Practitioner Profile 11576...India
ప్రాక్టీషనర్ 10602...భారత దేశము మానవాళికి ఎన్నో రీతులుగా సేవ చేయాలనే ఉదాత్తమైన ఆశయంతో పనిచేయలనుకొనే వారిలో ఈ ప్రాక్టీషనర్ ఒకరు. వీరు భారత సైన్యానికి చెందిన నౌకా విభాగములో వ్యూహాత్మక దళానికి సభ్యులుగా కూడా ఉన్నారు. అంకిత భావంతోను, ఆకట్టుకొనే స్వభావంతోనూ పనిచేసిన వీరు సర్వీసు నుండి పదవీ విరమణ చేసిన తరువాత తమ చదువును కొనసాగించి అమెరికాలోను మరియు భారత దేశములోను గల విశ్వవిద్యాలయాలలో పట్టాలు పుచ్చుకున్నారు. వీరికి ముఖ్యంగా వెనుకబడిన సామాజిక వర్గ ప్రజలకు సేవచేయాలనే సంకల్పము ఉండేది. ఇటీవల వీరు న్యూయార్క్ లో కార్పోరేట్ రంగంలో సామాజిక భాద్యత, మానవీయ, సామాజిక ప్రాజెక్టులపైన ప్రపంచ వ్యాప్త పెట్టుబడులు అన్న అంశము పైన ఫెలోషిప్ చేసారు. వీరు ప్రత్యమ్నాయ వైద్య పద్ధతులయన సాయి సంజీవని, ప్రకృతి వైద్యం, ప్రాణిక్ మరియు తీటా హీలింగ్, రికీ, NLP, ఆక్యుప్రెజర్, సుజోక్, హిప్నో మరియు సౌండ్ థెరపీలలో శిక్షణ పొంది తమకు దగ్గరలో ఉన్న గ్రామాలలోని ప్రజలకు నిస్వార్థ సేవలందించేవారు. 2015లో వీరు పుట్టపర్తిలో సాయివైబ్రియోనిక్స్ గురించి తెలుసుకోవడానికి నిర్ణయించుకొని నవంబర్లో AVP శిక్షణ తీసుకొని తిరిగి 2016 మే కల్లా VPగా ప్రొమోట్ అయ్యారు.
గడిచిన సంవత్సరం నుండి కేరళ లోని ఇతర వైబ్రో వైద్యులతో కలసి నెలవారీ క్యాంపుల నిర్వహణలో పాల్గొనగలగడం భగవదనుగ్రహంగా వీరు భావిస్తున్నారు. నెలకొకసారి కోచిలో జరిగే వైబ్రో సదస్సులో పాల్గొనడం కొత్త విషయాలు నేర్చుకొనడానికి, అనుభవాలు పంచుకొండానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు వీరు భావిస్తున్నారు. సేవలో భాగంగా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ ఎప్పుడయినా ఎక్కడయినా మందులివడానికి వీలుగా వెల్నెస్ కిట్ ఎప్పుడూ వీరి చెంతనే ఉంటుంది. వీరు తమ పేషంట్లు అందరినీ రెమిడిలను నీటితోనే వేసుకోవాలని అదే ఉత్తమ మైన పద్ధతి అని సూచిస్తారు. వైబ్రో రెమిడిలద్వారా మొక్కలు, జంతువులు స్వస్థత పొందడం వీరికి ఎంతో అనందం కలిగించే ఓకే కార్యక్రమము.
వీరు ఎంతోమంది మానసిక రోగులకు వైబ్రో రెమిడిల ద్వారా ఆరోగ్యం కలిగించారు. ఆందోళన, వత్తిడి, మానసిక సమస్యలకు CC15.2 Psychiatric disorders ఖచ్చితంగానూ, వేగవంతముగానూ పనిచేసే రెమిడి అని వీరి ప్రగాఢ విశ్వాసము. ఉదాహరణకు 23 సంవత్సరాల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 3 సంవత్సరాలుగా భయము, ఆందోళన, తీవ్ర మాంద్యము, ఆత్మన్యూనత, మబ్బుగా డల్ గా ఉండడం వంటి మానసిక వ్యాధితో బాధ పడుతూ అనేక ప్రమాదాలకు కూడా గురిఅవుతూ ఉండేవారు. ఈ విద్యార్ధి మానసిక వైద్యుణ్ణి సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకొనడానికి నిరాకరించినా వైబ్రో రెమిడి తీసుకొనడానికి మాత్రం అభ్యంతరం పెట్టలేదు. 2016 ఆగస్టు 5న ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic…QDS నీటితో
మూడు రోజుల తర్వాత ఈ అబ్బాయి తండ్రి తన కుమారుని ప్రవర్తనలో 25 శాతం మార్పు వచ్చినట్లు గమనించారు. వారంలోనే అబ్బాయి తన కర్తవ్యాన్ని గుర్తించి జీవితము పైన విశ్వాసము పెంచుకొని ఉద్యోగ ఇంటర్వులకు కూడా వెళ్ళడం ప్రారంభించాడు. ఇతనికి డోస్ మూడు వారాల తర్వాత OD గానూ ఏడు వారాల తర్వాత OW గానూ మరో నెల తర్వాత పూర్తిగా మానివేయడం జరిగింది. 2017 ఏప్రిల్ నాటికి అబ్బాయికి పూర్తి ఆరోగ్యం చేకూరడమే కాక కెనడాలో మంచి ఉద్యోగం సంపాదించుకొని ఆనందంతో జీవితం గడుపుతున్నాడు.
వీరు మనందరిలో ఉన్న అంతఃశక్తులకు పదునుపెట్టి అంతః చేతనానుసారము నడవడమే సరియయిన మార్గము అంటారు. రెమిడి పేషంట్లకు ఇచ్చే ముందు ప్రార్ధనతో ఇవ్వడమే కాదు తన పేషంట్లను కూడా నమ్మకముతోను ప్రార్ధనతోనూ తీసుకోవలసిందిగా సూచిస్తారు.
’’అందరినీ ప్రేమించు అందరినీ సేవించు‘’ అనే స్వామి సూక్తిని ఆచరణలో పెట్టటానికి, దివ్యభావనలను అనుభవంలోనికి తెచ్చుకొనడానికి సాయి వైబ్రియోనిక్స్ ఒక ఉత్తమ సాధనం అని వీరి అభిప్రాయము. ఈ కారణంతోనే మిగతా అన్ని ఇతర వైద్య పద్ధతులను విడనాడి సాయివైబ్రియోనిక్స్ పైనే పూర్తి ధ్యాసను లగ్నం చేసారు. ఈ వైబ్రియోనిక్స్ సేవ ద్వారా మనసు లయమయ్యి ప్రత్యేకించి ఒక వ్యక్తీ పట్లా, వస్తువు పట్లా సంఘటన పట్లా నిర్ణయం తీసుకొనే స్థాయి నుండి అంతా భగవత్ సంకల్పము వల్లనే జరుగుతుంది అనే స్థాయికి ఎదిగినట్లు వీరు ఆనందంగా వ్యక్త పరుస్తున్నారు. స్తితప్రజ్ఞత అలవడడానికి ఇదే ప్రధాన సోపానము కనుక ఇది వైబ్రియో సేవ ద్వారా సులభసాధ్యము అని వీరు వ్యక్తం చేస్తున్నారు.