ప్రాక్టీషనర్ల వివరాలు 03586...क्रोएशिया
ప్రాక్టీషనర్ 03586...క్రొయేషియా లైబ్రేరియన్‌షిప్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్న ఈ ప్రాక్టీషనర్ గత 36 సంవత్సరాలుగా క్రొయేషియాలోని జాదర్ సిటీ లైబ్రరీలో పని చేస్తున్నారు. ఆమె ప్రతిభావంతులైన సంగీత విద్వాంసురాలు మరియు కళాకారిణి, అంతేకాక
ప్రత్యామ్నాయమ వైద్యం మరియు యోగా పట్ల మక్కువ కలిగి ఉన్నవారు. 1986లో ఆమెకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె శ్రీ సత్యసాయి బాబాను మొదటిసారిగా టెలివిజన్‌లో చూసి అనిర్వచనీ యమైన ప్రేమ భావనతో ఉప్పొంగిపోయి స్వామి వైపు ఆకర్షించబడి అనుబంధం పెంచుకున్నారు. ఆమె తర్వాత లైబ్రరీలో ఉద్యోగం పొందిన తరువాత స్వామి గురించిన పుస్తకాలు చదవడం ప్రారంభించి పుట్టపర్తిలోని స్వామి ఆశ్రమం చిరునామాను కనుగొన్నారు. తనకు కొంత విభూతి కావాలని ఆ చిరునామాకు ఉత్తరం పంపారు. ఒక నెల తర్వాత, మరొక నగరంలో (స్ప్లిట్) ఉన్న తన స్నేహితురాలిని సందర్శించినప్పుడు, ఆమెకు ఒక చిన్నపెట్టె ఇస్తూ ఆ స్నేహితురాలు 'ఎవరో 'కొంతమంది' సాయిబాబా నుండి ఈ పవిత్రమైన పొడిని నాకు ఇచ్చారు నీకే ఇవ్వాలి అనిపించింది అన్నారు. ’ స్వామి మీద తనకున్న ప్రేమ గురించి ఎవరికీ చెప్పకపోయినా అసంకల్పితంగా వచ్చిన ఈ గిఫ్ట్ ఆమెను ఆశ్చర్య చకితురాలిని చేసింది. ఆమె చివరికి లుకేమియాతో బాధపడుతున్న స్నేహితుడికి ఈ విభూతి ఇచ్చారు. ఆమె ఉంటున్న నగరంలో సాయి కేంద్రం లేనప్పటికీ, ఆమె సత్సంగ సభ్యులైన ఇతర సాయి భక్తులను కలుసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో పుట్టపర్తికి వెళ్లిన వారు ఆమెకు పలుమార్లు విభూతి అందించడం వల్ల ఆమెకు ఎంతో మేలు జరిగింది. టీవి ద్వారా కలిగిన స్వామి యొక్క ఆ ఒక్క దర్శనం ఆమెపై ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపి, ఇప్పుడు ఆమె జీవితంలో తన ఏకైక లక్ష్యం అన్ని జీవరాశులకు కరుణతో నిస్వార్థంగా సహాయం చేయడమేనని విశ్వషించేలా చేసింది. 17 సంవత్సరాలుగా ఆమె ప్రతిరోజూ వీధి పిల్లులకు ఆహారం ఇస్తున్నారు, ఇంకా పబ్లిక్ కిచెన్‌లు మరియు కుక్కల ఆశ్రయాలకు క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకువెళుతున్నారు.
వీరు ప్రశాంతినిలయంలోని బాబా ఆశ్రమాన్ని సందర్శించాలనుకున్నారు కానీ ఆమె జీవన స్థితిగతులు, ఆర్ధిక పరిస్థితులు, మరియు యుద్ధం ఆమెను భారతదేశానికి వెళ్లడానికి అనుమతించక పోవడంతో 2018
వరకు ఆమె పుట్టపర్తికి చేరుకోలేకపోయారు. ఒక రోజు ఉదయపు ధ్యానం తర్వాత ఆమె చేతిలో నుండి ఒక కొవ్వొత్తి కింద పడిపోయి స్వామి చిత్రం నేలపై ఆ మైనపు ముద్దలో
ఏర్పడింది. అనంతరం ఆమె స్నేహితురాలు స్వామివారి తోటలో ప్రాక్టీషనర్ మరియు ఆమె కుమార్తెతో పలు సెల్ఫీలు దిగారు. తోటలోని వివిధ ప్రాంతాలలో తీయబడిన అలాంటి రెండు ఫోటోలలో ఎవరికీ కనిపించని రెండు ఇంద్రధనస్సులు చిత్రీకరింపబడ్డాయి! ఒక సంవత్సరం తర్వాత ఆమె రెండవ దర్శనానికి వచ్చి పుట్టపర్తిలో నడుస్తూ ఉన్నప్పుడు ఆమె కుమార్తె స్కార్ఫ్ పై స్వామివారి లాకెట్ సాక్షాత్కరించింది.
తరువాతి సంవత్సరాలలో, ఆమె స్వామి తాలూకు అనేక అద్భుతాలు చిన్నవి గానీ పెద్దవి గానీ అనేకం అనుభవిస్తూ నిరంతరం స్వామి ఉనికిని మరియు మార్గదర్శకత్వాన్ని పొందారు. ఆమె ఇంట్లోఉండే ఒక పిల్లికి మరియు తన కుటుంబ సభ్యులకు చికిత్స చేసిన ప్రాక్టీషనర్ ద్వారా వైబ్రియానిక్స్‌కు పరిచయం చేయబడి ఈ వ్యవస్థ అందించే సేవా అవకాశం ద్వారా ప్రేరణ పొందారు. అదే ప్రాక్టీషనర్ ద్వారా, 2019 సెప్టెంబరు లో రాజధాని నగరం జాగ్రెబ్‌లో వైబ్రియానిక్స్‌పై జరగనున్న సెమినార్ గురించి ఆమె తెలుసుకున్నారు. ఆమె ఎంతో ఆసక్తితో ఆ వర్క్‌షాప్‌కు హాజరై AVP అయ్యారు. అప్పటి నుండి ఆమె అనేకమంది రోగులకు, జంతువులకు మరియు మొక్కలకు చికిత్స చేసారు.
వైబ్రియానిక్స్‌ను అభ్యసించడం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించడమే కాక ప్రాక్టీషనరుగా ఇట్టి అవకాశం కల్పింపబడినందుకు కృతజ్ఞతతో మాత్రమే కాకుండా, ఆమె తన రోగులకు ఇస్తున్న రెమిడీలు స్వామి స్వయంగా ఆశీర్వదిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతను వ్యక్తంచేస్తున్నారు. ఒకసారి ఆమె ఒక కుటుంబానికి రెమిడీలు తయారు చేయవలసి ఉన్నందున కొన్ని సీసాలలో చక్కర గోళీలతో నింపి ఒక అత్యవసర పని నిమిత్తం ఈ పనిని అరగంట నిలిపివేశారు. ఆనంతరం ఆమె తిరిగి వెళ్లి ప్రతీ రోగికి రెమిడీలు చేయడం ప్రారంభించి ఆమె చివరి సీసాకి వచ్చేసరికి, ఇదిగో, ఫోటోలో చూపిన విధంగా అది చెక్కర గొళీలకు బదులుగా అమృతాన్ని కలిగి ఉంది!
అలెర్జీలు మరియు మధుమేహంతో బాధ పడుతున్న అనేక మంది రోగులలో అద్భుతమైన ఫలితాలను పొందారు, ఆమె ఈ రోగాలలో ఒక్కొక్క్ దానికి ఒక ఉదాహరణ క్రింద వివరించారు.
గత ఐదేళ్లుగా వసంతకాలం ప్రారంభములో ఏర్పడే అలెర్జీలతో బాధపడుతున్న 32 ఏళ్ల వ్యక్తికి 2020 మార్చిలో ఆమె చికిత్స చేసారు. అతనికి తుమ్ములు మరియు కళ్లవాపు వంటి లక్షణాలు ఉన్నాయి. ప్రాక్టీషనర్ అతనికి CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies ఇచ్చారు. లక్షణాలు పునరావృతం కాకుండా కొన్ని రోజుల్లో అదృశ్యమయ్యాయి! యవ్వనం నుండి మధుమేహంతో బాధపడుతున్న 75 ఏళ్ల మహిళ 2021 జూన్ నెలలో ఆమెను సంప్రదించించారు. ఆమె అల్లోపతి మందులు
తీసుకుంతున్నప్పటికి ఆమె రక్తంలో చక్కెర శాతం ఎక్కువగానూ మరియు హెచ్చుతగ్గులకు లోనౌతూ ఉంటోంది. మందులు నిలిపివేయవద్దని ఆమెకు సలహా ఇస్తూ, ప్రాక్టీషనర్ ఆమెకు CC6.3 Diabetes ప్రతిరోజూ ఉదయమే మేల్కొన్నప్పుడు ఖాళీ కడుపుతో తీసుకోవాలని సూచించారు. ఐదు రోజుల్లో ఆమె రక్తంలో చక్కెర సాధారణ స్థితికి రావడమే కాక రెండు సంవత్సరాల పాటు స్థిరంగా ఉంది, ఆ తర్వాత ఆమె రోగితో సంబంధాన్ని కోల్పోయింది
వైబ్రియానిక్స్‌ను పరిచయం చేసినందుకు ప్రాక్టీషనర్ స్వామికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఏదీ యాదృచ్ఛికం కాదని, అంతా ఆయన సంకల్పంతోనే జరుగుతుందని ఆమె గ్రహించారు. రోగులు వారి దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడానికి చూపే సుముఖతపై ఫలితాలు తరచుగా ఆధారపడి ఉంటాయని ఆమె ప్రాక్టీస్‌లో తెలుసుకున్నారు. వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ ఆమె తన జీవితంపై శక్తివంతమైన పరివర్తన ప్రభావం చూపడమే కాక ప్రతీ రోజు, ఆమె మంచి వ్యక్తిగా మారడానికి ప్రయత్నించ సాగారు. ఈ సేవలో తనను పర్యవేక్షించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి స్వామి అనుక్షణం తనను సిహుస్తూనే ఉన్నారని ఆమె భావన.
స్వామిపై విశ్వాసం చాలా ముఖ్యమని ఆమె భావన. మానసికంగా దేవునికి దూరంగా వెళ్లడం ద్వారానే వ్యక్తి వ్యాధి బారిన పడతారని ఆమె విశ్వాసం. ప్రతికూల ఆలోచనలు తరచుగా వ్యాధిని ప్రేరేపిస్తాయి. బలమైన విశ్వాసం ఉంటే, ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె భావిస్తారు. స్వామి మనకు ఏది మంచిదో అదే చేస్తారని విశ్వసించండి, వర్తమానంలో స్వామి చర్య పట్ల బాధగా అనిపించినా ఫలితం ఏదైనప్పటికీ కృతజ్ఞతతో ఉండండి. మనకు హాని చేసిన వారి పట్ల కూడా కృతజ్ఞతా దృక్పథం, కలిగి ఉండండి ఎందుకంటే ఈ వ్యక్తులు తరచుగా మనకు ముఖ్యమైన బోధకులుగా ఉన్నందున, ఈ భావమే మనల్ని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంచుతుంది. ప్రతి ఒక్కరికీ సహాయం చేయడమే ఆమె లక్ష్యము, ఎందుకంటే ప్రజలు మరియు జంతువులు, కూడా తమను తాము జాగ్రత్తగా చూసుకోవడంలో బలహీనులు.
ఉదహరించిన కేసు చరిత్రలు :