Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

Vol 5 సంచిక 3
May/June 2014


ప్రియమైన చికిత్సా నిపుణులకు,

ఇది వ్రాస్తున్నప్పుడే, ఈ మాటలు మిమ్మల్ని చేరుకుంటున్నట్లు తోస్తోంది. మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు కనుక అది నాకు సహజం. మీకు శిక్షణ నివ్వటం, మీరు వైద్యం చేస్తున్నప్పుడు మిమ్మల్ని అనేక రకాలుగా కలిసి మీ గురించి తెలుసుకోవటం అనే  అవకాశాలు నాకు దక్కాయి..

కానీ మీలో ఎవరినీ సాయి వైబ్రియానిక్స్ వైద్యులుగా ఎంచుకున్నది నేనని నాకు తోచటం లేదు. అదంతా స్వామి చేష్ఠ. విజ్ఞానము, నేర్పు, ఆత్మీయత అవసరమైన ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఆయన మీమల్ని తన చేత్తో ఎన్నుకున్నారు. మీరు వైబ్రో ఆచారులైనప్పుడు మీలో ప్రతి ఒక్కరు నాకు కాకుండా భగవంతుడికి ప్రమాణం చేసారు. ఈ సందేశం చదువేటప్పటికి మీరు ఆ ప్రతిజ్ఞ  నిలుపుకునైనా ఉంటారు లేదా ఇంకా ఆ ప్రయత్నంలో ఉండి ఉంటారు.

ఇతర విషయాలతో పాటు రోజుకు కనీసం ఒక గంట సేవలో అందరు రోగులను ప్రేమతో చూసుకుంటాననీ ప్రతి నెలా మీ నుంచి వైద్యం అందుకున్న రోగుల సంఖ్యనూ, ప్రత్యేకమైన లేదా అసాధారణమైన కేసులనూ తెలుపుతామని భగవంతుడికి ప్రమాణం చేశారు. మీ ప్రతిజ్ఞను నేను ఇప్పుడు ఒక కారణం వల్ల జ్ఞాపకం చేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికీ మీ వైద్య అనుభవాన్ని మునపటికన్న మరింతగా పంచుకోవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే -  మన రోగులను ఉత్తమమంగా సేవించుకోవటానికీ, మన సహాయం అవసరమైన చాలా రోగులలో మరింత మందికి మన సేవలు అందటానికీ మనమంతా మనం తెలుసుకున్న దానిని పంచుకోవాలి.

మీరు వైద్యం చేస్తున్న రోగులు ఇతర రోగులకన్న భిన్నంగా మీకు తోచవచ్చు. కానీ నిజానికి రోగులను మనం అలా వేరు చేయలేము. ఒక్కొక్కరికి వేరువేరు రోగులను స్వామి పంపంటం నిజమే అయినా అందరు రోగులూ “మన రోగులే”, ఎందుకుంటే మన సేవా క్షేత్రానికి మన గుమ్మం హద్దుకాదు. “అస్వస్థులు, కుంగిపోయిన వారు, ఓదార్పు అందని వారు, రోగగ్రస్థులు – ఎవరు ఎదురైనా అదే నీ సేవా క్షేత్రము”. మన సేవా క్షేత్రానికి గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, మన నివాస ప్రాంతం వంటి భౌగోళిక పరిమితులు లేవు.

మీ సేవా క్షేత్రంలో ఇప్పుడే - మీ విజ్ఞానమూ, అనుభవమూ, ప్రేమా అవసరమై మీరెన్నడూ కలుసుకోని రోగులు ఉన్నారు. అది ఎలా అంటే- మిమ్మల్ని ఎన్నుకుని మీ వైద్యంలో చేయూతనిస్తున్న స్వామి మీరు ప్రకటిస్తే  ఇతర వైద్యులకూ రోగులకూ ఉపయోగపడే విద్యనీ, అనుభవాన్నీమీకు ఇస్తున్నారు. ప్రకటించక పోవటం స్వచ్ఛమైన అహంకారం.

ఇంతవరకు చదివిన తరువాత నేను ఏమి చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. మీలో కొందరికి నేను పంచుకోవలసినది ఏమీ లేదు అనుకుంటూ స్తభ్ధంగా ఉండిపోతారని అనిపిస్తోంది. మరికొందరికి ఈ వైద్యమే ముఖ్యంగా, అనుభవాలను పంచుకోవటం దీనికి ప్రతిబంధంగా తోచవచ్చు. మీరు గడించిన అనుభవం ఇతరులకు  అందించవలసిన బహుమతిగా కాక మీ సొత్తుగా కూడా తోచవచ్చు. ఇటువంటి  ధోరణులు ఏవైనా మీకుంటే – భగవంతుడికి ఎంతగా శరణాగతులమవు తున్నామో పరిశీలించుకోవాలి.

మనం వైబ్రియానిక్స్ లో ముందుకు పోవటానికి ఐక్యతకున్న ప్రాధాన్యాన్ని స్వామి నొక్కిచెప్పారని తోస్తోంది. అలా కలిసి పని చేయటంలో ఎంతటి శక్తి ఉందో అంతర్జాతీయ సాయి వైబ్రియానిక్స్ సమావేశం తళుక్కు మనిపించింది. ఆ సమావేశానికి మీరు వచ్చినా రాకపోయినా - సమాచారాన్నీ, అనుభవాన్నీ పంచుకోవటం వైద్యులకు ఎంత ప్రేరణ నిచ్చిందో విని ఉంటారు. చాలా మంది వైబ్రియానిక్స్ సేవకు మరింత ఉత్సాహంతో అంకిత మయ్యారు. ఇటువంటి సమావేశం ఉండాలని స్వామి నిశ్చయిస్తున్నప్పుడు ఇటువంటి ప్రయోజనం ఆయన మనసులో ఉండి ఉండాలి.

ఈ అనుభవం ఆధారంగా ఎదిగే పద్ధతిని తయారు చేసుకుందాం. ఈ సమావేశానికి రాలేక పోయిన వైద్యులకు ఈ సమావేశపు ప్రసాదాలను విస్తరిద్ధాం.  ఇది ప్రస్తుతం మనం చేయవలసిన పనులలో అతి ప్రధానమైనది. సమాచారాన్ని పంచుకోవటం వల్ల ముందుముందు సాయి వైబ్రియానిక్స్ ప్రయోజనాలు మరింతగా సిద్ధిస్తాయని ధృవ పడింది. స్వామి దయవల్ల మన అనుభవాలను పంచుకుంటూ , ఒక్కక్కరుగా సాధిస్తున్న దానికన్న మరింత ముందుకు పోదాం.

ఈ ప్రకారం సాయి వైబ్రియానిక్స్ సంస్థ యొక్క కృషిలో పాల్గొనమని సూటిగా మిమ్మల్ని పిలుస్తున్నాను.

వార్తా లేఖ

వైద్యులు తమ సమాచారాన్ని పంచుకునే మార్గమైన ఈ వార్తాలేఖ రూపురేఖలు సమీప భవిష్యత్ లో మెరుగవుతాయి. మనం ప్రకటించదలుచుకుంటున్న అంశాలు

  • అసాధారణమైన కేసులతో పాటు, సామాన్యమై వైద్యుల దైనందిన అనుభవాన్ని చూపే కేస్ చరిత్రలు
  • వైద్యులు అందించదలుచుకున్నచిట్కాలు
  • ఆవిష్కారిస్తూ, ప్రేరణనిస్తూ కలిగే అనుభవాల నివేదికలు
  • వైద్యం గురించి పొట్టికథలు
  • తమ ప్రాంతంలో సాయి వైబ్రియానిక్స్ సేవాకార్యక్రమాలు, పథకాలూ, పరిశోధనల గురించిన నివేదికలు
  • వైద్యుల రూపు రేఖలు. వైద్యుని ఫొటోతోపాటు ఆయన గురించిన క్లుప్త సమాచారం ఇక్కడ ఉంటుంది. తమ నేపథ్యం, సేవ ఎక్కడ ఎంతకాలంగా చేస్తున్నారన్న వివరం, తమ అభిప్రాయాలను వైద్యులు ఇక్కడ క్లుప్తమైన వాక్యాలలో పంచుకుంటారు.

మీరు పాల్గొనే విధానం: ఇటువంటి సమాచారాన్ని సమీకరించటానికి సాయివైబ్రియానిక్స్ కు ఒక కార్యవర్గం ఉన్నది. వీరు వార్తాలేఖకు సమాచారాన్ని సమకూర్చే సంపాదకులుగా సేవలందిస్తారు. వీరిలో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి వ్రాయమని కోరితే, మీకు సాధ్యమైనంతగా స్పందించండి. కానీ అలాంటి అభ్యర్థన కోసం మీరు ఆగకండి. నిజానికి నా ఆశ – మీరు అలా ఆగరనే. [email protected] కు మీరే మీ సమాచారాన్ని సూటిగా పంపవచ్చు. అలా అందిన ప్రతిదానిని మీకు తెలిపి మీతో అవసరమైన  విధంగా వ్యవహరిస్తాము.

వ్యవసాయ పరిశోధన

ఇటీవల సoవత్సరాలలో ఢిల్లీ లోనూ ఇతర చోట్లా విజయవంతమైన ప్రయోగాల జాడలో, వ్యవసాయంలో సాయి వైబ్రియానిక్స్ ఉపయోగం గురించి దీర్ఘకాలిక పరిశోధన కోసం అదనపు కార్యవర్గాన్ని ఏర్పాటుచేసుకున్నాం. ఈ జట్టు వైబ్రియానిక్స్  ను వ్యవసాయ సంబంధంగా ఉపయోగించటానికి అవసరమైన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి, ఇతర ఆధారల నుంచి సేకరిస్తుంది. ఈ కార్యానికి సంబంధించిన సమాచారం ఏదైనా మీ దగ్గర ఉంటే దయచేసి నాతో పంచుకోండి. ఒక ప్రాథమిక నివేదికను రూపొందించి పుట్టపర్తి లోని సత్యసాయి యూనివర్సిటీ లో - పొలాలు, బీళ్ళు, దిగుబడుల మీద సాయి వైబ్రియానిక్స్ ప్రభావాన్ని పర్యవేక్షించదలుచుకున్న ఉద్యోగికి అందిస్తాము. వ్యవసాయదారుల కు  ప్రయోజనం ప్రధాన లక్ష్యం.  కానీ, వ్యవసాయరంగంలో సాయి వైబ్రియానిక్స్ సాధించే విజయాలు, ఈ వైద్యం అనేక మందికి పరిచయం అయ్యే వీలు కల్పించవచ్చు.  వైబ్రియానిక్స్ ఫలితాలను గడబిడ చేయగలిగిన మానసిక చికాకులు మనుషులకు ఉన్నట్లు  మొక్కలకు లేవు. కనుక 100 సంవత్సరాల క్రితం రేడియానిక్స్ లో లాగా సాయిరామ్ స్పందనా వైద్యపు బలం స్పష్టం కావటానికి మొక్కల మీద పరిశోధన ప్రభావవంతమైన విధానంగా తోచింది.

ఈ పథకాలలో మీ సేవకు నా మనసారా కృతజ్ఞతలు.

ప్రేమ పూర్వకమైన సాయి సేవలో

జిత్ అగర్వాల్.