బెల్స్ పాల్సీ (ముఖ కండర పక్షవాతం) 12013 & 11553...India
అమెరికా నుంచి వచ్చిన 62 ఏళ్ల మహిళ గత ఆరు నెలలుగా తన జీవితంలో అధిక ఒత్తిడికి గురి అయింది. 2015 జూన్ 4న డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆమె ముఖం యొక్క ఎడమ వైపున అకస్మాత్తుగా తిమ్మిరి మరియు కండరాలు సంకోచంతో తీవ్రమైన బాధ ఏర్పడే సరికి రహదారి పక్కనే ఆమె కారును ఆపవలసి వచ్చింది. తన ముఖానికి పక్షవాతం వచ్చినట్లు భావించడంతో ఆమె అత్యవసర సంరక్షణ కోసం ఆసుపత్రికి వెళ్ళింది. ఇది బెల్స్ పాల్సి(ముఖ కండర పక్షవాతం) అని, నిర్ధారణ చేసిన వైద్యుడు అది నయమవడం కష్టమని దీని స్వస్థతపై ఎటువంటి భరోసా ఇవ్వలేమని ఏదైనా కాస్త మెరుగుదల తీసుకురావడానికి అనేకవారాలు స్టెరాయిడ్స్ వాడుతూ ఫిజియో థెరపీ చేయించు కోవాలని చెప్పారు.
అయితే, ఆమె స్టెరాయిడ్స్ తీసుకోకూడదని నిర్ణయించుకొని వారి సలహా ప్రకారం వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ మాత్రం ప్రారంభించింది. ఆమె నోరు ఎడమవైపు పడిపోవడంతో ఆమెకు ఎటువంటి స్పర్శ తెలియక ఆమె ఆహారాన్ని కూడా ఎడమవైపు నుండి తీసుకోలేకపోవడం లేదా అటువైపు నమలలేక పోవడం, ఒక్కొక్కసారి ఆ ప్రక్రియలో ఆమె బుగ్గను లేదా పెదవిని కొరకడం కొనసాగుతోంది. ఆమె తీసుకునే చికిత్స వల్ల ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో, ఆందోళనతో ఆమె మానసిక ఒత్తిడి స్థాయి మరింత పెరిగింది. 2015 జూన్ 18 నాటి తెల్లవారు ఝామున, ఆమె నిరాశకు గురై స్వామిని తీవ్రంగా ప్రార్థించింది. ప్రస్తుతం అమెరికా సందర్శనలో ఉన్న ఆమె స్నేహితురాలి తల్లిదండ్రులు వైబ్రో ప్రాక్టీషనర్లు అవడంతో వారినుండి చికిత్స పొందాలని ఆమె అంతరంగం నుండి ఒక సందేశం వచ్చింది. ఆమె వెంటనే వారికి ఫోన్ చెయ్యగా వారి కుమార్తె వెంటనే క్రింది రెమిడీ తీసుకువచ్చి ఇచ్చింది:
CC15.1 Mental & Emotional tonic + CC18.4 Paralysis…6TD
2015 జూన్ 21 న, ఆమె సాయి కేంద్రాన్ని సందర్శించినప్పుడు పక్షవాతం యొక్క చిన్న సంకేతం కూడా లేకుండా ఉన్న ఆమెను చూసిన వారు ఎంతో ఆశ్చర్యపోయారు. 48 గంటల్లో తన ముఖం సంపూర్ణంగా మామూలుగా మారిపోయినట్లు ఆమె సంతోషంగా తెలియజేశారు. నరాలకు ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఆమె 100% చక్కగా ఉన్నట్లు భావించింది. 2015 జూన్ 24న, మోతాదు TDS కు తగ్గించారు. రోగికి ఎక్కువ కాలం రెమెడీని కొనసాగించాల్సిన అవసరం లేకపోవడంతో, ఆమె ఒక నెల తర్వాత దానిని ఆపివేసింది. ఆమె ప్రాక్టీషనర్లతో సన్నిహితంగా ఉండడంతో ఏప్రిల్ 2020 నాటికి, ఆమెకు వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదని తెలిసింది.
రోగి యొక్క వాంగ్మూలము :
“48 గంటల తర్వాత పక్షవాతం లేదా నరాలు దెబ్బతినకుండా నా ముఖం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చింది. వైబ్రియానిక్స్ తీసుకోక ముందు కనీసం నా ఎడమ కంటిని మూయలేక పోయేదానిని. దానిని మూసివేయడానికి మరియు నీటితో తరచుగా కడగడానికి నా వ్రేలిని ఉపయోగించవలసి వచ్చేది. స్వామి దయ మరియు అంకుల్ ప్రేమ ద్వారా నేను వైబ్రియానిక్స్ తో పూర్తిగా నయం అయ్యి సాధారణ స్థితికి వచ్చాను.
“మా డాక్టరు ఈ వార్తలను చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన సూచించిన ఫిజియో థెరపీ లేదా స్టెరాయిడ్స్ లేకుండా ఇంత త్వరగా కోలుకోవడం ఊహించలేకపోయారు. వారి మాటల్లోనే “ఇది ఖచ్చితంగా ఒకఅద్భుతం, నేను డాక్టరుగా నా రోజుల్లో ఎప్పుడూ కనీ వినీ ఎరుగనిది’’.