Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ద్విద్రువ రుగ్మత (బైపోలార్ డిజార్డర్) 03572...Gabon


పెయింటింగ్ మరియు సిరమిక్స్‌లో ప్రావీణ్యం కలిగి  గ్రాడ్యుయేట్ ఆర్టిస్ట్ ఐన42  ఏళ్ల మహిళ మందుల దుకాణంలో తన తల్లికి  సహాయం చేస్తూ ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ  ఆమె గత 10 సంవత్సరాలుగా ఎక్కువ సమయం తన గదికి తాళం వేసుకొని దయనీయ స్థితిలో జీవించసాగింది. చిరిగిపోయిన దుస్తులు ధరించి, కొన్నిసార్లు తనకు తాను వీధుల్లోకి వెళ్లిపోయేది. ఆమె ఎవరితోనూ మాట్లాడదు, తన తల్లి నుండి తప్ప ఎవరి నుండి ఏమీ స్వీకరించదు. ఆమె అవసరాలు తీర్చటానికి, కనీసం ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ  ఆమె ప్రవర్తన భయం, కోపం మరియు కొన్నిసార్లు హింసాత్మకంగా కూడా ఉంటుంది. ఆమె పరిస్థితి బైపోలార్ డిజార్డర్ అని నిర్ధారించబడినది. ఫార్మసిస్ట్ గా నిష్ణాతురాలైన అయిన ఆమె తల్లి, ఆమెకు వైద్య చికిత్స అందించడానికి తన వంతు కృషి చేసింది కానీ విజయం సాదించలేకపోయింది. ఆమె ఎటువంటి  ఔషధం తీసుకోవడానికి నిరాకరించడంతో, తన కుమార్తె ఎప్పటికైనా మామూలుగా అవుతుందనే ఆశను తల్లి కోల్పోయింది.

 ఇట్టి నిరాశాజనితమైన  స్థితిలో రోగి తల్లి 2019 డిసెంబర్ 11 న అభ్యాసకుడిని సందర్శించారు. తన కుమార్తె సమస్య గురించి మాట్లాడుతూ, తన కుమార్తె చాలా సున్నితమైనదని మరియు ప్రేమలో పదేపదే విఫలమవడంతో ఆమె తీవ్ర నిస్పృహ మరియు ఉన్మాద స్థితికి నెట్టివేయబడిందని సూచించారు. వైబ్రియోనిక్స్ మానసిక వ్యాధిని నయం చేస్తుందని అభ్యాసకునికి పూర్తి నమ్మకం కానీ రెమెడీ ఎలా ఇవ్వాలి అనే విషయంలోనే ఆలోచిస్తున్నారు. స్వామిని తీవ్రంగా ప్రార్థించిన తరువాత, అతను ఈ క్రింది రెమెడీ ఇచ్చారు:

CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing...TDS  నీటితో పేషెంటుకు ఇస్తూ ఆమె గదికి వెళ్ళే దారిలో మరియు దారికి అటు ఇటు ఉన్న గోడలు లేదా గ్రిల్స్ (బానిస్టర్స్) మీద చల్లాలని సూచించారు.

ఐతే రోగి యొక్క తల్లి తన కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేస్తుందనే భయంతో, రెమెడీ మందులు తన కుమార్తెకి ఇవ్వడం గానీ చల్లడం గానీ చేయలేదు. దానికి బదులుగా, ఆమె తన కుమార్తె యొక్క ఇటీవలే తీసిన ఫోటోను  రెమెడీ బాటిల్ చుట్టూ చుట్టి, హృదయపూర్వక ప్రార్థనతో దేవునికి అర్పించి దానిని తన భోజన శాలలో  సురక్షితంగా ఒక మూల ఉంచారు.  ఒక వారంలో రోగి యొక్క తల్లిని ఆహ్లాద, ఆశ్చర్యాలకు గురిచేస్తూ  తన కుమార్తె ఆమెతో మాట్లాడటానికి నిదానంగా ఆమె దగ్గరకు చేరుకుంది. అంతేకాక ఆమెతో సంతోషంగా భోజనం చేయడానికి ఆసక్తి చూపింది. ఆమె టీవీ చూడటానికి తన తల్లితో కలిసి గదిలో కూర్చోటం  మరియు  కుటుంబంతో పాటు భోజనం చేయడంకూడా  ప్రారంభించింది. ఒక నెలలో తన కుమార్తె యొక్క ప్రవర్తనలో నిదానంగా ఈ విదమైన మార్పు, అది కూడా వాస్తవానికి రెమెడీ మందులు నోటిలోకి తీసుకోకుండానే  రావడం రోగి తల్లి నమ్మలేకపోయింది. ఈ శుభవార్తను అభ్యాసకుడితో పంచుకోవాలని ఉన్నా ఈ మార్పు తాత్కాలికం  కాదని నిర్ధారించుకోడానికి ఆమె మరో 4 నెలలు వేచి ఉంది. 2019 మే 10 న  రోగి తల్లి అభ్యాసకుడిని కలుసుకుని,  2019 ఫిబ్రవరి నుండి, తన కుమార్తె  ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చిందని, తన చుట్టూ ఉన్న అందరితో ఆమె ప్రశాంతంగా మరియు మామూలుగా ఉంటోందని తెలియజేసారు. ఆమె ఇకపై చిరిగిపోయిన బట్టలు ధరించటం కానీ తన గదిలో తాళం వేసుకోవడం గానీ  చేయటంలేదు. జీవితాన్ని సాఫీగా ఎదుర్కోగలననే విశ్వాసం ఆమెలో చిగురించింది.

తన కుమార్తెను చూడకుండా మరియు ఏ ప్రతిఫలం ఆశించకుండా  చికిత్స చేయగలడం దేవుని యొక్క అనంతమైన దయ అని ఆమె తన ఆనందాన్ని మరియు కృతజ్ఞతను వ్యక్తం చేసారు. రోగికి చికిత్స చేయటంలో వైబ్రియోనిక్స్ కి  ఉన్న అపరిమిత సామర్థ్యం గురించి తెలుసుకున్నందుకు అభ్యాసకుడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 2019  ఆగష్టు నాటికి, రోగికి వ్యాధి పునరావృతం కాకుండా బాగానే ఉన్నది. ఆమె తన తల్లికి 10 సంవత్సరాల క్రితం ఏవిధంగా సహాయం చేసేదో అలా చేయడం ప్రారంభించింది మరియు ఆర్టిస్ట్ గా ఆమె తన నైపుణ్యాన్ని తిరిగి ప్రారంభించింది. రోగి యొక్క ఫోటో ఇప్పటికీ నివారణ మందు చుట్టూ చుట్టబడే ఉంది.

రోగి తల్లి నుండి నిర్ధారణ : “నిజమే కవల పిల్లలలో ఒకరైన 42 సంవత్సరాల నా  కుమార్తె 10 సంవత్సరాల క్రితం మానసిక వత్తిడికి గురైంది. న్యూరోలెప్టిక్స్‌ చికిత్స మాటల దూకుడును పెంచడమే కాక వంటగది పరికరాలు, టెలివిజన్ మరియు దుస్తులను పాడుచేయడాన్ని తీవ్రతరం చేసింది . నేను స్వచ్ఛందంగా ఈ చికిత్సను ఆపేసరికి దూకుడు తగ్గింది కానీ ఆమె తనకి తాను అపార్ట్మెంట్లో తాళం వేసుకొని అక్కడే ఉండిపోసాగింది. అలా మాతో సంబంధాలు లేకుండా  రెండు, మూడు నెలలు అక్కడే ఉంది.  మాకు తెలుస్తున్న ఒకే ఒక  సమాచారం ప్రకారం, మేము మెట్లపై పెడుతున్న ఆహారాన్ని ఆమె తీసుకునేది. వైబ్రియానిక్స్ గురించి ఎవరో 6 నెలల క్రితం నాకు చెప్పారు. నేను వెంటనే ప్రయత్నించాను. నాకు ఉన్నఇబ్బంది ఏమిటంటే నేను అభ్యాసకుడు సూచించినట్లు మందులు ఇవ్వలేను. అందువల్ల ఆమె ఇటీవలి ఫోటోలలో ఒకదాన్ని వైబ్రియానిక్స్ పిల్ల్స్ ఉన్న ట్యూబుకి చుట్టే ఆలోచన నాకు వచ్చింది.  శక్తి విషయంలో దూరం ప్రతిబంధకం కాదు అని, ఆ చర్య వలన శక్తి నా కుమార్తె మెదడుకు నేరుగా చేరుతుంది అనే ఉద్దేశ్యంతో నేను దీనిని భోజనాల గదిలోని ఫర్నిచర్‌లో ఉంచాను.

సుమారు 5 నుండి 6 రోజుల తరువాత నా కుమార్తె తన అపార్ట్మెంట్ నుండి దిగి నా వైపు రావడం చాలా ఆనందంగా చూశాను.   ఎలా ఉన్నావని ఆమె నన్ను అడిగింది  కుర్చీని ముందుకు లాగి, కూర్చుని టీవీలో సినిమా చూసింది. అ తరువాత  ఆమె నాతో భోజనం కూడా చేసింది. ఆ రోజు నుండి ఆమె ప్రతిరోజూ నా వద్దకు వస్తూ కూరలు వంటివి చేయడం మరియు వంట చేయడం కూడా ప్రారంభించింది. 7 సవత్సరాలు ఒoటరితనం తరువాత వచ్చిన మార్పు అద్భుతమైనదని నేను ధృఢంగా చెప్పగలుగుతున్నాను.  వైబ్రియానిక్స్ యొక్క శక్తివంతమైన చికిత్సను కొనసాగిస్తాను. ఈ విదమైన చికిత్స పద్ధతిని అందించినందుకు చాలా ధన్యవాదాలు. ”