Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ ప్రొఫైల్ 02308...Slovenia


ప్రాక్టీషనర్ 02308…స్లొవేనియా  వీరు స్లొవేనియా దేశానికి చెందిన సీనియర్ వైబ్రియో నిపుణులు. వైబ్రియోనిక్స్ పట్ల వీరి నిస్వార్ధ సేవ అంకిత భావం అసాధారణమైనది. వీరు మొట్టమొదట స్వామి గురించి ఎల్ జుబుల్జన ఆధ్యాత్మిక సంస్థ ద్వారా విన్నారు. అదే వీరిని 2001 అక్టోబర్ లో స్వామిని పుట్టపర్తిలో దర్శించుకొనేలా చేసింది. ఆమె తిరిగి తమ దేశం వచ్చేముందు చేసుకున్న చివరి దర్శనంలో స్వామి ఆమె వంక చూసిన దీర్ఘమైన చూపు ఆమెను రెండు రోజులు ఏడ్చేలా చేసింది. ఐతే ఆ చూపే అనేక సంవత్సరాలుగా ఆమె ఆందోళన, మానసిక వ్యధ, కొడుకును కోల్పోయిన శోకమునుండి దూరము చేసిందని భావిస్తోంది. ఇదే సందర్భంలో ఈమె చదివిన పుస్తకం ‘’ద పాత్ ఆఫ్ మాస్టర్స్’’ లో శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువే అతనిని వెతుక్కుంటూ వస్తాడని స్వామియే తన సద్గురువని తెలుసుకో గలిగారు ”.

2002 వ సంవత్సరం జూలై నెల గురుపూర్ణిమ సందర్భంగా ఆమె రెండవ సారి పుట్టపర్తి ని సందర్శించినప్పుడు వీరి వైబ్రియోనిక్స్ ప్రస్థానం మొదలయ్యింది. ఆమెకు నిస్వార్ధ సేవ చేయడానికి వీలున్న అవకాశాలు గురించి తెలుసుకోవాలనే తపన తీవ్రంగా ఉండేది. త్వరలోనే అనగా ఆమె ఆశ్రమం లో ఉన్న మూడవరోజున చైతన్య జ్యోతి సంగ్రహాలయం లో షిర్డీసాయి విగ్రహాల వద్ద సేవ చేసే అవకాశము లభించింది. అంతేకాకుండా అప్పుడు ప్రశాంతినిలయం లో సేవ పైన ప్రపంచ సదస్సు జరుగుతోంది. ఇది ఆమెకు ఒక అనుకోని అవకాశము. ఈ సదస్సు ఆమెకు  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధరకాల సేవలు సేవ సంస్థలు గురించి తెలపడంతోపాటు తాను 15 ఏళ్లుగా తమ ఊరికి రెడ్ క్రాస్ కార్యకర్తగా చేసిన సేవను గుర్తుకు తెచ్చింది.

ఈ సదస్సు లోనే ఎక్కువ సమయం కింద కూర్చునివున్న కారణంగా ఆమెకు నడుము నొప్పి మొదలయ్యిది. తనకు తెలిసిన మరో స్లోవేనియన్ దేశస్తురాలు వైబ్రియోనిక్స్ ట్రీట్మెంట్ తీసుకోవలసిందిగా సూచించినది. ఆ ట్రీట్మెంట్ ఆమెలో ఎంత ఉత్సుకతను రేపిందంటే వెంటనే  SRHVP ఉపయోగించే విధానము తెలుసుకొనడానికి పేరు నమోదు చేయించుకున్నారు. ఆమె గత సంవత్సరమే ఆంగ్లము స్లోవేనియా బోధించే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయినిగా ఉద్యోగ్ విరమణ పొంది ఉన్నందున డాక్టర్ అగ్గర్వాల్ గారు ఆమె భాషా ప్రవీణ్యమును చిన్న చిన్న ఆర్టికల్స్ ఆంగ్లము నుండి స్లొవేనియా కు తర్జుమా చేయుటకు వినియోగించ వలసిందిగా కోరారు. ఈ అంకురమే ఈ నాడు స్లొవేనియా చికిత్సా నిపుణులకు పుష్కలంగా వారి భాష లో వైబ్రో సాహిత్యం లభించడానికి కారణమయ్యింది.  

చేతిలో కావలసినంత సమయం సేవ చేయాలనే తపన ఉండడం తో వీరు పూర్తిగా వైబ్రియో సేవలో మునిగిపోయారు. ఈ సేవే వీరిని నశ్వరమైన ప్రాపంచిక వ్యవహారాలనుండి వ్యామోహములనుండి దూరం చేసి భగవత్ సంబంధమైన అమృతాన్ని చవి చూసేలా చేసింది. ఇలా ప్రతీ రోజు చేయడం ద్వారా మదర్ థెరిసా చెప్పిన సూక్తి ‘’ఇతరుల కోసం నాకోసం ప్రతిరోజూ సేవ చేయాలి’’ ఇది ఆమె ఆలోచనలు, మాటలు, చేతలు ఒకటవడానికి చక్కని సాధన గా ఉపయోగ పడింది.  

వీరి మూడవ పుట్టపర్తి సందర్శనం లో ఒక పరీక్షా కాలమును ఎదుర్కోవలసి వచ్చింది. 2002 డిసెంబర్ లో వీరు న్యుమోనియా తో హాస్పిటల్ లో చేరవలసి వచ్చింది. నెల తర్వాత ఆమె స్లొవేనియా వెళ్ళినప్పుడు తన బరువు 10 కేజీలు తగ్గిపోవడం తో పాటు చాలా నీరసంగా అయిపోయారు. తనకు దగ్గరలో ఉన్న ప్రాక్టీషనర్ 02264 వద్దకు వెళ్లారు కానీ రెమిడి లు తానే తయారు చేసుకున్నారు. తిరిగి తను కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ఐతే ఈ పరిక్షా కాలాన్ని ఆమె ప్రక్షాలనా కాలం గా భావించారు. బాధే బాబా బోధన గా భావించి సేవలోనే నిమగ్నమైనారు.

2008 లో బ్రెస్ట్ కేన్సర్ మూడవ స్థాయి లో ఉన్న ఈ ప్రాక్టీషనర్ తనకు తానే  వైద్యం చేసుకుంటున్నప్పుడు (అలోపతి వైద్యం తీసుకుంటూ) తన జీవితములో  ఒక అపూర్వ సంఘటన గా వీరు కేన్సర్ బారినుండి స్వామి దయతో అద్బుతంగా కోలుకోవడం  జరిగింది. అనంతరం వీరు ముంబాయి లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయి స్పిరిట్యువల్ ఎడ్యుకేషన్ లో మానవతా విలువల పైన జరిగిన సర్టిఫికేట్ కోర్సు లో కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు వర్కు కోసం ‘’ఆరోగ్యము మరియు మానవతా విలువలు’’ టాపిక్ ను వైబ్రియోనిక్స్ కు ప్రాముఖ్యత నిస్తూ తయారు చేసి సమర్పించారు.

వీరు తనవద్దకు వైద్యం నిమిత్తం వచ్చే పేషంట్లను స్వామినే పంపిస్తున్నారని భావిస్తారు. ముఖ్యంగా డిప్రెషన్ మరియు కేన్సర్ వ్యాధి గ్రస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఎందుకంటే  ఈ రెండు వ్యాధుల విషయంలో స్వామి తనకు నేర్పిన వ్యక్తిగత అనుభవాన్ని రంగరించి లోతైన అధ్యయనం చేసి రెమిడి ఇస్తూ ఉంటారు. గత 15 సంవత్సరాలుగా వైబ్రియో సేవతోపాటు స్వామి ఎల్ జుబుల్జన  సాయి సెంటర్ లో వీరికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అంతేకాక  వార్తాలేఖలను అనువాదం చేయడంద్వారా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నానని ఇతర చికిత్సా నిపుణుల అనుభవాల ద్వారా ఎంతో నేర్చుకునేందుకు అవకాశం కలిగిందని వీరు భావిస్తున్నారు.

సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి సేవాకార్యక్రమాలు మరింత వ్యాప్తి చేస్తూ పోయారు. వీరు పేషంట్లకు వైద్యం అందించే నిమిత్తం ప్రత్యేకమైన విధానమేమి అనుసరించరు కానీ వారిలో ప్రేరణ కలిగించడానికి కొన్ని ప్రత్యేకమైన సూక్తులు చెపుతూ ఉంటారు. ఉదాహరణకి ‘’ మనం ఎప్పటికీ ఉండాలనే భావనతోనే పనిచేద్దాం కానీ రేపే వెళ్ళిపోవలసి వచ్చినా సిద్ధపడే ఉందాం.’’ అంతేకాక వీరు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత  కమ్యునిజం ప్రబలంగా ఉన్న యుగోస్లేవియాలో పాఠశాల విద్య  నేర్చుకున్నారు కనుక ‘’అందరికోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ’’ అనే భావజాలం ఆమెలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది.

 ప్రాక్టీషనర్  02264 మరియు  ప్రాక్టీషనర్  00512 లు ఇచ్చిన సలహాలు, సూచనలు, అపూర్వ అనుభావల ద్వారా తనలో మార్పుకు దోహద పడినందుకు వారికి తన హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియ జేస్తున్నారు. 

పంచుకున్నకేసులవివరాలు: