దివ్య వైద్యుని దివ్యవాణి
Vol 11 సంచిక 2
March/April 2020
“తాజా ఆహారం మాత్రమే భుజించండి. ముందటి రోజు తయారుచేసిన పాచిపోయిన ఆహారాన్ని తినవద్దు. ఆహారం తయారు చేయడానికి చమురు అవసరమే కానీ డాక్టర్లు ఎక్కువ నూనె పదార్థాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెబుతారు. అయితే మన శరీరానికి కొలెస్ట్రాల్ కూడా అవసరమే. కనుక పూర్తిగా నూనె లేని ఆహారం తీసుకోకండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి”.
-సత్య సాయి “బాబాసంపూర్ణ జ్ఞానం నుండి సంపూర్ణ ఆనందం” దివ్యవాణి, 1996 సెప్టెంబర్ 1
http://sssbpt.info/ssspeaks/volume29/d960901.pdf
»మనం నిరంతరం ఇతరుల సేవలో నిమగ్నం అవ్వాలి. దానికోసమే దేవుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. శరీరాన్ని కేవలం తినడం తాగడంతోనే గడుపుతూ విలువైన సమయం వృధా చేయరాదు. భగవంతుడు శరీరాన్ని మనకు ఇచ్చింది ఇతరులకు సేవ చేయడం ద్వారా వారికి సహాయపడటం కోసం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మానవ సేవకు మించింది లేదు. మానవ సేవయే మాధవ సేవ. గొప్ప వారంతా మానవులకు సేవ చేయడం ద్వారా మాత్రమే తమ జీవితాలను పవిత్రం చేసుకున్నారు. అందువల్ల, మీరు కూడా కనీసం ఇప్పటినుండి అయిన సేవ చేయడం ప్రారంభించండి. భజన మరియు ఇతర సాధనాల కంటే సేవే అత్యుత్తమమైనది.”
-సత్య సాయి, “బాబా మానవసేవయే మాధవసేవ” దివ్యవాణి, 2004 జనవరి1 2004
http://www.sssbpt.info/ssspeaks/volume36/sss37-01.pdf