జవాబుల విభాగం
Vol 6 సంచిక 5
September/October 2015
1. ప్రశ్న: నా పేషంట్లులలో ఒక మహిళకు జ్ఞాపకశక్తి తక్కువ ఉండడంతో, ఆమెకు అల్జీమర్ వ్యాధి ఉందేమోనని అనుమాన పడుతోంది. ఆమెకు CC17.3 Brain & Memory tonic ఇస్తే సరిపోతుందా లేదా అల్జీమర్ వ్యాధికి సంభందించిన కాంబోను కూడా చేర్చివ్వాలా?
జవాబు: CC18.2 Alzheimer’s disease కాంబో, అల్జీమర్ వ్యాధి నివారణగా ఉపయోగపడుతుంది కాబట్టి, CC18.2 Alzheimer’s disease కాంబోను CC17.3 Brain & Memory tonicతో పాటు చేర్చివ్వడం ఉత్తమం. ఏదైనా ఒక సందర్భంలో మీరు అదనంగా ఒక కాంబోను చేర్చాలా వద్దా అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ అదనపు కాంబోను చేర్చివ్వడమే మంచిది.
________________________________________
2. ప్రశ్న: మందు సీసా మూతలో పిల్ ను ఎక్కువ సమయం ఉంచడంవల్ల పిల్లో ఉన్న వైబ్రెషన్స్ ఆవిరైపోతాయా? (ఉదాహరణకు పిల్ ను మూతలో వేసి నేను నా బిడ్డకోసం వెదుకుతున్నప్పుడు)
జవాబు: లేదు. వైబ్రేషన్స్ పిల్స్ లో పాదుకొని ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే, ఎక్కువ కాంబోలు చేర్చడం కారణంగా పిల్స్ లో తడి అధికంగా ఉన్నప్పుడు, పిల్స్ లో ఉన్న అదనపు అల్కహొల్ ఆవిరై పోవాలన్న ఉద్దేశ్యంతో మందు సీసా మూతను కొంత సమయం వరకు తెరిచి ఉంచుతాము.
________________________________________
3. ప్రశ్న: వైబ్రో మందును పేషంట్లకు ఎదురుగా తయారు చేస్తారా లేదా మరో గదిలో తయారు చేస్తారా
జవాబు: 108 కాంబో బాక్సును ఉపయోగించేటప్పుడు, పేషంట్లకు ఎదురుగా మందు తయారు చేయడంలో ఎటువంటి సమస్య ఉండదు. అయితే, SRHVP యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు, రోగి యొక్క సౌఖర్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకోవాలన్న పేషంట్ల ముందు యంత్రాన్ని ఉపయోగించి మందు తయారు చేయవచ్చు కాని అనుమానం ఎక్కువున్న పేషంట్ల విషయంలో మరో గదిలో మందు తయారు చేయడం ఉత్తమం.
________________________________________
4. ప్రశ్న: రోగ చరిత్ర రాసేటప్పుడు, ఒక వేళ అభ్యాసకుడే/ అభ్యాసకురాలే రోగి అయితే, ఆ వాస్తవాన్ని చెప్పాలా లేదా కేవలం ఆడ/మగ, వయస్సు వంటి సాధారణ వివరాలను సూచిస్తే చాలా?
జవాబు: అభ్యాసకుడు తనను తాను రోగియని సూచించే అవసరం లేదు కాని అలా చేయడం ద్వారా కేసుకు మరింత ప్రామాణికతను ఇవ్వవచ్చు. ఒక అభ్యాసకుడు తన సొంత రోగ చరిత్రను వివరించేటప్పుడు, తాను అనుభవించిన భావోద్వేగాలను మరింత వివరంగా రాయడానికి అవకాశముంది.
________________________________________
5. ప్రశ్న: డాక్టర్కి అభ్యాసకుడికి మధ్య వ్యత్యాసం ఏమిటి?
జవాబు: సాధారణంగా సుధీర్గ కాలం వరకు, ప్రాథమిక వైద్య శిక్షణను పొంది మరియు ప్రభుత్వ నియంత్రణ విభాగం ద్వారా వైద్యం చేయడానికి అనుజ్ఞాపత్రము అందుకున్న వ్యక్తిని 'డాక్టర్' అని అంటారు. వైబ్రియానిక్స్ మందులలో ఎటువంటి రసాయనాలు లేదా మూలికలు చేర్చబడలేదు. ఈ వైబ్రేషన్స్ ఎటువంటి హానిచేయవని మీకు తెలిసినదే. ఈ కారణాలు వల్ల వైబ్రియానిక్స్ చికిత్సను అందించే మనల్ని "అభ్యాసకులు" అనడం సముచితం.
________________________________________
6. ప్రశ్న: చాలా మంది పేషంట్ల దంతాలలో పాదరస మిశ్రమం నింపబడియుంది. పాదరసం ఒక లోహం కాబట్టి, వైబ్రో మందులకు దీనివల్ల అంతరాయం కలుగుతుందా? ఒక వృద్ధ పేషంటుకున్న కట్టుడు పళ్ళలో ఒక మెటల్ క్లిప్ ఉంది. ఆమె పళ్ళలో ఉన్న ఈ లోహపు క్లిప్ వైబ్రో మందును ప్రభావితం చేయదా?
జవాబు: ఇతర లోహాలు వలె, పాదరసం సాధారణంగా, వైబ్రో మందుకు అంతరాయం కలిగించవచ్చు. వాస్తవంలో, చాలా మంది పేషంట్లకు పళ్ళల్లో లోహపు మిశ్రమాలు నింపబడో లేదా లోహం అమర్చబడో ఉంటుంది. ఇటువంటి ఎన్నో కేసులలో వైబ్రో మందులు సఫలితాలను కలుగచేసాయి. వైబ్రో మందును పేషంటు నోటిలో వేసుకోగానే, వైబ్రేషన్స్ శరీరంలోకి పీల్చబడతాయి.
________________________________________
7. ప్రశ్న: A నేను వైబ్రియానిక్స్ చికిత్స మాత్రమే కాకుండా, అనేక సేవలను నా పేషంట్లకు ఉచితంగా అందిస్తున్నాను. కొందరు పేషంట్లు కేవలం మార్గదర్శకత్వం కొరకు నన్ను సంప్రదిస్తున్నారు. కొందరు రేకి వంటి నిర్దిష్ట చికిత్సలు కోసం వస్తున్నారు. ఇటువంటివన్నీ కూడను సేవలే కాబట్టి, ఈ సేవలకోసం కేటాయించిన సమయాన్ని నేను నా నెలవారీ వైబ్రియానిక్స్ రిపోర్టులో చేర్చవచ్చా?
జవాబు: మీ నెలవారీ రిపోర్టు వైబ్రియానిక్స్ సేవకు సంబoదించినది కాబట్టి, మీరు కేవలం ఈ సేవ కోసం కేటాయించిన సమయం మాత్రమే నెలవారీ రిపోర్టులో రాయాలి. అయితే వైబ్రియానిక్స్ చికిత్స సమయంలో మీరు కౌన్సిలింగ్ కూడా చేసినట్లయితే, మీరు కౌన్సిలింగ్ కోసం గడిపిన సమయాన్ని కూడా మీ రిపోర్టులో చేర్చవచ్చు.
________________________________________
8. ప్రశ్న: ఒక రోగి కొన్ని రోగ లక్షణాల ఉపశమనం కోసం నన్ను సంప్రదించినప్పుడు, ఆ రోగిలో మరొక రోగ లక్షణాన్ని నేను గమనించినట్లయితే (ఉదాహరణకు రోగి నుదుటిపై బొడిపి), ఆ లక్షణానికి కూడా వైబ్రో మందును తీసుకోమని సలహా ఇవ్వవచ్చా? లేదా కేవలం ఆ రోగికి సహాయం చేయమని బాబాను ప్రార్థన చేయాలా?
జవాబు: ఎటువంటి సందర్భంలోనైన మనము బాబాను నయం చేయమని ప్రార్థన చేయాలి. మీరు మీ రోగికి ఎటువంటి సలహా ఇస్తారన్నది మీ పేషంటుతో మీకున్న అవగాహన పై ఆధారపడి ఉంటుంది. మీకు బాగా తెలిసిన పేషంటు అయితే, ఆ రోగ లక్షణాన్ని గురించి మెల్లగా విచారణ చేయవచ్చు. మీకు పేషంటుతో ఎక్కువ పరిచయం లేనట్లయితే, మీ పేషంటుకు మీపై మరియు వైబ్రో చికిత్సపై విశ్వాసం కలిగేంత వరకు ఆగడం మంచిది.
________________________________________
9. ప్రశ్న: 108CC సీసాల మూతలు సులభంగా తెరవడం కోసం, మూతలో రబ్బరు పొదుగులో ఉన్న పట్టి మీద ఆలివ్ నునె పూయవచ్చా?
జవాబు: సీసాలో ఉన్న మందు కాలుష్యపడే అవకాశం ఉంటుంది కాబట్టి మూత లోపలున్న రబ్బరు పట్టి మీద నునె కాని వేరొక పదార్థాన్ని కాని ఉపయోగించడం మంచిది కాదు. CC సీసాను సులభంగా తెరిచే మార్గం: రబ్బర్ పొదుగును మరియు ప్లాస్టిక్ మూతను ఒక చేతితో స్థిరంగా ఉండేలా గట్టిగా పట్టుకొని, మరో చేతితో సీసాను తిప్పాలి. డెమో కోసం Click here
________________________________________
10. ప్రశ్న: 108CC సీసాను ఉపయోగించే ముందు సీసాను ఆడించకూడదని (షేక్) విన్నాను. ఇది నిజమేనా?
జవాబు: కాదు. నిజానికి ఉపయోగించే ముందు 108CC సీసాను ఆడించడం మంచిది. 108CC సీసాను నిలువుగా పట్టుకొని, అరిచేయి మీద తట్టడం ద్వారా సీసాలో ఉన్న మందు కదులుతుంది. సీసాను 8 ఆకారంలో తిప్పరాదు. చార్జింగ్ సమయంలో, సమయాన్ని ఆదా చేసే నిమిత్తమై 108CC సీసాను ఆడించమని చెప్పబడదు. చాలావరకు అభ్యాసులందరు వారి 108 CC బాక్సులతో ప్రయాణం చేసేవారే కాబట్టి, ప్రయాణ సమయంలో సీసాలు కదలడం ఎలాగూ జరుగుతుంది.