంతాలకు కూడా రెమెడీలను పంపుతూ, చురుకుగా రోగులను చేరుకోవాలని ఆయన సూచించారు. దీనికి అదనంగా, హేమ్ అగర్వాల్ మాట్లాడుతూ, 108CC బాక్స్‌ను మొదట రూపొందించడంలో సహకరించిన వారి హృదయపూర్వక ప్రార్థనలు అందులో నిండి ఉన్నాయని, అనంతరం స్వామి స్వయంగా దానిని అపారంగా ఆశీర్వదించారని గుర్తుచేశారు.
ఈ ఆనందదాయకమైనప్పటికీ ఎంతో లోతైన అనుభవంతో పాల్గొన్నవారు హృదయపూర్వకంగా కదిలిపోయారు. వారు గొప్ప ఉత్సాహంతో, సేవ పట్ల మరింత పునరుద్ధరించబడిన సంకల్పంతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు.
__________________________________________________________________________________
3. ఆసక్తికరమైన సంఘటన - డా. జిత్ కె. అగర్వాల్ గారి డైరీ నుండి – రోగి నుంచి ప్రాక్టీషనర్‌గా: ఒక కుటుంబం విశ్వాసంతో వేసిన అడుగు!
మా వైబ్రియానిక్స్ ప్రయాణం ప్రారంభ దశలో అది. ఎటువంటి అధికారిక అర్హతలు లేవు, జ్ఞానం చాలా పరిమితంగా ఉంది, అనుభవం తక్కువ, రికార్డుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండేది కాదు. ఈ వైద్య విధానాన్ని ఎవరికి బోధించాలి అనే విషయంలో కూడా స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. మేము కోరుకున్నది ఒక్కటే — వైబ్రియానిక్స్‌ను సేవగా ఆచరిస్తానని దేవునికి లిఖితపూర్వకంగా వాగ్దానం చేయడం, అలాగే ప్రతి తరగతిలో కనీసం ఆరుగురు విద్యార్థులు ఉండడం. అయితే, నిర్మాణాత్మక వ్యవస్థలో మాకు ఉన్న లోటును, మా అచంచలమైన ఉత్సాహం, రెమెడీలపై సంపూర్ణ విశ్వాసం, స్వామి అపారమైన ఆశీర్వాదాలు భర్తీ చేశాయి. వాటి ప్రతిఫలంగా అద్భుతమైన ఫలితాలు కనిపించేవి. అలాంటి మరపురాని సంఘటన 1995లో జరిగింది.
ఒక సాయంత్రం, 12 ఏళ్ల అమెరికన్ బాలుడు తన తండ్రితో కలిసి మా క్లినిక్‌కు వచ్చాడు. అతనికి గొంతు ఇన్ఫెక్షన్కు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించారు. అయితే నాలుగు క్యాప్సూల్స్ తీసుకున్న కేవలం 16 గంటల్లోనే అతని శరీరం మొత్తం స్ఫోటకాలతో, మొటిమలతో మరియు ఎర్రటి పొక్కులతో నిండిపోయింది. కుటుంబం తీవ్రంగా ఆందోళన చెందింది, ఎందుకంటే వారు రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంది. బాలుడి తండ్రి స్వయంగా డాక్టరు. ఇది యాంటీబయాటిక్ వల్ల కలిగిన ప్రతిచర్య కాదని ఆయన భావించగా, నాకు మాత్రం అది అలాంటి ప్రతిచర్యగానే అనిపించింది. నేను ఆ క్యాప్సూల్‌ను 200Cలో పొటెంటైజ్ చేసి, రోజుకు TDS గా తీసుకోవాలని ఇచ్చాను.
మరుసటి రోజుకే సగం చర్మ గాయాలు మాయమయ్యాయి. ఆ తరువాతి రోజుకల్లా అన్ని స్ఫోటకాలు పూర్తిగా తొలగిపోయాయి. వారికి సురక్షితమైన ప్రయాణం కావాలని కోరుకున్నాను. కానీ నా ఆశ్చర్యానికి, వారు ఇప్పటికే తమ విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నామని, వైబ్రియానిక్స్ నేర్చుకున్న తరువాత మాత్రమే స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు! ఒక తరగతి ప్రారంభించాలంటే కనీసం ఆరుగురు పాల్గొనేవారు అవసరమని నేను వివరించాను. అదే సాయంత్రం, ఆ బాలుడి నలుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో దంపతులు కూడా వచ్చి, మరుసటి ఉదయం నుంచే కోర్సు ప్రారంభించమని నన్ను కోరారు. ఒక వారం తరువాత, శిక్షణ పూర్తి చేసి, మౌఖిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఆ రెండు కుటుంబాలు, రెండు SRHVPs చేతబట్టి తమ స్వదేశానికి తిరిగి వెళ్లారు. స్వామిపై వారి అచంచలమైన విశ్వాసం మరియు నమ్మకం కారణంగానే వారు తరువాత అద్భుతమైన ఫలితాలను సాధించారని చెప్పనవసరం లేదు.
__________________________________________________________________________________
4. జ్ఞాపకార్థం తీవ్రమైన దుఃఖంతో, కేరళకు చెందిన అంకితభావంతో సేవలందించిన ప్రాక్టీషనర్ ఫిలోమినా జోసెఫ్ 11972…ఇండియా, 68 సంవత్సరాల వయస్సులో పరమపదించిన విషయాన్ని తెలియజేస్తున్నాము. ఆమె 10 ఆగస్టు 2025న ప్రశాంతంగా
కన్నుమూశారు. ఫార్మసిస్ట్‌గా శిక్షణ పొందిన ఆమె, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు కూడా. ఆమె వివాహం చేసుకోకుండా, సేవా జీవితాన్ని ఎంచుకున్నారు. ఇతరుల సంక్షేమం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. 12 సంవత్సరాల పాటు, ప్రతిరోజూ తన గ్రామం నుంచి కాసరగోడ్‌లోని తన క్లినిక్‌కు 50 కి.మీ. ప్రయాణించేవారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు, అవసరంలో ఉన్నవారికి తన స్వస్థతా సేవలను అందించేవారు. కరుణ, త్యాగం, అచంచలమైన భక్తితో వేలాది మంది జీవితాలను స్పృశించిన ఆమె, తన చివరి రోజు వరకు సేవ చేస్తూనే ఉన్నారు.
ఆమె జీవితం నిస్వార్థ సేవకు, నిష్కల్మషమైన ప్రేమకు నిజమైన ప్రతిరూపం. ఒక సహ ప్రాక్టీషనర్ ఇలా రాశారు: “ఇతరులకు వెలుగునందించేందుకు తాను కరిగిపోయే కొవ్వొత్తిలా, ఆమె మానవసేవకు తన జీవితాన్ని నిశ్శబ్దంగా అంకితం చేశారు.” ఆమె పుణ్యాత్మకు శాంతి చేకూరాలని, ఆమె సేవా వారసత్వం మనందరికీ అదే అంకితభావంతో సేవ చేయడానికి స్ఫూర్తినివ్వాలని ప్రార్థిస్తున్నాము.