ప్రాక్టీషనర్ల వివరాలు 03553...Canada
ప్రాక్టీషనర్ 03553...కెనడా 38 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవంతో, కెనడా, ఆంటారియా లోని ఒక ఆసుపత్రిలో ఫిజియోథెరపీ డైరెక్టర్ గా రెండేళ్ల క్రితం వీరు పదవీ విరమణ చేశారు. 1986లోముంబైలోని ధర్మ క్షేత్రం లో స్వామి దర్శనం పొందిన తర్వాత వీరు స్వామి ఫోల్డ్ లోకి వచ్చారు. 1991 నుండి వీరు చురుకైన బాలవికాస్ గురువుగా ఉంటూ పిల్లలతో గడపడాన్ని అత్యంత విలువైన సమయంగా భావించేవారు. వీరు ఒక దశాబ్దానికి పైగా కెనడాలోని సత్యసాయి సేవా సంస్థ విద్యా విభాగం జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు.
యూఎస్ ఏ - కెనడా కోఆర్డినేటర్ 01339 చేసిన సోల్జరన్స్ వీడియో ద్వారా వీరు 2015లో మొట్టమొదట వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు. క్యాన్సర్ కారణంగా ఈమె అక్క మరణించిన సందర్భంలో ఈ వీడియో టాక్ ఆమె మనసులో ప్రతిధ్వనిస్తూ జీవితం గురించి సమాధానంలేని ప్రశ్నలతో ఆమె మనసును నింపివేసింది. మరుసటి సంవత్సరం, ఒక అద్భుతమైన వైద్య చికిత్సను ఆమె ఇంట్లోనే చూడగలిగారు. 96 సంవత్సరాల ఆమె బంధువు 2016 వ సంవత్సరం మధ్యలో నోటి మంటకు అనగా బర్నింగ్ మౌత్ సిండ్రోముకు గురి అయ్యారు. ఈ రుగ్మత వలన ఆమె ఆహారం తీసుకోలేక మరియు బరువు తగ్గిపోవడం ప్రారంభించారు. అలోపతి చికిత్సా విధానం ద్వారా చేసిన ప్రయత్నాలు తాత్కాలిక ఉపశమనం అందించాయి కానీ ఆమెలో ఈ వ్యాధిని నయం చేయలేక పోయాయి. రోగి నోటి ద్వారా ఏమి తీసుకోవడానికి నిరాకరించడంతో ఒక సీనియర్ వైబ్రో అభ్యాసకుని సంప్రదించగా వారు బ్రాడ్ కాస్టింగ్ ద్వారా చికిత్స చేశారు. వారం రోజుల్లోనే రోగికి వ్యాధి పూర్తిగా నయం కావడమే కాక ఇప్పటి వరకూ అది పునరావృతం కాలేదు. ఈ సంఘటన ఆమెను ఎంతో ప్రభావితం చేయడంతో వైబ్రియానిక్స్ కొర్సులో ప్రవేశం పొందారు. 2016 అక్టోబర్ లో AVPగా మరియు మార్చి 2017 లో VP గా అయ్యారు. ఈ ప్రాక్టీషనర్ ఇప్పటివరకు 140 మందికి పైగా రోగులకు చికిత్స చేశారు. జలుబు/ దగ్గు/ఫ్లూ మరియు అజీర్ణం వంటి కాలానుగుణ మరియు సాధారణ సమస్యలతో పాటు దీర్ఘకాలికవ్యాధులయిన మధుమేహం (ప్రారంభ దశ), బాధాకరమైన రుతుక్రమం, తలపోటు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, శ్వాస సంబంధిత అలర్జీలు మరియు గజ్జి. అలాగే వీరి ఇంటి చుట్టూ ఉన్న పెంపుడు జంతువులకు కూడా చికిత్స చేశారు. రోగులకు గణనీయంగా ఉపశమనం కలిగిన దీర్ఘకాలికవ్యాధుల విషయంలో ఆమ్లత్వం, మలబద్ధకము,జెంకర్స్ డై వర్టిక్యులం (అనగా గొంతు మరియు అన్నవాహిక మధ్య భాగం లో సంచి వంటి నిర్మాణం ఏర్పడడం), హైపోథైరాయిడ్, రాలిపోతున్న జుట్టూ, మూత్రపిండాల సమస్యలు, ప్రోస్టేట్ గ్రంధి విస్తరణ, నిద్ర రుగ్మతలు, నిరాశ, ఆటిజం, దీర్ఘకాలిక సైనసైటిస్, స్తంభింపజేసిన ఎముకలు మరియు కండరాల నొప్పులు, భుజంలో లైకెన్ ప్లానస్, మరియు రోషేశియా. రోగులకు వ్యాధి దాదాపుగా తగ్గిపోయినట్లు భావిస్తున్నప్పుడు మరియు తిరిగి వారు రిపోర్ట్ చేయనప్పుడు అనేక సందర్భాలలో మోతాదును టాపర్ చేయడం లేదా తగ్గించడం అసాధ్యమవుతోందని వీరు భావిస్తున్నారు.
వెన్ను మరియు మెడ నొప్పులకు CC18.5 Neuralgia ను CC20.5 Spine తో చేర్చినప్పుడు రోగులు త్వరగా ఉపశమనం పొందినట్లు వీరు తెలుసుకున్నారు. CC1.2 Plant tonic + CC17.2 Cleansing + CC21.7 Fungus ఈ కలయిక మొక్కల్లో ఫంగస్ ను తొలగించడం లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చినట్లు తెలుసుకున్నారు. రెండు సంవత్సరాలుగా పూలు పూయని ఆర్కిడ్ మొక్క రెండు నెలల్లో మొగ్గ వేయటం ప్రారంభించింది. ఒక నెలలోనే వీరు పెంచుకునే పవిత్రమైన తులసి మొక్కలు మరియు గులాబీ మొక్క ఆకుల నుండి కీటకాలు అదృశ్యమయ్యాయి. ఈమె పెంచుకొనే అందమైన తోటను చూసిన, స్నేహితులు మరియు రోగులు ఆమె ఉపయోగించిన ప్లాంట్ టానిక్ కావాలని అభ్యర్థనలతో ఆమెను ముంచి వేశారు.
గుండె దడతో బాధపడుతున్న 23 ఏళ్ల యువతి చికిత్స కోసం వీరి వద్దకు వచ్చిన ఒక ఆసక్తి కరమైన కేసును ఈ చికిత్సా నిపుణురాలు మనతో పంచుకుంటున్నారు. ఈ రోగికి CC10.1 Emergencies మాత్రలను ముందు జాగ్రత్త కోసం అదనపు బాటిల్లో ఇవ్వడం జరిగింది. ఈ యువతికి వాల్నట్ లేదా అక్రూట్ కాయ అలర్జీ కలిగిస్తుంది. ఇది ఆమెకు శ్వాస నాళాల సంకోచము, దురద మరియు వికారము కలిగించి, చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఐతే ఈ విషయం ఆ యువతి అభ్యాసకురాలికి చెప్పలేదు. వాల్నట్ లేదా అక్రోటు కాయ తీసుకోకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది. అంతేకాక ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి వీలుగా ఎపిపెన్ (ఒక ఆటో ఇంజెక్టర్) ఆమె తీసుకెళుతూ ఉండేది. 2019 జూన్ నెలలో ఒక రోజు, ఆమె ఈ ఆటో ఇంజెక్టర్ తీసుకెళ్లడం మర్చిపోయి అనుకోకుండా వాల్ నట్స్ ను రెస్టారెంటు లో తినేసింది. దాంతో వచ్చిన ఇబ్బందిని ఎదుర్కోవడానికి ఆమె తల్లి ప్రోత్సాహం పై, CC10.1 Emergencies మరియు ఆమె సోదరి వద్ద ఉన్న CC19.2 Respiratory allergies కూడా తీసుకుని తన ఇంటికి చేరుకునే వరకు ప్రతి గంటకు ఆమె తీసుకుంది. ఆమె తీసుకున్న ఈ చికిత్స కారణంగా ఆమెకు వాల్నట్ ద్వారా ఏర్పడే ఎటువంటి అలర్జీ కలుగలేదు. మరొక సందర్భంలో రోగి ఆటలో గాయపడిన తన సోదరుడికి CC10.1 Emergencies మాత్రలు ఇవ్వడం జరిగింది. అతడు అద్భుతంగా రెండు రోజుల్లోనే కోలుకొని తర్వాత అభ్యాసకురాలి నుండి వైద్య చికిత్స తీసుకోవడం జరిగింది.
ఈ అభ్యాసకురాలికి గృహ సంబంధిత మరియు సామాజిక కట్టుబాట్ల నేపధ్యం ఉన్నప్పటికీ వైబ్రియానిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సాధ్యమైన అన్ని చోట్ల దీని గురించి అవగాహన పెంపొందించడానికి కృషి చేయడమే కాకుండా ఇతర చికిత్స నిపుణులకు కూడా వీరు సహకరిస్తున్నారు. సులభంగా నిర్వహించడం కోసం ఆరోగ్య చరిత్రను వాటి యొక్క రికార్డులను కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తూ క్రమం తప్పకుండా ఆ కేసులను ఫాలోఅప్ కూడా చేస్తున్నారు. వారానికి ఒకసారి ఆమె తన సామగ్రిని తనవద్దనున్న గోళీలు మరియు బాటిల్ స్టాక్ ను చెక్ చేసుకుంటూ ఉంటారు. ఆమె కుటుంబ సభ్యులు గోళీలు, బాటిళ్లలో నింపడం లోనూ మరియు నివారణాలను పోస్ట్ చేయడం లోనూ ఆమెకు సహాయం చేస్తూ ఉంటారు. అనివార్య కారణాల వల్ల ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినప్పుడు ఆమె రోగులు రెండు వారాల కంటే మించి ఇబ్బంది పడకుండా ఉండే దానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆమె సేవలో భాగంగా వార్త లేఖలను ఫార్మాటింగ్ లేదా ఆకృతీ కలిగించడం లోనూ మరియు చికిత్సా నిపుణుల ప్రొఫైల్ సవరించడం లోనూ ప్రధాన బృందానికి సహాయం చేస్తున్నారు. .
సాధారణంగా మనం శిరస్సు ద్వారా ఆలోచించడం చేస్తున్నప్పటికీ వైబ్రియానిక్స్ సేవ హృదయం ద్వారా రోగి యొక్క బాధలు వినడం నేర్పింది అని సంతోషంగా తెలియజేస్తున్నారు. రెమెడీలు తయారు చేసేటప్పుడు నిశ్శబ్దంగా ప్రార్థిస్తూ, విశ్వ శ్రేయస్సుకోసం, అందరి సౌభాగ్యం కోసం, సంక్షేమం కోసం రోజువారీ ప్రార్థన మరియు సాయి గాయత్రి ని ఉదయం 108 సార్లు జపించడం పైన ఆమె దృష్టిని కేంద్రీకరిస్తారు. స్వామి ఇచ్చిన విలువైన బహుమతి అయిన ఈ సేవ తనలో అహంకారాన్ని త్రుంచి స్వార్ధాన్ని తగ్గించి వినయంతో స్ఫూర్తి వంతంగా ప్రశాంతంగా ఉండడానికి మరియు స్వామికి శరణాగతి చేసుకోవడానికి స్వామి ఇచ్చిన అవకాశముగా వీరు భావిస్తున్నారు. అభ్యాసకులు అందరూ స్వామి చేత ఎంపిక చేయబడిన వారే కనుక వారు అభ్యాసకుల పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటానికి ప్రేమ మరియు అంకితభావంతో ఈ మిషన్ ముందుకు తీసుకు పోవలసిన అవసరం ఉందని ఆమె భావిస్తున్నారు.
పంచుకున్న కేసులు :
-
పిల్లిలో బలవంతంగా వెంట్రుకలు తినేవ్యాధి
-
మెడ వద్ద వెన్నుపూస క్షీణత