Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చికిత్సా నిపుణులు 11993...India


చికిత్సా నిపుణులు 11993…India, కేరళ రాష్ట్ర ప్రభుత్వం క్రింద కస్టమ్స్ మరియు ఎక్సయిజ్ విభాగంలో ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్న వీరు అనుభవం మరియు ప్రవీణత గల ఒక చికిత్సా నిపుణులు. పరోపకారియైన వీరు త్రివేండ్రంలో ఒక దేవాలయం వెలుపల 12 సంవత్సరాల పాటు ప్రతి రోజు సుమారు 200 పేద ప్రజలకు అన్నదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

2001లో వీరికి పేదరికం నిండియున్న కాసర్గోడ్ ప్రాంతానికి బదిలీ చేయబడింది. ఆపై మూడు సంవత్సరాలు తర్వాత ఈ చికిత్సా నిపుణుల తల్లిగారికి అంతిమ దశలో ఉన్న పెద్దప్రేగు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారణ చేయబడింది మరియు ఆమె కొన్ని రోజులు కంటే ఎక్కువ జీవించడం అసాధ్యమని వైద్యులు చెప్పడం జరిగింది. తల్లిగారి కోరికను అనుసరించి వీరు ఆమెను ఇంటికి తిరిగి తీసుకు రావడం మరియు ఆమెకు రేకి మరియు ప్రకృతివైద్యం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను చేయడానికి ప్రయత్నించారు. ఆమె మరో మూడు నెలలు జీవించి ఆపై ప్రశాంతంగా మరణించారు. ఈ అనుభవం ద్వారా, క్యాన్సర్ వంటి తీవ్ర జబ్బులతో బాధపడుతున్నవారికి సహాయపడాలన్న ఒక బలమైన కోరిక వీరిలో కలిగింది. వీరు ప్రకృతివైద్యం మరియు రేకి మాత్రమే కాకుండా ప్రాణ చికిత్స, ఆక్యుప్రెషర్, సు-జోక్ చికిత్స, హిమాలయ మరియు టిబెటన్ సింగింగ్ బౌల్స్ ను ఉపయోగించిన సౌండ్ థెరపీ(చికిత్స)వంటి వివిధ ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలలో శిక్షణ పొందారు. హిప్నోథెరపి, కౌన్సెలింగ్ మరియు సైకో-న్యూరోబిక్స్ వంటి ప్రసిద్ధమైన విద్యాసంస్థల్లో శిక్షణ పొంది ఉత్తీర్ణులయ్యారు.

పురుగులమందు ఎండోసల్ఫాన్ ను  గాలిలో చల్లడం (ఏరియల్ స్ప్రే) కారణంగా నీరు కలుషితమై, కాసర్గోడ్ జిల్లాలో వందల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. మానసిక మరియు శారీరిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలను చూసిన వీరు ఎంతో బాధపడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రజలకు చికిత్సను ఇవ్వాలని ఆశించిన వీరు, తాను నేర్చుకున్న ప్రాతామ్నాయ చికిత్సలన్నీ వ్యాధులను నయంచేయడానికి అధిక సమయం తీసుకోవడంతో, ఒక సరళమైన పరిష్కారం కోసం వీరు స్వామిని ప్రార్థించారు. వెంటనే ఈ చికిత్సా నిపుణులు యొక్క రేకి గురువు మరియు వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణులు వైబ్రియానిక్స్ యొక్క సామర్ధ్యం గురించి వీరికి చెప్పడం జరిగింది. వైబ్రియానిక్స్ చికిత్సా విధానంలో శిక్షణ పొందాలనే తీవ్ర ఆకాంక్ష వీరిలో కలిగింది గాని ఎంపిక పరిమాణాలు వీరికి అనుకూలముగా లేవని తెలుసుకొని వీరు స్వామిని సహాయం కోసం ప్రార్థించారు. ఒక రోజు ఉదయం వీరికి  స్వప్నంలో స్పష్టంగా స్వామి మరియు స్వామి చుట్టూ దేవతలు మరియు ఋషులు దర్శనమిచ్చారు. మరుసటి రోజు కాసర్గోడ్ సాయి సెంటర్ అందించే ప్రథమ స్థాయి వైబ్రియానిక్స్ శిక్షణలో పాల్గొనే అవకాశం వచ్చింది. వీరు మరియు వీరి యొక్క భార్య విజయవంతంగా ఈ శిక్షణను పూర్తి చేయడం జరిగింది.

సంపూర్ణ అర్పణా భావం కలిగిన ఈ జంట ఇతర చికిత్సా నిపుణులతో కలిసి గిరిజన ప్రాంతాల్లో వైబ్రో చికిత్సను అందించారు. సోరియాసిస్, ఎలెర్జీలు, ఆస్తమా, కంటి సమస్యలు, శారీరిక మరియు మానసిక రుగ్మతలు, అభ్యాసన సమస్యలు మరియు గర్భస్రావాలు వంటి సమస్యలకు ఈ బృందం చికిత్సను అందించడం జరిగింది. స్వామి కృపతో అనేక మందికి అద్భుతమైన రీతిలో వ్యాధులు నయమవ్వడం జరిగింది. 2013 నుండి కాసర్గోడ్ ఆశపత్రికి చెందిన పెయిన్ మరియు పాలియేటివ్ విభాగంచే సూచించబడే అనేక రోగులకు విజయవంతంగా చికిత్సను అందిస్తూ వస్తున్నారు. వీరు పొందుతున్న సఫలితాలను గమనించిన ఈ విభాగాలు తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైబ్రియానిక్స్ చికిత్సను అందించి అమోఘమైన సఫలితాలను పొందుతున్నారు. ఈ చికిత్సా నిపుణులు ఇంత వరకు పది వేలకు పైగా  రోగులకు విజయవంతంగా చికిత్సను అందించారు.

దీనితో పాటు వ్యవసాయదారులు మరియు పాడి మరియు కోళ్ళు (పౌల్ట్రీ) పెంచుకొనే రైతులలో వైబ్రియానిక్స్ పై అవగాహన కలిగించిన ప్రథమ చికిత్సా నిపుణులుగా నిలిచారు. దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు ప్రసిద్ధ సినిమా నటుల మద్దత్తుతో  వ్యవసాయం మరియు పశుపాలన లో విజయవంతమైన ఫలితాలతో కూడిన అనేక ప్రణాళికలు నిర్వహించారు. ఈ ప్రణాళికల ద్వారా విజయవంతముగా సేంద్రుయ పంటలు మరియు సేంద్రీయ పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా ఒక రకమైన మరుగుజ్జు ఆవులలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం జరిగింది. వ్యవసాయ విభాగంలో వైబ్రియానిక్స్ చికిత్స పై పెరుగుతున్న అవగాహన, కాసర్గోడ్లో భారతీయ ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ట్యూబేర్ క్రోఫ్స్ రీసెర్చ్ యూనిట్ వారిని ఆకర్షించింది. వైబ్రియానిక్స్ ద్వారా ఉత్పాదన పెరిగిన కారణంగా వారు ఈ చికిత్సా నిపుణులు అందిస్తున్న వైబ్రియానిక్స్ సేవ పై గొప్ప ఆశక్తి చూపించి, కేరళలో ఇతర జిల్లాలలో ఉన్న పొలాల్లో ఈ చికిత్సా విధానాన్ని ప్రారంభించారు.  

పశువుల పరిశ్రమలో రైతులు పశువులకు కలిగే పాదాల సమస్యలు, పొదుగు వాపు మరియు విరోచనాలు వంటి వ్యాధి సమస్యలకు వైబ్రో చికిత్స ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. అనేక పశు వైద్యులు మరియు పశువుల అధికారులు వైబ్రో చికిత్స ద్వారా విజయవంతమైన ఫలితాలను పొందారు. ఒక కోళ్ళ ఫారమ్ కి యజమానియైన ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయుడు, వైబ్రో చికిత్స ద్వారా అనేక విజయవంతమైన ఫలితాలు లభించినట్లుగా తెలిపారు. తన ఫారమ్ లో ఉన్న కోళ్లు అధిక సంఖ్యల్లో మరణించిన తర్వాత ఇతను వైబ్రో చికిత్సను ప్రారంభించారు. వైబ్రో మందులను క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా గుడ్ల ఉత్పత్తి పెరిగిందని ఇతను తెలుపుతున్నారు.

ఇటీవల ఈ చికిత్సా నిపుణులు కాసర్గోడ్ తో పాటు మరో రెండు స్థానాల్లో వైబ్రో సాధనను ప్రారంభించారు. అంతేకాకుండా వీరు క్రమం తప్పకుండా పాఠశాలలు, అనాధ శరణాలయాలు మరియు వృద్ధాశ్రమాలలో ఈ సేవను అందిస్తున్నారు. ముఖ్యంగా వామతంత్రము (బ్లేక్ మాజిక్), శాపాలు భాదితులకు ఈ చికిత్స ద్వారా అద్భుతమైన ఫలితాలు లభించాయని వీరు తెలుపుతున్నారు. కుటుంభంలో విబేధాలు అధికంగా ఉన్న సమయాల్లో శాంతికి సంబంధించిన నివారణ మందులను ఇళ్లల్లో చల్లినప్పుడు తరచుగా సమస్యలు పరిష్కరించబడిన సందర్భాలు ఉన్నాయని  వీరు తెలుపుతున్నారు. అమితమైన పరిమితి గల ఈ మహత్తరమైన చికిత్సను మరింత పెద్ద స్థాయిలో ఉదాహరణకు మత ఉద్రిక్తత, సంఘర్షణ మరియు అల్లర్లు  అధికంగా ఉన్న కాసర్గోడ్ వంటి ప్రాంతాలలో ఉపయోగించాలని వీరు అనుకుంటున్నారు.

అనంతమైన విశ్వాసం, నమ్రత మరియు అనంత సృజనాత్మకత పురోగతికి ప్రధానమైనవి. భగవంతుడు చేతిలో అంకిత భావంతో కూడిన ఒక  ఉత్తమ సాధనంగా జీవించడం మరియు స్వచ్ఛమైన భక్తితో ప్రతి ఒక జీవిలోను దైవాన్ని దర్శిస్తూ వారికి సేవను అందించడం సర్వశ్రేష్టమని వీరు భావిస్తున్నారు. వీటి ద్వారా చికిత్స పరిపూర్ణమై అద్భుతమైన ఫలితాలకు దారి తీస్తుందని వీరు పూర్తిగా నమ్ముతున్నారు. క్రెడిట్ మనమే తీసుకోకుండా నిజమైన క్రెడిట్ మరియు గౌరవం అసలైన నివారణ కర్తయైన భగవంతుడికి ఇవ్వడం ద్వారా అనుగ్రహం మరింతగా లభిస్తుంది. సాయి వైబ్రియానిక్స్ సాధన ద్వారా తనకు అత్యంత ప్రియమైన సాయి బాబాకు సేవ చేసే అవకాశం ప్రసాదించబడినందుకు వీరు తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నారు. "స్వామీ పై నాకున్న అనంతమైన కృతజ్ఞతా భావాన్ని తెలపడానికి నా పూర్తి జీవితకాలం సరిపోదు" అని వీరు చెబుతున్నారు.

 పంచుకుంటున్న రోగ చరిత్రలు