Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సాధకురాలి వివరములు


ప్రాక్టీషనర్  10355…ఇండియా కామర్స్ పట్టభద్రు రాలైన ఈ చికిత్సా నిపుణురాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కరెన్సీ పరిశీలకురాలిగా కొన్ని  సంవత్సరాలు పనిచేశారు. 1984 లో పెళ్లైన తరువాత వీరు ఉద్యోగం మానేసి కుటుంబ విషయాలే చూసుకునేవారు.  1989 నుండి స్వామి గురించి తెలుసుకొని ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు భజనలకు హాజరవుతూ ఉండేవారు. 1998 లో పుట్టపర్తి దర్శించిన తరువాత సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. వీరు బాలవికాస్ కు చెందిన సాయి  వాఙ్మయాన్ని ఆంగ్లము నుండి మరాఠీ కి ఆ తరువాత 2002 నుండి సనాతన సారధి పత్రికకు మరియు  ఇటీవలే విద్యావాహిని కి సంబంధించిన వ్యాసాలను  వీరు ఆంగ్లము నుండి మరాఠీ కి తర్జుమా చేయడం ప్రారంభించి ప్రస్తుతం వాటిని కొనసాగిస్తూ ఉన్నారు.  

వీరు 2006 లో వైబ్రియానిక్స్ గురించి ఒక వాలంటీర్ ద్వారా విని ఈ కోర్సులో చేరాలని భావించారు. 2008 లో AVP శిక్షణ పూర్తి చేసుకొని అప్పట్లో ఉన్న నియమం ప్రకారం 54 CC బాక్సును తీసుకున్నారు. అనంతరం 2015లో  అవసర మైన పరీక్ష వ్రాసి 108 CC బాక్సు ను తీసుకున్నారు. ఇంత ఎక్కువ విరామం రావడానికి కారణం 2000 సంవత్సరం లో మయాస్తేనియా గ్రావిస్ అనే  నరాల, కండరాల వ్యాధి సోకినట్లు నిర్ధారణ చేయబడడం ఇంకా ఇతర కుటుంబ సమస్యలు. ప్రాక్టీషనర్ ఐన తరువాత రెండు సంవత్సరాలు తన ఇంట్లోనే  రోగులకు వైద్యం చేసేవారు. ఐతే అనారోగ్య కారణంగా కొంతకాలము పేషంట్లను చూడడం నిలిపి వేశారు. ఆ తరువాత  తనకు అనుకూల మైన సమయంలో రోగులకు జలుబు, దగ్గు,జ్వరము,జీర్ణ సమస్యలు, ఎముకల నొప్పులు వంటి రుగ్మతలకు తయారుచేసి  మెడికల్ క్యాంపులలో  సహచర చికిత్సా నిపుణులకు ఇస్తూ ఉండేవారు. ఐతే తనకు ఏర్పడిన రుగ్మత నిమిత్తము ఆలోపతి మందులనే వాడేవారు కానీ వాటివల్ల ఏర్పడే ప్రతికూల ఫలితాల నివారణకు వైబ్రియానిక్స్ రెమిడీలనే ఆశ్రయించేవారు.  

వీరు తోటి సేవాదళ్ సభ్యుల సహాయంతో గత 15 సంవత్సరాలుగా భవన నిర్మాణపు పనివాళ్ళ పసిపిల్లలకు, పిల్లలకు సాయి ప్రోటీన్ పంపిణీ చేస్తున్నారు. ఒక సీనియర్ వైబ్రియానిక్స్ అభ్యాసకుని సూచన మేరకు రోగులకు తను ఇచ్చే నివారణుల తోడుగా  CC12.2 Child tonic + CC17.3 Brain & Memory tonic + CC20.6 Osteoporosis కూడా ఇవ్వడం ప్రారంభించారు. వీటిలో ప్రతీ ఒక్క కొంబోను 27 చుక్కలను ఒక కేజీ వేయించిన వేరుశెనగ పప్పు పౌడర్ తో కలిపేవారు. దీనిని 27 కేజీల సాయి ప్రోటీన్ మరియు 7.5 కేజీల పంచదార పొడితో కలిపేవారు. ప్రతీ రోజూ రెండు స్పూన్ల పౌడర్ ను నీటిలో గానీ, పాలలో గాని కలిపి పిల్లలకు ఇచ్చేవారు. పిల్లలు ఈ పౌడర్ యొక్క రుచిని ఆస్వాదించేవారు. ఈ పౌడర్ యొక్క ఫలితం గురించి అధ్యయనాలేవీ నిర్వహింప బడలేదు కానీ ఈ చికిత్సా నిపుణురాలు ఇది పిల్లల యొక్క రోగనిరోధక శక్తి,ఆరోగ్యము,జ్ఞాపకశక్తి ఏమేరకు పెంచుతాయో అధ్యయనం చేస్తున్నారు. 

ఈ ప్రాక్టీషనర్ చికిత్స చేసిన కొన్ని విజయవంతమైన కేసుల వివరాలు ఈవిధంగా తెలియచేస్తున్నారు. 2015 అక్టోబర్ నెలలో  75 సంవత్సరాల  మహిళ వీరి వద్దకు వచ్చారు. ఈ పేషంటు గత సంవత్సర కాలంగా మలబద్దకం,కడుపులో మంట, మలద్వారము పైన దురద తో బాధ పడుతూ ఉన్నారు.  ఈమెకు CC4.4 Constipation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic ఇచ్చిమషాలాలు ఎక్కువ వాడొద్దని సలహా  ఇచ్చారు.  10 నెలలు వాడిన తరువాత ఆమెకు పూర్తిగా తగ్గిపోవడంతో మోతాదును తగ్గించి వాడుతూ 12 వ నెలలో పూర్తిగా మానేసారు. ఇప్పుడామె మషాలా తో కూడిన ఆహారము కూడా తినగలుగుతున్నారు.  2016ఏప్రిల్ లో ఈ పేషంటు వీపు క్రింది భాగంలో నొప్పి నిమిత్తం  ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆమెను ఆస్టియో పోరోసిస్ గా నిర్ధారించబడిన ఈ నొప్పి బాధిస్తోంది. ఈమెకు ఆలోపతి నొప్పి నివారణలు కొనసాగించడం ఇష్టం లేదు.  ప్రాక్టీషనర్ ఆమెకు CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis + CC20.7 Fractures. ఇచ్చారు. మూడు నెలలలో ఆమెకు 90 శాతము మెరుగయ్యింది. దీనితో ఆమె ఈ నివారణలు తన జబ్బును పూర్తిగా తగ్గిస్తాయనే విశ్వాసం తో  మందులు కొనసాగిస్తూ ఉన్నారు.

ఈ ప్రాక్టీషనర్ ఇప్పటివరకూ 1500 పేషంట్లకు చికిత్స చేశారు. చికిత్స తో పాటు SVP10001 తో కలసి AVPమాన్యువల్ ను ఆంగ్లము నుండి మరాఠీ కి అనువాదం చేశారు. ఇది ముద్రిoచ బడింది. 108CC పుస్తకమును కూడా మరాఠీ లోనికి అనువాదం చేశారు ఇది ఇంకా ముద్రించ బడవలసి ఉన్నది. ఈ రెండు పుస్తకాలు మహారాష్ట్ర లోని గ్రామీణ ప్రాంతాల వారికి వారి మాతృ భాషలో AVP కోర్సు నేర్చుకొనడానికి ఎంతో అనువుగా ఉంటాయి. ఈ ప్రాక్టీషనర్  వైబ్రియానిక్స్ అనేది ప్రజలకు నిస్వార్ధంగా ఎల్లలెరుగని సేవ చేయడానికి భగవంతుడు తనకిచ్చిన వరంగా  భావిస్తున్నారు. ఈ సేవ తనను అనారోగ్యం నుండి దూరం చేసి  భౌతికంగా, మానసికంగా,భావోద్వేగ పరంగా  ధృడంగా చేశాయని వీరు భావిస్తున్నారు. అంతేకాక వైబ్రియానిక్స్ తనలో ఇతరుల పట్ల ఫ్రేమ, దయా పెంపొందించుకునేలా చేశాయని తెలుపుతున్నారు. 

పంచుకున్న కేసులు: