దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 12 సంచిక 1
January / February 2021
"మీరు దేహము అనే భ్రమలో ఉన్నప్పుడు ఈ శరీరము ఎక్కువ ఆహారాన్ని, వైవిధ్యమైన ఆహారాన్ని, మీ రూపానికి ఎక్కువ శ్రద్ధ మరియు శారీరక సౌకర్యాన్ని కోరుతుంది.ఇటీవల మనం తినే ఆహారంలో ఎక్కువ భాగం నిరుపయోగంగా నే ఉంటుంన్నది; మితమైన ఆహారంతో కూడా మనిషి చాలా ఆరోగ్యంగా జీవించగలడు.రుచికరమైన ఆహారం కోసం మరియు ఆడంబరం కోసం అధిక ప్రయత్నము మరియు అధిక ధనము వ్యర్థం చేయడం మానితే ఆరోగ్యం చేకూరుతుంది. “మితమైన ఆహారం అమితమైన హాయినిస్తుంది. "కష్టపడి పని చేసే వారుమాత్రమే తమ తమోగుణాన్ని(జడత్వము లేదా బద్ధకము మరియు అనాసక్తి) విసర్జించగలరు. జీవించడం కోసం తినండి కానీ తినడమే జీవితమని భావించ రాదు."
…శ్రీ సత్యసాయిబాబా, “నాలుగు మచ్చలు” దివ్యవాణి http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-15.pdf
"బాధలలో ఉన్న వ్యక్తులు దుఃఖంలో మునిగి పోయిన వ్యక్తులు మరియు నిస్సహాయంగా ఉన్న వారు మీ నిజమైన స్నేహితులుగా భావించండి. మీరు అలాంటి వారికి సహాయం చేయాలి. ఇదే మీ ప్రాథమిక కర్తవ్యముగా భావించి సహాయం చేయాలి."
…శ్రీ సత్యసాయిబాబా, “మానవసేవయే మాధవ సేవ” వేసవి వెన్నెల 1973 http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf