చికిత్సా నిపుణుల వివరాలు 01228...Slovenia
ప్రాక్టీషనర్ 01228…స్లోవేనియా సీనియర్ వైద్యనిపుణులైన వీరి వైబ్రియోనిక్స్ ప్రస్థానం 1996లో తన వ్యక్తిగత అనుభవం అనంతరం ప్రారంభమయ్యింది. వైబ్రియోనిక్స్ పట్ల వీరికెంతో ఆదరణ కలిగి తన స్లోవేనియా దేశం వెళ్ళిన తర్వాత ఎంతో సేవ చేసారు.(వివరాల కోసం సాయి వైబ్రియోనిక్స్ అంతర్జాతీయ కాన్ఫెరెన్స్ 2014 పుస్తకం 73 -78 పేజీలు చూడండి) చిన్నప్పటినుండి ఈమె జీవితం అనారోగ్యముతోనూ అనేక దుర్ఘటనలుతోనూ ప్రారంభమయ్యింది. రెండు కారుప్రమాదాలు, పక్కటెముకలు విరిగిపోవడం, వెన్నుముక శోధము(స్పోండ్ లైటిస్) అపస్మారక స్థితి, ఎన్నో ఆపరేషన్లు, డిప్రెషన్, చికెన్గున్యా, చిన్నప్పటినుండి దగ్గర చూపు లోపించడం ఇలాంటివి ఎన్నింటితోనో ఆమె సతమతమవుతూ ఉండేది. 2002 -04 మధ్య 14 నెలలు ఆమె హాస్పిటల్లోనే ఉండవలసి వచ్చినపుడు చాల స్ట్రాంగ్ అల్లోపతిక్ మందులు తీసుకోవలసి వచ్చింది. డాక్టర్లు ఆమె తిరిగి కోలుకోవడం కష్టమని కూడా అన్నారు. స్లోవేనియా మెడికల్ బోర్డు వారు ఆమెకు 30% వైకల్యము ఉన్నట్లు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆ సమయంలో అనువాదకురాలుగానూ ఉంటున్నఈమె తన వృత్తిని కూడా వదిలి పెట్టవలసి వచ్చింది. కారణం ఏమిటంటే ఆమె శరీరం 5% మాత్రమే పనిచేయడానికి సహకరిస్తోంది.
ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్న ఆమె జీవితములో వెలుగు రేఖలు ఉదయించాయి. ఆమె అనుభవించిన కష్టాలు వృధాగా పోలేదు. నెలల తరబడి హాస్పిటల్లో నిస్సహాయురాలుగా ఉన్న ఆమె జీవితములో బాబా ప్రవేశించి ఆమెను ప్రశాంతినిలయం మరలించారు. ఆమె మాటల్లోనే “ నేనున్న పరిస్థితిలో స్వామీయే నాకు దిక్కు. వారి అనుగ్రహంతో ఇండియా చేరాను. 6 నెలలు ప్రశాంతినిలయంలో గడుపుదామని బయలుదేరినపుడు నా సూట్కేస్ లో సగం అల్లోపతిక్ మందులతోనే నిండినది. ఈ మధ్య కాలంలోనే నేను వాడిన ఒక పెద్దసూట్ కేస్కు సమానమైన మందులు నాలో చాలా సైడ్ ఎఫెక్ట్ కలిగిస్తున్నాయి. నాకు వేరే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను గురించి ఆలోచించే ఓపిక లేదు. నమ్మశక్యం కాని అద్భుతమైన లీల ఏమిటంటే ఇండియాలో నేను వాడే మందులు దొరకవని వత్తిడి చేసిన మా డాక్టర్ సలహా మేరకు అన్నిరకాల మందులు తెచ్చుకున్నప్పటికీ పుట్టపర్తిలో నా రూములో సూట్ కేస్ తెరిచి చూసేసరికి మందులన్నీ మాయమైపోయి ఉన్నాయి. ఇకనుండి అల్లోపతి మందులు జోలికి పోకుండా వైబ్రియో రెమిడిల వంటి ప్రత్యామ్నాయ మందులు మాత్రమే వాడమని అది స్వామి నాకు ఇచ్చిన సూచనగా భావించాను”.
ఆమె ఎన్నోరకాల ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు ప్రయత్నించారు కానీ అన్నింటికన్నా వైబ్రియోనిక్స్ అద్భుతంగా పనిచేస్తున్నట్లు అనుభవమయ్యింది. వైబ్రియో మందులు ప్రయత్నించిన 4 సంవత్సరాలలో దృష్టిలో 60% వృద్ధి కనిపించింది. మిగతా శారీరక సమస్యలలో 80% మెరుగుదల కనిపించింది. ఆమె తనకు వ్యాధి నివారణ ఐనందుకు ఎంతో ఆనందించి ఇక తన జీవితాన్ని తనలా వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారి సహాయం కోసం అందించాలని నిర్ణయించుకున్నారు.
ప్రాక్టీషనర్ గా ఆమెకుఉన్న14 సంవత్సరాలు అనుభవంతో వైబ్రియో మెడికల్ క్యాంపులను సొంతంగా నిర్వహించే అనుభవం సంపాదించారు. ఆమె తన భర్తతోకలసి 90 క్యాంపులలో 20,000 మంది పేషంట్లను చూడడం జరిగింది. అలా నిర్వహించిన క్యాంపులలో కొన్ని అతి సుదూర హిమాలయ ప్రాంతాలలోని గ్రామాలు కూడా ఉన్నాయి. ప్రారంభంలో ఆమె ఒక సమగ్రమైన నోట్స్ వ్యక్తిగతమైన రెమిడిలను తయారుచేసేవారు. త్వరలోనే ఆమె పేషంట్లను అందరినీ చూడడానికిగాను తగినంత సమయం ఉండడం లేదని నోట్స్ తయారు చేయడం మానివేసి ముందు రోజే 108 CC బాక్స్ లోని బాటిల్లను సరి చూసుకొని తక్కువగా ఉన్నవాటిని నింపుకొని ఎక్కువగా వాడబడే 3 రెమిడి సమ్మేళనాలను తయారు చేసుకొని క్యాంపుకు వెళ్ళేవారు.
వంటినొప్పులకు :
CC3.1 Heart tonic + CC10.1 Emergencies + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures + CC12.1 Adult tonic ఇది అవసరాన్ని బట్టి పెద్దవారికి ఇవ్వబడేది
జలుబు/ఫ్లూ వంటి వాటికి:
CC9.1 Recuperation + CC9.2 Infections acute + CC19.1 Chest tonic + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic
విద్యార్ధులకు:
a. CC12.2 చిన్నపిల్లలకు మరియు b. CC17.3 Brain & Memory tonic పెద్ద పిల్లలకు
ప్రాక్టీషనర్ కు పిల్లలతో కలసి పనిచేయడం చాలా ఇష్టం. వీరు ఇలా వ్రాస్తున్నారు “ పిల్లలకు వారి లేత వయసులోనే సమర్దవంతమైన, ఎటువంటి దుష్ప్రభావాలు లేని వైబ్రియోనిక్స్ రెమిడిలను ఇవ్వడం మంచిదని నా ధృడమైన విశ్వాసము. వారు ఇంకనూ ఏ వైద్య విధానానికి బహిర్గతమై ఉండరు కనుక వారు ఈ వైద్య విధానము యొక్క అద్భుత ఫలితాలను జీవితాంతము గుర్తుంచుకొని తమ కుటుంబ సభ్యులకు ఇతరులకు వ్యాపింపజేస్తారు. అందుకోసం వారి వారి పాఠశాలలలో తరుచుగా వైబ్రో మెడికల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా ఈ అద్భుత విధానము పట్ల వారి విశ్వాసము మరింత పెంపొందింపజేయబడుతుంది.
ఒక ముఖ్యమైన సంఘటనను ఇలా తెలియజేస్తున్నారు. “జూన్ 2015 నెలాఖరులో నేను వేదం నేర్పే పాఠశాలలో ఒక పిల్లవాడు డెంగ్యు జ్వరం వల్ల మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేను వెంటనే ఏదో ఒకటి చేసి ముఖ్యంగా చిన్నారులలో ఈ ప్రాణాంతకమైన వ్యాధి వ్యాపించకుండా అరికట్టాలని భావించాను.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏదైనా నివారణ మందు ఇచ్చి ఈ వ్యాధి ఇతర పిల్లలకు వ్యాపించకుండా అరికట్టవచ్చా అని అడిగారు. చాలామంది అప్పటికే జ్వరము, ఫ్లూ, జలుబు వంటి వాతావరణ మార్పుకు సంబధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. ఇటువంటి సేవ కోసమే ఎదురు చూస్తున్న నేను వెంటనే కార్యరంగంలోనికి ప్రవేశించాను. ఎందుకంటే ఆరేళ్ళ క్రితం నేను ఈ వ్యాధి తోనే ఎంతో బాధననుభవించాను. అల్లోపతిమందుల వల్ల చికెన్గున్యా, డెంగ్యు తగ్గవచ్చేమో కానీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో అవి తిరిగి తలెత్తే అవకాశము ఉంది. గత సంవత్సరం ఐదుగురు పేషంట్లకు డెంగ్యు జ్వరమును నివారణ చేసిన అనుభవాలను పురస్కరించుకొని వైబ్రియోనిక్స్ ఈ వ్యాధికి దివ్య సంజీవని అని భావించి నా భర్తతో కలసి రెండు సెట్ల నివారణామందులను (ప్రివెంటివ్ )తయారు చేశాను. కొంచం చిన్న వయసు గల పిల్లలకు వారి ఉపాధ్యాయుల ద్వారా క్రింది రెమిడి ఇప్పించాను:
#1. CC3.2 Bleeding disorders + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies + CC12.1 Immunity + CC12.2 Child tonic + CC20.4 Muscles & Supportive tissue + CC21.4 Stings & Bites + Potentised Gold & Ruby 30C + Potentised Amethyst & Platinum 30C…BD
పిల్లలు ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు మరియు తిరిగి వెళ్లేముందు రెమిడి తీసుకొనేవారు. బాటిల్స్ ను వారి ఇంటికి మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే ఈ షుగర్ గోళీలను మిఠాయి గా భావించి తినేస్తారేమోననే భయంతో.
పెద్ద పిల్లలకు సొంతంగా బాటిల్స్ ఇవ్వబడ్డాయి (వారికి వైబ్రో మందులు తీసుకోవడం అలవాటేనని).
#2. CC 3.2 Bleeding disorders + CC 9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies + CC12.1 Immunity + CC12.4 Autoimmune diseases + CC17.3 Brain & Memory tonic + CC20.4 Muscles & Supportive tissue + CC21.4 Stings & Bites + Potentised Gold & Ruby 30C + Potentised Amethyst & Platinum 30C…BD
ఇంకా దోమకాటుకు సరియైన చికిత్సపైన విద్యార్ధులకు అవగాహన కలిగించుటకు ప్రత్యేక ప్రయత్నంకూడా వీరు చేసారు. దోమకాటులన్నీ ప్రాణాంతకమైనవి కావు. దోమకాటు వల్ల శరీరం ఎర్రబడినా, దురద ఉన్నా, వాపు ఉన్నా అటువంటి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. గర్భవతులైన వారు 4 నుండి 7 రోజులు వైబ్రోరెమిడిలను నివారణ డోస్ గా తీసుకుంటే సరిపోతుంది. 800 పైగా విద్యార్ధులు మరియు పెద్దవారు డెంగ్యు జ్వరానికి మరియు ఇతర వ్యాధికారక లక్షణాలకు నివారణ డోసులు తీసుకున్నారు. ప్రతీ పాఠశాలలోనూ ఉన్న ఉపాధ్యాయులకు ఎవరైన విద్యార్ధికి డెంగ్యు వ్యాధి లేదా ఇతర అంటు వ్యాధి సోకినట్లుంటే వెంటనే తెలియపరచవలసిందిగా సూచించారు. తమ వద్ద వివిధరకాల వ్యాధులకు మంచి మందులున్నవని ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ గావించిన వెంటనే వాడితే తొందరగా నివారణ ఔతుందని వారికి నమ్మకం కలిగించారు.
2009నుండి బాబా వారి పుట్టిన రోజు సందర్భంగా 3 రోజుల వైబ్రో క్యాంప్ ను ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్లో ప్రతీ సంవత్సరం నిర్వహిస్తూ గత 7 సంవత్సరాల నుండి సుమారుగా 850 మంది పేషంట్లకు వైద్యం అందించారు. వై బ్రియోనిక్స్ వీరి జీవితంలో ఎంత అంతర్భాగం అయ్యిందంటే సమాజములోని అందరినీ అనగా ఆశ్రమం బయట ఉండే పువ్వులు అమ్ముకునే మహిళలు, భిక్షగాళ్ళు, ఇలా ఎందరో తమకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే “సంప్రదించాల్సిన వ్యక్తి” గా ఐపోయారు. దీనికంతటికీ కారణం స్వామి ప్రేమను క్రియా రూపంలో చూపడం ద్వారా నిస్సహాయులకు సహాయం చేయడం ద్వారా, స్వామి అనంత ప్రేమకు వాహకంగా పనిచేసినందుకు లభించిన ఆనందం అని భావిస్తున్నారు.
తన వ్యక్తిగత అనుభవము, మెడికల్ క్యాంపులలో వేలాది మందికి వ్యాధి నివారణ అనుభవముతో వైబ్రియోనిక్స్ రెమిడిలతో తగ్గని వ్యాధి అంటూ ఏదీ లేదనే నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా వైబ్రో మెడికల్ క్యాంపులు నిరుపేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడానికి ఒక చక్కని వేదికగా వీరు భావిస్తున్నారు. జన బాహుళ్యము ఉన్న ప్రతీ చోటా ఒక వైబ్రియో ప్రధమ చికిత్స పెట్టె ఉండాలనే వీరి ఆశయం స్వామి ప్రేమకు పరాకాష్టగా వీరి ఉదాత్త స్వభావమునకు నిదర్శనంగా భావించవచ్చు.