Vol 15 సంచిక 4
జులై / ఆగష్టు 2024
అవలోకనం
డాక్టర్ జిత్ కె అగర్వాల్ గారి డెస్క్ నుండి
గురు పౌర్ణమి సందర్భంగా స్వామి ప్రసాదించిన సందేశాన్ని ఆధారంగా చేసుకొని, డా. అగర్వాల్ మన జీవితాన్ని సంపూర్ణంగా దైవానికి సమర్పణగా మార్చుకోవాలని, అలాగే మనలోని గురువును మేల్కొల్పాలని ప్రతి ఒక్కరినీ ప్రేరేపిస్తున్నారు. స్వామి శతజయంతి వేడుకల కోసం మనం ఎల్లప్పుడూ తాజా సమాచారంతో సిద్ధంగా ఉండి, మన వంతు పాత్రను సమర్థంగా పోషించాలని ఆయన సున్నితంగా గుర్తుచేస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
ఈ సంచికలో ఈ క్రింది 12 ఆసక్తికరమైన కేసులు పొందుపరచబడ్డాయి: నిరాశ (డిప్రెషన్); దుమ్ము, పొగకు అలర్జీ; చర్మంపై దురదతో కూడిన మచ్చలు; మొలలు; బహిష్టు సమయంలో మైగ్రేన్; అజీర్ణం, వ్యసనం; దురదతో కూడిన చర్మ దద్దుర్లు; అర్టికేరియా (Hives); అసిడిటీ, మొలలు; భుజం, మోకాలి నొప్పి; ఎక్జిమా; నిద్రలేమి, కాలి నొప్పి.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
పుట్టుకతోనే స్వామి సన్నిధిలో పెరిగి, వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న ఇద్దరు అంకితభావం గల ప్రాక్టీషనర్లను ఈ సంచికలో పరిచయం చేస్తున్నాము. అంతరంగం నుండి కలిగిన బలమైన ప్రేరణతో వారు వైబ్రియానిక్స్‌ను స్వీకరించారు. వారు తమ హృదయాన్ని హత్తుకునే స్వస్థత అనుభవాలను, అలాగే కొన్ని అద్భుతమైన స్వస్థతలను పంచుకుంటున్నారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నోత్తరాల విభాగము
తెలుసుకోవడానికి చదవండి: కొత్తగా అర్హత పొందిన ఒక ప్రాక్టీషనర్ రోగులకు చికిత్స చేసే సందర్భంలో తన మెంటర్‌ను ఎప్పుడు, ఎలా సంప్రదించాలి? వైబ్రియానిక్స్ మాత్రను నాలుక కింద నెమ్మదిగా కరిగేలా ఎందుకు ఉంచాలి? ప్రయాణాల సమయంలో SRHVPను సురక్షితంగా ఎలా తీసుకెళ్లాలి? పుల్‌అవుట్ గురించి రోగికి ఎలా వివరించి, దానిని జాగ్రత్తగా ఎలా నిర్వహించాలో ఎలా సూచించాలి? అలాగే దెబ్బతిన్న, అరిగిపోయిన లేదా పోగొట్టుకున్న SRHVP కార్డులను ఎలా భర్తీ చేసుకోవాలి?
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
సాత్విక ఆహారం ద్వారా మనలో ఎలా పరివర్తన కలిగించుకోవాలో, అలాగే మన కర్తవ్యాన్ని హృదయపూర్వకంగా ఆరాధనగా ఎలా నిర్వర్తించాలో స్వామి ప్రేమతో బోధిస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
భారతదేశంలోని పుట్టపర్తిలో జరగనున్న ఉపాధ్యాయుల శిక్షణా శిబిరం సహా రాబోయే శిక్షణా శిబిరాల వివరాలు.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
• “మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకొని దాని అద్భుత సామర్థ్యాన్ని సాకారం చేసుకోండి” అనే ఆరోగ్య వ్యాసం—మన అద్భుతమైన మెదడు గురించి, వివిధ మెదడు సంబంధిత వ్యాధులు, వైకల్యాలు, స్ట్రోక్ సంభవించినప్పుడు చేయవలసినవి, చేయకూడనివి, అలాగే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన సూచనలను అందిస్తుంది. • నిరంతరం విస్తరిస్తున్న వైబ్రియానిక్స్ శిబిరాలు, క్లినిక్‌ల ముఖ్యాంశాలు. • “డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి” అనే కొత్త ఉపవిభాగం ప్రారంభం—వైబ్రియానిక్స్ ప్రయాణంలో మనస్సు పవిత్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఒక అనుభవం. • దివంగతులైన ఇద్దరు ఆత్మలకు మన ఘన నివాళి.
పూర్తి వ్యాసం చదవండి