Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ ప్రొఫైల్ 01001...Uruguay


ప్రాక్టీషనర్ 01001...ఉరుగ్వే ఇద్దరు చిన్న పిల్లలకు మాతృమూర్తి అయిన ఈ అభ్యాసకురాలు సహజ సౌందర్య సాధనాలకు సంబంధించిన ఒక చిన్న వ్యాపారమును నడుపుతూ ఉన్నారు. 2017 మార్చి- ఏప్రిల్ వార్తాలేఖలో ప్రచురింపబడిన వీరి యొక్క ప్రొఫైల్ భగవాన్ సత్యసాయి బాబా మరియు వైబ్రియానిక్స్ వైపు వీరి అద్భుత ప్రయాణం గురించి తెలుపుతుంది. గత మూడు సంవత్సరాలుగా ఆమెకు వ్యాపార పరంగా మరియు దేశీయ సవ్వాళ్ళు ఉన్నప్పటికీ వైబ్రియానిక్స్ కోసం గణనీయమైన సమయాన్ని కేటాయించారు. ఈ అభ్యాసంరాలి రెండవ బిడ్డ సంవత్సరం వయస్సు కలిగి ఉన్నప్పటికీ  వీరు SVP ఈ కోర్సు పూర్తిచేసుకుని, దీనికి అనుగుణంగా భారతదేశంలో 2018 నవంబర్ లో జరిగిన SVP వర్క్ షాప్ లో స్కైప్ ద్వారా పాల్గొన్నారు. ఆ సమయంలో అలర్జీ కారణంగా ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐదు రోజులూ  రాత్రంతా మేలుకొని (ఆ దేశం యొక్క టైమ్ జోన్ భారతదేశానికి 8:30 గంటలు వెనుకగా ఉంటుంది)శిక్షణ పూర్తి చేసుకొని SVP గా అర్హత సాధించారు.

SVP గా విజయవంతంగా శిక్షణ ముగించుకున్న తర్వాత, శిశువులలో రిఫ్లెక్స్, మధుమేహం, హైపర్ మెట్రోపియా, అండాశయ తిత్తులు, నోటిపూత, రోగ నిరోధక శక్తి లోపం, పిల్లలలో భయాలు, మ్రింగలేకపోవుట మరియు నిద్ర రుగ్మతలు వంటి విభిన్న పరిస్థితులతో ఉన్న40 మంది రోగులకు చికిత్స చేశారు.

ఈ చికిత్సా నిపుణురాలు వైబ్రియానిక్స్ ద్వారా నివారణ పొందిన తన సొంత కేసుని మనతో పంచుకుంటున్నారు. ఆమె రుతుక్రమంలో సమస్య వల్ల పొత్తికడుపులో పునరావృత నొప్పి వస్తూ ఉండేది. 2019 ఫిబ్రవరి 1న తీసుకున్న అల్ట్రాసౌండ్ రిపోర్టు ప్రకారం, ఆమె ఎడమ అండాశయంలో 6.07 cm x 4.09 cm పరిమాణం కలిగిన తిత్తి ఏర్పడింది. ఇది ఆమెకు ఎంతో ఆందోళన కలిగించసాగింది ఎందుకంటే 1999లో ఇటువంటి కారణంగానే ఆమె ఎడమ అండాశయంలో సగ భాగం మరియు కుడి అండాశయము పూర్తిగా తొలగించబడ్డాయి. అభ్యాసకురాలు ఆపరేషన్ చేయించుకోకుండా ప్రత్యామ్నాయ వైద్య చికిత్స ద్వారా తగ్గించుకుందామని ప్రయత్నం సాగిస్తుండగా ఆమె డాక్టరు నాలుగు నెలల్లో పరీక్షలు పునరావృతం చేయాలని తిత్తి యొక్క పరిమాణం తగ్గకుంటే శస్త్ర చికిత్స చేసి తొలగించుకోవాలని సూచించారు. మర్నాటి నుండి ఆమె CC2.3 Tumours & Growths+CC8.4 Ovaries & Uterus...TDS తీసుకోవడం ప్రారంభించారు. మొదటి మోతాదు తీసుకోగానే ఆమెకు ఎంతో ఉపశమనం కలిగింది.  తదుపరి రుతుక్రమ కాలం లో ఏ మాత్రం నొప్పి కూడా లేదు. రెండు వారాల తర్వాత, ఆమె అంతరాత్మ పిలుపుమేరకు మిగిలివున్న ఎడమ అండాశయాన్ని కాపాడుకోవడం కోసం ఒక ఈజిప్షియన్ ఆక్యుపంచర్ విధానాన్ని వైబ్రియానిక్స్ నివారణలతోపాటు పది వారాలు ఉపయోగించారు. 2019 జూలై 1న, రెండోసారి అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించినప్పుడు ఆమెకు తిత్తి అదృశ్యమై పోగా ఎడమ అండాశయం పూర్తి ఆరోగ్యంగా ఉంది. కనుక ఆమె రెండు వారాల పాటు మోతాదు BD కి తగ్గించారు మరియు 2019 జులై 16 నుండి తన అండాశయ ఆరోగ్యం కోసం OD నిర్వహణ మోతాదుగా తీసుకుంటున్నారు.

ప్రయోగాలు చేయడం పట్ల అత్యంత ఉత్సాహం కనపరిచే ఈ అభ్యాసకురాలు, తన వంట ఇంట్లో ఉన్న బొద్దింకల పీడ వదిలించుకోవడానికి CC1.1 Animal tonic+CC17.2 Cleansing స్ప్రే చేయగా 24 గంటల్లో వాటిపీడ వదిలి పోయింది. తన పేషంట్లతో నిరంతరంసంబంధ బాంధవ్యాలతో ఉండటమే కాకుండా వీరువైబ్రియానిక్స్ పరిపాలనా బాధ్యతలను కూడా తీసుకున్నారు. మరొక అభ్యాస కుని సహాయంతో, వార్త లేఖలను స్పానిష్ భాషలోకి అనువదించారు, అలాగే  స్పానిష్  మాట్లాడే దేశాలలోని అభ్యాసకుల డేటాబేస్ సమీకరించే బాధ్యతను కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా, కొన్ని సంవత్సరాలుగా నిద్రాణమైన స్థితిలో వైబ్రియానిక్స్ గురించి ఏమీ చేయలేని స్థితిలో ఉన్న వారిని ప్రేరేపించి తిరిగి వారు ప్రాక్టీస్ ప్రారంభించేలా కూడా చేశారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే, ఇటీవల తన పేషెంటు మరియు కొంతమంది అనువాదకుల సహాయంతో, వైబ్రియానిక్స్ గురించి అవగాహన కోసం “ఇంట్రడక్షన్ టు వైబ్రియానిక్స్”  అనే చిన్న వీడియోను 13 భాషలలో రూపొందించారు.

ఈ అభ్యాసకురాలు తన పేషంట్లు అందరితో వారి సానుకూలతను చూస్తూ ఆనందంగా సంభాషించడానికి ప్రయత్నిస్తారు- వారి వివరాలు, వారి మంచితనం, వారి యొక్క ఆరోగ్యం ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టి వారితో ఆనందంగా సంభాషించడానికి ప్రయత్నిస్తారు తప్ప, వారి అనారోగ్యము, బాధలు వంటి వాటిపై దృష్టి పెట్టనివ్వరు. నివారణను పూర్తి నమ్మకంతో, ఫలితం ఎలా ఉన్నా,అది వారి జీవితంలో వెలుగు ఇస్తుందనే విశ్వాసంతో రోగులకు ఇస్తారు.

వైబ్రియనిక్స్ పవిత్రమైన దైవిక సాధనం అవ్వడంవల్ల గ్రహం యొక్క వైబ్రేషన్స్ పెంచడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదని, మనతో మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సామరస్యంగా జీవించడానికి దారి తీస్తుందని ఆమె భావిస్తున్నారు. ఇచ్చిన ప్రతి రెమెడీ జీవిలో (వ్యక్తి, జంతువు, లేదా మొక్క)కాంతిని తీసుకువచ్చి ప్రకాశించేలా చేస్తుందని ఆమె ఊహిస్తున్నారు.             మన భూగ్రహం చీకటినుండి వెలుగుకు, స్వార్ధం నుండి సంఘీభావానికి భయం నుండి ప్రేమ వైపు పరివర్తన చెందుతోంది. ఈ దివ్య సంకల్పంలో ఇతరులకు సేవ చేయడం ద్వారా, మనలను మనం ఉద్ధరించుకొంటూ, పరివర్తన  చెందే అవకాశం, మన వైబ్రేషన్ పెంచుకొనే అవకాశం మనకు అందిస్తూ వైబ్రియానిక్స్ తన పాత్రను తను పోషిస్తోంది. దీనిలో మన నిబద్ధత చాలా ముఖ్యం. మనం ఏ ప్రాంతం లో సేవ చేస్తున్నాము, ఎంతమంది పేషెంట్లను చూసాము అనే దానితో సంబంధం లేదు. ఈ బాధ్యతను ఎంత హృదయపూర్వకంగా నెరవేరుస్తున్నాము అనేదే ముఖ్యం అని పేర్కొంటున్నారు. ఇతర అభ్యాసకులకు వీరి సలహా ఏమిటంటే మనల్ని  సందర్శించే ప్రతీ పేషంటు యొక్క సందర్శననూ ఆస్వాదించాలి, ఎందుకంటే ప్రతీ రోగి వారిని స్వస్థపరచు కోవడం కోసమే కాదు, మనలో ఉన్న ఏదో ఒక ఒక సమస్యను నయం చేయడానికి వారు వస్తున్నారు అని భావన మనలో ఉండాలి. మన సమస్యను విప్పి చెప్పే దర్పణం వంటి వారే మన పేషెంట్లు అనే భావన మనలో ఉండాలి.

ఈరోజు అభ్యాసకురాలు 10 సంవత్సరాల క్రితం వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఏదైతే అయస్కాంతత్వం అనుభూతిని పొందారో అదే అనుభూతిని నేడు కూడా పొందుతున్నారు. వైబ్రియానిక్స్ ఇప్పుడు ఆమె జీవితంలో సేవ యొక్క ఆనందాన్ని అనుభూతిని ఆస్వాదింపజేసే ఒక సహజసిద్ధమైన విడదీయలేని అంశం.

పంచుకున్న కేసులు :


పంచుకోదగిన దృష్టాంతములు