Vol 16 సంచిక 3
మే / జూన్ 2025
అవలోకనం
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
అహంకారం లేకుండా సేవ చేయాలనే స్వామి పిలుపును గుర్తుచేస్తూ, డా. అగర్వాల్ అనేక రంగాల్లో అంకితభావంతో సేవలందిస్తున్న మన ప్రాక్టీషనర్ల నిజాయితీగల కృషిని ప్రశంసిస్తున్నారు. అలాగే SVIRT లక్ష్యాలను నిరంతరం ముందుకు తీసుకెళ్లేందుకు, సంస్థలో అసోసియేట్ సభ్యుడిగా ఎలా చేరాలో, ఇప్పటికే ఉన్న అసోసియేట్ సభ్యత్వాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలో కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
ఈ సంచికలో ఈ క్రింది 12 ఆసక్తికరమైన కేసులు పొందుపరచబడ్డాయి: ఫ్రోజన్ షోల్డర్; టిన్నిటస్; ప్రీడయాబెటిస్‌లో తలతిరగడం, అధిక ఆకలి; వెర్టిగో, సమతుల్యత కోల్పోవడం; భుజం నొప్పి; ట్రిగ్గర్ ఫింగర్ సిండ్రోమ్; పెరియానల్ యాబ్సెస్, మలబద్ధకం; రాడిక్యులోపతితో కూడిన సర్వైకల్ స్పాండిలోసిస్; అలర్జిక్ రైనైటిస్, విరేచనాలు; ఛాతీ నొప్పి, అధిక రక్తపోటు, మలబద్ధకం; దీర్ఘకాలిక మలబద్ధకం, మొలలు; మరియు నిరాశ (డిప్రెషన్).
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
వైబ్రియానిక్స్ సేవ ద్వారా తమ జీవితాల్లో వచ్చిన పరివర్తనను అనుభవిస్తున్న ఇద్దరు అత్యంత అంకితభావం గల ప్రాక్టీషనర్ల గురించి తెలుసుకోండి. మొదటి ప్రాక్టీషనర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినవారు. ఎల్లప్పుడూ సేవకు సిద్ధంగా ఉండే ఆయన, తన అనుభవాలను పంచుకుంటున్నారు. రెండవ ప్రాక్టీషనర్ పుట్టపర్తికి చెందిన వైద్య నిపుణులు. వైబ్రియానిక్స్ ద్వారా జరిగిన విశేషమైన స్వస్థతలను ప్రత్యక్షంగా చూసిన ఆయన కూడా తన ఆసక్తికరమైన, అద్భుతమైన కొన్ని కేసులను పంచుకుంటున్నారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
తెలుసుకోవడానికి చదవండి: అలర్జీ కారకమైన సూర్యకాంతిని పొటెన్టైజ్ చేసే దశలవారీ విధానం; ఒక ప్రాక్టీషనర్ తన విజిటింగ్ కార్డు రూపొందించుకోవడానికి పాటించాల్సిన మార్గదర్శకాలు; ICUలో ఉన్న రోగికి ఇరవై నాలుగు గంటలూ నిరంతరంగా వైబ్రేషన్లను ప్రసారం చేసే విధానం; జీవితపు చివరి దశలో ఉన్న రోగి బాధను తగ్గించి, మనశ్శాంతిని కలిగించేందుకు ఎలా సహాయపడాలి; అలాగే ఆరోగ్య శిబిరాల్లో రోగుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, వారికి నీటి రెమెడీ తయారు చేసుకోవడం ఎలా నేర్పించి ప్రోత్సహించాలి?
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్యవాణి
మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే కారణాలు ఏమిటో, అలాగే సేవను ప్రేమతో కూడిన నిరంతర సమర్పణగా ఎలా మార్చుకోవాలో స్వామి ప్రేమతో మార్గనిర్దేశం చేస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
భారతదేశంలోని పుట్టపర్తిలో జరగనున్న రాబోయే శిక్షణా శిబిరాల వివరాలు.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
అదనంగా ఈ సంచికలో • “శక్తివంతమైన కండరాలను సంరక్షించుకోండి – మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి” అనే ఆరోగ్య వ్యాసం—కండరాల స్వభావం, నిర్మాణం, శరీరంలో వాటి కీలక పాత్ర, వివిధ కండరాల వ్యాధులు, గాయాలు, అధిక వినియోగం వల్ల కలిగే సమస్యలు, అలాగే కండరాల గాయాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా నివారించుకోవాలో వివరిస్తుంది. • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాక్టీషనర్లు ప్రారంభించిన కొత్త శిబిరాల ముఖ్యాంశాలు, అలాగే పుణే, చెన్నైలో నిర్వహించిన ప్రాక్టీషనర్ల సమావేశాల విశేషాలు. • అనుభవాలు: డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి – “దర్శన్ మాత్ర: స్వర్ణయుగంలోని స్వస్థతను స్పృశించిన అనుభూతి.”
పూర్తి వ్యాసం చదవండి