Practitioner Profile 02090...India
ప్రాక్టీషనర్ 02090 భారత దేశము 2001 లో ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీవిరమణ చేసిన వీరు ఆధ్యాత్మిక సాధనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. భగవాన్ బాబా పైన ఉన్న ప్రగాఢ విశ్వాసం వల్ల అనేక సార్లు ప్రశాంతినిలయం వెళ్లివచ్చారు. అలా వెళ్లి వస్తున్న సందర్భములో ఒకసారి డాక్టర్ అగ్గర్వాల్ సార్ ద్వారా నిర్వహింపబడు 3రోజుల వైబ్రియోనిక్స్ సదస్సు లో పాల్గొనే అవకాశం వచ్చింది. వెంటనే వారు ఈ అద్బుతమైన చికిత్సా విధానానికి ఆకర్షితులయ్యారు. ఎందుకంటే గతంలో కేరళలో జరిగిన మెడికల్ క్యాంపులలో పాల్గొన్న అనుభవం వీరికి ఉంది. ఈ వైద్యవిధానం గురించి నేర్చుకోవాలనే తపనతో డాక్టర్ అగ్గర్వాల్ సార్ ను సంప్రదించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం 12 మందితో కూడిన SRHVPలో శిక్షణకు అగర్వాల్ సార్ అంగీకరించారు. వైబ్రియోనిక్స్ కు రాక పూర్వము వీరు ఇతరత్రా ప్రత్యామ్నాయ వైద్య విధానములయిన రికీ, మాగ్నెటిక్ థెరపీ, ప్రకృతి వైద్యము, ఆయుర్వేదం వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రత్యామ్నాయ వైద్య విధానంలో వీరికి MD డిగ్రీ కూడా ఉంది. కొంతకాలం వైబ్రో విధానంలో ప్రాక్టీస్ చేసిన తర్వాత సాక్షాత్తు భగవంతుడు అనుగ్రహించిన ఈ వైద్యవిధానం కంటే మరొక గొప్ప విధానం ఏదియు లేదని వీరికి అనుభవం లోనికి వచ్చింది. వంటరిగా సాధన చేసుకొనే కంటే భగవంతుడి అనుజ్ఞానుసారం వైబ్రో సేవ చేయడమే ఉత్తమం అని భావించారు. దీనిని సమర్దిస్తూ వీరు పుట్టపర్తి వెళ్ళినప్పుడు తాను పూర్తి సమయం వైబ్రియో సేవ చేయడానికిగాను అనుజ్ఞా, ఆశీర్వాదము ఇవ్వమంటు వీరు వ్రాసిన ఉత్తరాన్నిస్వామి చిరునవ్వు నవ్వుతూ గ్రహించే సరికి వీరికి కొండంత బలం వచ్చింది. అప్పటినుండి పూర్తిసమయం హృదయపూర్వకంగా ఈ సేవ కే వినియోగించసాగారు తదనుగుణంగానే పేషంట్లు కూడా భగవదానుగ్రహంతో పెద్ద సంఖ్యలో రాసాగారు.
ఇలా పేషంట్ల సంఖ్యతో బాగాపెరిగిన పరిస్థితిలోనే ఒకే రెమిడిని అనేకమందికి SRHVP ద్వారా ఇవ్వడం ఇబ్బందిగా తోచింది. కనుక వీరికి వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచనతో 10 మిల్లీమీటర్ల డ్రాపర్ సీసాలతో తరుచుగా ఉపయోగించే రెమిడిలను తయారు చేసారు. వీరు ఎన్నోరకాల వ్యాధులకు వైద్యం అందించడంలో నిమగ్నమై ఉన్నారు కనుక రానురానూ ఈ సీసాల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీనితో వీరి వడ్రంగి (కార్పెంటర్) ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న 108 CC కొమ్బో బాక్సుకు రెట్టింపు సైజులో ఉన్న చెక్క పెట్టెను తయారు చేసారు(చిత్రం చూడండి).
2008లో తన అంతరంగ ప్రభోధతో కేరళలోని ఇతర ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించాలనే ఆశయంతో సాయి హాస్పిటల్ ఇంచార్జ్ గా ఉన్నరాష్ట్ర మెడికల్ ట్రస్ట్ కన్వీనర్ను సంప్రదించారు. మొదట కొంత ప్రతిఘటించినప్పటికీ ఆ హాస్పిటల్ లో నెలవారీ వైబ్రియోనిక్స్ క్యాంపు నిర్వహించడానికి ఒప్పుకోవడం వైబ్రియోనిక్స్ విషయంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించవచ్చు.
2010లో వీరు మొట్టమొదటి AVP వర్క్ షాప్ ను కేరళలో నిర్వహించగా అదే కాలానుగుణంగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. దీని ఫలితమే ప్రస్తుతం కేరళలో 100 కు పైగా అంకితభావం గల ప్రాక్టీషనర్లు విస్తృతంగా సేవలు అందిస్తూ అద్భుత ఫలితాలు పొందుతున్నారు. ఐతే కొంత కాలం గడిచిన తర్వాత ఈ వైబ్రియో ప్రాక్టీషనర్ లు డబ్బు చెల్లించి ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో శిక్షణ తీసుకోవడానికి వెళుతున్నట్లు తెలిసింది. దీనికి కారణం ప్రాక్టీషనర్ లలో వ్యక్తిగత సాధన లోపించడమే అని భావించి పేషంట్లకు, మరియు ప్రాక్టీషనర్ లకు యోగాలో మరియు ఆరోగ్యం పై ఆధ్యాత్మికత ప్రభావం పైన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
వీరి నాయకత్వంలోనే కేరళలోని వైబ్రియోనిక్స్ టీం నివారణా మరియు చికిత్సా విధానంలో వినూత్నమైన ప్రోగ్రాంలను ఆవిష్కరింప జేసింది. ఉదాహరణకు కాసర్గడ్ జిల్లాలోని ఎండోసల్ఫాన్ బాదితుల కోసం ఒక ప్రత్యేక రెమిడి ప్యాకేజిని ఈ టీం తయారుచేసింది. వైబ్రియోనిక్స్ కు ఇంకా విస్తృతంగా సేవలందించాలనే ఉదాత్తమైన భావంతో వీరు ప్రతీ రోజు నడిచే 3 వైబ్రియో సెంటర్లను ప్రారంభించారు.వీరు కేరళ వైబ్రియో న్యూస్ లెటర్ కు కూడా 3 సంవత్సరాలు సంపాదకులుగా పనిచేసారు.
వీరు వందల సంఖ్యలో పేషంట్లకు అనేక రకాల వ్యాధులకుముఖ్యంగా సంతానలేమి, త్రాగుడు, థైరాయిడ్, కణుతులు, మూత్ర విసర్జక సమస్యలు, PCOD, ల్యుకోరియ, స్త్రీల బహిస్టు సమస్యలు, చుండ్రు, బట్టతల, పార్శ్వపునొప్పి, మొగవారి సమస్యలు, మానసిక సమస్యలు, మూలశంకలు, అలెర్జీ, ఆస్తమా, సైనసైటిస్, భుజాల బిగింపు, కీళ్ళనొప్పులు, వడదెబ్బ, కేన్సర్ ఇలా ఎన్నో వ్యాధులకు చికిత్సనందించుచున్నారు. వీరు మొక్కలపైన కూడా ఎన్నో పరిశోధనలు చేసారు. వీరు CC1.2 Plant tonic ను మొక్కలలో లేత వయసులో ఇచ్చినపుడు అది వాటి పెరుగుదలకు ఎంతో బాగా సహాయపడుతున్నట్లు, అలాగే ఒకటి లేదా రెండు వారాల లేత మొక్కలకు ఇచ్చినట్లయితే మరింతగా ఉపయోగం కనపడినట్లు వీరు కనుగొన్నారు. వృద్ధాప్యం వల్ల ఓపిక సన్నగిల్లుతున్నా సత్యసాయి సంస్థలో ఆఫీస్ బేరర్ గా బాధ్యత నిర్వహిస్తూనే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కేరళ లోని జిల్లాలన్నింటికీ సాయి వైబ్రియోనిక్స్ చేరాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా యువతను తన కుటుంబ సభ్యులను కూడా వైబ్రియోనిక్స్ లో కీలక పాత్ర నిర్వహించ వలసిందిగా ప్రోత్సహిస్తున్నారు. వైబ్రియోనిక్స్ కు వీరు చేసిన అమోఘ కృషికి అభినందనలు తెలియజేస్తూ వీరి సేవ కొత్తవారికి మార్గదర్శకం కావాలని స్వామిని ప్రార్ధిస్తున్నాము.