సర్వత్రా వ్యాపించిన రొమ్ము క్యాన్సర్ 10014...India
2009 సంవత్సరం జూలై నెలలో ఒక సాయి భక్తురాలి ద్వారా 61 సంవత్సరాల మహిళ పూర్తిగా విస్తరించిన రొమ్ము క్యాన్సర్ తో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఈ క్యాన్సర్ ఆమె కుడి రొమ్ము భాగంలో ప్రారంభమై చాతీ భాగమంతా వ్యాపించడం తో పాటు ఉదరకోశ పటలమునకు కూడా వ్యాపించింది. ఇంతేకాక ఇది ఆమె క్లోమ గ్రంధి లో ఒక కణితిని, ఇంకా ఆమె పిత్తాశయము, మరియు ఇతర జీర్ణ కోశ భాగాలకు అలాగే ఇతర ముఖ్యమైన భాగాలకు, ఎముకలకు ఇలా శరీరమంతా వ్యాపించింది. దీనివలన ఆమెకు నొప్పి, అజీర్ణము, నీరసము, కలగడమే కాక ఆమె జూలై 30 నుండి మంచం పైనే ఉండ సాగింది. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC2.1 Cancers – all + CC4.1. Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC12.1 Adult tonic + SM1 Divine Protection…6TD 15 రోజుల వరకు, ఆ తరువాత QDS 15 రోజుల వరకు.
ఆమెను ఆయుర్వేద మందులను కూడా తీసుకోవలసిందిగా సూచించడమైనది. కనుక వైబ్రో రెమిడి ప్రారంభించిన ఒక నెల తర్వాత ఈ మందులను ప్రారంభించింది.
ఐతే రెమిడి వల్ల చెప్పుకోదగిన ఉపశమనం లేకపోవడంతో ఈ ప్రాక్టీ షనర్ మరొక సీనియర్ ప్రాక్టీ షనర్ 02709…ఇండియా ను సంప్రదింఛి ఆగస్టు 26 న రెమిడి క్రింది విధంగా మార్చడం జరిగింది:
#2. CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths + CC4.7 Gallstones + CC4.11 Liver & Spleen…QDS
నలుగు వారాల తర్వాత ( అనగా సెప్టెంబర్ 22 న ) పేషంటులో చక్కని పురోభివృద్ధి కనిపించింది. ఆమె బయటకు వెళ్ళడం కూడా ప్రారంభించింది. పేషంటు భర్త ఆమె ఆహారము కూడా బాగా తీసుకుంటోందని చెప్పారు. ఆమె రెమిడి క్రింది విధంగా మార్చడం జరిగింది:
#3. CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths + CC4.1. Digestion tonic + CC4.2 Liver & Gallbladder + CC4.7 Gallstones + CC4.11 Liver & Spleen…QDS
నవంబర్ 17 న ఈమె భర్త ప్రస్తుతం పేషంటు ఆరోగ్య పరిస్థితి చాల మెరుగుగా ఉందని తెలిపారు. అంతేకాక ఆమె ప్రయాణాలు కూడా చేస్తోందని ఒక తీర్ధ యాత్ర కు కూడా వెళ్లిందని తెలిపారు. మరొక నెల రోజుల కోసం ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది.
#4. CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths + CC4.1. Digestion tonic + CC4.2 Liver & Gallbladder + CC15.1 Mental & Emotional tonic…QDS.
ఈ రెమిడి ఇచ్చిన తర్వాత పేషంటు తనకు ఎంతో మెరుగుగా ఉందని తెలిపారు. ప్రాక్టీ షనర్ పేషంటు తోనూ ఆమె కుటుంబ సభ్యుల తోనూ రెమిడి ఆపకుండా వాడుతూ ఉండాలని పదే పదే తెలిపినప్పటికీ ఈమె తిరిగి రెమిడిల కోసం రాలేదు. సుమారు 6-7 నెలల తర్వాత ఆమె ప్రశాంతంగా మరణించారు.