ప్రశ్నలు జవాబులు
Vol 16 సంచిక 3
మే / జూన్ 2025
Q1. దయచేసి అలర్జీ కారకం – సూర్యకాంతిని పొటెంటైజ్ చేసే విధానాన్ని దశలవారీగా వివరించగలరా?
A. SRHVPలో పొటెన్సీని 1Mకి (గతంలో 200C) సెట్ చేయండి. సగం వరకు నింపిన సాధారణ డైల్యూషన్ బాటిల్‌ను ‘రెమెడీ’ వెల్‌లో (పాత మోడళ్లలో ‘Out’ అని గుర్తించబడినది) ఉంచండి. సూర్యకిరణాలు రెమెడీపై ప్రభావం చూపకుండా లేదా దాని ప్రభావాన్ని నిర్వీర్యం చేయకుండా ఉండేందుకు, SRHVPలోని కుడివైపు ఉన్న (రెమెడీ వెల్) భాగాన్ని మందమైన నల్లని వస్త్రం లేదా ప్లాస్టిక్ బ్యాగ్‌తో పూర్తిగా కప్పండి. తరువాత SRHVPను నేరుగా సూర్యకాంతి పడే సమతల ప్రదేశంలో ఉంచండి. సాధారణంగా UV కిరణాలు అత్యధికంగా ఉండే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య, ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఉంచడం మంచిది. ప్రార్థన చేస్తూ కనీసం ఒక నిమిషం పాటు సూర్యకాంతికి గురయ్యేలా ఉంచండి. సూర్యుని వైబ్రేషన్లు శాంపిల్ వెల్ లోకి గ్రహించబడి, రెమెడీ వెల్ ని డైల్యూషన్‌కు బదిలీ అవుతాయి. ఆ తరువాత SRHVPను నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి, ఉపయోగించడానికి రెమెడీ బాటిల్‌ను జాగ్రత్తగా బయటకు తీయండి.
_________________________________________________________________________________
Q2. నేను VPగా గత నాలుగు సంవత్సరాలుగా వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటీవల ఒక వివాహ వేడుకలో కొంతమంది వైబ్రియానిక్స్ పట్ల ఆసక్తి చూపించి, నా విజిటింగ్ కార్డు అడిగారు. నేను స్వయంగా నా విజిటింగ్ కార్డును ప్రింట్ చేసుకోవచ్చా, లేక దీనికి ఏదైనా స్టాండర్డ్ ఫార్మటు ఉందా?
A. అవును, ప్రాక్టీషనర్లందరూ ఉపయోగించాల్సిన ప్రామాణిక విజిటింగ్ కార్డు నమూనా ఉంది. ముందుగా, మీరు ఇన్స్టిట్యూట్ యొక్క అసోసియేట్గా ఉన్నారో లేదో నిర్ధారించుకోండి. అలాగే ప్రాక్టీషనర్ పోర్టల్ లో మీ రిపోర్టులు అన్నీ తాజాగా ఉండేలా చూసుకోండి. ఆ తరువాత అధికారిక విజిటింగ్ కార్డు టెంప్లేట్ కోసం [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు. టెంప్లేట్‌లో మీ వ్యక్తిగత వివరాలను మాత్రమే నమోదు చేసి, మీ అవసరానికి అనుగుణంగా విజిటింగ్ కార్డులను ప్రింట్ చేయించుకోవచ్చు.
_________________________________________________________________________________
Q3. ICUలో ఉన్న రోగికి SRHVP ద్వారా వైబ్రేషన్లను ప్రసారం చేస్తున్నప్పుడు, 10 నిమిషాల పాటు 6TD ప్రసారం చేయడానికి బదులుగా, రెమెడీని శాంపిల్ వెల్లో మరియు రోగి ఫోటోను రెమెడీ వెల్లో 24 గంటలూ ఉంచవచ్చా?
A. అవును, ఇది ఆమోదయోగ్యమే. అయితే, మీరు రోజుకు ఆరు సార్లు నిర్ణీత సమయాల్లో ప్రార్థనలు చేయాలి. ఆ సమయాల్లో సామూహిక స్వస్థత కోసం రోగి కుటుంబ సభ్యులను లేదా ఇతర శ్రేయోభిలాషులను కూడా ప్రార్థనల్లో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు.
_________________________________________________________________________________
Q4. అంతిమ దశలో ఉన్న వ్యాధితో బాధపడుతూ, అనాయాస మరణము కోరుతున్న రోగిని ఎలా ఎదుర్కోవాలి?
A. అనాయాస మరణం అంటే బాధాకరమైన, నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని నొప్పి లేకుండా ఉద్దేశపూర్వకంగా మరణింపజేయడం. ఇది అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన నైతిక మరియు చట్టపరమైన అంశం కాబట్టి, ఇటువంటి పరిస్థితులను గాఢమైన సానుభూతితో, ఎటువంటి తీర్పు ఇవ్వకుండా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్‌గా, వైద్యపరమైన లేదా చట్టపరమైన సలహాలు ఇవ్వకుండా ఉండాలి; మీ పాత్ర సానుభూతితో రోగి మాటలను వినడం, ఆధ్యాత్మిక సహాయాన్ని అందించడం, అలాగే బాధను తగ్గించి ప్రశాంతతను కలిగించే రెమెడీలను అందించడం. రోగి ఇప్పటికే తీసుకుంటున్న మందులతో పాటు, SR272 Arsen Alb CM లేదా CC15.2 Psychiatric disorders (Vol 12 #5.Q4 చూడండి) కూడా ఇవ్వవచ్చు.
_________________________________________________________________________________
Q5. క్యాంపుల్లో సాధారణంగా జనసందోహం ఎక్కువగా ఉండటం వల్ల, నీటి రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో వివరించడానికి నాకు ఎల్లప్పుడూ తగినంత సమయం ఉండదు. దీనివల్ల చాలా మంది రోగులు దాని వల్ల త్వరగా లభించే స్వస్థత ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమి చేయగలను?
A. ఒక ఆచరణాత్మక పరిష్కారం ఏమిటంటే, నీటి రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, దాని ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను వివరించే సరళమైన పోస్టర్ లేదా కరపత్రాన్ని (అవసరమైతే స్థానిక భాషలో) తయారు చేయడం. రోగులు వేచి ఉన్న సమయంలో చదువుకునేలా దాన్ని మీ టేబుల్‌పై లేదా సమీపంలో స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించండి.
ప్రత్యామ్నాయంగా, సులభంగా అర్థమయ్యే చిన్న కరపత్రాలను కొంత సంఖ్యలో సిద్ధంగా ఉంచి, రెమెడీతో పాటు రోగులకు ఇవ్వవచ్చు. అలాగే, అదే సూచనలను SMS లేదా వాట్సాప్ సందేశం ద్వారా తరువాత కూడా పంపవచ్చు. అయితే, సంప్రదింపు సమయంలోనే రోగి ఫోన్ నంబర్‌ను తీసుకోవడం తప్పనిసరిగా గుర్తుంచుకోండి.