తీవ్రమైన అస్తమా 11581...India
32-సంవత్సరాల మహిళను తీవ్రమైన అస్తమా వల్ల ఊపిరి అందకపోవడంతో 2016 సెప్టెంబర్ 16 న హాస్పిటల్ కి తీసుకెళ్ళడం జరిగింది. ఈమెకు చిన్నప్పటినుండి ఈ వ్యాధి ఉండడంతో పాటు ఇస్నోఫిలియ కౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉండడం తో ఆమె ఇన్హేలర్ ఉపయోగించేవారు. ఈ విధంగా 10-15 సంవత్సరాలుగా అస్తమా వల్ల పెద్దగా ఇబ్బందేమీ లేదు కానీ ఎప్పుడయినా వాతావరణం తేమగా ఉన్నప్పుడు ఆమెకు జలుబు దగ్గు వస్తూఉండేవి. ఐతే గత రెండు నెలలుగా ఈమెకు తరుచుగా జలుబు చేస్తూ ఆకుపచ్చని కళ్ళే తోపాటు ఊపిరి తీసుకునేటప్పుడు గరగర శబ్దం కూడా వస్తోంది.
హాస్పిటల్లో ఈమెను డాక్టర్ చూసినప్పుడు ఊపిరి అందకపోవడము, గొంతులో గరగర శబ్దంతో చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. డాక్టర్ ఆమెకు 5 రోజులవరకూ యాంటిబయోటిక్స్ వాడమని చెపుతూ 5 రకాల మందులను వ్రాసారు. ఈ 5 రోజులలో ఆమెకు తగ్గక పొతే అస్తమా కలిగినప్పుడల్లా నెబ్యులైజెర్ ఉపయోగించ వలసి వస్తుందని డాక్టర్ చెప్పారు. ఆమె మందులు తీసుకోకుండా ప్రాక్టీ షనర్ ను సంప్రదించడంతో ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.
#1. CC10.1 Emergencies…ప్రతీ 10 నిమిషాలకు నీటితో
#2. CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack + CC19.6 Cough chronic…6TD
ఈమె అలోపతిక్ మందులు ఏమీ తీసుకోకుండా కేవలం వైబ్రో రెమిడి లనే తీసుకున్నారు.
ఒక గంట తర్వాత గొంతులో గరగర ఆగిపోవడంతో #1 ను ఆపివేయడం జరిగింది. ఆ రాత్రి ఈమెకు హాయిగా నిద్రపట్టింది. రెండు రోజులలో ఆమెకు వచ్చే కళ్ళె రంగు ఆకుపచ్చ నుండి పసుపు పచ్చకు మారిపోయి వ్యాధినుండి 60% మెరుగుదల కనిపించింది. మూడవ రోజుకల్లా #2 ను క్రింది విధంగా మార్చారు:
#3. CC8.1 Female tonic + CC9.2 Infections acute + #2...6TD
వారం తర్వాత ఆమెకు వ్యాధి నుండి 100% నివారణ కలగడంతో #3 TDS గా రెండువారాలు, BD గా మరొక వారము OD గా నాలుగు వారాలు చివరిగా OW ప్రివెంటివ్ డోసేజ్ గా తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది. చివరిసారిగా 2016 డిసెంబర్ 8 వ తేదీన ఈమె ప్రాక్టీషనర్ ను కలిసినపుడు తనకు పూర్తిగా నయంయ్యిందని ఒక్కసారికూడా వ్యాధివల్ల ఇబ్బంది కలగలేదని చెప్పడంతో మరొక నెల డోసేజ్ ను OW గా తీసుకోమని సూచించడం జరిగింది.
ఈ ప్రాక్టీషనర్ CC8.1 Female tonic మహిళా రోగులలో వ్యాధినిరోధక శక్తి పెంచుతుందని తెలుసుకున్నారు.