Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మానసిక దాడులు (సైకిక్ అట్టాక్స్) 02836...भारत


35 ఏళ్ల వయసున్న, శారీరకంగా చాలా బలంగా ఉన్న యువతిని, ఆమె భర్త 15 సెప్టెంబర్ 2010 న ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువచ్చాడు. గత 10 సంవత్సరాలుగా, ఆమె మానసిక దాడులకు గురైంది. అరవడం, అసభ్యకరమైన భాష వాడటం మరియు ఆమె యవ్వనంలో వున్న కొడుకు, కుమార్తె మరియు ఆమె భర్తను కూడా దాదాపు ప్రతిరోజూ కొట్టడం ఆమెకు అలవాటుగా మారింది. ఆమె గత 3 సంవత్సరాలుగా అల్లోపతి చికిత్స తీసుకుంటున్నా ఎటువంటి మార్పు లేకుండా ఉంది.

ప్రాక్టీషనర్ ఈ క్రింది మందు తయారుచేసి ఇచ్చాడు.

#1. CC15.2 Psychiatric disorders…TDS

అతను రోగిని కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోమని కోరి, తరువాత ఆమె నోటిలో మొదటి మోతాదును ఇచ్చాడు. ఆమెను కళ్ళు మూసుకుని దీర్గ శ్వాసలు తీసుకొంటూ, 5 నిమిషాలు క్రమబద్దమైన శ్వాసపై దృష్టి పెట్టమని కోరి, ప్రాక్టీషనర్ ఆమె కోసం ప్రార్థించాడు. అదే సమయంలో అతను 4 అంగుళాల పొడవున్న ఒక ఆమె ముఖం యొక్క కుడి వైపు నుండి ఉద్భవించి ఆమె ఎడమ వైపు కదులుతున్న నల్ల నీడను చూశాడు, ఆమె పెద్దగా ఏడుపు ప్రారంభించి, కొన్ని నిమిషాల తర్వాత శాంతించింది.

3 రోజుల తరువాత, ఆమె దుర్భాషలాడుతున్నపటికి, ఆమె చాలా ప్రశాంతంగా ఉందని తెలిసింది. ఆమె బాగా నిద్రపోకపోవడంతో, # 1 తోపాటు ఈ క్రిందదానిని కూడా ఇచ్చారు:

#2. CC15.6 Sleep disorders + #1…TDS

ఒక వారం తరువాత, ఆమె, తన భర్తతో కలిసి, ప్రాక్టీషనర్ ని కలసినప్పుడు ఈ దాడులు ఎలా ప్రారంభమయ్యాయో పంచుకున్నారు. యుక్తవయసులో, ఒక నదిలో ఈత కొడుతున్నప్పుడు, ఆమె తన పాదాల అరికాళ్ళను ఏదో తాకుతున్నట్లు అనిపిచింది. ఆమె దాన్ని తీసి చూస్తే అది ఒక అందమైన విగ్రహం. ఆమె దానిని తన ఇంటికి తీసుకువచ్చింది. సుమారు 10 సంవత్సరాల తరువాత, ఆమెలో మానసిక దాడులు మొదలైయాయి. క్షుద్ర శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న ఒక విద్వాంసుడు ఆ విగ్రహాన్నినదిలో విసిరేయమని చెప్పగా, ఆమె ఆ నదిలో పారవేసింది. కానీ ఇది ఆమె మానసిక దాడులను ఆపలేదు. అయితే వైబ్రియోనిక్స్ తీసుకున్న ఒక నెలలోనే, ఆమె ప్రశాంతంగా మారింది మరియు ఆమె కోప తీవ్రత తగ్గింది. అందువల్ల, ఆమె స్వచ్ఛందంగా అల్లోపతి మందులు తీసుకోవడం మానేసింది.

ఆమె # 2 ను మొత్తం 3 నెలల పాటు కొనసాగించింది, ఈ సమయంలో ఆమె లో హింస మరియు దుర్భాషలాడడం లాంటి మానసిక దాడులు పూర్తిగా ఆగిపోయాయి. రోగితో చివరిసారిగా 2017 లో కలిసినప్పుడు ఆమె ప్రాక్టీషనర్ కి కృతజ్ఞతలు తెలియచేసి మానసిక దాడులు పునరావృతం కాలేదని ధృవీకరించింది.