Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 11975...भारत


ప్రాక్టీషనర్ 11975…ఇండియా , పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐన ఈ ప్రాక్టీషనర్ ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన గృహిణి. సాయి భక్తుల కుటుంబంలో జన్మించిన ఈమె తన తల్లిదండ్రుల ప్రేరణతో చిన్నతనం నుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. సేవా దృక్పథం గలిగి స్వామి నుండి అనేక వ్యక్తిగత ఆశీర్వాదలు అందుకొన్న ఆమె తండ్రి నిస్వార్థ సేవ చేయడానికి మరియు వినయపూర్వకమైన జీవితాన్ని గడపడానికి మార్గనిర్దేశం చేశారు. బాలవికాస్ తరగతులలో తన తల్లికి సహాయం చేస్తూ తానే బాలవికాస్ గురువై తన ఇంటికి సమీపంలోని బలహీన వర్గాల పిల్లలకు సహాయం చేయడానికి పూనుకున్నారు. స్థానిక సాయిసెంటర్లో చురుకుగా ఉండే ఈమె పుట్టపర్తికి వార్షిక సేవ సందర్శన నిమిత్తం లేదా బెంగళూరులోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేసే అవకాశాన్ని చాలా ఎక్కువగా పొందుతూ చాలా అరుదుగా మాత్రమే ఈ అవకాశాన్నికోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.

ఏప్రిల్ 2012లో వంశపారంపర్యంగా వచ్చినటువంటి పన్నెండేళ్ల ఆస్తమాను కేవలం ఒక మోతాదు వైబ్రో రెమిడీ నయం చేసిన  అద్భుతాన్ని ఆమె కనుగొన్నారు. వీరు సేవ చేసే సాయి సెంటరుకు వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్టు గా ఉన్న ఒక ప్రాక్టీషనర్ రావడం తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో ఉన్న ఈమెను చూడడం జరిగింది. అతను వెంటనే ఒక ఔషధాన్ని తయారు చేసి ఆమె నోటిలో మొదటి మోతాదు వేసారు. ఆమె తన ఇంట్లో స్వామి చిత్రపటానికి ముందుఈ రెమిడీ బాటిల్ ను ఉంచి దాని ధ్యాస కూడా లేకుండా మర్చి పోయింది.  మరుసటి రోజు ప్రాక్టీషనర్ ఆమె ఆరోగ్య స్థితి గురించి ఆరా తీసినప్పుడు ఆమె శ్వాస సాధారణంగా ఉందని అందువల్ల ఇక రెమిడీ అవసరం లేదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. కానీ అతని ఒత్తిడి మేరకు ఆమె వారంరోజులు ODగా తీసుకొని ఆపివేసింది.

తిరిగి ఈ సమస్య ఎన్నడూ పునరావృతం కాలేదు ఈ సంఘటన ఈ ప్రాక్టీషనర్ని వైబ్రియానిక్స్ వైపు మరలడానికి అవకాశం కల్పించింది. అతని సహాయంతో ఆమె కోర్సు చేయడానికి కేరళకు వెళ్లి 2012 జూలైలో AVP అయ్యారు. అయితే శ్రద్ధతో మరియు గొప్ప వినయంతో నిశ్శబ్దంగా తన పని తాను చేసుకొనే అంకిత భావం గల ఈ ప్రాక్టీషనర్ కర్ణాటక లోని రెఫ్రెషర్ వర్క్ షాప్ లో పాల్గొన్నాక VP గా అవ్వాలన్న ప్రేరణ పొంది జూన్ 2020లో VP అయ్యారు.

గత ఎనిమిది సంవత్సరాల్లో ఈమె దాదాపు 1000 మంది రోగులకు అనేక రకాల రుగ్మతలకు ముఖ్యంగా గ్యాస్టిక్ సమస్యలు, జలుబు మరియు దగ్గు, తలనొప్పి, పంటి నొప్పి, టాన్సిల్స్, మరియు దద్దుర్లు వంటి సాధారణ వ్యాధులు,అలాగే  క్యాన్సర్, అనారోగ్య సిరలు, గుండె సమస్యలు, మధుమేహం, హైపో థైరాయిడిజం, వంధత్వం, జుట్టు రాలడం, హెచ్ఐవి, మూత్రపిండ రుగ్మత, ప్రోస్ట్రేట్ సమస్యలు, డౌన్ సిండ్రోమ్, మూర్చ, ఉబ్బసం, బొల్లి మరియు తామర వంటి దీర్ఘకాలిక రోగాలకు కూడా చికిత్స చేయడం జరిగింది. చికిత్స చేసిన రోగులలో 80 శాతం మందికి 100% నయమవ్వడం ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే వారు హృదయపూర్వకంగా ఈ రెమిడీలు తీసుకున్నారని ఆమె విశ్వసిస్తున్నారు. ఇతరులు గణనీయంగా మెరుగు పడి రావడం మానేశారు. ఆమె రోగులలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యానికి చెందినవారు. రెమిడీల కోసం సందర్శించ లేని వారికి ఆమె పోస్టు ద్వారా రెమెడీలను పంపిస్తారు. వంద మంది రోగులకు 12 రకాల క్యాన్సర్లకు చికిత్స చేశారు. వీరిలో కొంతమంది క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న వారు కూడా ఉన్నారు. వీరిలో 50 మందికి పూర్తిగా నయమైనట్లు నివేదికల ద్వారా ఋజువు చేయబడింది. ప్రస్తుతం నిర్వహణ మోతాదు కొనసాగిస్తున్నారు. ఐదుగురు వృద్ధ రోగులు శాంతియుతంగా కన్నుమూశారు. మిగిలిన వారంతా గణనీయంగా మెరుగుపడి ఆరోగ్యం చేకూరి ప్రస్తుతం వైబ్రియానిక్ రెమిడీలు కొనసాగిస్తున్నారు. మధుమేహ రోగుల విషయంలో  కూడా ఆమె మంచి ఫలితాలు సాధించారు. ఇన్సులిన్ ఆధారిత పదిమంది రోగులలో ఐదు మంది 6-8 నెలలలో ఇన్సులిన్ తీసుకోవడం మానేశారు. మిగిలిన ఐదుగురిలో ఇన్సులిన్ తీసుకోవడం సగానికి సగము తగ్గించగలిగారు. ఇతర 15మంది డయాబెటిక్ రోగులలో ముగ్గురు వారి రక్తంలో చక్కెర స్థాయి సాధారణమైనప్పటి నుండి వారి వైద్యుని సలహా మేరకు అల్లోపతి మందులు ఆపివేశారు. వారు OW నిర్వహణ మోతాదులో కొనసాగిస్తున్నారు. మిగిలిన 12 మంది రోగులలో వారిచక్కెర స్థాయి స్థిరంగా ఉన్న స్థితికి మెరుగు పడడంతో అల్లోపతి ఔషధం సగం మోతాదులో తీసుకుంటున్నారు. వంధత్వానికి చేసిన చికిత్సలో 15 జంటల్లో ఆమె 100% విజయం సాధించారు. ముగ్గురు మహిళలు 1-2 నెలల్లో గర్భము దాల్చగా మిగిలినవారు సంవత్సరం లోపు గర్భం ధరించారు. మొత్తం 15 మంది మహిళలకు సాధారణ డెలివరీ మరియు ఆరోగ్యకరమైన పిల్లలు కలిగారు. ఇద్దరు తల్లులకు స్వామి కలలో కనబడి వారిని ఆశీర్వదించడమే కాకుండా వారి పిల్లలకు పేర్లు కూడా సూచించారు.

ప్రాక్టీషనర్ తన పొరుగువారి ఆవుకు 2019 డిసెంబర్లో CC1.1 Animal tonic + CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic వైబ్రోరెమిడీతో చికిత్స చేసిన ఆసక్తి కరమైన విషయాన్ని మనతో పంచుకుంటున్నారు. ఒక నెల తర్వాత రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తున్న ఈ ఆవు 7-8 లీటర్లు ఇవ్వడం ప్రారంభించింది మరియు ఈ పాలలో  మునుపటి కంటేవెన్న ఎక్కువగానూ మరియు పాలుతియ్యగానూ ఉంటున్నాయి.ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. మరొక సందర్భంలో 20 సంవత్సరాల పాటు మూర్ఛవ్యాధిని అనుభవిస్తున్న60 ఏళ్ల వ్యక్తి పది సంవత్సరాలుగా అధిక బిపి, మరియు ఎనిమిది సంవత్సరాలు నిద్రలేమి వంటి వాటితో బాధపడుతూ అల్లోపతి మందుల నుండి ఎటువంటి ఉపశమనం పొందలేక వైబ్రో రెమిడి తీసుకోగా దీనిని ప్రారంభించిన రెండు వారాల్లోనే అతనికి మూర్చలు కలగడం  ఆగిపోయాయి. బి.పి స్థిరంగా మారింది మరియు అతను బాగా నిద్ర పోవడంకూడా ప్రారంభించాడు. కాబట్టి అతని వైద్యుడు స్లీపింగ్ టాబ్లెట్ ఆపివేసి బి.పి ఔషధ మోతాదు తగ్గించారు. చివరకు అతను మూర్ఛ సంబంధించిన ఔషధాన్ని కనీస స్థాయికి తగ్గించాడు.

ఈ ప్రాక్టీషనర్ వైబ్రోసాధన ప్రారంభంలో తన హృయము రోగుల బాధలకు అంతగా స్పందించేది కాదు అనే భావనలో ఉండేది. అయితే ఆమెకు కలిగిన కొన్ని అపూర్వమైన అనుభవాలు ఆమె తన సేవ పట్ల తాదాత్మ్యాన్ని పెంపొందించేలా చేసాయి. కొంతమంది రోగులు మైగ్రేన్ గురించి ఎందుకు ఎక్కువ ఫిర్యాదు చేస్తున్నారు అని ఆమెకు సందేహం కలిగింది. మరుసటి రోజు ఆమెకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. అది రోజంతా కొనసాగింది కాబట్టి మైగ్రేన్ ఎంత బాధాకరంగా ఉంటుందో ఆమె అర్థం చేసుకోగలిగింది. మరొకసారి ప్రజలలో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఉత్పన్న మవుతాయి అని అనుమానం కలిగింది.  వారంలోనే ఆమెకు బరువు బాగా పెరిగి రోజంతా నిద్ర మరియు సోమరితనం కొనసాగాయి. థైరాయిడ్ కోసం పరీక్షించినప్పుడు ఆమెTSH 13-14 mIU/L ఉంది. సాధారణస్థాయి 0.4 నుండి 4.0. ఈ TSH సాధారణ స్థాయికి రావడానికి రెండు నెలలు పట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఇవేమీ పునరావృతం కాలేదు. మరొక సందర్భంలో ఆమె తన తల్లి మరియు అత్తగారు ఇద్దర్నీ వారి మధుమేహ సమస్య గురించి మనసులో విమర్శించేది. అయినప్పటికీ బాహ్యంగా ఆమె వారి ఆహార నియంత్రణ నిమిత్తం  మరియు రోజూ నడకను కొనసాగించవలసిందిగా ప్రేమతో సలహా ఇచ్చేది. ఆ తరువాత ఆమెకు పునరావృత UTI (మూత్ర నాళ రుగ్మత) ఏర్పడింది. ఆమె డాక్టర్ సలహా మేరకు అనేక  రకాల పరీక్షలకు గురికాగా ఆమె గ్లూకోజ్ స్థాయి 400mg/dl కంటే ఎక్కువ పెరిగిందని తెలుసుకోవడం షాక్ కు గురిచేసింది. ఆమెకు అవసరమైన మందులతో పాటు ఒక వారం ఇన్సులిన్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.అందుచేత ఆమె అలోపతి బదులు వైబ్రియానిక్స్ మీద ఆధారపడటానికి ఇష్టపడ్డారు. రెండు వారాల తర్వాత ఉపవాస చక్కెరస్థాయి  90mg/dl. మరియు యాదృచ్చికచక్కర స్థాయి 140-160 mg/dL ఉంది. రక్తంలో చక్కెర అంత త్వరగా తగ్గుతుందని వైద్యుడు నమ్మలేకపోయారు. అప్పటినుండి ఇది సాధారణ పరిధిలోనే ఉంది.

వైబ్రో ప్రాక్టీస్ ప్రారంభ సంవత్సరాల్లో తన ఇంట్లోనే రోగులను చూడటానికి ఆమె నిర్ణీత సమయం కేటాయించేవారు. 2015లో ఆమె తన కుటుంబంతో కర్ణాటక లోని తమ ఇంటికి వెళుతూ గ్రామీణ కేరళ ప్రాంతములో దారి మర్చిపోయిన సందర్భంలో ఆమెకు  కళ్ళు తెరుచుకునే అనుభవం ఎదురైంది. ఈ ప్రాంతం నుండే ఎంతోమంది రోగులు చికిత్సకోసం ఆమె వద్దకు వచ్చేవారు.  అటువంటి మారుమూల ప్రదేశం నుండి బస్సు ద్వారా 200-300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావడంలో ఉన్న ఇబ్బందులు అ పేద రోగులకు ఒక నిర్దిష్ట సమయంలో ఆమె ఉంటున్న స్థానానికి చేరుకోలేక నిరాశ చెందే పరిస్థితుల పట్ల అవగాహన కల్పించి  ఆ రోజునుండి ఏ సమయంలో నైనా ఆమె రోగులను చూడాలని సంకల్పించించేలా చేసింది. ఆమె భర్త కూడా ఈ సేవలో ఆమెకు పూర్తి సహకారం అందించేవారు. అతను రోగులను సౌకర్యవంతంగా కూర్చునే టట్లు చేసి ఆమె వీరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నోట్స్ రాసుకుంటారు. అలాగే ఆమె పేషెంట్లను చూడటానికి సమయాన్ని ఇస్తూ ఇంటి పనులను కూడా వారే చేసుకుంటారు. ఈ ప్రాక్టీషనర్ పిల్లలు కూడా రోగులు మరియు వారి పిల్లలను సౌకర్యవంతంగా ఉంచడంలో సహాయం చేస్తారు. ఆమె తన ఇంటికి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధాప్య గృహంలో 100 మందికి పైగా రోగులకు చికిత్స చేస్తూ ఉంటారు. ఆమె మూడు నెలలలో ఒకటి కంటే ఎక్కువసార్లు వారిని సందర్శించ లేకపోవడంతో ఆమె ప్రతీ నెలా ఒక వాలంటీర్ ద్వారా లేదా పోస్టు ద్వారా వారికి రెమిడీలను పంపుతున్నారు. అదనంగా ఆమె స్థానిక సాయి సెంటర్ నిర్వహించే వార్షిక వైద్య శిబిరాలలో కూడా  పనిచేస్తున్నారు.

సాయి వైబ్రియానిక్స్ తన జీవితంలో పెద్ద పాత్ర పోషిస్తోందని మరియు తనకు అపారమైన సంతృప్తిని ఇస్తోందని ఆమె పేర్కొంటున్నారు. రెమిడీ ఇవ్వడంలో సందిగ్ధంలో ఉన్నప్పుడల్లా స్వామి తనను ఆంతరంగికంగా నడిపిస్తూ ఆశీర్వదిస్తున్నారని  ఆమె భావిస్తున్నారు. ఎప్పుడైనా కృతజ్ఞతతో మరియు ప్రేమతో కొంతమంది రోగులు తమకు  వైబ్రియానిక్స్ ద్వారా కలిగిన పిల్లలను కలవడానికి తీసుకు వచ్చినప్పుడు వారు తమ చుట్టూ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉన్నారని ఆమె భావిస్తున్నారు. ఈ వైబ్రో సాధన వీరిని శాంతియుతంగా మరియు సానుకూలంగా చేసింది. ఆమెకు వేర్వేరు మతవిశ్వాసాల నుండి అనేక మంది రోగులు ఉన్నారు. మొదట్లో సంశయించినప్పటకీ వారి ఇష్ట దైవ స్మరణతోనే రెమిడీ తీసుకోవాలని ఆమె వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తవ రోగులు సత్యసాయి ప్రభువులో యేసును చూశామని చెప్పేవారు. ప్రాక్టీషనర్లు తమ రోగులను పూర్తి విశ్వాసంతో వైబ్రియానిక్స్ రెమిడీలను తీసుకోమని ప్రోత్సహిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని వీరు విశ్వసిస్తున్నారు.

పంచుకున్న కేసులు: