ప్రాక్టీషనర్ వివరాలు 02885...Argentina
నేను ఒక కిండర్గార్టెన్ టీచర్ ను అంతకు మించి బాబాకు విశ్వసనీయమైన భక్తురాలిని. 2010 నుండి ప్రతీ సంవత్సరం పుట్టపర్తి సందర్శిస్తూనే ఉన్నాను. మొదటి సారిగా నేను నా స్నేహితురాలుతో వెళ్ళాను. ఆ సమయంలో ఆమె యొక్క 7 సంవత్సరాల బాబు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇతను పుట్టుకతోనే వాచిపోయి పెరిగిన గుండె తో పుట్టాడు. భగవంతుని శరణు వేడే ఉద్దేశ్యంతో వెళ్లి అనుకోకుండా సాయి వైబ్రియోనిక్స్ నేర్చుకున్నాము. డాక్టర్ అగ్గర్వాల్ మరియు శ్రీమతి హేమ అగ్గర్వాల్ ఈ బాబుకు రెమిడి ఇచ్చారు. దీనిని అక్కడే ఇండియాలోనే వాడడం ప్రారంభించాము. రోజు రోజుకు బాబు ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల కనిపించింది. అందుచేతనే నేను వైబ్రో థెరపీ నేర్చుకుని ప్రాక్టీ షనర్ అవుదామనుకున్నాను. ఐతే డాక్టర్ అగ్గర్వాల్ రెండు సంవత్సరాల వరకు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత ఆశ్రమం లోనే శిక్షణ తీసుకున్నాను. 2013 నుండి నేను JVP గా ఉన్నాను. ఇప్పటివరకూ అర్జంటినా లో 700 పేషంట్ లను చూసాను. ఈ సేవను శ్రద్ధతో ప్రేమతో చేయడానికి కావలసిన శక్తిని స్వామి నాకు ప్రసాదించారు. జంతువులకు చిన్న పిల్లలకు రెమిడి లు ఇవ్వడం అంటే నాకు మహా ఇష్టం ఎందుకంటే వీరి నుండి వ్యతిరేక భావలేమి రావు కనుక త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
నేను పేషంట్ లకు చికిత్స ఇచ్చే సందర్భంలో తమహృదయంలో ఉన్న భగవంతుని పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచమని చెపుతాను.
ఈ సేవ ద్వారా నేను ఏది చేస్తున్నానో దానిని ప్రేమించ గలగడం అలవాటయ్యింది. వైబ్రియోనిక్స్ తో పనిచేస్తుంటే ప్రేమావతారి స్వామితో ఉన్నట్లే ఉంటుంది.
ఈ వైబ్రో సాధన వల్ల నా భావాలలో మార్పు వచ్చి ప్రేమతో పేషంట్ లు చెప్పేది ఓపికతో వినగల్గుతున్నాను. వారిని ఓదార్చి ప్రేమను అందించి వారికోసం ప్రార్ధనలు కూడా చేసే విధంగా స్వామి నాలో మార్పు తెచ్చారు.