ప్రాక్టీషనర్ల వివరాలు 02051...Chile
ప్రాక్టీషనర్ 02051…చిలీ అభ్యాసన వ్యూహాలు మరియు వనరుల విభాగంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. 2018లో వెనిజులా నుండి చిలీకి వలస వచ్చినప్పటి నుండి, సమస్యాత్మకమైన వెనిజులా నుండి అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పొందలేకపోవడం వల్ల ఆమె మరియు ఆమె భర్త, గతంలో యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు, అయినప్పటికీ క్లరికల్ ఉద్యోగాలు చేయవలసి వచ్చింది.
ఏప్రిల్ 1988లో, బరువైన నీటి బాటిళ్లను తీసుకువెళుతున్న ఒక మహిళకు సహాయం చేస్తున్న సందర్భంలో ప్రాక్టీషనర్ మరియు ఆమె భర్త సాయి కేంద్రానికి తీసుకెళ్లబడ్డారు, అక్కడ వారు సాయి బాబా గురించి మొదటిసారి విన్నారు. వారు తక్షణమే స్వామితో ప్రేమలో పడి శాకాహారులుగా మారిపోయారు మరియు వారి ఇంట్లో సాయి కేంద్రాన్ని ప్రారంభించగా అది తదుపరి 13 సంవత్సరాలు పనిచేసింది. వారు భారతదేశాన్ని చాలాసార్లు సందర్శించారు మరియు ప్రాక్టీషనరుకు పుట్టపర్తిలోని బాబా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసే అదృష్టం లభించింది. ఆమె ఏడు సంవత్సరాలు వెనిజులా లో EHV ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేసారు మరియు 2016-2018 నుండి మూడు సంవత్సరాల పాటు నేషనల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్‌గా పనిచేసారు. ప్రస్తుతం, ఆమె చిలీ యొక్క ఏకైక సాయి సెంటర్‌కు ఎడ్యుకేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు మరియు చిలీలో EHV ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటులో పాలుపంచుకున్నారు. ఆమె భర్త, పిల్లలు కూడా సాయి సంస్థలో క్రియాశీలక పాత్రలు పోషిస్తున్నారు.
2001లో, తన భర్త మరియు కుమార్తెతో కలిసి ప్రశాంతినిలయం మొదటిసారి సందర్శించినప్పుడు ఆమె వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు. తనకు మరియు ఇతరులకు స్వస్థత చేకూర్చగలగడమే తన వృత్తి అని భావించడం, ఆమె సాయి వైబ్రియానిక్స్ ప్రారంభ కోర్సు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేసింది. పరీక్ష మరియు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావడంతో ఈ ముగ్గురూ ప్రాక్టీషనర్లుగా అర్హత సాధించారు. తదనంతరం, ఆమె తన SVP కోర్సు 2006లో పూర్తి చేసారు. ప్రస్తుతం, ఆమె మాత్రమే చురుకుగా వైబ్రియానిక్స్ సాధన చేస్తున్నారు, అయినప్పటికీ ఆమె కుటుంబం ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నది.
గత కొన్ని సంవత్సరాలుగా వైబ్రియానిక్స్‌పై ఈమె విశ్వాసం ఎంతో బలపడింది. ఆమె అనుభవంలో సాయి వైబ్రియానిక్స్ ఔషధం 'సాయి' స్వరూపం కనుక అపజయము ఎరుగనిది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడని వ్యక్తులు
సూచించిన ప్రోటోకాల్‌ను పాటించని వారు మాత్రమే అని ఆమె అనుభవంలో తెలుసుకున్నారు. ఆమె రోగులలో చాలామంది వైబ్రియానిక్స్ స్వస్థతా ప్రక్రియలో తాము ప్రశాంతంగా ఉన్నట్లు గమనించారు. ప్రతి వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారని మరియు అందరూ ఒకే విధంగా రెమిడీలకు ప్రతిస్పందించరని లేదా ఒకే ఫలితాలను పొందరని ఆమె తెలుసుకున్నారు. ఒక ప్రాక్టీషనరుగా ఆమె రోగికి చికిత్స చేయడం ప్రారంభించే ముందు, మరియు రెమిడీలను సిద్ధం చేసే ముందు ప్రార్థన తప్పనిసరిగా చేస్తారు. ఆమె వైబ్రియానిక్స్ సేవ చేసే రోజులను ముందుగానే నిర్ణయించుకుని దానికి అవసరమైన మెటీరియల్ అంతా ముందుగానే సమీకరించు కోవడంలో జాగ్రత్త వహిస్తారు. అలాగే ఈ సేవ లో ఉపయోగింపబడే రెమిడీల యొక్క సమగ్ర రికార్డులను భద్రంగా ఉంచుతారు. వైబ్రియానిక్స్ పట్ల నమ్మకం చూపేందుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నందున తనకు రోగుల కొరత లేదని ఆమె స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఒక ఆసక్తికరమైన కేసును ఈ ప్రాక్టిషనరు పంచుకోవాలనుకుంటున్నారు. కంప్యూటర్ అద్దెకు ఇచ్చే సెంటర్ లో ఈమె వర్క్ చేస్తున్నప్పుడు, అత్యంత నిస్పృహకు లోనై ఉన్న ఒక మహిళ తనకు ఇక జీవించడం ఇష్టం లేదని ఏడుస్తూ ఆమె పక్కన కూర్చోనడం తటస్థించింది. ప్రాక్టీషనరు CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities ను సిద్ధం చేసి, మొదటి మోతాదును ఆమెకు అందించారు. మరుసటి రోజు ఆ మహిళ తన కోసం వెతుకుతూ వచ్చింది, తాను ఒక అద్భుతాన్ని చూశానని తన జీవితంలో మొదటిసారిగా, ఎలాంటి బాధాకరమైన ఆలోచనలు లేకుండా రాత్రిపూట నిద్రపోగలిగానని ఆమె చెప్పింది. అప్పటి నుండి, ఈ మహిళ ఎలాంటి డిప్రెషన్‌తో బాధపడలేదు.
అన్ని కాంబోలు శక్తివంతమైనవి అయినప్పటికీ, ఈ ప్రాక్టీషనర్ CC6.3 Diabetes మధుమేహ వ్యాధిని నియంత్రించడంలో మరియు CC15.1 Mental & Emotional tonic మరియు CC15.2 Psychiatric disorders, మానసిక మరియు భావోద్వేగ అంశాలను సమతుల్యం చేయడంలో అసాధారణంగా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. క్యాన్సర్, మధుమేహం, హార్మోన్ల రుగ్మతలు, వంధ్యత్వం, ఆటిజం, డిప్రెషన్/భావోద్వేగ సమస్యలు, కీళ్లనొప్పులు, ఎముకలు మరియు చర్మ బాధలు వంటి వ్యాధులు నయం చేయడంలో ఆమె గొప్ప విజయాన్ని సాధించారు.
తనకు, తన కుటుంబం మరియు ఇతరుల యొక్క సమగ్ర ఆరోగ్యం (శారీరక & మానసిక ఆరోగ్యం & ఆరోగ్యకరమైన సంబంధాలు) పట్ల ఆసక్తిని రేకెత్తించి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనరుగా తనకు పాత్రను ఇచ్చినందుకు ఆమె స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆమె మరియు ఆమె భర్త వైబ్రియానిక్స్ వైపు మొగ్గు చూపుతారు. మెరుగైన ఫలితాల కోసం రోగుల చికిత్సల విషయంలో సహాయపడటానికి మరియు తద్వారా వారు మెరుగైన జీవన నాణ్యతను సాధించడంలో సహాయపడటానికి ఆమె రోగులకు ఉపయోగకరమైన సూచనలను అందించడానికి పోషకాహారం మరియు ఆరోగ్య సమస్యల గురించి మరింత తెలుసుకోవడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు. స్వామి ప్రేరణతో, ఆమె తన రోగులకు మార్గనిర్దేశం చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా, మానవ విలువలు మరియు జీవనశైలికి సంబంధించి వారికి సూచనలు ఇస్తూ ఉంటారు. వైబ్రియానిక్స్ తనను మరింత దయగల మరియు ఆత్మవిశ్వాసం గల వ్యక్తిగా మార్చిందని మరియు జ్ఞానం కోసం తన తపనని మరింత పెంచడంలో సహాయపడిందని ఆమె భావిస్తున్నారు.
తోటి ప్రాక్టీషనర్లకు ఆమె సలహా ఏమిటంటే, ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు; పట్టుదలతో మరియు పూర్తి విశ్వాసంతో, స్వామిని ఆశ్రయిస్తే ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు.
పంచుకున్న కేసు