అబ్యాసకురాలి వివరాలు 00971...Japan
అభ్యాసకుడు 02779...జపాన్ ఇట్లు వ్రాస్తున్నారు.గత 13 ఏళ్ళగా ఈ సోదరి జపాన్లో ఒక ప్రాంతంలో అనేకమంది రోగులకు వైబ్రియానిక్స్ ద్వారా వైద్యం మాత్రమే కాకుండా చాలా ప్రేరణ మరియు తన నిస్వార్థ ప్రేమను కూడా ఇచ్చింది. ఈ విధంగా ఈమె వైబ్రియానిక్స్ సేవాకార్యక్రమంలో ఉన్నత రీతిలో తోడ్పడింది.ఈమె చేసిన సేవలలో కొన్ని మాత్రం వ్రాస్తున్నాను. స్వామీ ఈమెను డా.అగ్గర్వాల్ ద్వారా అభ్యాసకురాల్ని చేసారు.ఈ దివ్య సేవా కార్యక్రమంలో చేరడానికి ముందు ఈమె హోమియోపతి,ఆయుర్వేదము,బాచ్ ఫ్లవర్ రేమడీలు మరియు ఇతర ప్రత్యామ్నాయ చికిత్సా విధానాల్ని అభ్యాసించింది.
పూర్తిగా పరిశోధన చేసి ఒకక్క రోగికి సరిపోయే మందుల్ని(రేమడీలు) గుర్తించి ఓర్పుగా తయారు చేసి ఇవ్వడం ఈమెలో ఉన్న అతి ఉన్నత గుణాలలో ఒకటి.ఈమె అవసరమైన వారికి SRHVP యంత్రం ఉపయోగించి నోసోడ్స్ (మందు) తయారు చేసిచ్చే అవకాశాన్ని ఎపుడు వదులుకోదు. వీలయినంత ఎక్కువుగా అవసరమైన వాళ్ళందరికీ సేవ చేయాలన్నదే ఈమె కోరిక.ప్రతి ఏడాది ఈమె 300 రోగులకు కాలిక రేమడీలు (సీసనల్ మందులు)పంపిస్తూ ఉంటుంది.(ఏప్రల్లో ఎండ దెబ్బ మరియు సెప్టంబర్లో ఫ్లూ జ్వరం కొరకై ). ఈ పేషంట్లు సాయి వైబ్రియానిక్స్ చికిత్సలో నమ్మకంతో ఈమని సంప్రదించుతూ ఉంటారు.
ఈమెకు అర్దరాత్రి వేళ కూడా ఫోన్లు రావడం మామూలే. 2012 జూలై 15న ఒక మహిళ ఈమెకు తెల్లవార్జామున ఫోన్ చేసింది. ఈ అభ్యాసకురాలికి ఆ మహిళ మాట్లాడే విధానాన్ని బట్టి ఆమె స్ట్రోక్ తో భాద పడిందని గ్రహించింది.ఈమె వెంటనే ఆ రోగి ఉండే ప్రాంతంలోనే ఉంటున్న ఒక స్నేహితురాలికి సహాయం కోరుతూ ఫోన్ చేసింది.ఈ స్నేహితురాలు ఆమె పేషంట్ అవడ్డంతో ఆమె దెగ్గర CC10.1 Emergencies మందు బాటిల్ ఉంది.అభ్యాసకురాలు ఈ స్నేహితురాలను ఆ రోగికి CC 10.1 Emergencies పిల్స వేసి ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పింది.ఈ అభ్యాసకురాలు అదే రోజు మధ్యానం రైల్లో రెండు గంటలు ప్రయాణం చేసి రొగి ఉన్న ఆసుపత్రికి చేరుకుంది. ఆ రోగికి ఎడమవైపున పక్షవాతం వచ్చిందని తెలియగానే ఈ అభ్యాసకురాలు రోగి కుమార్తెకు తాను తయారు చేసిన మందునిచ్చి రోగి నాలుక కింద మందుండేలా వేయమంది. రెండు రోజుల తర్వాత ఈ రోగికి కొద్దిగా నయమై తనంతట తానుగా మందు వేసుకోగలిగింది. వైద్యులు ఆశ్చర్యపోయే విధంగా ఈమె అతి త్వరలో కోలుకుంది. నలభై రోజుల తర్వాత ఈమె ఇంటికి తిరిగి వచ్చింది.ఈమెకు మాట స్పష్టంగా రాకపోయినా తనంతట తానుగా నడవగలిగింది.ఎనిమిది వారాలు తర్వాత ఈ రోగి కొద్ది గంటలు ప్రయాణంచేసి తన భంధువు వివాహానికి వెళ్లాలని ఆశ పడింది. అభ్యాసకురాలికి ఫోన్ చేసి ఇది సాధ్యం అయ్యేలా చేయమని కోరింది.
అభ్యాసకురాలు ఆమెను మందులని క్రమం తప్పకుండా వేసుకోవాలని నీరు అధికంగా తాగాలని నూనెతో మస్సాజ్ చేయించుకోమని మరియు ముఖ్యంగా దేవుడిని ప్రార్థించమని చెప్పింది.అభ్యాసకురాలు నిర్ణిత సమయంలో ప్రతివారం ఒక సారి ఈమెతో కలిసి ప్రార్థన చేసేది.స్వామీ దయతో ఈ రోగి తను కోరుకున్నట్లుగా వివాహానికి వెళ్ళగలిగింది.
ఈ అభ్యాసకురాలు ప్రతి రోగిలోను దైవాన్ని చూసుకుంటోంది.ఈ మహత్తరమైన సేవలో పాల్గొంటున్నందుకు తనకి చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
అభ్యాసకురాలి కేసు పుస్తకం నుండి
ప్రతి ఏడాది సెప్టంబర్ నెలలో 300 పేషంట్లకి నేను ఈ క్రింద వ్రాసియున్న మందుల్ని పంపిస్తున్నాను. NM11 Cold + NM12 Combination 12 + SM2 Divine Protection + SR360 VIBGYOR…రోగ లక్షణాలు కనిపిస్తే ప్రతి 15 నిమిషాలకి ఒకసారి తీసుకోవాలి. ఆ తర్వాత రోజుకి మూడుసార్లు(TDS) తీసుకుంటే సరిపోతుంది.
ఈ మందుల్తోపాటు అధికంగా నీరు తాగాలని నేను పేషంట్లకు సలహా ఇస్తాను. ఫ్లూ జ్వరం నివారణగా ఈ క్రింద ఇవ్వబడిన మందుల్ని నేను పేషంట్లకి పంపిస్తాను. CC9.2 Infections acute + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…3TW. ఇది ఒక్క అద్భుతమైన నివారణ మందుగా పనిచేస్తుంది.ఈ మందుని తీసుకున్న వాళ్ళందరు ఫ్లూ జ్వరంనుండి తప్పించు