Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అభ్యాసకుల ప్రొఫైల్ 01339...USA


ప్రాక్టీ షనర్  01339...USA     మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా అమెరికాలోని ఒక ప్రఖ్యాత ఆరోగ్య భీమా సంస్థలో పనిచేయుచున్న ఈమె  2006 లో దాని నుండి వైదోలగింది. కారణం ఆమె పని చేయుచున్న కంపెనీ మేనేజ్ మెంట్, ఆరోగ్య భీమా సంస్థలు, ఫార్మాసుటికల్ కంపెనీలు లాభార్జన దృష్టి తో వ్యాపారం చేస్తున్నాయి కానీ పేద పేషంట్ల సంక్షేమం కోసం కృషి చేయడం లేదు. ఇది చాలా అధర్మం అని ఆమెకు తోచింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆమె చేస్తున్న పనికి  ఆమె యొక్క ఆధ్యాత్మిక జీవితమునకు పొత్తు కుదరదు అని ఆమెకు తోచింది. అంతేకాక అనారోగ్యముగా ఉన్న పేషంట్లకు సేవ చేయుటకు కంపెనీ వారు నిరాకరించడంతో ఆమె వెంటనే వైదొలగింది. అప్పటినుండి ఆమె వైబ్రియో పేషంట్ల కోసం విస్తృతంగా పనిచెయ్యడం ప్రారంభించింది. గత 10 సంవత్సరములుగా ఆమె ఉంటున్న ప్రాంతంలోని ఒక ఉచిత ధార్మిక స్వచ్చంద సంస్థ లో వాలంటీర్ గా పనిచేస్తోంది. ఇదేకాక  ఆమె తన దేశంలోనూ అంతర్జాతీయముగా కూడా కొన్ని స్వచ్చంద సంస్థలు నెలకొల్పింది.

1999 లో ఆమె మొదటిసారి భగవాన్ బాబా వారిని చూడడానికి ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు నిలయం లోని రూమ్మేట్ ద్వారా సాయి వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకున్నారు. ఒక సాయంకాలపు వేళ డాక్టర్ అగ్గర్వాల్ గారిని కలుసుకొన్నది. వారు ఆమె విబ్రియో ట్రైనింగ్ తీసుకొనడానికి అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె SRHVP కార్డులూ, విబ్రియో గోళీలు, రెమిడి సీసాలు మరెన్నో ఆశలతో సేవా లక్ష్యంతో ప్రశాంతి నిలయం విడిచి తమ ఊరు  చేరుకున్నారు. ఎక్కడయినా ఎప్పుడయినా సేవ ఉన్నదని తెలిస్తే చాలు ఆనందంగా ఆ సేవలో పాల్గొంటారు.                                               ప్రశాంతి నిలయం వచ్చిన ఈ ట్రిప్ లోనే ఆమె బాబాతో ఎన్నోసార్లు ఆంతరంగిక సంభాషణల భాగ్యం పొందారు. మొదటి ఇంటర్వూలో బాబా ఆమెకు కొత్త ఉద్యోగం ప్రసాదిస్తానని చెప్పారు. ఆమె ఆశ్చర్యంతో స్వామీ 3 నెలల క్రితమే నేను కొత్త జాబ్ లో జాయినయ్యాను కదా అన్నారు. అప్పుడు స్వామి నాకు తెలుసు కానీ నేనిచ్చే జాబ్  నీకు ఎంతో సేవా భాగ్యాన్ని సంతృప్తిని అందిస్తుంది అని చెప్పారు. ఆ మాటలు అక్షరాలా నిజమయ్యాయి. 2009, ఈమె ఆశ్రమానికి వచ్చి అగ్గర్వాల్ సార్ను కలిశారు. బాబా వారి ద్వారా ఆశీస్సులు పొందిన 108CC బాక్స్ గురించి తెలపగానే ఆమె దానిని ఉపయోగించడంలో ట్రైనింగ్  తీసుకున్నారు. శిక్షణ ముగించుకొని కోమ్బో బాక్స్ తో ఇంటికి చేరారు.

కొన్ని నెలల తర్వాత అమెరికాలో జరిగిన రిట్రీట్ కు హాజరయ్యారు. అక్కడ జరిగిన మెడికల్ క్యాంప్ లో వైబ్రియోనిక్స్ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యం తో అందులో పాల్గొన్నారు.ఆశ్చర్యకరంగా మొదటి రోజు ఆమె 25 మంది పేషంట్లకు వైద్యం చేసారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాగా మారిపోయింది. ఆమె వద్ద పేషంట్లకు ఇవ్వడానికి సరిపడా రెమెడీ బాటిల్స్ లేవు. 9 మాత్రమే ఉన్నాయి. ఇంటికి వెళ్లి తెచ్చుకొనే పరిస్థితి లేదు. స్వామిని ప్రార్ధించి క్యాంప్ లో కూర్చుని వైద్యం ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు పేషంట్లు వస్తూనే ఉన్నారు. క్యాంప్ పూర్తి అయ్యే సమయానికి ఆమె 29 మంది పేషంట్లకు వైద్యం చేసారు. అందరికీ రెమిడి బాటిల్స్ సరిపోయాయి. 9 ఆమె తెచ్చుకున్నవి. 20 బాబా సృష్టించినవి ఎంత ఆశ్చర్యం?  ఆ విధంగా రెండు రోజులలో ఆమె 54 మంది పేషంట్లను, బాబావారి లీలనూ  చూసారు.  బాబా వైబ్రియోనిక్స్ పట్ల ఎంత మక్కువ తో ఉన్నారో అర్ధ మై మరింత ప్రేమతో, నమ్మకం తో పేషంట్లకు సేవలందించే బాబా వారి ఉపకరణం గా మారారు. వైబ్రియోనిక్స్ ను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఎంతో మంది ఆమె వద్దకు వైద్యం కోసం రాసాగారు. పేషంట్ల పట్ల ఆమె చూపే వాత్సల్య, ప్రేమాభిమానాలకు, పిల్లల వైద్య నిపుణులయిన ఆమె భర్త ముగ్ధులై తన పంధాను కూడా మార్చు కున్నారు.

ఆమె ఉండే ప్రాంతము జనాభా శాతం తక్కువగానూ, దూర దూరంగానూ ఉండే ప్రాంతం కనుక ఆమె తన ప్రాక్టీస్ కోసం ఎక్కువగా  ఫోన్లు, ఈ మెఇల్, స్కైప్ పైన ఆధార పడ్డారు. ఆమె ద్వారా వ్యాది నివృత్తి పొందిన పేషంట్లు వారి అనందాన్ని కుటుంబీకులకు, స్నేహితులకు, పంచడంతో కొత్త పేషంట్లకు కొదవ ఉండేది కాదు.

ఈ ప్రాక్టీషనర్ ప్రశాంతి నిలయం సందర్శించినప్పుడల్లా డాక్టర్ అగ్గర్వాల్ గారు కంప్యూటర్ వద్ద ఎంతో సమయం వెచ్చిస్తూ  వివిధ ప్రాంతాలు నుండి వచ్చిన ఈమెయిల్ లకు సమాధానం పంపడం, ఒకేప్రశ్నకు అనేకసార్లు  అనేకమందికి సమాధానం పంపడం ఇదంతా కష్టంతో కూడుకున్న, సమయాన్ని హరించే విధానము అని భావించి ‘సార్ మీరు ఈ వెబ్సైటు ను అప్డేట్ చేసి పదే పదే అడిగే ప్రశ్నలకు సమాధానాలు, కొంగ్రొత్త పోకడలు, ప్రాక్టీషనర్ లకు సూచనలు ఇవన్నీ చేర్చడం వల్ల మీకు సమయం కలసి వస్తుంది, ఎంతో మంది ప్రాక్టీషనర్ లకు ఉపయుక్తంగా కూడా ఉంటుంది అని చెప్పారు. వెంటనే అగ్గర్వాల్ సార్ బాగుంది అదేదో నీవే చేయరాదా అన్నారుట. నేనా నాకసలు కంప్యూ టర్ పరిజ్ఞానమే లేదు అని ఈమె చెప్పారట. వెంటనే అగ్గర్వాల్ సార్ లేదు లేదు నీవు చేయగలవు స్వామి నీకు సహాయ పడతారు అన్నారట. ఆ విధంగా స్వామి పంపిన సాఫ్ట్ వేర్ నిపుణుల సహాయంతో 2009 గురుపూర్ణిమ నాటికీ  www.vibrionics.org ను ప్రారంభించడం జరిగింది. ఆమె టేబుల్ పైన ఇప్పటికీ ఒక స్వామి సూక్తి రాసి ఉంటుంది ²ఎంత పెద్ద పని ఐనా ఫరవాలేదు నీవు చేయగలవు స్వామి నీకు ఎల్లవేళలా సహాయ పడతారు” (2007 మార్చ్ సత్యసాయి స్పీచ్ ).

వైబ్రియోనిక్స్ తన సేవా పరిధి ని విస్తృత పరుస్తూ ప్రాక్టీషనర్ లతో మరింత వేగవంతంగా సమాచార సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోసాగింది. ఆ విధంగా జూలై 2010 నాటికీ ఈ ప్రాక్టీషనర్ డాక్టర్ అగ్గర్వాల్ సార్ తో కలసి ఒక క్రొత్త ప్రాజెక్ట్ ‘‘ సాయి వై బ్రియోనిక్స్ వార్తా లేఖలు’’ప్రారంభించి రెండు నెలలలోనే మొదటిసారిగా వార్తా లేఖను రూపొందించి 2010 సెప్టెంబర్ 17 న డాక్టర్ అగ్గర్వాల్ గారిచే స్వామికి బహూకరించబడింది .స్వామి ప్రతీ పేజీని నిశితంగా పరిశీలించి ఆశీస్సులు అందించి ఆ లేఖను తమ వద్దే ఉంచుకున్నారు. ఇప్పుడు వార్తా లేఖ అనేది అనేకమంది కార్యకర్తలు, ప్రాక్టీషనర్ లు, అనువాదకులు, లేఖకులు, సమీక్షకుల సేవకు, ప్రేమకు గీటురాయి. ఇది వైబ్రియోనిక్స్ కుటుంబ సభ్యులను ఒక్క తాటి మీదకు తెచ్చి తమ భావాలూ అనుభవాలు, ప్రశ్నోత్తరాలు, రోగ చరిత్రలూ, ప్రాక్టీషనర్ల  ప్రేరణ కలిగించే ఆంతరంగిక సమీక్షలు, అన్నింటి సమాహారంగా విశ్వ వ్యాప్తమయ్యింది.

అమెరికాలోని హార్ట్ ఫోర్డ్ CT లో  22 మందితో మొదటి వర్క్ షాప్ 2012 అక్టోబర్ లో ఈ ప్రాక్టీషనర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యింది. డాక్టర్ అగ్గర్వాల్ మరియు శ్రీమతి అగ్గర్వాల్ ట్రైనీలుగా వ్యవహరించారు. ఈ వర్క్ షాప్ అనంతరం ఈమె అమెరికా, కెనడా దేశాలకు ట్రైనర్ మరియు కోఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. 2013 నుండి ఈమె ఎంపిక ఐన విద్యార్ధులకు ఈ-కోర్స్ నిర్వహించడం, 3 రోజుల AVP వర్క్ షాప్ నిర్వహించడం వంటివి ఇతర టెక్నిషియన్లు,వాలంటీర్లు  సహాయంతో నిర్వహిస్తున్నారు. నెలకొకసారి ప్రాక్టీ షనర్ల ఉపయోగార్ధము సంబంధిత అంశాల పైన కాన్ఫెరెన్స్ లు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈమె ఇతర సీనియర్ ప్రాక్టీషనర్ ల సహాయంతో హాస్పిటల్లో ఉండి విబ్రో సేవలు అందుకోలేని పేషంట్ల నిమిత్తం  AVPలు/VP లకు ఉప యోగకరంగా ఉండే విధంగా 2016 గురు పూర్ణిమ రోజున ప్రసార మాధ్యమాన్ని ప్రారంభించారు.

1999 లో స్వామి చెప్పిన రీతిగా వైబ్రియోనిక్స్ సేవ ఈమెకు అపరిమితముగా ఆనందాన్ని అందిస్తోంది. ఆధ్యాత్మికత లో కూడా ఆమెలో ఎంతో పరివర్తన వచ్చింది. “ నా హృదయం  వైబ్రియోనిక్స్ ద్వారా విద్యార్ధులకు, రోగులకు, సేవలందించుట  ద్వారా దయ ప్రేమ కరుణ లతో నిండిపోయింది. ఎవరు బాధ పడుతూ ఉన్నా, వైబ్రియోనిక్స్ సేవల కోసం ఎవరు ఎదురు చూస్తున్నా వారిపట్ల నాకు తెలియకుండానే ఒక ప్రేమ ప్రవాహం ప్రసరిస్తోంది. నన్నుఈ విధంగా మార్చి ఒక ఉత్తమమైన ఉపకరణం గా మార్చుకున్నందుకు స్వామికి ఎంతో కృతజ్ఞురాలిని ’’ అంటున్నారీమె. నిజంగా ఇది హృదయాన్ని తాకే గాధ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.