శ్వాశ కోశ ఎలెర్జీ, మోకాలి నొప్పి, ఋతు నొప్పి, & అలసట 11648...India
BMI (బాడీ మాస్ ఇండెక్స్) 33 గా ఉన్న 37 ఏళ్ల వయసు గల మహిళకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. 1998లో ఆమె రజస్వల ఐనప్పటినుండి ఆమె మూడు రోజుల బహిష్టు సమయంలో ప్రతీనెలా పొత్తికడుపు మరియు రొమ్ములలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఉన్నారు. హోమియోపతిక్ మాత్రలు ఉపశమనాన్ని అందించినప్పటికీ ఒక మోతాదు తీసుకోక పోయినట్లయితే తీవ్రమైన నొప్పి తిరిగి వచ్చేది.
2013లో ఆమె తండ్రి మరణించిన వెంటనే ఆమె దగ్గు, జ్వరం, బలహీనత, మరియు గొంతులో కపంతో బాధపడేవారు. జ్వరం తగ్గి పోయి దగ్గు 2 నుండి 3 మూడు నెలల్లో తగ్గింది కానీ కఫం మాత్రం కొనసాగింది. 2014 ఏప్రిల్ నుండి ఆమెకు ఎడమ కన్ను మరియు ఎడమ నాసికా రంద్రం నుండి నీరు కారడం, స్వల్పంగా తలనొప్పి, నాసికలో అవరోధం వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ప్రారంభమైంది. ఈ విధంగా 4 నుండి 5 రోజులు పాటు మందులు వాడడంతో తగ్గిపోతూ నెలకు మూడు సార్లు పునరావృతం అవుతూ ఉండేవి. తరచుగా వరుసగా రెండు రోజులు తలస్నానం చేయడం ద్వారా ప్రేరేపింపబడేవి. ఆమె హోమియోపతి నివారణలు తీసుకుంటున్నారు కానీ ఉపశమనం లభించనప్పుడు అల్లోపతి వైపు మొగ్గుచూపుతూ ఉండేవారు.
2020 జులై లో కోవిడ్ పాజిటివ్ గా పరీక్షింపబడి హై డోస్ స్టెరాయిడ్లతో చికిత్స పొందారు, ఫలితంగా ఆమె నిరంతరం అలసిపోతూ ఉండేవారు. 2021 డిసెంబర్ నుంచి ఆమె రోజుకు 3 నుండి 4 సార్లు విరోచనానికి వెళ్లాలనిపిస్తూ ఉండడంతో కోవిడ్ వ్యాక్సిన్ యొక్క రెండవ డోస్ దీనికి కారణమని భావించారు.
2022 సెప్టెంబర్ లో బైక్ పై నుండి పడిపోకుండా తనను తాను నిరోధించుకొనే ప్రయత్నంలో ఆమె ఎడమ పాదం బెణికింది కానీ చివరికి అది నయమైంది. అయితే ఆమె ఎడమ మోకాలు మరియు చీలమండలో నొప్పి మరియు వాపు ఏర్పడి అక్టోబర్ చివరి నాటికి పరిస్థితి మరింత దిగజారింది. మూడు రోజులకు ఒకసారి నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆమె సూచింపబడిన నొప్పి నివారణ మందులతో పాటు కాల్షియం మాత్రలు మరియు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా మందులు మరియు తగినంత విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఆమె చలన శీలత గణనీయంగా తగ్గింది. రోజుకు నాలుగు కిలోమీటర్లు నడిచే మునుపటి సామర్థ్యానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు తన కార్యాలయంలో కూడా స్వేచ్ఛగా నడవలేక పోయేవారు.
శాశ్వత పరిష్కారం కోసం నిరాశతో ఆమె ప్రాక్టీషనరును సంప్రదించి శ్వాశ సంబంధిత సమస్యలు తనను ఎక్కువగా బాధిస్తున్నాయని, అలాగే మోకాలు మరియు ఋతుక్రమమునొప్పి కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. సంప్రదింపుల సమయంలో ఆమె ఎర్రటి ముఖం మరియు పేలవమైన స్వరంతోపాటు ఆమె అన్ని ఎలర్జీ లక్షణాలను తెలిపారు. ఆమె అన్ని మందులు నిలిపివేశారు, 2022 డిసెంబర్ 12న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
శ్వాశ కోశ ఎలర్జీ కి:
#1. CC9.2 Infections acute + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies…6TD ఒక వారం వరకూ అనంతరం TDS
మోకాలి నొప్పికి :
#2. CC18.5 Neuralgia + CC20.2 SMJ pain…TDS నువ్వుల నూనెలో బాహ్య అనువర్తనం కోసం.
ఋతు నొప్పికి :
#3. CC8.7 Menses frequent…TDS ఋతు కాలములో 3 రోజుల ముందు ప్రారంభించి కొనసాగించడానికి
డిసెంబర్ 18న ఒక వారంలోనే ఆమె ఎలర్జీ లక్షణాలలో 25% ఉపశమనం పొందారు. బాహ్య అనువర్తన కోసం ఇచ్చిన నూనె రాయడం వలన నొప్పుల నుండి తక్షణ ఉపశమనం లభిస్తోంది కానీ కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటోంది కనుక #2 ఈ విధంగా మెరుగుపరచబడి డిసెంబర్ 20న ఇది మౌఖికంగా ఇవ్వబడింది
#4. CC10.1 Emergencies + #2…TDS
2023 జనవరి 5న రెండు వారాల తర్వాత 2022 డిసెంబర్ లో మొదటిసారిగా తనకు నొప్పిలేని ఋతుక్రమం వచ్చిందని అంతేకాక అదనంగా మోకాళ్ళ నొప్పులలో 40% మరియు శ్వాశకోశ లక్షణాల్లో 60% మెరుగుదల ఉందని ఉత్సాహంగా తెలియజేశారు.
2023 జనవరి 30న అలసట మాయమైందని మరియు అన్ని ఇతర లక్షణాలలో దాదాపు 75% మెరుగుదల ఉందని ఆమె ఆనందంగా తెలియజేశారు. ఫిబ్రవరి 26 నాటికి ఆమె చాలా రోజులుగా తల స్నానం చేస్తున్నప్పటికీ శ్వాసకోశ లక్షణాలలో 100% మెరుగుదల ఉన్నట్లు తెలిపారు; #1 OD కి తగ్గించబడింది. ఆమె కుటుంబంలో అత్యవసర పరిస్థితుల కారణంగా తదుపరి ఫాలో అప్ కోసం రావడం సాధ్యం కాలేదు.
జూన్ 14 వరకు శ్వాసకోశ లక్షణాలు లేదా ఋతుక్రమ నొప్పి పునరావృతం కాలేదని తెలియజేశారు. తరుచుగా మలవిసర్జనకు వెళ్లాలనే ఆలోచన మరియు మోకాలి నొప్పులు మాయమయ్యాయి. ఐతే అధిక వత్తిడికి గురిఐన సమయంలో ఏర్పడిన స్వల్ప మోకాళ్ళ నొప్పి విశ్రాంతితో పరిష్కరించబడుతున్నది. ఆమె రోజువారి 4 కిలోమీటర్ల నడకను తిరిగి ప్రారంభించారు. #4 OD కి తగ్గించ బడింది. #3 ను అవసరం మేరకు SOS గా తీసుకోవడానికి సూచించ బడింది.
ఈ సమయంలో ఆమె 2014 ఏప్రిల్ లో గుర్తించిన హైపో థైరాయిడిజమ్ ఏర్పడిన ఆహారము పై కోరికల విషయంలో 30% మెరుగుదలను కూడా వెల్లడించారు ఇది ఊహించని బోనస్.
2023 జూన్ 24 నాటికి #1 మరియు #4 క్రమంగా తగ్గించి ఆపివేయ బడ్డాయి, వీటితో పాటు #2 కూడా డిసెంబర్ 4 న ఆపివేయ బడింది.
2024 ఏప్రిల్ నాటికి ఆమె అన్ని రోగ లక్షణాల నుండి విముక్తి పొందారు. ఇటీవలే హైపో థైరాయిడిజం మరియు అధిక బరువు కోసం రెమిడీలు తీసుకోవడం ప్రారంభించారు.