ప్రాక్టీషనర్ల వివరాలు 12013 & 11553...भारत
ప్రాక్టీషనర్లు 12013 & 11553…ఇండియా ఆధ్యాత్మికంగా పరిణతి గలిగిన భక్తుల కుటుంబాలకు చెందిన జంటగా వీరిని పేర్కొనవచ్చు. మేనేజ్మెంట్ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో అర్హత కలిగిన మెకానికల్ ఇంజనీర్ అయిన భర్త ఒక పేరున్న సంస్థలో 38 సంవత్సరాలుగా సీనియర్ జనరల్ మేనేజరుగా సేవలందించి 2010లో పదవీ విరమణ చేశారు. భార్య సైన్స్ మరియు ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ చేసి హైస్కూల్ ఉపాధ్యాయురాలిగా 30 సంవత్సరాలు పనిచేసి 2012లో పదవీ విరమణ చేసారు. భర్త చిన్నప్పటి నుండి స్వామి అద్భుతాలను చవి చూస్తూ పెరగగా వివాహం అనంతరం భార్య స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు. గత 40 నుండి 45 సంవత్సరాలుగా వారు సత్యసాయి సేవా సంస్థ కార్యకలాపాలలో పాల్గొంటూ అనేక అద్భుతాలు ద్వారా స్వామి చేత ఆశీర్వదింపబడ్డారు.
ఇతని భార్య 1985 నుండి బాలవికాస్ గురువుగా ఉన్నారు ప్రస్తుతం స్థానిక సాయి సెంటర్లో బాలవికాస్ మరియు మహిళా కోఆర్డినేటర్ గా ఉండగా భర్త ఆధ్యాత్మిక సమన్వయకర్తగా సేవలు అందిస్తున్నారు. 2011 మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఒక కొండపై ఉన్న గ్రామానికి నీటిని తీసుకువచ్చే ప్రాజెక్టుకు వనరుల సమీకరణ, సామగ్రి సమకూర్చుకోవడం, మరియు మరియు సకాలంలో అమలు చేయడంలో భర్తకు ప్రధాన పాత్ర పోషించే అవకాశం లభించింది. స్థానిక గ్రామస్తుల సహాయంతో నది ప్రక్కనే ఒక బావిని నిర్మించి కొండపై నిర్మించిన ట్యాంకుకు నీరు పంపబడింది. మైదానాల నుండి నీటిని పొందడంలో సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న 200మంది నివాసితులకు ఇది చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది.
2008లో, ఈ జంటకు ఒక సీనియర్ వెైబ్రో ప్రాక్టీషనర్తో సన్నిహితంగా ఉండే అదృష్టం కలిగింది. ఎటువంటి దుష్ప్రభావాలు లేని వైబ్రేషనల్ రెమిడీలతో రోగులు ఎలా నయమవుతున్నారో వారు ప్రత్యక్షంగా చూశారు. వైభ్రియానిక్స్ శిక్షణ పొందడానికి మరియు ప్రాక్టీషనర్లుగా మారడానికి ఈ సీనియర్ ప్రాక్టీషనర్చే ప్రేరణ పొందారు. పదవీ విరమణ పొందిన వెంటనే 2011 భర్త తన శిక్షణను పూర్తి చేయగా, వీరి భార్య AVP కావడానికి 2012 లో ఈపద్ధతిని అనుసరించారు. ప్రారంభంలో భార్యాభర్తలిద్దరూ తమను తాము చికిత్స చేసుకొని వారి దీర్ఘకాలిక ఆమ్లత్వం, మోకాలు నొప్పి నుండి ఉపశమనం పొందారు. ఇది వివిధ రోగాలకు చికిత్స చేయడంలో వారి విశ్వాసం మరియు నమ్మకాన్ని పెంచింది. గత ఎనిమిది సంవత్సరాల్లో వారు 500 మంది రోగులకు చికిత్స చేశారు మరియు వైవిధ్యభరితమైన అనారోగ్యాలు - వెరికోస్ వీన్స్, ఆమ్లత్వం, విరోచనాలు, జ్వరం, దగ్గు మరియు జలుబు, సైనసైటిస్, మైగ్రేన్, మూర్చలు, పక్షవాతం, ఆర్థరైటిస్, స్తంభింపజేసిన భుజం, వెన్ను నొప్పి మరియు సొరియాసిస్ వంటి వ్యాధులకు విజయవంతంగా చికిత్స చేశారు.
వీరి రోగులలో అనేకమంది వివిధ రకాల వైద్య చికిత్సలు ఆశ్రయించి ప్రయోజనం లేక చివరకు వైబ్రియానిక్స్ ను ఆశ్రయించి మెరుగయ్యారు. అలాంటి వ్యక్తులు చాలా సంతోషంగా ఇటువంటి వ్యాధి పీడితులకు ధైర్యంగా వైబ్రియానిక్స్ మూలంగానే తాము నయం చేయబడ్డామని చెబుతూ ఈ ఔషధాలను తీసుకోమని ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగా రోగి యొక్క అనారోగ్య స్థితిలో మెరుగుదల అనారోగ్యం యొక్క స్వభావం, మరియు చరిత్ర , రోగి యొక్క విశ్వాసము, సహనము మరియు పట్టుదలపై ఆధారపడి ఉంటుందని వారు కనుగొన్నారు. తక్షణ ఉపశమనం ఆశించే రోగులు స్వల్ప ఉపశమనం మాత్రమే ఉంటే వారు నిరాశ చెందుతారు. ఇటువంటి సందర్భాల్లో రోగులకు వెన్నుదన్నుగా నిలిచి వారిని ప్రోత్సహిస్తూ ఇచ్చిన రెమిడీ లను సూచనల మేరకు కొనసాగించేలా ప్రయత్నిస్తారు. వారి అనుభవంలో 70 శాతం మంది రోగులు ఈ చికిత్స ద్వారా నయం అయ్యారు. సాయి సమితి నిర్వహించే వారాంతపు ఆరోగ్య శిబిరాలలో కూడా ఈ ప్రాక్టీషనర్లు పాల్గొంటున్నారు.
2016 జూన్ లో అలాంటి ఒక శిబిరంలో 40 ఏళ్ల ప్రారంభం నుండి అనేక నెలలుగా సొరియాసిస్తో బాధపడుతున్న ఇద్దరూ మగ రోగులను చూశారు. ఒకరు హోమియోపతి మరియు మరొకరు అలోపతి చికిత్స తీసుకుంటున్నప్పటికీ వారికి ఉపశమనం కలగలేదు. కేవలం రెండు నెలలు ఈ క్రింది రెమిడి తీసుకోగానే వారికి పూర్తిగా నయం అయింది : CC21.3 Skin allergies + CC21.5 Dry Sores + CC21.10 Psoriasis, మౌఖికంగా మరియు బాహ్య అనువర్తనం కోసం కొబ్బరి నూనెలో వేసి ఇవ్వడం జరిగింది. మొదటి రోగికి పూర్తిగా నయం అయింది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇది పునరావృతం కాలేదు. రెండవ రోగికి నాలుగు నెలల్లో 80 శాతం ఉపశమనం లభించింది. మరియు చికిత్స కొనసాగుతోంది. ఈ జంట సత్యసాయి సేవా సంస్థ చేపట్టే అన్ని ఆరోగ్య శిబిరాల్లో వైబ్రియానిక్స్ ఒక భాగం కావాలని భావిస్తోంది. సంస్థలో చాలామంది వైద్యులు స్వామిపై విశ్వాసం మరియు వైబ్రియానిక్స్ పరిజ్ఞానం కారణంగా వ్యాధి నయం అవ్వడం వేగవంతం చేయడానికి వారి రోగులను వెబ్రో ప్రాక్టీషనర్ల వద్దకు పంపుతున్నారు. మలబద్దకం, పైల్స్, నిద్రలేమి, మోకాలినొప్పి, వెన్నునొప్పి, మరియు ఉబ్బసం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధులు వారి దైనందిన కృత్యాలకు విఘాతం కలిగిస్తాయి కనుక రోగులు(సత్వర ఉపశమనానికి) బలమైన చికిత్స కోరుకుంటారు.
ఈ ప్రాక్టీషనర్లు భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బంధువులు మరియు స్నేహితులకు పోస్ట్ ద్వారా రెమెడీలను కూడా పంపుతారు. అలాగే వారు అమెరికాలో ఉన్న వారి పిల్లలను 2 సంవత్సరాలకు ఒకసారి సందర్శించినప్పుడు వారి వెల్నెస్ కిట్ తో పాటు 108 సి సి బాక్స్ నుండి ఎంచుకున్న 36 అత్యవసరమైన రెమిడీ లను కూడా తీసుకొని వెళ్తారు. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి మరియు అన్ని నొప్పులకు మరియు ముందస్తు సమాచారం మేరకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు రెమెడీలు తీసుకువెళ్తారు. అమెరికాలోని చాలా మంది సాయి భక్తులు వారి సేవల నుండి ప్రయోజనం పొందారు. వారి కుమార్తె కుటుంబం వైబ్రియానిక్స్ పట్ల బలమైన నమ్మకాన్ని పెంచుకోవడంతో వారి నాలుగు సంవత్సరాల పాప తనకు ఆరోగ్యం ఎప్పుడు బాగోపోయినా వైబ్రో రెమిడీలనే అడుగుతుంది.
వైబ్రేషన్ స్థాయిలో పనిచేసే ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఇటువంటి ఔషధం అందుబాటులో ఉండడం మరియు ఉచితంగా లభించడం మానవాళికి ఒకవరం అని ఈ ప్రాక్టీషనర్లు భావిస్తున్నారు ! స్వామియే స్వస్థత చేకూరుస్తున్నారని మరియు స్వామి చేతిలో వారు ఉపకరణాలు మాత్రమే అనే గట్టి నమ్మకంతో వీరు రెమిడీలు ఇస్తారు. కాలం గడుస్తున్న కొద్దీ, వైబ్రో రెమిడీల సమర్ధత గురించి వీరి నమ్మకం దృఢపడుతూ వచ్చింది.
ఎక్కువమంది ప్రజలు ఉపశమనం పొందడం ద్వారా వారు ఇతరులకు సిఫార్సు చేస్తూ ఉండడంతో ఈ వైద్య రంగం బాగా విస్తరిస్తోంది. భవిష్యత్తులో ఎక్కువ మంది భక్తులు వైబ్రియానిక్స్ శిక్షణ తీసుకోవడం ద్వారా ఇంకా ఇప్పటికీ ఈ చికిత్సా విధానం యొక్క ప్రయోజనం తెలియని ప్రాంతాలకు ఇది విస్తరిస్తుందని ఈ జంట ఆశిస్తున్నారు. వైబ్రియానిక్స్ ద్వారా సేవ చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని, ఇది భగవంతుడికి ఒక సేవా పుష్పాన్ని అర్పించడం లాంటిదని, వీరు ముగిస్తున్నారు!
పంచుకున్న కేసులు: