చికిత్సా నిపుణుల వివరాలు 02836...भारत
ప్రాక్టీషనర్ 02836… ఇండియా అగ్రికల్చరల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్, 2007 లో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో పార్క్స్ అండ్ గార్డెన్స్ విభాగానికి సీనియర్ అధికారిగా పదవీ విరమణ చేశారు. అతను ప్రకృతి పట్ల ఆసక్తి వల్ల మరియు తన తాత నుండి ప్రకృతి వైద్యం నేర్చుకున్నారు. ఆయన ప్రభుత్వ సర్వీస్ లో వుండగా తన స్నేహితుడి నుండి హోమియోపతి యొక్క ప్రాథమిక అంశాలను నేర్చుకున్నాడు తరువాత దానిమీద ఇష్టంతో తన కుటుంబం, స్నేహితులు మరియు ఆఫీసులోని సహచరులకు మందులు ఇస్తుండేవారు. 1980 ప్రారంభంలో స్వామి సన్నిధిలోకి వచ్చిన తరువాత, అయన సాయి సంస్థ యొక్క వివిధ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 2009 లో తన నివాసంలో గురువారం జరిగిన భజన సమయంలో, ముంబైలో వైబ్రియోనిక్స్ వర్కషాప్ జరుగుతున్నట్లు ఆయనకు తెలిసింది. వెంటనే, ఆయన , ఆయన భార్య ఇద్దరూ వర్క్ షాప్లో చేరారు, మే 2009 లో AVP మరియు 2011 జనవరిలో VP అయ్యారు. తరువాత, అక్టోబర్ 2011 లో ఆయన ప్రశాంతి నిలయంలో SVP కోర్సును పూర్తి చేశాడు.
పూర్తి విశ్వాసంతో, ఆయన గత 10 సంవత్సరాలగా తన నివాసంలో 4000 మందికి పైగా రోగులకు చికిత్స చేశారు. ఆయన విజయవంతంగా చేసిన చికిత్సలలో రక్త కాన్సర్ (లుకేమియా), గుండె మరియు జీర్ణ రుగ్మతలు, చెవ్వులలో గుయ్మనడం (టిన్నిటస్), థైరాయిడ్ గ్రంథి తక్కువగా పని చేయుట వలన కలుగు స్థూలకాయత (హైపోథైరాయిడిజం), జుట్టు రాలడం, తలనొప్పి, నోటి పూతలు, మూత్రపిండాల్లో రాళ్ళు, మానసిక రుగ్మతలు, కీళ్ల నొప్పులు మరియు చర్మ వ్యాధులు ఉన్నాయి. మాట పోయిన 5 కేసులతో ఆయన విజయం సాధించారు; ఒక కేసు ‘కేస్ హిస్టరీస్’ క్రింద ఇవ్వబడింది.
దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నరోగులకు శీఘ్ర ఉపశమనం కలిగించడానికి, అతను విశ్లేషణల కోసం లేదా కారణాల కోసం ఎక్కువ సమయం కేటాయించకుండా, రోగ లక్షణాల ఆధారంగా మాత్రమే నివారణలను మందులు ఇచ్చేవారు. ఈ విధానంతో, 1 లేదా 2 వారాల తరువాత జరిగే తన మొదటి సమీక్షలో చాలా మంది రోగులు మెరుగవుతున్నారని, తద్వారా ఆయనపై మరియు వైబ్రియోనిక్స్ పై విశ్వాసం పెంపొందించడానికి సహాయపడుతోంది. పురోగతి నెమ్మదిగా ఉందని అతను కనుగొన్న సందర్భాలలో, రోగ కారణాన్ని గుర్తించి ఆయన రోగ నివారణకై 108 సిసి బాక్స్ లేదా SRHVP ని ఉపయోగిస్తూ తగిన మందు తయారుచేయడం సముచితంగా భావిస్తారు.
ఆయన ఉద్దేశ్యప్రకారం, ఆధునిక జీవనశైలిని అధిక ఒత్తిడులతో పాటు వాతావరణంలో కాలుష్యం మరియు రేడియేషన్ లను పరిగణనలోకి తీసుకోని ప్రతి రోగికి ముందుగా మనస్సును శాంతింపచేయడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కాంబో ఇవ్వాలి. ఆయన అనుభవంలో, CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities కలపి ఇవ్వడం ద్వారా చాలామందికి త్వరిత నివారణ మరియు మరింత ఆరోగ్యవంతులు కావడానికి సహాయపడ్డాయి.
అనేక వ్యాధులకు సంబందించి తయారుచేసిన 108CC (సాధారణ కాంబో)తో చాలా సంతోషపడ్డారు. వైబ్రియోనిక్స్ యొక్క అద్భుత ప్రభావాన్ని మరియు మొక్కలు, జంతువులు మరియు మానవులు అవసరమైన ప్రకంపనలను తీసుకొని నయం పొందుతున్న అద్భుతాలని చూశారు. రోగులకు చికిత్స చేయడానికి ముఖ్యంగా ఖరీదైన వైద్య చికిత్సను చేయించుకోలేని నిరుపేదలకి వైద్యం చేసేందుకు తనకు ప్రత్యేకమైన అవకాశం ఇచ్చిన ఆ దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు.