ప్రాక్టీషనర్ల వివరాలు 03572...Gabon
ప్రాక్టీషనర్ 03572…గాబాన్ జీవవైవిధ్య నిర్వహణ మరియు అటవీ పర్యావరణ వ్యవస్థ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఈ ప్రాక్టీషనర్ దేశంలోని నేషనల్ పార్క్స్ పర్యావరణ మదింపు లకు ఇంఛార్జిగా ఉన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ వాటర్ అండ్ ఫారెస్ట్ ఉపన్యాసాల ద్వారా పర్యావరణ శాస్త్రం లో తనకు ఉన్న జ్ఞానం మరియు విస్తారమైన అనుభవాన్ని వేదిక ద్వారా పంచుకుంటున్నారు.
చిన్నప్పటినుండి మతపరమైన భావనలు కలిగి ఉన్నప్పటికీ అంతరంగికంగా ఏదో కోల్పోయిన భావన మనసులో బలంగా ఉండేది. 10 సంవత్సరాల వయసులో భగవంతుణ్ణి శారీరకంగా చూడాలని భగవత్ అనుభూతి పొందాలని లోతైన గాఢమైన కోరికను పెంచుకున్నారు. ఇతని యొక్క ప్రవర్తన పట్ల తల్లి విచారిస్తూ దేవుని వెతుక్కుంటూ ఇంటిని విడిచి పెడతాడేమో అని భయపడేవారు, కనుక తన తల్లి కోసం అతను తన దృష్టిని చదువు వైపు మళ్ళించాడు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిపుట్టిన రోజు వేడుకలు వారి స్వస్థలం లో జరగనున్న కారణంగా అక్కడకు రావాలని తన సోదరికి వచ్చిన ఆహ్వానం ద్వారా 1998లో స్వామి గురించి మీరు తెలుసుకున్నారు. ప్రారంభంలో స్వామి యొక్క దైవత్వం గురించి అంతగా నమ్మకం లేదు, అయితే బాబా గురించి మరింతగా తెలుసుకోవడానికి, పట్టుదలతో భజనలు మరియు సేవా కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు, శిరిడీసాయి మరియు సత్యసాయి వీరికి కలలో కనిపించి మార్గనిర్దేశం చేయడం ద్వారా తన జీవితంలో తప్పిపోయానని భావించిన దానిని కనుగొనగలిగానని భావిస్తున్నారు. 2007లో పుట్టపర్తిలో జరిగిన యువజన ప్రపంచ సదస్సు కు తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఆనందంగా ఉందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా గా స్వామి దర్శనం మరియు హృదయం లోకి చొచ్చుకొని పోయే వారి చూపులు దేవునితో ముఖాముఖి ఏర్పడాలన్న అతని దీర్ఘకాలిక - కోరికను నెరవేర్చడమే కాక అతని జీవితాన్ని కూడా మార్చివేశాయి. దేవుని పై విశ్వాసం స్థిరమవడమే కాక, పనిలో ఆంతరంగికంగా ఉన్న స్వామిని అనుభవించగలిగారు, అంతేకాక తన బంధువులు, కార్యాలయంలో పనిచేసే సహచరులు పట్ల మరింత సహనంగా అవగాహనతో ఉండగలుగుతున్నారు. 2009 నాటికి, అందుబాటులో ఉన్న ఆంగ్లం మరియు సంస్కృతం లో ఉన్న అన్ని వేదము పుస్తకాలను, ఫ్రెంచి భాషలోకి అనువదించారు మరియు వాటిని చాలాకాలంగా తెలుసుకున్నవారి మాదిరిగా, సరిగ్గా ఉచ్చరించడం కూడా ప్రారంభించారు. మీరు ఇప్పటికీ స్వామి పుస్తకాలను అనువాదం చేస్తూనే ఉన్నారు. వీరు ఫిబ్రవరి 2019 నుండి, సత్య సాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మరియు ఆఫ్రికాలోని ఫ్రెంచ్ మాట్లాడే దేశాలకు ప్రాంతీయ స్థాయిలో కార్యదర్శిగా ఉన్నారు.
వీరు 2015లో ఒక అభ్యాసకుడు 02819 చేత వైబ్రియానిక్స్ కు పరిచయం చేయబడ్డారు. అభ్యాసకుడు ఇతని రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ప్రక్షాళనకు నివారణలు ఇవ్వడం జరిగింది. ఇతడు అభ్యాసకుడికి స్వామి తనును చనిపోయే పరిస్థితి నుండి ఏ విధంగా కాపాడారో వివరించారు. ఇది 2013 పుట్టపర్తిలో ఉన్నప్పుడు జరిగింది. చికిత్స నిపుణుడు ఇచ్చిన రెమిడీ యొక్క సానుకూల ప్రభావాన్ని అతను అనుభవించినప్పటికీ, కేవలం వైబ్రేషన్ రోగ స్వస్థతను కలిగిస్తాయి అనే విషయాన్ని అతను నమ్మలేదు. నవంబర్ 2017, స్వామి గురించి ఒక పుస్తకాన్ని ట్రాన్సిలేషన్ చేస్తున్నప్పుడు వైబ్రియానిక్స్ కోర్సులో ప్రవేశం పొందాలని స్వామి చేత మార్గనిర్దేశం పొందారు. జూలై 2018 లో AVP గా అర్హత సాధించాడు 2018 డిసెంబర్ లో VP అయ్యాడు మరియు ప్రస్తుతం SVP ఈ - కోర్సు చేస్తున్నారు.
ప్రతిరోజు, తన ఆఫీసు నుండి తిరిగి వచ్చిన తర్వాత మరియు రోగులకు చికిత్స చేయడానికి ముందు, అభ్యాసకుడు తన ప్రార్థన గదిలో ఒక నూనె దీపం వెలిగించి, రోగులను స్వస్థపరచడం కోసం స్వామిని ఆహ్వానిస్తారు, మరియు మానసికంగా సాయి గాయత్రి జపిస్తారు. అలాగే రోగులతో మాట్లాడేటప్పుడు వారి నిరాశలు, కోరికల గురించి ఎటువంటి భయం లేకుండా తమ యొక్క భావాలను పంచుకునేందుకు వీలుగా వారిలో విశ్వాసాన్ని ప్రేరేపిస్తారు, వారికి అంతరాయం కలగకుండా ప్రేమతో మరియు శ్రద్ధతో వారి చెప్పే విషయాలను వింటారు. రోగులు కూడా ఈ అభ్యాసకుడి సమక్షంలో తమ ఇంట్లోనే ఉన్నట్లుగా భావిస్తారు. రోగులతో సంభాషించేటప్పుడు మరియు నివారణలు తయారుచేసేటప్పుడు, అభ్యాసకుడు, బాబా వారు అతనికి మార్గ దర్శకత్వం వహిస్తున్నట్లు భావిస్తారు. కలల ద్వారా మరియు అంతరంగం నుండి వెలువడే సంకేతాల ద్వారా మార్గనిర్దేశం చేయడం, నయం చేయడం అనేది స్వామి చూసుకుంటారు అని వీరికి కచ్చితంగా తెలుసు. ఈ అభ్యాసకుడు తన రోగులకు దేవునిపై ప్రేమతో జీవించాలని మరియు ఆరోగ్యంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని సలహా ఇస్తూ ఉంటారు.
గత సంవత్సర కాలంలో, ఈ అభ్యాసకుడు 200 మందికి పైగా రోగులకు విజయవంతంగా గా చికిత్స అందించారు. అధిక రక్తపోటు, మలబద్ధకం, ప్రాథమిక స్త్రీ వంధ్యత్వం, టైఫాయిడ్, దుష్టశక్తుల స్వాధీనం, చేతబడి దాడి, పిచ్చితనం, ఆర్థరైటిస్ మరియు శ్వాసకోస మరియు చర్మ అలర్జీ లాంటి సంక్లిష్ట కేసులను కూడా ఇతను పరిష్కరించారు. ఆఫ్రికా లోని వివిధ దేశాల్లోని రోగులకు పోస్టు ద్వారా రెమెడీలు పంపుతూ ఉంటారు. రోగినూరు శాతం అభివృద్ధిని నివేదించిన ప్రతిసారి అతను ఎంతో ఆనందాన్ని పొందుతాడు మరియు స్వామికి కృతజ్ఞతలు తెలుపుతాడు. వైబ్రియానిక్స్ సాధన తనను మంచి శ్రోతగా మార్చిందని, ఇతరులను బాగా అర్థం చేసుకోవడానికి మరియు ప్రేమించడానికి తన హృదయాన్ని విస్తరించిందనియు, మరియు స్వామి యొక్క వినయ పూర్వకమైన సాధనంగా తనని తయారు చేసింది అని ఇయన తెలుపుతున్నారు.
ఈ అభ్యాసకుడు ఆధ్యాత్మిక, వృత్తిపరమైన, లేదా ఇంటికి సంభందించి అన్ని పనులను స్వామి పనిగానే చూస్తారు. అయితే ఈ వైబ్రియానిక్స్ సేవలు మాత్రం తనకు స్వామి ప్రసాదించిన ఒక అద్భుతమైన బహుమతి గా వీరు భావించి స్వామికి కృతజ్ఞత తెలుపుతున్నారు. ఈ వైబ్రియానిక్స్ కు సంబంధించినంత వరకు అమూల్యమైన మార్గదర్శకత్వం వహించి ప్రేమ మరియు సహనంతో అనేక విషయాలు తెలియజేసి తన ప్రశ్నలకు మరియు సందేహాలను పరిష్కరించడంలో సహకరించిన తన మెంటర్ 01620 కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇతనికి అభ్యాసకుడుగా ఉండటం అంటే “తన అంతరంగం వినడానికి మరియు హృదయం నుండి పని చేయడానికి ఒక సువర్ణ అవకాశం” అని వీరి భావన.
పంచుకున్న కేసులు:
- పునరావృత మవుతున్న టైఫాయిడ్
- ప్రాధమిక వంధత్వం
- ద్విధ్రువ రుగ్మత (బైపోలార్ డిజార్డర్)