ప్రాక్టీ షనర్ల వివరాలు 11648...India
ప్రాక్టీ షనర్ 11648...ఇండియా ఈమె సైన్స్ గ్రాడ్యుయేట్ మరియు మానవ వనరుల శాఖలో MBA చేసారు. ఆమె 2008 నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో HR ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారు. క్రీడలు, దేవాలయాలు సందర్శించడం, స్తోత్రాలు
పఠించడం, వంటి వాటిపట్ల అభిరుచి కలిగిన వీరు బాహ్య దృష్టి కలిగిన చురుకైన వ్యక్తి మరియు అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు.
భక్తుల కుటుంబంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నారు, ఆమె తల్లి అమితమైన సాయి భక్తురాలు. తల్లిదండ్రుల నుండి సాధారణ మరియు సాత్విక జీవన శైలి ప్రభావంతో పెరిగిన వీరు ఎల్లప్పుడూ దేవునికి ఎంతో సన్నిహితంగా ముఖ్యంగా శ్రీరాముని రూపానికి ఎంతో ఆకర్షితురాలుగా ఉండేవారు. ఆమె ఒక భక్త కుటుంబంలో జన్మించడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. 2022 లో వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తర్వాత “సాయి” రాముని భౌతిక రూపాన్ని చూడనందుకు పశ్చాత్తాపం పొందారు. అయితే తన జీవిత కాలంలో తనకు స్వామి భౌతిక దర్శనం తప్పక చేసుకో గలుగుతాననే గట్టి విశ్వాసంతో ఉన్నారు.
ప్రాక్టీషనర్ 20 సంవత్సరాల వయసులో ఆమె తల్లితో కలిసి వారాంతపు భజనలకు హాజరవుతూ ఉండేవారు. అంతేకాక దుస్తులు మరియు ఆహార పంపిణీ, అనాధాశ్రమాల్లో పిల్లలతో గడపడం, వృద్ధాశ్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఆమె తన 30 సంవత్సరాల వయసులో బాగా స్థిరపడాలని తద్వారా ప్రతీ రోజు సేవను కొనసాగించాలని భావించారు. కాలేజీలో బయోటెక్నాలజీ చదివడం వలన మరియు ఆమె తండ్రి హోమియోపతి డాక్టర్ గా ఉండడం వలన మానవ శరీరం గురించి మరింత తెలుసుకోవడానికి ఆమెను ప్రేరేపించింది. స్వామి తన వైబ్రియానిక్స్ ప్రయాణానికి పునాది వేస్తున్నారని మొదట్లో ఆమె గ్రహించలేదు. ఆమె వివాహం అయిన వెంటనే ఆమె భర్తకి వైరల్ జ్వరం అనంతరం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి గురి అయ్యారు. అతను స్టెరాయిడ్లు తీసుకోవడానికి ఇష్టపడక పోవడంతో ఆమె ప్రత్యామ్నాయ చికిత్సలను వైపు చూడడం ప్రారంభించారు. ఆమె ఆఫీసు సహోద్యోగి వైబ్రో ప్రాక్టీషనర్ అని తెలుసుకున్నారు. మరింత తెలుసుకోవాలని కుతూహలంతో ఆమె వెబ్సైటు సందర్శించి ఆమె స్వయంగా ప్రాక్టీషనర్ కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చని కనుగొన్నారు. ఆమె తన AVP కోర్స్ ను 2022 నవంబర్ లో పూర్తి చేసి 2023 జూలైలో VP అయ్యారు. .
తనను స్వామి వారికి దగ్గర చేసిన కొన్ని సంఘటనలు పంచుకోవాలని ప్రాక్టీషనర్ భావిస్తున్నారు. AVP గా చేరడానికి ముందు వైద్య శిబిరాల్లో VP11634 (తర్వాత వీరే ఆమెకు మెంటర్ గా మారారు) కి సహాయం చేయడానికి సూచింప బడ్డారు. ఒకరోజు ఆమెకు వేళ్ళన్నింటిలో తీవ్రమైన నొప్పిఏర్పడడంతో తన భర్త పరిస్థితి గురించిన ఒత్తిడికి గురికావడం బహుశా తన నొప్పికి కారణమని భావించారు. VP ద్వారా ప్రోత్సహింపబడిన ఆమె బాబాను ప్రార్థించారు, మరుసటి రోజు ఉదయానికి ఆమెకు పూర్తి ఉపశమనం కల్పించి ఆమెను ఆశ్చర్యానికి గురి చేస్తూ నొప్పి మాయమయ్యింది. మరొకసారి ఆమె AVP అడ్మిషన్ ప్రాసెస్ సమయంలో స్వామి ఫోటోను తనకు చూపించడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని స్వామికి సవాలు విసిరారు. అదే రోజు ఆమె తన సాధారణ ప్రయాణంలో ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో స్వామి ఫోటోలు గమనించారు, విశేషమేమంటే గతంలో ఆ దారిలో ఎప్పుడూ ఆ ఫోటోలను ఆమె చూడలేదు!
మొదటి సంవత్సరంలోనే ఇంటి నుంచి 114 మంది రోగులకు మరియు శిబిరాల్లో 269 మంది రోగులకు చికిత్స అందించిన వీరు తన అద్భుతమైన అనుభవాలను పంచుకుంటున్నారు. చర్మం చాలా వేగంగా కంపనాలను గ్రహిస్తుందని ఆమె కనుగొన్నారు, పేషంటు ఒక రోజు తన నోటి ద్వారా తీసుకునే మోతాదును దాటవేసినప్పటికీ బాహ్య అనువర్తనం కోసం వాడే నూనె అద్భుతంగా పనిచేస్తుందని ఆమె గ్రహించారు. ఆమె దీర్ఘకాలిక వ్యాధుల కోసం దాదాపు అన్ని కోంబోలకు CC10.1 Emergencies & CC15.1 Mental & Emotional tonic జోడిస్తారు, మరియు తన రోగులందరికీ అద్భుతమైన ఫలితాలను అందించే IB ని అందిస్తారు. కంటి వ్యాధుల కోసం కంటి రెప్ప కురుపు(స్టై), కంటి వ్యాధులు, మరియు మంట (కండ్లకలక) కోసం CC7.3 Eye infections అద్భుతంగా ఉంటుందని కేవలం 48 గంటల వ్యవధిలో పూర్తి నివారణ అందిస్తుందని గ్రహించారు. అయితే రెమిడి ఆపివేసినట్లయితే కంటి కురుపు తిరిగి రావచ్చు, కానీ ఒక నెలపాటు OD గా ఇవ్వడం ద్వారా అద్భుతం చూడవచ్చని ఉపాయాన్ని సూచిస్తున్నారు. రెండు సందర్భాల్లో అతిసారం, అజీర్ణం, మరియు ఉబ్బరం వంటి ఉదర సంబంధిత సమస్యల కోసం ఈట్ వెల్ కాంబో ఒక గంటలోనే చక్కగా పనిచేసింది. గెట్ వెల్ + బ్రీత్ వెల్ కాంబోను 2 లేదా 3 డోసులు తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గు, మాయమైన అనేక సందర్భాలను ఆమె వివరిస్తున్నారు. జలుబు దగ్గు రెండు రోజుల నుండి ఉంటే ఈ కాంబో ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఓ గంట పాటు ఇచ్చిన అనంతరం 6TD గా ఇస్తే ఒక రోజులోనే తగ్గిపోతుందని గ్రహించారు.
అనేక క్లిష్ట మైన కేసుల సందర్భాల్లో కూడా ప్రాక్టీషనర్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. అటువంటి హృదయాన్ని కదిలించే ఒక కేసు ఏమిటంటే వీల్ చైర్ కు పరిమితమైన 56 ఏళ్ల పొరుగింటి స్త్రీకి 2019 లో షుగర్ లెవెల్స్ నియంత్రణ కోల్పోవడంతో ఎడమ కాలు తీసివేయ బడింది. తన వీల్ చైర్ నెట్టుకోవడం చేతులు మరియు మెడలో విపరీతమైన నొప్పిని కలిగించింది, అంతేకాక 2023 డిసెంబర్ 2వ తేదీన ఆమె కింద పడిపోవడం వల్ల నొప్పి మరింత తీవ్రమైంది. 2023 డిసెంబర్ 27న ఆమెకు #1. CC20.2 SMJ pain + CC20.5 Spine + CC20.7 Fractures…BD బాహ్య అనువర్తనం కోసం నువ్వుల నూనెలో మరియు #2. CC10.1 Emergencies + #1…6TD, గా అలాగే మన నిద్ర కోసం మన సాధారణ కొంబో కూడా ఇవ్వబడింది. రెండు వారాల్లో ఆమె నొప్పులన్నీ మాయమయ్యాయి కానీ నిద్రలో స్వల్ప మెరుగుదల కలిగింది. 2024 జనవరి 17వ తేదీన ఆమె తొడలపై వేడి నీటి వలన ఏర్పడిన బొబ్బలు కోసం రెమిడీ కోరారు. ఆమెకు #4. CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions…BD కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం మరియు #5. CC10.1 Emergencies + 18.5 Neuralgia + #4…6TD.రెమిడీ ఇవ్వబడింది. ఫిబ్రవరి 2 నాటికి కాలిన గాయాలు పొడిగా మారడం ప్రారంభమై మార్చి చివరి నాటికి పూర్తిగా తగ్గిపోయాయి. ఆమెకు నిద్ర విషయంలో 60% మెరుగుదల ఉంది. సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఇప్పుడు మధుమేహం కోసం రెమిడీ తీసుకుంటున్నారు. వైబ్రియానిక్స్ సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తూ వైద్య శిబిరాలలో పాల్గొనే అవకాశం కల్పించి నందుకు స్వామివారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జులై 22 - 23 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 1 వ రాష్ట్రస్థాయి సదస్సులో ఆమె మరియు తన భర్త చురుకుగా సేవ చేసారు. సదస్సు సందర్భంగా నిర్వహించిన క్విజ్ లో కూడా ఆమె విజేతగా నిలిచారు.
ప్రాక్టీషనర్ కావడానికి ముందు కుటుంబంలో ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఎంతో ఆందోళన చెందేవారు. సాయి వైబ్రియానిక్స్ ఆమెకు మనః శాంతిని ఇచ్చింది. బహిర్ముకురాలు కావడంవల్ల అపరిచితులకు కూడా వైబ్రో రెమిడీస్ అందించే అవకాశాన్ని ఆమె కోల్పోయేది కాదు అని ఈమె మెంటర్ తెలియ జేస్తున్నారు. వైబ్రో శిబిరాలలో కూడా రోగులకు రెమిడీలను అందిస్తూ జీవనశైలి మార్పులతో చికిత్సను వేగవంతం చేసుకోమని ప్రత్యేకంగా సలహా ఇస్తూ ఉంటారు. తనకు తెలియని ఏవైనా వైద్య సమస్యల కోసం ఇంటర్నెట్ ను ఆశ్రయించడానికి ఆమె వెనుకాడరు. కేస్ హిస్టరీల అనువాదం, పరిశోధన, మరియు వైబ్రో గురించి అవగాహన కల్పించడం వంటి ఇతర రంగాల్లో కూడా సహకరించడానికి ఆమె ఉత్సాహంగా ఉన్నారు.
మన ఉద్దేశాలు స్వచ్ఛమైనవిగా ఉండి, ఇతరుల విషయంలో తీర్పు చెప్పడం పట్ల దూరంగా ఉంటే అన్నీ మనకు అనుకూలంగా జరిగుతాయని ప్రాక్టీషనర్ విశ్వసిస్తున్నారు. తన విషయానికే వస్తే వైబ్రియానిక్స్ లోనికి ప్రవేశించిన వెంటనే ఆమెకు ఆఫీసు పనిభారం మరియు చిన్న పిల్లల తల్లిగా ఇంట్లో నిబద్ధత పెరిగినప్పటికీ ఆమె సేవాగంటలు ప్రభావితం కాలేదు. రోగులతో మరియు ప్రేమ మరియు కరుణతో వ్యవహరించడం ఆమెకు భౌతిక ఆస్తుల కంటే ఎక్కువ సంతృప్తిని అందిస్తుంది.
ఉదహరించిన కేసులు: