దీర్గకాలిక ముక్కు దిబ్బడ (క్రోనిక్ బ్లాక్డ్ సైనెస్స్) 10596...भारत
ముంబైలోని ఒక వృద్ధాశ్రమంలో 82 ఏళ్ల చూపులేని ఒక పెద్దాయన గత 8 సంవత్సరాలుగా ముక్కు దిబ్బడ మరియు సైనస్‌లతో బాధపడుతున్నారు; దీనివల్ల సరైన నిద్రకూడా పోలేకపోతున్నారు. అతను అల్లోపతి వైద్యం తీసుకున్నాఎటువంటి ఫలితం పొందలేదు. అతను జనవరి 2019 నుండి వృద్ధాప్య ఇంటిలో నివసించడం ప్రారంభించిన తరువాత అతను అల్లోపతి మందులు తీసుకోవడం మానేశారు. రోగి తన పరిస్థితికి చాలా బాధపడుతూ సహాయం కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు.
19 జనవరి 2019 న, అతనికి ఈ క్రింది కాంబో ఇవ్వబడింది:
CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…TDS
ప్రాక్టీషనర్ ఒక నెల తరువాత వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు, రోగి అతను మందు మొదలుపెట్టిన 3 రోజుల తర్వాత మంచి నిద్ర పొగల్గుతున్నారని తెలిపారు. అతని ముక్కు దిబ్బడ మరియు సైనస్ కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది మరియు ఇప్పటికి, అది కనుమరుగైంది మరియు నొప్పి కూడా పోయింది. ఫిబ్రవరి 19 న, మోతాదు OD కి తగ్గించబడింది. మందు అతనికి బాగా నిద్రపోయేలా చేయడంతో, మోతాదును తగ్గించడానికి అతను ఇష్టపడలేదు. ఏప్రిల్ 2019 నాటికి, పునరావృతం కాలేదు; రోగి సంతోషంగా ఉన్నాడు మరియు OD నివారణను కొనసాగిస్తున్నాడు.