Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ వివరాలు 10014...India


నేను ముంబాయి కి చెందిన శాంతాక్రజ్ ప్రాంతపు వాడిని. నేను మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టా తీసుకోని గత 22సంవత్సరాలుగా ఎయిర్ఇండియా లో ఏవిఏషన్ ఇంజినీరుగా పనిచేస్తున్నాను.  నేను 2007 లో వైబ్రియోనిక్స్ లో ప్రవేశించాను. ఆ సంవత్సరము మొదటి త్రయిమాసికము లో నాకు హైపర్ అసిడిటీ మరియు మానసిక ఆందోళన వలన నా జీవన శైలి పూర్తిగా మారిపోయింది. గత ఆరునెలలుగా అలోపతి మందులు తీసుకుంటూనే ఉన్నాను. అంతేకాక ఎండోస్కోపీ లో నా అన్నవాహిక  కోతకు గురైనట్లు రిపోర్టు వచ్చింది. చాలాకాలం నుండి అలోపతి మందులు తీసుకొనడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్ లను తగ్గించుకొనే ఉద్దేశంతో వీటిని మానివేయాలని నిశ్చయించుకొన్నాను. ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో ధర్మక్షేత్రం లో ఇదే ఇబ్బంది తో బాధపడే ఒక సాయి భక్తుడి ని కలుసుకున్నాను. వైబ్రియోనిక్స్ మందులవల్ల అతని వ్యాధి నయమైనట్లు తెలిసింది. వారు నన్ను ఒక అలోపతి డాక్టర్ మరియు వైబ్రియో ప్రాక్టిషనరైన మహిళకు పరిచయం చేసారు. ఆమె సాయిసెంటర్ లో వైబ్రో క్లినిక్ నడుపుతున్నారు. వారిదగ్గర మందులు తీసుకొగానే నయమయ్యి చాలా ఆనందం కలిగింది. జూలై 3వ తేదిన ఒక ప్రాక్టీషనర్ నాకు ఫోన్ చేసి రానున్న రెండు రోజులలో వైబ్రియో వర్క్ షాప్ ఉందని దానిలో పాల్గొనడంతో పాటు తనకు కార్యక్రమ నిర్వహణలో సహాయపడవలసి ఉంటుందని  చెప్పారు. ఆ విధంగా జూలై 15 న నేను ఈ సేవ ప్రారంభించడం తో పాటు CC4.10 Indigestion…TDS రెమిడి  తీసుకోవడం ద్వారా మొదటి పేషంటు నాకు నేనే అయ్యాను.ఆరోజు రాత్రి నా వైబ్రియో కిట్టు ను 108 CC బాక్సు ను, హ్యాండ్ బుక్కును స్వామి ఆశీస్సులు కోసం వారి ఫోటో ముందు ఉంచాను. రెండు రోజుల్లోనే పుస్తకం మొదటి పేజీ పైన “ఓం” అనే అక్షరాలు విభూతితో కనిపించాయి (క్రింద నున్న ఫోటో చూడండి ). నన్ను ముందుకు సాగమని స్వామి ప్రోత్సహించడానికి ఇంతకంటే నిదర్శనం ఏమికావాలి ?

అప్పటి నుండి ప్రాక్టీషనర్ ల లిస్టులు తయారుచేయడం, వారికి అధికారిక సమాచారం పంపడం, రిపోర్టులు సేకరించడం వాటిని క్రోడీకరించడం, ఇంకా ధర్మక్షేత్రం లో వర్క్ షాప్ ల నిమిత్తం ఒక కోఆర్డినేటర్ గా ఏర్పాట్లు చూడడం ఇదంతా స్వామి ప్రసాదమే.  ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది.  

2007 డిసెంబర్ లో నేను JVP శిక్షణ పూర్తి చేసుకున్నాను. నాకు ఇచ్చిన క్రొత్త 108CC బాక్సును స్వామి ఫోటో ముందు ఉంచగా రెండు రెమిడి బాటిళ్ళ పైన స్వామి హస్తాక్షరి  రావడమే కాక  బాక్సు మొత్తం విభూతితో నిండిపోయింది. “ప్రేమతో బాబా” అనే అక్షరాలు NM18  రెమిడి పైన (సామాన్య జ్వరము)  (25వ సీసా) మరియు  “ శ్రీ సత్యసాయి ” అనే అక్షరాలు NM20 Injury రెమిడి పైన (29వ సీసా)  కనిపించాయి. (పైన ఉన్న ఫోటోలు తిలకించండి). ఈ సీసాలు మెడికల్ క్యాంపుల్లో పిల్స్ ఆలశ్యం లేకుండా త్వరగా ఇవ్వడం కోసం తయారు చేయబడ్డాయి. (ఆల్కహాల్ పడినప్పుడు చెరిగిపోకుండా ఉండడానికి  నేను ఈ అక్షరాల పైన టేపు అంటించాను)

 2013, జూలై 20 న నా యొక్క SVP కోర్సు ముగిసిన తర్వాత  నేను డాక్టర్ అగర్వాల్ గారినుండి  SRHVP మిషన్ తీసుకోని ఆరోజు సాయత్రం హారతి అనంతరం స్వామి ఆశీస్సుల కోసం సమాధిపై ఉంచడం జరిగింది.

ఇంటికి వచ్చిన తర్వాత దీనిని స్వామి ఫోటో ముందు ఉంచగా మూడు రోజుల తర్వాత స్వామి అనుగ్రహానికి సూచనగా మిషన్ రెండు బావుల లోనూ విభూతి రావడంతో దానిని జాగ్రత్త పరచి  అసాధారణ సమస్యలతో వచ్చే పేషంట్ లకు రెమిడి పిల్స్ తో పాటు ఇవ్వడానికి రెండు కంటైనర్ లలో భద్రపరిచాను. విచిత్ర మేమిటంటే సాంపిల్ వెల్ లో వచ్చిన విభూతి యొక్క రంగు రుచి రెమిడి వెల్ లో వచ్చిన విభూతి కి భిన్నంగా ఉన్నాయి.

ఇంతేకాక స్వామి ప్రేమతో తమ దివ్య హస్తాక్షరి ని చివరి కార్డు ఐనట్టి   SR576 Tumours పైన ప్రసాదించడం జరిగింది (ఫోటో చూడండి).  

 ఇదంతా కూడా ఒక దివ్యమైన ప్రణాళిక ప్రకారము జరిగిందనే విషయం మెల్లిగా నాకు అవగత మైనది. నాకు స్వామి వారి దర్శనం ధర్మ క్షేత్రంలో 1999 మార్చి 12 వ తేదీన స్వామి శాంతి దీప్ ఎదురుగ ఉన్న మెడికల్ సెంటర్ ను ప్రారంభించడానికి వచ్చినప్పుడు కలిగింది. సరిగ్గా 9 సంవత్సరాల (2008 లో)తర్వాత అదే స్థానంలో వైబ్రో పిల్స్ ఇచ్చే దివ్యమైన సేవలో పాలు పంచుకునే భాగ్యం కలిగింది. ప్రస్తుతం నేను మా ఇంట్లోనే కాక షిర్డీసాయి మందిరం, కదంవాడి, కలీనా, శాంతాక్రజ్ (తూర్పుముంబాయి ) లలో వారాంతపు సెలవులలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వైబ్రో రెమిడిలు ఇస్తున్నాను. ఈ విధంగా ఇంతవరకు 2480 పేషంట్ లను చూడడం జరిగింది.


పంచుకోదగిన దృష్టాంతములు