వెన్ను నొప్పి 11648...India
44 ఏళ్ల వ్యక్తి 2022 అక్టోబర్ నుండి సంవత్సర కాలముగా నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అతను పనిచేయడానికి మోటార్ సైకిల్ పై రోజూ 50 కి.మీ ప్రయాణం చేయడం నొప్పి కి కారణం అని భావించారు. ప్రారంభంలో విశ్రాంతి మరియు నొప్పి నివారణ స్ప్రే తో తగ్గించుకున్నప్పటికీ 2023 లో అతను ఎత్తుగానూ మరియు ఇరుకైన సీటుతో ఉన్న కొత్త మోటర్ సైకిల్ ను ఉపయోగించడం ప్రారంభించినప్పటినుండీ అతని పరిస్థితి మరింత దిగజారింది. నొప్పి పగలు క్రమంగా పెరుగుతూ సాయంత్రానికి తీవ్రమయ్యేది. తన నాలుగు కిలోమీటర్ల రోజువారీ నడకను బలవంతంగా ఆపివేయడమే కాకుండా తన కుటుంబంతో కొంత సమయాన్ని ఆస్వాదించడం కూడా అతనికి కష్టం అనిపించింది. హీట్ ప్యాడ్ ఉపయోగించడం మరియు రాత్రిపూట తగినంత విశ్రాంతి తీసుకోవడం అతనికి తాత్కాలిక ఉపశమనం కలిగించేవి. సెప్టెంబర్ ప్రారంభంలో నొప్పి భరించ లేనివిధంగా వచ్చినప్పుడు అతను వైద్యుడిని సంప్రదించగా MRI స్కానింగ్ మరియు నొప్పిని తగ్గించే మౌఖిక ఔషధాలను సూచించారు. అయినప్పటికీ వైద్యుడైన తన స్నేహితుడి సలహా అనుసరించి వెంటనే MRI చేయించు కోకుండా దూరంగా ఉండి తీవ్రనొప్పి కలిగినప్పుడు అల్ట్రాసెట్ Ultracet (ఇది ఓపియాడ్ ను కలిగి ఉంటుంది.) మాత్ర తీసుకునేవారు. ఇది అతనికి రెండు గంటలు ఉపశమనం కలిగించేది కానీ తప్పించుకోలేని మోటార్ సైకిల్ రైడ్ తర్వాత నొప్పి వెంటనే తిరిగి వచ్చేది. 2023 అక్టోబర్ 20 తేదీన అతను ప్రాక్టీషనర్ ని సంప్రదించారు CC10.1 Emergencies + CC20.5 Spine…TDS నువ్వుల నూనెలో బాహ్య అనువర్తనం కోసం …BD
అతను పని వత్తిడి కారణంగా BD గా మాత్రమే రెమిడీ తీసుకున్నప్పటికీ కేవలం మూడు రోజుల్లో నొప్పి నుండి 20% ఉపశమనం లభించింది. నవంబర్ 3 నాటికి 50% మెరుగుదల కలిగింది. అంతేకాక అతను విశాలంగా మరియు క్రిందికి సౌకర్యవంతంగా సీటు ఉన్నటువంటి మోటార్ సైకిల్ కి మారారు. నవంబర్ 30న అతను 80% ఉపశమనం ఉన్నట్లు ఆనందంగా తెలియజేశారు. సాయంత్రం పది నిమిషాలు విశ్రాంతి తర్వాత తన కుటుంబం సభ్యులతో విశ్రాంతిని మరియు ఆనందాన్ని పొందుతున్నారు. చికిత్స ప్రారంభించినప్పటి నుండి తనికి నొప్పి నివారణ మందులు లేదా హీట్ ప్యాడ్ అవసరం రాలేదు.
డిసెంబర్ 28 నుండి అతని ఒక వారం పాటు నొప్పికి రెమిడీ తీసుకోలేకపోవడంతో నొప్పి పునరావృతం అయ్యింది. 2024 జనవరి 4న రెమిడీ తిరిగి ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత అతను 80% ఉపశమనం పొందారు. ఫిబ్రవరి 16 నాటికి 100% ఉపశమనం కలగడంతో మోతాదు OD కి తగ్గించబడినది మరియు బాహ్య అనువర్తనం నిలిపివేయబడినది. అతని ఇప్పుడు తన రోజువారి నడకలను మరియు మోటార్ సైకిల్ పై ప్రయాణాలను నొప్పి లేకుండా తిరిగి ప్రారంభించారు.
2024 ఏప్రిల్ 3వ తేదీ నాటికి నొప్పి పునరావృతం కాలేదు కానీ అతను తన సౌకర్యం కోసం OD లో కొనసాగుతున్నారు. అతను ఈ చికిత్సతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తన బంధువుల కోసం కూడా ఈ రెమిడీలను తీసుకుంటున్నారు.
రోగి యొక్క వాంగ్మూలము (స్పష్టత కోసం కొంచెం పారా ఫ్రేజ్ చేయబడింది):
నా వెన్ను నొప్పికి ప్రాక్టీషనర్ ను సంప్రదించడాన్ని నేను వాయిదా వేస్తూ వచ్చాను కానీ రెమిడి ప్రారంభించిన తర్వాత మాత్రమే నేను ఇంతకుముందే రెమిడీ తీసుకున్నట్లయితే ఇంత బాధ పడే వాడిని కాదు అని గ్రహించాను. తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు తీసుకున్న ఈ రెమెడీలు అద్భుతంగా పనిచేసాయి. నేను వీటిని ఎంతో గౌరవ ప్రదంగా భావించడమే కాకుండా ఇతరులకు కూడా గట్టిగా సిఫారసు చేస్తున్నాను. నా స్నేహితులను కూడా ప్రాక్టీషనర్లుగా తయారుకమ్మని ప్రోత్సహిస్తున్నాను.