కుక్క మెడ పైన గాయాలు 02885...Argentina
ప్రాక్టీ షనర్ ఇలా వ్రాస్తున్నారు: మా కుక్క పిట్టీ ని మా మేనల్లుడి వ్యవసాయ క్షేత్రంలో రెండు కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీనికి మెడ పైన చాలా పెద్ద గాయాలు అయ్యాయి. మా మేనల్లుడు ఆ సమయంలో దూరంగా ఉన్నాడు. అందువలన పిట్టి నాలుగు రోజుల పాటు గాయాలతో అలాగే ఉండవలసి వచ్చింది. మా మేనల్లుడి తల్లి గాయాలను శుభ్రపరిచి మందు వ్రాసింది. మా మేనల్లుడు ఉరునుంది వచ్చాక పిట్టి ని పశు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాడు. డాక్టరు పిట్టి కి గాయాల్ని శుభ్రపరిచి చెడిపోయిన మాంసాన్ని తొలగించారు. ఆ తర్వాత తీసిన ఫోటోలు క్రింద చూపబడ్డాయి.
మే 7 వ తేదీన నేను పిట్టి ని చూడగానే వైబ్రో చికిత్స ప్రారంభించాను. నా దగ్గర ఎప్పుదూ అత్యవసరంగా ఉండే కిట్ నుండి ఎమెర్జెన్సీ రెమిడి, ఫిట్ వెల్, మూవ్ వెల్, బి వెల్, గెట్ వెల్ రెమిడి లు ఇచ్చాను.
CC9.2 Fevers & Infections + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & emotional tonic + CC18.1 Brain disabilities + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…లీటరు నీటిలో 4 గోళీలు నెల వరకూ BD అనంతరం OD
దీనితో పాటు సిల్వర్ వాటర్ (కొలయిడాల్ సిల్వర్ తో రూపొందించిన నీరు ) ఇన్ఫెక్షన్ ఉన్న గాయానికి ఎడమవైపు రాయసాగాము. ఎందుకంటే వెటర్నరి డాక్టర్ ఆ భాగంలో ఇన్ఫెక్షన్ కు గురై పాడయిన చర్మ భాగం ఉండడడం వలన దానిని శుభ్రం చేయవద్దని చెప్పారు. దీనితో పాటు విభూతి కూడా మెడ అంతా రాస్తూ ఇతర రకాల శక్తి ప్రేరక చిట్కాలు కూడా ఉపయోగింవచాము. 7 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది (క్రింద ఎడం ప్రక్క ఫోటోలు చూడండి).
జూన్ 5 నాటికి పిట్టి ఆహారం బాగానే తీసుకొంటోంది. ఇందువల్ల దీని బరువు 3 కేజీలు పెరగడంతో పాటు ఇది రోజుకు ఒక లీటరు వైబ్రో నీటిని కూడా త్రాగుతోంది. ఎడమవైపు ఉన్న గాయం ముసుకు పోయింది కానీ కుడివైపు గాయం ప్రస్తుతం 10 cm x 5cm ఉంది. త్వరలోనే దీనికి కుట్లు వేసి మూసివేద్దామని వెటర్నరి డాక్టర్ చెప్పారు. (క్రింద మరియు ప్రక్కనున్న ఫోటోలు చూడండి.).