దివ్య వైద్యుని దివ్యవాణి
Vol 9 సంచిక 4
July/August 2018
“ మానవుడు తను జన్మ ఎత్తినది సేవను ఒక పవిత్రమైన కార్యముగా భావించి సమాజానికి సేవ చేయడానికి అని విశ్వసించాలి. ఫలాపేక్ష లేకుండా సక్రమమైన మార్గంలో ఏ కొంచం సేవ చేసినా అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సేవ ఎలా చేసాము ఎంతచేసాము అన్నది ప్రధానం కాదు హృదయపూర్వకంగా చేసామా లేదా అన్నది ప్రధానము. ఏ విధంగా ఐతే ఆవు ఎట్టి ఆహారాన్ని తిన్నప్పటికీ అమృతతుల్యమైన పాలను ఇస్తుందో పవిత్రమైన హృదయంతో చేసిన ఏ చిన్న సేవయినా అనంత ఫలితాన్ని ఇస్తుంది. సేవ చేస్తున్నప్పుడు ఫలితం పైన దృష్టి ఉండకూడదు. "ఇది నా బాధ్యత నేను పుట్టింది సేవ చేయడానికే అనే భావంతో చెయ్యాలి."
... సత్యసాయిబాబా, “పుట్టింది సేవ చేయడానికే (Born to Serve)” దివ్యవాణి 19 నవంబర్ 1987 http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf
"ఆహారంలో మితాన్ని పాటించడం, కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సాత్వికమైన ఆహారము మానసిక ప్రశాంతతను శారీరక ఆనందాన్ని ఇస్తుంది. ఆహారములో మితాన్ని ఎల్లప్పుడూ పాటించాలి. చాలామంది అవసరం లేకపోయినా ఖరీదైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు మితాన్ని హితాన్ని పాటించడం వారికే శ్రేయస్కరం. ధూమపానం చేయకుండా ఉండడం ద్వారా ఎన్నో సమస్యల నుండి మానసిక ఉద్వేగాలనుండి (రాజసిక మైనవి) దూరంగా ఉండవచ్చు. సహజ సిద్ధంగా ఉన్న సమతౌల్యాన్నిఇటువంటి మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలు దెబ్బతిస్తాయి. ఆహారములో మితము, భాషణలో మితము, కోరికల పై అదుపు, జీవితంలో మనకు ఏదైతే లభించిందో దానితో సంతృప్తి పడడం, ఇతరులకు సేవ చేయడం ద్వారా ఆనందింప చేయడంలోనే మన ఆనందం దాగిఉందని గ్రహించడం. ఇవే ఆరోగ్యాన్ని సమకూర్చే అత్యుత్తమ టానిక్స్ కంటే శక్తివంతమైన ఔషదాలు. మన సనాతన ధర్మం బోధించింది కూడా ఇదే."
... సత్యసాయిబాబా, “ఉత్తమమైన టానిక్” దివ్యవాణి, 21 సెప్టెంబర్ 1960 http://www.sssbpt.info/ssspeaks/volume01/sss01-28.pdf