చికిత్సా నిపుణుల వివరాలు 10596...भारत
ప్రాక్టీషనర్ 10596 ... ఇండియా చరిత్రలో గ్రాడ్యుయేట్ మరియు టైలరింగ్‌లో డిప్లొమా తీసుకొని, 5 సంవత్సరాలు పాఠశాల ఉపాధ్యాయురాలిగా, తరువాత స్థానిక కళాశాలలో 18 సంవత్సరాలు పరీక్షా ఇన్విజిలేటర్‌గా పనిచేశారు.1999 లో తన ఇంటికి దగ్గరలో జరిగిన నారాయణ సేవలో పాల్గొన్న తరువాత ఆమె సాయి సన్నిదిలోకి వచ్చింది. అప్పటి నుండి ఆమె సాయి సంస్థ యొక్క అనేక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంన్నారు, ఉదాహరణకి సంవత్సరానికి రెండుసార్లు ప్రశాంతి సేవ, పాటశాల విద్యార్ధులకి ప్రధమ, ద్వితీయ భాషలను బోధించడం, కుట్టు పని నేర్పడం అలాగే దగ్గరలో వున్న మురికివాడల్లోని మరియు "గ్రామ సేవ" క్రింద దత్తత తీసుకున్న గ్రామాలలోని వయోజన మహిళలకు టైలరింగ్ వంటివి. ఆమె ప్రతివారం జరిగే మొబైల్ క్లినిక్‌లో కూడా సేవలందిస్తోంది.
24 సంవత్సరాల వయస్సులో, తన బాల్యం నుంచి ఔషధ మొక్కల పట్ల వున్న అభిరుచితో ఆమె ఇంట్లో కొన్నింటిని పెంచుకోన్నారు. ఈ మొక్కలను ఉపయోగించి, ఆమె తనకు, తన కుటుంబానికి, పొరుగువారికి మరియు జంతువులకు గత 40 సంవత్సరాలుగా చికిత్స చేస్తోంది. ఉదాహరణకు, జలుబు, దగ్గు మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఆమె ఇంట్లో పెరిగిన పిప్లీ తో పల్చని సూప్ తయారుచేసిoది, అలాగే నల్లేరు కాడల పేస్ట్ తో IBS మరియు విరిగిన ఎముకలుకు వైద్యం చేయడానికి మరియు వావిలి ఆకుల ఆవిరి ద్వారా దోమలను పోగోట్టడానికి, ఉబ్బసం నుండి ఉపశమనం పొందటం లాంటివి. ఉడికించిన ఆకుల నుండి ఆవిరితో ఆమె మనవరాలికి వచ్చిన దద్దుర్లతో కూడిన వైరల్ జ్వరాన్ని ఒక రోజులో పోగ్గొటారు. తన పొరుగు వారితో మాట్లాడేటప్పుడు, అలాగే స్థానిక పాఠశాలలు మరియు సమితి సమావేశాలలో మాట్లాడటానికి ఆహ్వానించినప్పుడు ఆమె ఔషధ మొక్కల గుణాలని మరియు తన అనుభవాన్ని సంతోషంగా పంచుకుంటుంది.
ఈమె 2009లో మొబైల్ మెడికల్ వ్యాన్ సేవలో పాల్గొన్నప్పుడు సాయి వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆమె తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న తన కొడుకు కోసం సమీపంలోని ప్రాక్టీషనర్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొంది. వైబ్రియోనిక్స్ చికిత్సతో తన కొడుకు ఆరోగ్యం త్వరగా మెరుగుపడినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి చాలా ఆనందపడింది. వెంటనే ఆమె కోర్సులో పేరు నమోదు చేయించుకుంది. ఏప్రిల్ 2009 లో, ముంబైలోని ధర్మక్షేత్రంలో మొదటి వైబ్రియోనిక్స్ శిక్షణాశిబిరం నిర్వహించినప్పుడు, ఆమె AVPగా అర్హత సాధించింది. తరువాత ఆమె 2013 లో VP అయ్యారు.
ఆమె వైబ్రియనిక్స్ చికిత్స తనకున్న కాలి నరాలు ఉబ్బిపోయే వ్యాది(వేరికోజ్ వీన్స్)కి సంబందించిన చికిత్శ ద్వారా ప్రారంభించింది. ప్రతీ నెల ఒకసారి ఆమె సమీపంలోని వృద్ధాశ్రమంలో వున్న పెద్దవారికి సేవ చేయడానికి వెళ్ళుతుంటారు. ప్రాక్టీషనర్ అయిన తరువాత, ఆమె CC3.1 Heart tonic + CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic…TDS అక్కడ వున్న పెద్దవారికి ఇవ్వడం ప్రారంభించింది. వాటివల్ల వారిని ఉల్లాసంగా మరియు ప్రశాంతంగా చేశాయి. వృద్ధాశ్రమంలో నీరు మరియు ఆహారం కలుషితం కావడం వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి కూడా ఇది సహాయపడింది.
ఆమె, మరో ముగ్గురు AVPలతో పాటు, వారం విడిచి వారం ప్రతి గురువారం మరియు శనివారం దగ్గరలో వున్న రెండు దేవాలయాలలో రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇద్దరు సహాయకులు సీసాలకు లేబుల్ అతికించడం మరియు సీసాలను చక్కెర మాత్రలతో నింపడము లాంటి సహాయం చేస్తున్నారు. ఆమె ఇప్పటివరకు 11000 మందికి పైగా రోగులకు రోగనివారణ చేయగలిగారు. ఆమె దీర్గకాల వ్యాధులైనటువంటి కాలి సిరలు ఉబ్బడం, ఉబ్బసం, మోకాలి నొప్పులు (ఆర్థరైటిస్), అలాగే దద్దుర్లు, తామర వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు విజయవంతంగా చికిత్స చేసారు. ముఖ్యంగా, ముంబైలో అధిక ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా ఆమె అనేక నిద్ర సంబందిత రుగ్మతలను పోగొట్టడంలో గొప్ప విజయాన్ని సాధించింది.
సమిష్టిగా ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఆనందం మరియు నేర్చుకోవడానికి చాలా సహాయపడుతోందని మరియు అంతర్గతంగా, బాహ్యంగా అందరు ఒకటే అనే భావాన్ని పెంచిందని ఆమె చెప్పారు. సేవ చేయడానికి ఇచ్చిన ఈ సువర్ణావకాశానికి ఆమె స్వామికి చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నారు. రోగులు వారి రోగం నయం అయినప్పుడు వారి సంతోషకరమైన ముఖాన్ని చూడటం ఆమెకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది.
క్రమం తప్పకుండా న్యూస్ లెటర్స్ లోని సమాచారం ద్వారా తనను తానుగా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. ఆమె కుటుంబ భాధ్యతల కారణంగా గత 3 సంవత్సరాలుగా పుట్టపర్తికి వెళ్లలేకపోయింది. కానీ, ముంబైలో నిర్వహించే రిఫ్రెషర్ సెమినార్‌లకు హాజరయ్యే అవకాశాన్ని ఆమె వదులుకోదు. సంవత్సరంలో నెల విడిచి నెల జరిగే సమావేశాలలో ఇటీవల నిర్వహించిన ఒకరోజు రిఫ్రెషర్ సమావేశం నుండి CC12.1 Adult tonic and CC17.2 Cleansing ద్వారా వ్యాధులను నివారించవచ్చని నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె తనతో సహా తన రోగులకు ఈ కాంబోలను సూచించడం మరియు ఇవ్వడం ప్రారంభించింది.
వైబ్రియోనిక్స్ సాధన చేయడం ద్వారా ఆమె రోజువారీ సమస్యలను ఇబ్బంది లేకుండా ఎదుర్కోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ సాధన ద్వారా దైవత్వానికి దారితీసే స్వచ్ఛతను సాధించవచ్చని ఆమె నమ్మకంగా ఉంది. ముంబై వంటి అధిక జనాభా వున్న పెద్ద నగరాల్లో నివసించే వారు వైబ్రియోనిక్స్ కోర్సు చేసి ప్రాక్టీషనర్స్ గా మారి తమ మంచి కోసం, తమ కుటుంబం, పొరుగువారు, స్నేహితులు మరియు సమాజాన్ని చూసుకోవాలని ఆమె భావిస్తోంది! వైబ్రియోనిక్స్ తన స్వీయ-పరివర్తనకు సహాయపడిందని, తన కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చాలా కృతజ్ఞతలు తెలిపింది.
పంచుకున్న కేసుల వివరాలు: